గృహహింస చట్టం అమలు తీరుతెన్నులమీద సమావేశం

డా.రోష్ని
21 సెప్టెంబర్‌ 2012న భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలులో ఉన్న అవరోధాలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ-సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆక్స్‌ఫామ్‌-ఇండియా సహకారం అందించారు. ముందుగా భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ నుండి కె. సత్యవతి చర్చకు విచ్చేసిన వారందరికి స్వాగతం పలికారు. చర్చను ప్రారంభిస్తూ ఇటీవల ఆక్స్‌ఫామ్‌-ఇండియా ఆధ్వర్యంలో జరిగిన చర్చ గురించి గుర్తు చేసారు. అందులో డి.వి. ఏక్ట్‌ అమలులో జరుగుతున్న ఆలస్యం, ఇతర సమస్యల గురించి మాట్లాడారు. అంతేకాకుండా రక్షణాధికారి ఆఫీసులో ఉన్న సమస్యలు, సేవలందించేవారి బాధ్యతల గురించి కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా తగినంత బడ్జెట్‌ కేటాయించడం డి.వి. ఏక్ట్‌ అమలుకి ఎంత అవసరమో వివరించారు.

డి.వి ఏక్ట్‌ అమలు గురించిన రివ్యూ మీటింగ్స్‌ జరగటం లేదని, ఎవరి బాధ్యతలు ఏమిటి అనే స్పష్టత లేదని, ఈ విషయంలో గైడు చేసే దిక్కు కూడా లేదని సత్యవతి తన విచారాన్ని వ్యక్తం చేశారు.  రక్షణాధికారులకు కూడా వారిపై ఉన్న మిగతా పనిభారానికి డి.వి. ఏక్ట్‌ పని తోడవుతోంది. దీనికి సంబంధించిన సమావేశాలు కూడా అనేకసార్లు వాయిదాలుపడి చివరకు జరగనే లేదు. చాలా కేసుల్లో 498(ఎ) సెక్షన్‌ ప్రకారం పోలీసులు కేసు పెట్టినా, భర్తను అరెస్టు చేసినా బహుకొద్ది రోజుల్లోనే ఆ భర్త విడుదలై స్వేచ్ఛా ప్రపంచంలోనికి అడుగుపెడతాడు. ఈ విధంగా గృహహింసకు గురవుతున్న మహిళకు జరిగే న్యాయం శూన్యం. స్త్రీ, శిశుసంక్షేమశాఖలో 20,000 కేసులు పెండింగ్‌ ఉన్నాయని, వాటిలో 10,623 కేసులు డి.ఐ.ఆర్‌. తో రిజిస్టర్‌ అయి ఉన్నాయని, కేవలం 2,600 (24.5%) కేసులు మాత్రమే పరిష్కరించటం జరిగింది. డి.ఐ.ఆర్‌.తో కేసు ఫైల్‌ చేసాక 60 రోజుల లోపు పరిష్కరించి తీర్పు ఇవ్వాలనే అంశం మూలన పడింది.

తన ఉపన్యాసంలో సత్యవతి షెల్టర్‌ హోమ్స్‌ దుస్థితులను వివరించారు. భూమికలాంటి సంస్థలు కూడా ఈ హోమ్స్‌కు కేసులను పంపించడానికి వెనుకాడుతున్నారు. ఈ సందర్భంగానే అక్రమ రవాణాకు గురైన స్త్రీలకు ఉద్దేశించబడిన ‘ఉజ్వల హోమ్స్‌’, నిర్వహణ కూడా సరిగ్గా  లేదు.

ఆక్స్‌ఫామ్‌ ఇండియా ప్రోగ్రామ్‌ ఆఫీసరు రంజన మాట్లాడుతూ, ”న్యూఢిల్లీకి చెందిన లాయర్స్‌ కలెక్టివ్‌ డి.వి. ఏక్ట్‌ గురించిన వార్షిక నివేదిక తయారుచేసింది. దానిలో ఆంధ్రప్రదేశ్‌ డి.వి.ఏక్ట్‌ అమలులో 100% ఫలితాలను సాధించిందని, ఎందుకంటే బడ్జెట్‌ మొత్తం ఖర్చు అయినట్లుగా తెలుస్తుందని” అన్నారు. ఇది నిజమేనంటారా? ఈ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం వుంది. ఇక్కడ రక్షణాధికారి కేవలం డి.వి. ఏక్ట్‌ అమలుకే పనిచేయరు. వారికి వేరే డ్యూటీలుంటాయి. గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో ఫుల్‌టైం రక్షణాధికారులు వున్నా కాని అక్కడ పరిస్థితి కూడా పెద్ద గొప్పగా లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో మరొక వాస్తవం ఏంటంటే డి.ఐ.ఆర్‌. అయ్యాక కోర్టు ఆర్డర్‌కి చాలా సమయం పడుతుంది.  దీనివలన డి.వి. ఏక్ట్‌ అమలు కుంటుపడుతోంది. గృహహింస బాధితులకు కావాల్సిన న్యాయసహాయం ఉచితంగాను, నిష్పక్షపాతంగా అందేలా చూడాల్సిన అవసరం వుంది. కాని ప్రస్తుతం ఇది కూడా సరిగా అమలవ్వడం లేదు.  అసలే మానసికంగా గాయపడిన మహిళలకు న్యాయపరమైన సహాయం అందడం లేదనేది వాస్తవం. కొన్ని సంస్థలు షెల్టర్‌ హోమ్స్‌, హెల్ప్‌లైన్స్‌ నిర్వహిస్తున్నాగానీ కేంద్రం నుంచి సరైన ఫండ్స్‌ లేనందువల్ల, సరయిన వైద్యసౌకర్యాలు లేనందువల్ల సహాయం జరగడం లేదు. ఒరిస్సాలో జరిగిన 75 కేసుల అధ్యయనంలో కోర్టు తీర్పు రావడానికి 60 రోజులకంటే ఎక్కువ పట్టిందని తెలుస్తోంది. 2008-09 సం||రానికి కాను డి.వి. ఏక్ట్‌ అమలుకు సంబంధించి కేటాయించ బడ్డ బడ్జెట్‌ కోటి రూపాయలు. 2011-12 సంవత్సరంలో కూడా 1.14 కోట్లు.  ఇందులో పనిచేస్తున్న కౌన్సులర్స్‌కి వారికి జీతాలు మాత్రం సరిగ్గా అందడం లేదు. కాని పనిభారం చాలా ఎక్కువ. మన రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన పశ్చిమగోదావరిలో ఒక్క గృహహింస కేసు కూడా రిజిస్టర్‌ కాకపోవడాన్ని తెలియజేస్తూ సత్యవతి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. న్యాయపరమైన చర్యలు లేకుండగానే కేసులన్నీ పరిష్కరించ బడుతున్నట్లు కనబడుతున్నది. ఈ విషయమై తప్పక చర్చించాలి.

రంజన తన ఉపన్యాసాన్ని ముగిస్తూ స్త్రీలపై గృహహింస అంశం జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకోలేదని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమీషన్‌ సెక్రటరీ మాట్లాడుతూ ఈ యాక్టు అమలులో పనిచేస్తున్న వారికి రెగ్యులర్‌గ అవగాహన ట్రైనింగ్‌ ఇవ్వాలని, సరిపడా బడ్జెట్‌ ఉండాలని, బాధితులకు సరయిన వైద్య సహాయం అందించాలని, పెళ్లికాకముందు కౌన్సిలింగ్‌ ఉండాలని తెలియచేసారు.

ఇంకా ఈ సమావేశంలో హైదరాబాద్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసరు లక్ష్మీదేవి, అడ్వకేటు ముజిబ్‌కుమార్‌, నారాయణాఖేడ్‌ జడ్జి నాగరాణిగారు మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన గ్రూఫు చర్చ తర్వాత వచ్చిన సలహాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ చర్చలో వివిధ ఎన్‌జివోలకు చెందినవారు పాల్గొన్నారు.

ు    నైపుణ్యం కలిగిన స్టాఫ్‌, సరిపడే బడ్జెట్‌, అవగాహనా కార్యాక్రమాలు, ప్రత్యేక మహిళా కోర్టులు (డివియాక్టు కై ప్రత్యేక కోర్టులు) మండల స్థాయిలో సోషల్‌ యాక్షన్‌ కమీటీలు (ఎస్‌ఎసిఎస్‌) అవసరం.

ు     స్టాఫ్‌్‌ను ఎంచుకొనేటప్పుడు మహిళాసమస్యలపట్ల అవగాహన, సానుభూతి కలవారిని సెలక్టు చేసుకోవాలి.

ు    అన్ని స్థాయిల్లో పనిచేసేవారికి అవగాహనా సదస్సులు పెట్టాలి.

ు    రేడియో, టివి, కరపత్రాలు, ఇంటర్నెట్‌, హోర్డింగ్‌లద్వారా అవగాహనా కార్యక్రమాన్ని ఉధృతం చేయాలి.

ు    కోర్టువారు సమన్లు పంపడానికి పోలీసు, హోంగార్డులను ఉపయోగించుకోవాలి. హోంగార్డుల సంఖ్యను పెంచాలి.

ు    డిఐఆర్‌ కి సమన్లకి మధ్య సమాయన్ని బాగా తగ్గించాలి.

ు    ఆల్కహాలు ఎడిక్ట్‌లను రిహాబిలిటేషన్‌ సెంటర్లకు పంపవచ్చు. దీనికి తగిన సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి.

ు    కౌన్సిలర్లు కేసును పూర్తిగా అర్థం చేసుకుని బాధితురాలికి సాయపడాలి. ఏదీ కూడా బలవంతపు పరిష్కారంగా ఉండ కూడదు.

ు    లైసెన్సు కలిగిన షెల్టర్‌ హోమ్స్‌కే కేసులు పంపాలి. ఈ హోమ్‌ల గురించిన సమాచారం అందరికీ అందచేయాలి. వాటి సంఖ్యను ఇంకా పెంచాలి. ఈ హోమ్‌లలో ట్రైనింగ్‌ పొందిన కౌన్సిలర్‌ తప్పకుండా ఉండాలి.

ు    బాధితురాలికి సరయిన వైద్య సహాయం వెంటనే అందేలా చూడాలి.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో