జెండర్‌ సమన్యాయ ప్రచారోద్యమంలో భాగస్వాములు కండి!

ఇటీవల కాలంలో మహిళలపై, ఆడపిల్లలపై అత్యాచారాలు, కిడ్నాపులు, గృహహింస సంఘటనలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, యాసిడ్‌ దాడులు పెరిగిపోతున్నాయి. గర్భస్థ పిండంగా వున్నప్నటినుండే స్త్రీలపై హింస మొదలై, వారిపై ఆ హింస జీవితాంతం కొనసాగుతూనే వుంది. ప్రతి స్త్రీ తన జీవిత కాలంలో ఏదోక రకమైన హింసను ఎదుర్కొంటూనే వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఇటీవల ప్రకటించడం వాస్తవం.

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 992 మంది మాత్రమే మహిళలున్నారు. వారిలో 0-6 మధ్య వయస్సున్న పిల్లల్లో ఆడపిల్లల సంఖ్య కేవలం 943 మాత్రమే. మన రాష్ట్రంలో గత 4 ఏళ్ళలో 40 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారు. ఈ విధంగా మాయమైన వారు చివరికి అంగడి సరుకులుగా మారుతున్నారు. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు మనిషి బుద్ధిని, సమాజ నాగరికతను అవహేళన చేస్తూ ఆధునిక బానిసత్వానికి అద్దం పడుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి నివేదిక మరియు ‘లాయర్స్‌ విమెన్స్‌ రైట్స్‌ ఇనిషియేటివ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే, నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2011లో దేశవ్యాప్తంగా 2,28,650 నేరాలు మహిళలపై జరిగినట్లు తెలుస్తున్నది. దక్షిణాదిలో మొత్తం రాష్ట్రాలతో పోల్చుకుంటే మహిళలకు భద్రత లేనిది మన రాష్ట్రంలోనే అనే విషయాన్ని గణాంకాలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది స్త్రీలపై అత్యధికంగా నేరాలు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో వున్నది. ఈ నేపథ్యంలో స్త్రీలపై ఇంటా బయటా జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ప్రతి సంవత్సరం 16 రోజులపాటు నవంబరు 25 నుండి డిసెంబర్‌ 10 వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ మహిళా సంస్థలు 1991లో పిలుపు నిచ్చాయి. దీనికి స్పందిచిన మన రాష్ట్ర మహిళా సంస్థలు, ఇతర పౌర సమాజ సంస్థలు కలిపి 2005లో ”జెండర్‌ సమన్యాయ ఐక్యవేదిక”గా ఏర్పడ్డాయి. అప్పటినుండి పేద, దళిత ఇతర అణిచివేయబడిన మరియు మైనారిటీ వర్గాల మహిళల స్థితిపై అవగాహన కల్పిస్తూ ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నవి. ఈ 16 రోజుల ప్రచారోద్యమంలో సమాజంలోని ప్రతి వ్యక్తిని, సంస్థలను ముఖ్యంగా, సమానత్వాన్ని కోరే పురుషులను కూడా నిశ్శబ్దాన్ని వీడి, స్త్రీలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, ఉద్యమిస్తున్న స్త్రీలతో గొంతు కలపాలని ఐక్య వేదిక ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. మానవీయ సమాజాన్ని కోరే వారిగా, ప్రజాస్వామిక లౌకిక భారతీయులుగా, శాంతిని కోరే వారిగా, మనందరం స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసలనూ, దాడులనూ ఖండిద్దాం. ఎలాంటి వివక్షతల్లేని సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం. ఈ 16 రోజుల ప్రచారోద్యమంలో స్త్రీలపై, బాలికలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, హింసకు బలై మరణించిన స్త్రీలను స్మరిస్తూ, వారి కుటుంబాలకు మనమున్నామని ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, స్త్రీలపై జరుగుతున్న హింసావ్యతిరేకోద్యమాల్లో మన వంతు పాత్రను నిర్వహించుదాం.

ప్రతిజ్ఞ

పరస్పర ప్రేమాభిమానాలతో,స్నేహంతో మనుషులందరూ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకొని జీవించే సమాజం కోసం ఉద్యమిస్తూ అన్ని రకాల అన్యాయాలను, అణచివేతలను వివక్షతలను వ్యతిరేకిస్తూ లింగం, కులం, మతం, వర్గం, భాష, ప్రాంతం, రంగు, సామర్ధ్యం ఏదైనా మనుష్యులందరికీ సమాన హోదా కల్పించేటటువంటి సమాజ నిర్మాణ క్రమంలో భాగం పంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.

సామాజిక బాధ్యత గత పౌరులుగా మెరుగైన సమాజానికి పునాదులు వేద్దాం!

ఆం.ప్ర జెండర్‌ సమన్యాయ ఐక్య వేదిక (జుఆ ్పుళిబిజిరిశిరిళిదీ తీళిజీ వీలిదీఖిలిజీ అతిరీశిరిబీలి, ) తేది 25.11.2012

క. శ్రీళి. 1-1-781/ఔ/4, శ్రీలిబిజీ ్పుబిదీబిజీబి ఔబిదీది, స్త్రబిదీఖినీరి దీబివీబిజీ, కగిఖిలిజీబిలీబిఖి – 500 080

ఆనీ. 040-65793180 లిళీబిరిజి.: బిళీబిదీఖీలిఖిరిదిబిటగిబినీళిళి.బీళి.రిదీ

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో