గ్రామీణ అభివృద్ధి – ఉపాధి హామీ చట్టం

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి,
కాకతీయ విశ్వవిద్యాలయం

నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు భూభాగంనుంచి, 3 శాతం సముద్రం నుంచి, 6 శాతం ఇతరత్రా, నీటివనరుల నుంచి లభిస్తుంది. దేశపురోభివృద్ధికి, ఆర్థిక స్థోమతకు వ్యవసాయమొక్కటే ఆయువుపట్టు లాంటిది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ఏర్పరచుకొన్న అభివృద్ధి ప్రణాళికలోని ప్రధానాంశం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 54 ఏళ్ళు గడిచిపోయినా, జాతి జీవనానికి పట్టుగొమ్మలైన గ్రామసీమల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లవుతున్నది. దేశంలో 5వ పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను పరిగణనలోకి తీసుకుంటే 2001 జనాభా లెక్కల ప్రకారం 7 కోట్ల 63 లక్షల జనాభాలో 73 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. పేదరికం, నిరక్ష్యరాస్యత, చాలిచాలని రక్షిత మంచినీటి సరఫరాతో పాటు, పారిశుద్ధ్యం, కుటుంబ సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిపాలన, దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు, రాజ్యాంగం మొదలైన సరియైన అవగాహన లేకపోవడం వల్ల నేటి మన గ్రామీణులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు దైవానికి వారసులని, తల్లిదండ్రులకు ఆశాజ్యోతులని, రేపటి సమాజానికి వారధులని అంటుంటారు. అయితే కొంతమంది బాలల నిజజీవిత చరిత్రల్ని నిశితంగా పరిశీలిస్తే హృదయాలు కరిగి కన్నీళ్ళు వస్తాయి. మనదేశంలో 5 కోట్ల 45 లక్షల బాల కార్మికులున్నారు. వీరిలో 6.3 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వెట్టిచాకిరికి నియమితులై కాలం గడుపుతున్నారనేది నిర్వివాదాంశం, మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్ర దిశలో ముందడుగు వేయలేకపోతున్నారు. వరకట్నం, నిరక్షరాస్యత, కులవ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు, అంటరానితనం, దారిద్య్రం మొదలైనవి గ్రామాలను విడవకుండా ఉన్నాయి.

గ్రామాలలోని వ్యవసాయ కార్మికులకు సంవత్సరం పొడువునా పనిలేక ఇతర ప్రాంతాలకు వలసపోయి కొందరు ఉభయభ్రష్టత్వం అన్నట్లుగా అక్కడకూడా నిర్జీవంగా బతుకుతున్నారు. మరి ఇతర కార్మికులకు కూడా అన్ని రోజులు చేతినిండా పనిలేక ఆకలిచావులకు గురికావలసి వస్తుంది.

చట్టం :
భారతదేశ చరిత్రలో 2006 సంవత్సరం ఫిబ్రవరి 2 ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున పనిచేసే వారికి పని కల్పించే గ్యారంటీ చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు. గతంలో ఈ పనులు కొన్ని రోజులకే పరిమితమయ్యాయి. కానీ ఈ పథకంలో 100 రోజులు పని కల్పించడంవల్ల పని చేసేవారు కొంత నిధిని తమ కోసం దాచుకునే అవకాశం ఏర్పడింది. ఈ పథకం వల్ల పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మొదటి దశలో ఈ పథకాన్ని 200 జిల్లాల్లో అమలు చేస్తారు. ఆ తరువాత దేశమంతటికీ విస్తరిస్తారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో నిరుద్యోగ యువతకు పని కల్పించడానికి నిర్దేశించారు. మొదటి దశలో మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, అనంతపురం, చిత్తూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, విజయనగరం, వరంగల్ జిల్లాల్లో అమలు చేస్తారు. జిల్లాకు వందకోట్ల చొప్పున 13 జిల్లాలకు 13 వందల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. దేశంలోని 200 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తోపాటు, అరుణాచల్ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలున్నాయి. మనరాష్ట్రంలో 34 లక్షలు కుటుంబాలకు ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించుటకు దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు 5 లక్షల మందికి పని కల్పించినారు.

ఈ పథకంలో భాగస్వామలు కాగోరే వారు తమ కుటుంబంలో పనిచేయడానికి ఇష్టపడుతున్న వయోజనుల వివరాలను గ్రామ పంచాయితీలో నమోదు చేయించుకోవాలి. నమోదులో భాగంగా కుటుంబంలో ఎవరెవరికి ఎన్ని రోజులు పని కావాలో ఒక తెల్ల కాగితంపై వివరంగా రాయాలి. పనికోసం బృందాలవారీగా కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. తమ వద్ద పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్ధులకు గ్రామ పంచాయతీలు ‘జాబ్ కార్డు’లను జారీ చేస్తాయి. పేర్ల నమోదు (పని అడిగిన) తర్వాత 15 రోజుల్లో పని కలిపిస్తారు. పనికి గానూ రాష్ట్రంలో అమలవుతున్న కనీస వేతనాల ప్రకారం దినసరి వేతనాలు చెల్లిస్తారు. వేతనాల చెల్లింపు వారానికోసారి జరుగుతాయి. ఎట్టి పరిస్థితులలోనూ వేతనాల చెల్లింపు అవధి పదిహేను రోజులకు మించకూడదు. ఆడ, మగ కూలీలకు సమాన కూలీ రేట్లు చెల్లిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ లింగ వివక్షకు చోటుండకూడదు. పని అడిగిన ప్రతివారికి పని కేటాయింపుకు సంబంధించిన వివరాలను నేరుగా ఉత్తరం ద్వారా తెలియజేస్తారు. ఫలానా తేదీ నుంచి పనికావాలని కోరుతూ అభ్యర్థులు ముందుగానే వివరాలను గ్రామపంచాయతీ/మండల పరిషత్ కార్యాలయంలో పొందుపరుస్తారు.

ప్రధానాంశాలు
ప్రతిగ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజులు తప్పనిసరిగా పనిని కల్పించడం ద్వారా గ్రామీణుల జీవనోపాధి భద్రతను పెంపొందించడం. ఒక కుటుంబం కింద పేరు నమోదు చేసుకున్న వయోజనులందరికీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజులు పని కల్పిస్తారు. అంటే కుటుంబంలోని ఒకరు/కొందరు లేదా అందరూ కలసి వంద రోజులు పనిచేయవచ్చు. ఎలాంటి నైపుణ్యం అవసరం లేని పనులను చేయగలిగే గ్రామీణ వయోజనులందరూ ఈ పథకానికి అర్హులు. ఒకవేళ వందరోజులు పని కల్పించకపోతే పని కల్పించని రోజులకుగానూ నిరుద్యోగభృతిని చెల్లిస్తారు. అందువల్ల అది ఖచ్చితమైన ఉపాధి హామీ పథకం. పని కల్పించని పక్షంలో చెల్లించే నిరుద్యోగభృతి మొదటి 30 రోజులకుగాను కనీస కూలీ రేటులో 25% మిగిలిన రోజులు 50% చొప్పున చెల్లిస్తారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా సాధ్యమైనంత వరకు గ్రామానికి అయిదు కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పిస్తారు. ఒకవేళ పని కల్పించే చోటు గ్రామానికి అయిదు కిలో మీటర్లకు మించితే ప్రయాణ ఖర్చులకు గానూ కూలీలో 10% అదనంగా చెల్లిస్తారు. వారంలో ఆరు రోజులు మించకుండా వరుసగా కనీసం 14 రోజులు పని కల్పిస్తారు. పని జరిగే చోట్లలో కనీస వసతులు సమకూరుస్తారు. మహిళలు వారి పిల్లల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కూలీ మొత్తం నగదు రూపంలో లేదా నగదు, బియ్యం రూపంలో కలిపి చెల్లిస్తారు. అయితే నగదు 25% తగ్గకూడదన్న నియమం ఉంది. పని జరిగేటప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే ఉచితంగా చికిత్స జరిపిస్తారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే నిర్దేశిత ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు. ఈ పథకంలో అమలు చేసే పనిలో 50% గ్రామ పంచాయతీయే నిర్వహిస్తుంది. పనుల ఎంపికలో గ్రామ సభలదే నిర్ణయాత్మకపాత్ర కాబట్టి గ్రామ సభలో సోషల్ ఆడిట్ జరుగుతుంది. పనుల ఎంపిక, అమలు, కూలీ చెల్లింపులతోపాటు నాణ్యతా పరీక్షలోనూ పారదర్శకత పాటిస్తారు. అంటే పనులకు సంబంధించిన అన్ని రికార్డులు, జమా ఖర్చుల వివరాలను సోషల్ ఆడిట్ కోసం గ్రామ పంచాయితీ ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.

గ్రామాల్లో ఎక్కువకాలం మనుగడలో ఉండే ఆస్తులను ఏర్పాటు చేయడానికి, గ్రామీణపేదల ఉపాధి వనరులను పెంచడానికి ఈ పథకం కింద పనులు చేపడ్తారు. ఉదాహరణకు ఎస్.సి., ఎస్.టి.ల భూములు, బిసిలకు చెందిన అసైన్డ్ భూములను సాగు భూములుగా మార్చే పనులు, కరువును ఎదుర్కోవడానికి మొక్కల పెంపకం, నీటి సంరక్షణ పనులు, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మిగతా ప్రపంచంతో గ్రామీణ ప్రాంతాలకు అనుసంథానం తెగకుండా వాటికి రోడ్లు వేయడం వంటి పనులు చేపడ్తారు.

వికలాంగులకు చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం నర్సరీల పెంపకం, మంచినీళ్ళను అందించడం వంటి పనులను కేటాయిస్తారు. ఇక మహిళా స్వయం సహాయ గ్రూపులకైతే ఈ పథకం కింద చాలా పనులున్నాయి. మహిళల గ్రూపులతో కూడిన గ్రామ సంఘం గ్రామ పంచాయితీలతో కలిపి పని చేయాలి. వారు పనులకోసం గ్రామీణులను సమీకరించాలి. గ్రామంలో పనుల కేటాయింపుకు, పథకం అమలుకు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారాన్ని బహిరంగంగా అందరికీ తెలిసేలా ఉంచేందుకు ఏర్పాటు చేసే సమాచారం అందించే బాధ్యత మహిళా గ్రూపులదే. అలాగే వీరికి వేజ్స్లిప్లను పనిచేసే వారికి అందించే బాధ్యత కూడా ఉంటుంది. ఈ పనులను చేసిన గ్రామ సంఘాలకు ఫీజు కూడా చెల్లిస్తారు. ఈ పథకంలో నిబంధనల్లోనే పారదర్శకతను కాపాడే ఏర్పాటు ఉంది. ఉదాహరణకు పని కేటాయింపు జరిగిందనే సమాచారం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి లేఖ రూపంలో వెడుతుంది. కాబట్టి దళారీలు, కాంట్రాక్టర్లు అసలు లబ్దిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ముప్పులేదు. ఈ చట్టం కింద మానవవనరులతోనే పనులు పూర్తి చేయించాలి తప్ప యంత్రాలు ఉపయోగించ రాదు, కాంట్రాక్టర్లను నియమించరాదనే నియమం ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.