అణు కుంపట్లు రగిలించొద్దు

తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, కుడంకళంలో రష్యా సహకారంతో మన ప్రభుత్వం నిర్మిస్తున్న అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని నెలలుగా నిరశనలు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని ‘త్రీ మైల్‌ ఐ లాండ్‌’ అణు ప్రమాదం, రష్యాలో ‘చెర్నోబిల్‌’ అణు ప్రమాదాల తర్వాత జపాన్‌ ‘ఫుకిషిమా’ అణువిద్యుత్‌ ప్రమాదంతో ప్రపంచ వ్యాప్తంగా అణువిద్యుత్‌ ప్లాంట్ల పట్ల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అణుధార్మిక ప్రమాదం వలన లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. దాని ప్రభావం వలన నేటికీ కాన్సర్‌ జబ్బులు, అంగవైకల్యం ఇతర అనేక రోగాలతో ప్రజలు బాధలు పడుతూనే ఉన్నారు. పైగా కూడంకళంలో నిర్మిస్తున్న రష్యా అణురియాక్టర్‌ల పూర్తి భద్రతపై సరైన సమాచారం నేటికీ లేదు. ఈ రియాక్టర్‌ల వల్ల బల్గేరియాలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఉంది. కుడంకళం ప్లాంట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే 30 కిలోమీటర్ల పరిధిలో 12 లక్షల మంది ప్రజల్ని ఖాళీ చెయ్యించాల్సిన అవసరం ఉంది. కానీ మన అణుశక్తి నియంత్రణ సంఘం దగ్గర దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవు. పైగా కుడంకళం సముద్ర తీర ప్రాంతాన ఉండటంతో సునామీ, ఇతర ప్రమాదాలు ఏర్పడితే అణువిద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో సునామీ వచ్చినపుడు చెన్నై దగ్గర్లోనే ఉన్న కల్పకం అణువిద్యుత్‌ ప్లాంట్‌ అదృష్టవశాత్తు మూసివేసి ఉండటం వలన భారీ ప్రమాదం తప్పింది. ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా మత్స్య కారులు, బీడీ కార్మికులు అధిక శాతంలో జీవనోపాధి సాగిస్తున్నారు. వీరంతా తమ జీవించే హక్కుపై పోరాడుతున్నారు.

సెప్టెంబర్‌ 10వ తేదీన వందలాది గ్రామాలనుండి మహిళలు పిల్లలతో సహా వేలాది మంది ప్రజలు ”వీరవీ కెనాల్‌ బీచ్‌” ప్రాంతంలో శాంతియుతంగా తమ నిరశన ప్రదర్శన చేస్తుండగా తమిళనాడు పోలీస్‌లు పాశవికంగా దాడిచేసి లాఠీలతో చితకబాదారు. ప్రజలపై పొగ బాంబులు ప్రయోగించారు. ఈ దాడిలో అనేక మంది ప్రజలు గాయాల పాలైయ్యారు. అంథోని అనే మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలందరూ భయాందోళనలతో వణికిపోతున్నారు.

ప్రజలు తమ జీవించే హక్కులో భాగంగా అణువిద్యుత్‌ ప్లాంట్‌ వలన ఎదురయ్యే సమస్యల గురించి, అడుగుతున్న ప్రశ్నలకు నిజాయితీగా పారదర్శకంగా జవాబు చెప్పకుండా, బలవంతంగా కుడంకళంలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. నెలల తరబడి ఏమాత్రం హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని హింసాపూరితం చేసి, ప్రజల ప్రాణాలను బలిగొనడాన్ని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తూ కూడంకళం ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ విశాఖలో నిరశన కార్యక్రమం నిర్వహించారు.

ఇండియాలో మానవ హక్కుల గురించి ప్రస్తావించండి

– ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి, ఆస్ట్రేలియా గ్రీన్స్‌ విన్నపం

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ‘జీవవైవిధ్య’ సమావేశానికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా గ్రీన్స్‌ సభ్యులు ‘ఇండియాలో అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత దేశ ప్రజల అణచివేత పై స్పందించవలసిందిగా గట్టిగా కోరారు’. ఇండియాలో కొత్త రియాక్టర్ల పై పెద్ద ఎత్తున వస్తున్న అసమ్మతి భౌగోళిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న అణువిద్యుత్‌ పరిశ్రమ పై ఒత్తిడిని పెంచుతుంది. అసమ్మతి తెలియజేసే ప్రజాస్వామిక హక్కును ఇండియాపోలీసు గట్టిగా అణచివేస్తుందని గ్రీన్స్‌ సెనెటర్‌ స్కాట్‌ లుడ్లామ్‌ అన్నారు.

”కుడంకళంలో అణురియాక్టర్లను స్థానిక వాసులపై తుపాకీ గొట్టంతో బలవంతంగా మోపుతున్నారు. 10 సురక్షిత మార్గదర్శకాలను పాటించనప్పటికీ, యురేనియం ఇంధనాన్ని ఎక్కించి తీరుతారు. రియాక్టర్‌ వద్ద గుమిగూడిన వేల కొలది ప్రశాంతంగా ఉన్న అసమ్మతి దారులను పోలీసులు క్రూరమైన అణచివేతకు గురిచేసారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరిని కాల్చి చంపారు. ఆంథోని సామి తరువాత కొద్ది రోజుల్లో చనిపోయాడు. 2010 సంవత్సరము నుండి కుడంకళం, జైతాపూర్‌ (మహారాష్ట్ర) ఘోరక్‌పూర్‌ (హర్యానా) అణువిద్యుత్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలలో కనీసం 5గురు మరణించారు.

ఎమ్‌.పి. పరమేశ్వరన్‌, ఇండియాలో ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త, ఒకప్పుడు ఇండియాలోని ఎటామిక్‌ ఎనర్జి కమీషన్‌ సభ్యుడు, 2011 సంవత్సరంలో ఇలా అన్నారు. ”భద్రతా అపాయము వలన, అణు వ్యర్థాల సమస్యపై అనిశ్చిత సమస్యల మూలంగా భారతదేశం తన అణు కార్యక్రమాలను నిలిపి వేయాలి”.

ఈ సంవత్సర ఆరంభంలో అణునిల్వల భద్రత విషయంలో, 32 దేశాల్లో ఇండియా 28వ స్థానంలో ఉంది. అంతకన్నా దారుణంగా, పూర్వపు ‘ఎటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు’ కంటే కొత్తగా వచ్చిన ‘న్యూక్లియర్‌ సేఫ్టీ రెగ్యులేటరీ అధారిటీ’కి తక్కువ అధికారాలున్నాయి, తక్కువ స్వతంత్రత ఉంది. ఒక రకంగా రెగ్యులేటరీ అథారిటీ ఒక కీలుబొమ్మ వ్యవస్థ. అది కొంతమంది మంత్రులకు జవాబు దారి. ఆ మంత్రులు ఈ వ్యవస్థకు ఆజ్ఞలు జారీ చేయవచ్చు, అందులోని సభ్యులను తొలగించవచ్చు.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అక్టోబర్‌లో ఇండియా వచ్చినపుడు, అణురక్షణ, అణువిస్తరణ, శాంతియుత అసమ్మతికి మానవ హక్కు విషయాలను ప్రధానంశాలుగా చేయుటకు ఆమెను కలవటానికి అవసరమైన తీర్మానాన్ని సెనేటర్‌ లుడ్లామ్‌ సెనేట్‌లో ప్రవేశపెడతారు.

( గ్రీన్‌ క్లైమెట్‌ మేగజైన్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో