బత్కమ్మ సంబురాలకు దళితాడోల్లని అనుమతించాలె

జూపాక సుభద్ర
బత్కమ్మంటే పూలపండుగ. ఫక్తు ఆడోల్ల పండుగ. పూలు ఆడవాల్లు కల్సి పాడుకొని ఆడుకునే సప్పట్ల సంబురాల పండుగ. యిది తెలంగాణ పల్లెల్ని అల్లుకున్న పండుగ. తెలంగాణ పల్లెలు, ఆడపిల్లలు పూలావరణంగా విరబూసే పండుగ యీ పండుగ రోజుల సందలు బడ్డ తర్వాత యిండ్లల్ల పుట్టిన పిల్లల కాన్నుంచి సచ్చే ముసలోల్లదాకా ఆడమగ అంత చెరువు కొమ్ముకు చేర్తరు. బత్కమ్మలు పట్టుకొని పొయే కుల అనుమతులున్న బీసి, ఓసీ ఆడోల్లు చెరువు కాడికి ఆడి పాడనీకి తీస్కపోయిన సత్తుపిండి, మలీద ముద్దలు, పెసరుముద్దలు,  బెబ్బెర ముద్దలు, పల్లి ముద్దలు సద్దులుగా తీస్కపోయి వూరందరికి పంచి పెడతారు, ‘బత్కమ్మలు మిరాడొద్దు, మీ పూలగొడుగులు, పాటల పర్వతాలను మేము సహించము అని ‘బత్కమ్మ మీద దొబ్బబెట్టిండ్రనీ, బొక్క బెట్టిండ్రనీ ”వూరి, కులనిషేధాలున్నా దళిత ఆడోల్లు మాత్రము వూరంతట్ని చెరువును, పూల బత్కమ్మల్ని చూడనీకి పాటలు విననీకి, వూర్లోల్లందర్ని కండ్లనిండ, చూసుకోవాలెననీ మానవీయతలతో పోతారు. యిక దళిత మగవాల్లు అందులో మాదిగ మగవాల్లు దొరల యిండ్లల్ల బత్కమ్మకు పూలు తేవాలె, చెరువుకాడికి మోయాలి. దప్పుదరువుల్తో వూరి బత్కమ్మలనన్నింటిని చెరువు కాడికి తీస్కపోవాలె. యింత చెమటలు కారంగ సేతులు నొయ్యంగ దప్పులు కొడితే వాల్లకొచ్చేది బత్కమ్మల మీద దిష్టి తీసిచ్చే రూపాయి, రెండ్రూపాయలు, దప్పు చెక్కల్ల యేసే సద్దుల ముద్దలు మాత్రమే. పండుగప్పుడు కూడా దళిత కులాలది ఎట్టి కష్టమే.

జీవావరణం ధ్వంసమైనా కుల రీతులు, కులాలు ధ్వంసం కావట్లేదు. రంగు రంగుల పూలబొయికాయితం బత్కమ్మలొచ్చి దళిత ఆడోల్ల చేతుల్లకు బత్కమ్మలు రాలే. యీ నిషేధాలు మాత్రం ధ్వంసం కావడం లేదు. ఎన్ని జీవావరణాలు, ఎన్ని పర్యావరణాలు ధ్వంసమైనా కులావరణాలు మాత్రం ధ్వంసం కావట్లేదు. సీమాంధ్ర వలస పాలనలో  గ్లోబలీకరణలో తెలంగాణ నీల్లు, సెరువులు, కుంటలు, పూలు, పశువులు, పక్షులు, తెలంగాణ  భాష సంస్కృతి వనరులు, పండుగలు నశించిపోయిన, యింకా పోతున్న తరుణంలో జీవవైవిధ్య సాంస్కృతిక సద్దుల బత్కమ్మను తెలంగాణ ఉద్యమం, జాగృతి మహిళలు బత్కమ్మను తెలంగాణ బతుకు చిత్రంగా, జీవ చిత్రణగా, సంస్కృతిగా ప్రపంచానికి చాటారు. కాని దళితాడోల్లు బత్కమ్మను ఎత్తుకొని పోవడానికి బత్కమ్మ పాట పాడనీకి, ఆడనీకి ఆటంకంగా వున్న నిషేధాల్ని తీసేసి, తరిమేసి అన్ని కులాల ఆడవాల్లు, అన్ని మతాల ఆడవాల్లు కూడా బత్కమ్మ ‘పాటలో పండుగలో మమేకమయే కార్యక్రమం తీసుకోవాల్సింది. తెలంగాణ జిల్లాల్లో యింత ఉద్యమమొచ్చినా దళితులకు సద్దుల బత్కమ్మ సాంఘిక సాంస్కృతిక నిషేధముంది. ఏవో  కొన్ని చోట్ల జిద్దుకు ‘పూలు మాయికూడా, బత్కమ్మ మాది కూడా అని రెబెల్‌గా ఆడుతున్నారుగానీ తెలంగాణ పల్లెల్లో యీ నిషేధాలు గుడి ప్రవేశంలాగానే వున్నాయి. యివి లేనట్లే, పట్టించుకోనట్లే గుర్తించనట్లే తెలంగాణ ఆడోల్లందరికి అని ‘వూరూర బత్కమ్మ’ అని బత్కమ్మను రాజకీయ బత్కమ్మను చేసి పట్నాలల్ల వూదరగొట్టిస్తున్నరు. దళితుల మీద బత్కమ్మ నిషేధాల సంగతినికూడా మాట్లాడి, సభబెట్టి, చర్చపెట్టి బత్కమ్మ తెలంగాణ ఆడబిడ్డలందరిది. అందరు ఆడుకోవాలె, పాడుకోవాలెనని వూరూర్ల బత్కమ్మాడాలెననే కార్యక్రమం తీసుకోవడం తెలంగాణ ఉద్యమానికి అవసరముంది.

తెలంగాణలో ‘మల్లీ సద్దులవరకు సచ్చెదెవరో బతికెదెవరోనని యీ రోజును ఒక సెంటిమెంట్‌గా బత్కమ్మ పండుగను తలుస్తారు. తెలంగాణలో రకరకాల ఉద్యమాలతో తిష్టవేసిన యిజాలు యిక్కడి జీవసాంస్కృతిక వైవిధ్యంగా వుండిన సద్దుల బత్కమ్మను కనుమరుగు చేసే ప్రయత్నాలు పట్నాల్లో కొంతవరకు ఫలించినా పల్లెల్నించి మాత్రము సద్దుల బత్కమ్మను విడదీయలేకపోయినయి ఏ ఉద్యమాలు సద్దుల  బత్కమ్మ అందరి ఆడవాల్లదికాదు, యిది వూరివరకే పరిమితం చేసిన అప్రజాస్వామికాలు, అన్యాయాలని ప్రశ్నించలేదు, గుర్తించలేదు.

చెట్టు పుట్ట, చేను చెలక, చెరువుకుంటలు పశు, పక్షులకు పూతబట్టిన పూలకు ఆకు బట్టిన అడివికి అలివైన జీవితాలు దళితాడవాల్లవి. నిత్యం ప్రకృతితో, జీవవైవిధ్యంగా తలపడే, సహజీవనం చేసే దళితాడవాల్లకు యీ జీవావరణాల నుండి దూరముంచే దుర్మార్గుల్ని తప్పించాలి. ఈ జీవావరణాల్ని,, జీవవైవిధ్యాల్నించి దూరం బెట్టే ఎంత గొప్ప పండుగలైనా అవి కొందరివే, అవీ ఆధిపత్యాలు చలాయించే కులాలవే. బత్కమ్మ లాడనివ్వని వూరివాల్లకోసం పూలు మోసి, బత్కమ్మల్నిమోసేది, దప్పుమేళాలతో వూరేగింపుగ చెరువులకాడికి, వాగులకాడికి తీసుకొచ్చేది దళిత మగవాల్లు. పూల బత్కమ్మల్ని పట్టనీయకున్నా, ముట్టనీయకున్నా పూలసీరెలు గట్టుకొని వూరి ఆటపాటల్ని సూడబోయి పాటలకు పగ్గాలేసుకోలేక చిన్న పిల్లల్ని బత్కమ్మలోలిగి మద్దెన బెట్టుకొని తీరొక్క రాగాలతో చెరువు చెవుల కరువు దీరే పాటలు బాడి జీవసాంస్కృతిక వైవిద్యాన్ని చాటే మానవీయతలు దళితాడోల్లవి. వూరంత  ఒక్క పూవుగా చందమామోలే విచ్చుకున్న బత్కమ్మ పాటలు మానవ విలువలు  ఆటపాటలు వూరి వాల్లకంటే దళిత వాడల్లోనే కొలువుంటాయనేది నిజము…యిట్లాంటి నిజాలమీద నిషేధాలు అల్లడం అసామాజికమ్‌, అన్యాయం. దళితాడవాల్లు బత్కమ్మాడితే ఆడొద్దనే కొట్లాటలు కోకొల్లాలు.

బత్కమ్మక అందరి ఆడవాల్లదికావాలి. అప్పుడే బత్కమ్మ ప్రజాస్వామిక రించబడ్తుంది. వూరి బైటి ఆడవాల్లను పూలను పూల బత్కమ్మను ఆడనివ్వని  సాంస్కృతిక నిషేధాలు యింత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా కొనసాగడము తెలంగాణ సాంస్కృతిక విషాదమని చెప్పుకోవాలి. వూరూర బత్కమ్మలు వాడవాడలకు పోవాలి. వాడ ఆడవాల్ల పూల బత్కమ్మల మీద వున్న నిషేధాల్ని ఎత్తివేయించి వూరు వాడ ఆడవాల్లు కలెగలిసి కలబోసుకునే బత్కమ్మలనాడాలి. యీ సామాజిక సాంస్కృతిక బాధ్యతలను తెలంగాణ ఉద్యమనాయకత్వాలు చేపట్టాలి. జీవవైవిధ్యాల గూర్చి మాట్లాడ్తున్న మనం సామాజిక, ప్రాంతాల పంపకాల గురించి మాట్లాడున్న మనం సాంస్కృతిక జీవావరణ, పర్యావరణ వైవిధ్యాన్ని, భిన్నత్వం గురించి కూడా మాట్లాడాల్సి వుంది. ఉద్యమాలు సామాజిక రుగ్మతల్ని, జాడ్యాల్ని తొలగించుకుంటాయి. ఆ క్రమంలో ‘వూరుర’ ఆడే బత్కమ్మలు వాడవాడలకు బొయి ఆడోల్లందరూ ఒక్కేసి పువ్వేసి సందమామ పాటలు పాడుకోవాలి. అందుకు తెలంగాణ ఉద్యమం నడుము కట్టాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.