ఉత్తరం

పియ్రమైన కమలా!

ఎలా ఉన్నావు? చాలారోజులైంది నీనుంచి ఉత్తరం రాక – ఫోన్లల్లో ఏం మాట్లాడుకుంటాం? తీగలమాటలు తృప్తినివ్వవు.

కమలా, ఈ మధ్య ఒక గొప్ప ఆనందాన్ని, ఉద్వేగాన్ని పొందాను. ఆ అనుభూతిని నీక్కూడా కలిగిద్దామనే ఈ ఉత్తరం.

‘భూమిక’ పతిక్ర నీకు తెలుసుకదా! భూమిక నుంచి కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో 27 మంది రచయితుల్రం, కవయితుల్రం, సాహిత్యాభిమానులం కలిసి పాపికొండలు చూడడానికి వెళ్ళాం.

నర్సాపూర్లో వై.ఎన్ కాలేజీవాళ్ళు మా అందర్నీ ఆహ్వానిస్తూ, కరపత్రాన్ని వేసి మీటింగ్ పెట్టారు. నర్సాపూర్లోని ఉమెన్స్ కాలేజీ, ఈ కాలేజీలో రచయితుల్ర పట్ల వాళ్ళకున్న గౌరవాభిమానాలు, వారి అతిథి సత్కారాలు, మర్యాదలు మమ్మల్నెంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసాయి. అక్కడ్నించి సత్యవతి వాళ్ళ సొంత వూరు సీతారామపురం వెళ్ళాం. పేరుపాలెం బీచ్‌లో ఆ అలలతో ఆటల్లో అందరూ బాల్యావస్థలోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత పట్టిసీమ నుంచి లాంచ్లో పేరంటపల్లి బయల్దేరాం. కమలా! నిజంగా అదొక అద్భుతమైన ప్రయాణం. సంతోషంగా అన్నీ మరిచి వున్న మమ్మల్ని చూసి పులకించిన హృదయంలో ఆకాశం కూడా జలపుష్పాల్ని మాపై చిలకరిస్తూనే వుంది. ఇళ్ళూ, వాకిళ్ళూ, పిల్లలూ, ఉద్యోగాలూ, బరువులు, బాధ్యతలు, హోదాలు, అధికారాలు, ఇవన్నీ ఒదిలేసి స్నేహతరంగాలలో ఓలలాడారందరూ – లాంచ్లో చిన్నపాటి సెమినార్లాంటి మీటింగ్ కూడా పెట్టుకున్నాం. చందల్రత, పోలవరం పాజ్రెక్ట్ గురించి అనేక విషయాలు సేకరించి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. చర్చోప చర్చలు జరిగాయి. ‘భూమిక’ కార్యకలాపాల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత, రొటీన్ విషయాలనొదిలేసి పక్రృతిలోకి వెళ్ళిపోయాం-

నిజం కమలా! ఉన్న ఈ రెండు కళ్ళూ చాలవనిపించింది. ఎత్తైన కొండలు, ఎటుచూసినా పవ్రహిస్తున్న నీటి సొగసులు, గోదారిలో సుడిగుండాలెక్కువట. వేగంగా సుడులు తిరుగుతున్న వాటి కదలిక అపురూపం. చుట్టూ ఉన్న నాగరిక పప్రంచం కనుమరుగైపోయింది. ఎటుచూసినా నీళ్ళే, కొండల మధ్యనుంచి దూకుతున్న జలపాతాలు, విరిగిపడిన కొండచరియల తాలూకూ మట్టి సొగసులు, ఎత్తైన మట్టి దిబ్బలపైన చిన్న చిన్న గుడిసెలు, బొమ్మల్లాంటి మనుషులు, వాళ్ళ మొహాల్లోని అమాయకత్వాలు, ఆకలిరేఖలు, కొండల చెంపలమీద ‘పోడు’ వ్యవసాయపు రేఖలు, ఎండకు ఎండి వానకు తడిసిన కొండలు, చిన్న చిన్న పొగ వలయాలు, సన్నగా కురుస్తున్న వర్షం, కొండలన్నీ మంచు శరీరాన్ని కప్పుకుని, వణుకుతున్నాయి. గోదారీ, కొండలూ, ఆకాశం ఏమీ విడివిడిగా లేవు. అన్నీ కలగలిసిపోయి పక్రృతంతా ఒక్కటై నిలిచినట్లుంది. లాంచ్లో ముందు భాగాన నిలుచుని చుట్టూ చూస్తుంటే, ఎవరమూ ఎవరితో మాట్లాడుకోలేకపోయాం. అందరం ఒకే అనుభూతికి లోనయ్యాం. లయబద్ధంగా, పేమ్ర పూర్వక చినుకులు మొహం మీద పడి పలకరిస్తూనే వున్నాయి. శరీరం కోల్పోయి, చేతనావస్థను వదిలిపెట్టి మనసొక్కటే రెక్కలు తొడుక్కుని పక్షిలా పరవశించిపోయింది. పాపికొండలు రాబోతున్నాయి. ఎటుచూసినా తెల్లపూలు, పచ్చపూలు గోదారంతా కనిపిస్తున్నాయి. ఇవేం పూలు అని ఆశ్చర్యంగా చూస్తోంటే లాంచి దగ్గరకొచ్చిన కొద్దీ, నీటి కదలికలకు అవి చెల్లాచెదరైపోతున్నాయి. ఎమిటా అని చూస్తుంటే విచిత్రం, అవి పువ్వులు కావు, గోదారి విరగబడి నవ్వగా పుట్టిన అలల నురుగులు, పుక్కిట పట్టిన ఆ నురుగులన్నీ నీటి పువ్వులనే భా్రంతిని కల్పించాయి.

రెండు సన్నటి కొండలమధ్య నుంచి ఉధృతంగా పవ్రహిస్తున్న గోదారి మీద లాంచి వేగంగా వెళుతోంది. రెండు కళ్ళు సరిపోవని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాం.’’ నిశ్శబ్దంగా వుండండి గోదారికి శబ్దం చేస్తే కోపమట, అందుకని మాట్లాడకుండా వుండండి. కొండ దాటాక చల్లగా వెళ్ళండి అని గోదారితల్లి దీవిస్తుందట’’ అని ఎవరో అన్నారు. వాళ్ళు అలా అనకముందే ఉద్వేగం నిండిన మనసుల్తో అందరూ మూగగా మారిపోయారు. గొప్ప చైతన్యాన్ని మనసు నింపుకుంది. గోదారిని మనసంతా నింపుకోవాలని పాపికొండల్ని నిలుపుకోవాలని పయ్రత్నించినా సాధ్యం కాలేదు. కళ్ళు ఎంతగా తెరిచి చూస్తున్నా మనసుకు తృప్తి కలగట్లేదు.

‘మైక్’ నిస్తూ ఒక్కొక్కళ్ళనీ వాళ్ళ వాళ్ళ అనుభూతిని చెప్పమంటే అందరి మాటల్లోనూ కవిత్వం ప్రవహించింది.

ఏ అరమరికలూ లేని ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని, ఆనందాన్ని అనుభవించారందరూ. ఇంతమందిని ఈ విధంగా కలిపి, ఆనందానుభూతిని కలిగించినందుకు సత్యవతిని హోల్సేల్గా పేమ్రించేశారందరూ. సత్యవతి నిజంగా స్నేహశీలి. మంచి ఆర్గనైజర్, ఎడ్మినిస్టేట్రరూ కూడా. రాజమండి్ర వచ్చి గౌతమిలో ఎవరి గూళ్ళకు వాళ్ళు వచ్చేసినా, ఆ గోదారి తడి, ఆ సముదప్రు ఇసుక, ఆ కొండల పచ్చదనం, ఆ మనుషుల అమాయకత్వం, ఆ తెలిమంచు పొగలు, టైటానిక్ షిప్లో కూర్చున్నట్లున్న అనుభూతి, ఆ స్నేహ పరిమళాలు అన్నీ విడిచి వెళ్ళనంటున్నాయి. గోదారి నీటి అలలమీద పయ్రాణమప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటే అన్ని దృశ్యాలు దృశ్యాలుగా ఇంకిపోయాయి.
నిజం కమలా! పాపికొండలు కనుమరుగైపోతాయిక. ఆ పక్రృతంత నిర్మలంగా నవ్వలేదు. మనసు కాన్వాసుపై తప్ప మరింక వుండదు అనుకుంటే దిగులేస్తోంది.

శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో ణించడమంటే ఏమిటో తెలిసింది. మరణించి జీవించిన పయ్రాణమది. జీవితేచ్ఛను రగిలించిన ఉద్వేగస్థితి అది. అక్షరాలల్లోకి ఎంత రాసినా ఆ అనుభూతి ఒదగట్లేదు, కొన్ని కొన్ని సార్లంతే – చెప్పాల్సిందేదీ ఈ సిరా నింపుకోలేదు. ఈ దసరా సెలవులకన్నా నీ దగ్గరికి వద్దామని వుంది. వీలౌతుందో లేదో! ఉంటామరి.

-నీ శిలాలోలిత

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో