శ్వేత విప్లవ పితామహులు డా.వర్గీస్‌ కురియన్‌

సూరంపూడి పవన్‌ సంతోష్‌
కొన్ని దశాబ్దాల ముందు నగరాల్లో, కాస్త పెద్ద పట్టణాల్లో చిర పరిచిమైన దృశ్యం ఒక మిల్క్‌ బూత్‌  ఎదుట తెల్లవారుతుండగానే క్యూలో జనం. ఆ పాలబూత్‌లలో కొనుక్కున్న పాలే కుటుంబ అవసరాలకు సరిపెట్టుకునేవారు. ఈనాడు ఆ దృశ్యం ఆదృశ్యమైంది.  పాలకి రేషన్‌  ఉండటం బహుశా నా తర్వాతితరానికి  ఊహకు అందదు. ఇది స్థానిక దృశ్యం.
అంతర్జాతీయ స్థాయి వార్తా కథనాలు పరిశీలిస్తే   డైరీ పరిశ్రమకి అర్థ శతాబ్దికి పైగా ప్రథమస్థానంలో నిలిచిన న్యూజిలాండును దాటి భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచాన అగ్రస్థానం పొందింది. ఈ పరిణామం ఓ నలభై ఏళ్ళ క్రితం ఎవరూ ఊహించి వుండరు. ఈ రెండు పరిణామాలకు కారకులు విప్లవ పితా మహులుడా. వర్గీస్‌ కురియన్‌ . ఆయన  నేడు తెల్లవారు జామున తన తొంభయ్యవ యేట స్వల్ప అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ వార్త చూడగానే నాకు జ్ఞప్తికి వచ్చిన పుస్తకం ” నాకూ ఉంది ఒక కల”. ” ఐ టూ హేడ్‌ ఎ డ్రీమ్‌” అన్న ఆయన ఆత్మకథకి తెలుగు అనువాదం ఇది.
ఈ పుస్తకానికి ముందు మాట ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌టాటా రాశారు. పుస్తకం మొదటే పరిచయం అంటూ కురియన్‌ తన మనవడికి రాసిన లేఖలో ఆయన ఆలోచనలు పంచుకుంటూ  చివరగా ”సిద్ధార్థా, ఈ పుస్తకాన్ని నీకూ, ఇంకా మనదేశంలో నీ తరానికి సంబంధించిన లక్షలాది మంది పిల్లలకి కూడా అంకితం ఇస్తున్నాను. మీరంతా ఈ పుస్తకం చదవడంవల్ల ఉత్తేజితులై ప్రపంచంలోకి ధైర్యంగా వెళ్ళి, మీరు ఎంచుకున్న రంగాలలో, ఈ దేశ విస్తృత ప్రయోజనాల కోసం, ఎక్కువమంది ప్రజల కోసం, అవిశ్రాంతంగా పనిచేస్తారనే ఆశతో ఈ అంకితం ఇస్తున్నాను.” అంటారు.
కేరళలోని కాలికట్‌ 1921లో సంపన్న విద్యావంతులైన కురియన్‌ క్రిస్టియన్ల ఇంట జన్మించాడు. ఇంజనీరింగు (మెటలర్జీ) చదివిన కురియన్‌ టాటా స్టీల్‌ ప్లాంటులో అప్రెంటిస్‌గా చేరతాడు.   తర్వాత ప్రభుత్వం నుంచి అనుకోని విధంగా డైరీ ఇంజనీరింగ్‌లో స్కాలర్‌షిప్‌ పొంది అమెరికా వెళ్లారు. ఆపైన భారతదేశం వచ్చాక ప్రభుత్వం బలవంతాన ఆనంద్‌లో చిన్న ప్రభుత్వ డైరీలో ఉద్యోగిగా వెళ్తారు. అప్పుడు పరిచయమైన కైరా జిల్లా పాల సహకార సంఘం,  వారి నాయకుడు త్రిభువన్‌ దాస్‌ పటేల్‌లు పరిచయమౌతారు. ఆ పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అలానే ఈ దేశ పాల ఉత్పత్తి రంగాన్ని కూడా.
ఆపైన కథంతా చాలా ఆసక్తికరం. ఆ కథ కురియన్‌దే కాదు ఈ దేశ సహకార పాలవ్యవస్థ ఎదుగుదలది కూడా. ఆ క్రమంలో దేశాన్ని ఎదగనీయకుండా చేసే బ్యూరో క్రాట్‌ వ్యవస్థ, ఒక్క మంచి మార్పు తీసుకు వద్దామంటే ఎదురయ్యే వందలాది అడ్డంకులూ, వాటిని ఎదుర్కోవడంలోని ఒడుపులూ అన్నీ ఆసక్తి కలిగించేలా ఎదురవుతాయి. అంతర్జాతీయంగా మిగులు పాలపొడి మనకు ఉచితంగా అంటకట్టి దేశంలో మార్కెటును సృష్టించుకుని అపైన నచ్చిన రేటుకు మార్కెట్‌లో పాలపొడి, డైరీ ఉత్పత్తులూ అమ్ముకునేందుకు ఐరోపా దేశాల ప్రయత్నంలోనే దేశంలో పాల వెల్లువ ఎలా సృస్టించారన్నది ఆయన మాటల్లో చూడండి.
”ఒక దశలో యూరోపియన్‌  ఎకనామిక్‌ కమ్యూనిటీ (ఇ.ఇ.టి) వాళ్ళకి, పర్వతాల్లా పోగుబడిన పాలపొడి,సరస్సుల్లా తయారైన బటర్‌ ఆయిల్‌లూ గొప్ప సమస్యనే తెచ్చిపెట్టాయి. దాంతో మన పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బ తినేదే. ఇవి, ఉన్నకొద్దీ విలువ పెరిగే వస్తువులు కాకపోవడంతో యూరోపియన్‌ దేశాలవారు ఈ అధిక ఉత్పత్తులకు ఒక పరిష్కారం వెతుకుతున్నారు. ఎవరో దయగలవారు యూరోపియన్‌ పెద్దమనిషికి, ఈ వస్తువుల్ని భారతదేశంలో ఉన్న కోట్లాది అన్నార్తులకి అందించడం పరిష్కారంగా తోచడానికి ఎంతోకాలం పట్టదనిపించింది. అదే జరిగితే, మన పాలరైతుల్లో పెరుగుతున్న ఆశల్ని, ఆకాంక్షల్ని శాశ్వతంగా  పట్టనట్టవుతుంది. ఉచితంగానో, తక్కువ రేటుకో వచ్చే పాలు, బటర్‌తో మన రైతులు   ఎలా పోటీ పడగలరు? ఆ పాలు, బటర్‌ ఆయిల్‌ అయిపోయాకా పెరిగిన దేశీయ మార్కెట్‌, నాశనమైన పాల రైతులూ మిగిలిన దేశం ఐరోపా, న్యూజిలాండ్‌ పాల డైరీలకు ఎదురులేని మార్కెట్‌  అయ్యేది.
ఎన్‌.డి.డి.బిలో వుండి, భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి బాధ్యులైన మేం వేగంగా ఓ కార్యక్రమం రూపొందించాం.  అధికోత్పత్తి అయిన మొత్తం సరుకుని యూరప్‌ నుంచి తీసుకుని ఉపయోగించడంద్వారా నిధుల్ని సంపాదించి, భారతదేశంలో ఆనంద్‌  తరహా సహకార సంఘాల విస్తరణకు, డైరీ అభివృద్ధికి ఉపయోగించాలని, అందుకు కావలసిన ఆరువందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి ఆ పాలతో సమకూర్చవచ్చన్న ఆలోచన  నా మనస్సులో మెదిలింది. అదే పాలవెల్లువ.
ఆ ఆలోచన గురించి కురియన్‌ ”మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశాన్ని గుర్తించవచ్చు ” అంటారు.
కురియన్‌ ఆత్మకథని సంఘటనవారీగా చూస్తే ..మొదట అమూల్‌ కోసం ప్రెవేటు డైరీలతో పోటీ, బొంబాయి నగర పాల అవసరాలు సహకార రైతులు తీర్చగలిగినా న్యూజిలాండ్‌ డైరీల పాలపొడి దిగుమతి చేసే అవినీతి అధికారితో పోరాటం, అమూల్‌ని సాంకేతికంగానూ, మార్కెటింగ్‌ పరంగానూ అభివృద్ధి చేయడం ఒక దశ. ఆపై ఆ సహకార పాల సంఘం వ్యవస్థని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు పాలవెల్లువ ప్రారంభించడంతో మలుపు తిరిగిన ఆయన ప్రస్థానం ఆపై దేశమంతటా పాడి పరిశ్రమ అభివృద్ధికి తన అమూల్‌ అనుభవాలు ఉపయోగించారు. ఈ సంఘటనలన్నీ సహజంగానే ఆసక్తికరంగా ఉంటాయి. కావాల్సినంత నాటకీయత వాటిలో పుష్కలంగా ఉంటుంది. పైగా ఇవన్నీ తన వ్యాపార సామ్రాజానీదీన్ని విస్తరించుకునే వ్యాపార దిగ్గజం అనుభవాలు కావు. నెలజీతం తీసుకుంటూ వ్యాపారస్థుడిలా పనిచేసి, లాభాలు సామాన్య పాడి రైతులకి పంచే దేశభక్తుడి జీవితానుభవాలు. కురియన్‌ తన అంకితంలో ప్రస్తావించినట్టే తెలుసుకున్న అనుభవపాఠాలు సందర్భోచితంగా రాస్తారు బోల్డ్‌ అక్షరాల్లో.
కొన్ని ఇబ్బందులకి లోను కాకుండా మనం ఏదీ సాధించలేమని నా నమ్మకం. వచ్చిన అవకాశాలు చేజార్చుకోకూడదు. అంటారు  ఓ సందర్భంలో. నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు చెప్పేది ” ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది” అని. బహుశా దీని అర్థం. ” ఎవరూ ఈ విషయం చూడరూ” అని నాలో ఒక దరిద్రమైన అభిప్రాయం మిగిలిపోయింది.” అంటారు ప్రభుత్వం నిష్క్రియాపరత్వం గురించి ఘూటుగా, ఆవేదనగా రాస్తూ.
మరికొన్ని వింత విషయాలూ రాస్తారు. ” ప్రతి ఒక్క పాల ఉత్పత్తిదారుడూ ఒక రూపాయి చొప్పున ఇవ్వడంవల్ల , మేం అవసరమైన నిధులు సేకరించగలిగాం. ఈ విధంగా ‘మంథన్‌’ సినిమాని గుజరాత్‌ డైరీ రైతులు నిర్మించారు. దీని నిర్మాణానికి 10 లక్షలు మాత్రమే ఖర్చయింది” (ఇది సహకార ఉద్యమం గురించిన పూర్తి నిడివి చిత్రం, దర్శకుడు శ్యాంబెనగల్‌). మనదేశంలో సామాన్యుడు బలపడటాన్ని భరించలేనివాళ్ళు కూడా ఉండడం బాధాకరం. ఇప్పుడున్న అధికార వ్యవస్థకి  అది  ఇష్టం లేదు. వ్యాపారస్థులకి అసలే సరిపడని సంగతి. ఇలాంటి లోతైన పరిశీలనలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. పుస్తకం మధ్యలో కురియన్‌ వివిధ సందర్భాలలో నాణ్యమైన ఫోటోలు ఇచ్చారు. పుస్తకంలో మధ్యలో కురియన్‌ వివిధ సందర్భాలలోని నాణ్యమైన ఫోటోలు ఇచ్చారు. అనువాదం చాలా సరళంగా వుంది.
నా ఉద్దేశ్యంలో ఈ పుస్తకంలో ఆత్మకథలు ఇష్టపడేవారికి ఆత్మకథ, చరిత్ర తెలుసుకోవాలనుకుంటే చరిత్ర, వ్యక్త్తిత్వ వికాస పుస్తకాలు నచ్చేవారికి వ్యక్తిత్వ వికాసగ్రంథం.
– (పుస్తకం.నెట్‌ సౌజన్యంతో)
నాకూ ఉంది ఒక కల (ఆత్మకథ)
( | శిళిళి నీబిఖి బి ఖిజీలిబిళీ కి అనువాదం)
రచయిత: డా. వర్గీస్‌ కురియన్‌
అనువాదం డా. తుమ్మల పద్మిని,  డా. అత్తలూరి నరసింమారావు.
వెల. రూ. 125,
ప్రచురణ : అలకనంద ప్రచురణ
కాపీలకు : ప్రముఖ బుక్‌ సెంటర్లు
బిరీనీళిదిలీళిళిదిరీటరీబిదీబీనీబిజీదీలిశి.రిదీ కు మెయిల్‌ చేసి తెప్పించుకోవచ్చు.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

One Response to శ్వేత విప్లవ పితామహులు డా.వర్గీస్‌ కురియన్‌

  1. kk murthy says:

    పీదలకస్తము తెలిసినవారు, హ్రుదయమున్నవారు, కస్తము చెసినారు ,పెరుపొందారు ,కస్తముతొ మీరు పీరు పొందంది అని చెప్పకనె, చెసి చూపినారు, గొప్పవారుఅయ్యరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో