బాల్య వివాహాలు – ఒక పరిశీలన

ఎస్‌. రమేష్‌, ఎం. రాజేందర్‌ రెడ్డి

బాల్య వివాహాలు చాలా పాతకాలం మాట. అయినా ఈ నాటికి కూడా కొనసాగుతున్నాయి. మనిషి జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కాని తల్లిఒడిలో ఉండగానే పెళ్ళిల్లు జరగడం బాధాకరమైన విషయం. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి.

ఆడపిల్లలు చదవటం, ఆర్థికంగా నిలద్రొక్కుకునేలా చేసే ఎలాంటి ఆసక్తిలేని తల్లిదండ్రులకు భర్త ఇంటికి పంపే ఆతృత అంతా ఇంతా కాదు. మనం రాకెట్‌ యుగంగా చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే కొందరిని ఆశ్చర్యపరచవచ్చు కాని ఇది నిజం. ఈనాటికి కూడా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలు కర్నూలు, కోస్తా ప్రాంతాలు, తూర్పుగోదావరి ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో మెదక్‌, మహబూబ్‌ నగర్‌ లాంటి జిల్లాల్లో కూడా వెళ్ళూనుకుంది.

బాల్య వివాహాలు నిరోధించటానికి ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి?

బాల్య వివాహాలు నిరోధించడానికి మన దేశంలో మొట్టమొదటి సారిగా రాజారామ్‌ మోహన్‌రాయ్‌, విద్యాసాగర్‌, మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, వెంకటరత్నం నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ లాంటి సంఘ సంస్కర్తలు అనేక ఒడంబడికలు ప్రదర్శించి కృషి చేసినా, ఈ మూఢాచారం కొనసాగు తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

నిరక్షరాస్యత, పేదరికం, వరకట్నం, సామాజిక భద్రత లేక పోవటం, అధిక సంతానం, సంప్ర దాయాలు, అభివృద్ధికి నోచుకోక పోవడం, పురుషాధిక్యత, తల్లిదండ్రులు (అనాసక్తత), ఆస్తి కారణాలు. పైన పేర్కొన్న కారణాల వలన ప్రభుత్వాలు కూడా ఏమీ చెయ్యలేకపోవడంచేత ఇది ఈనాటికి కూడా కొనసాగు తున్నాయి. ప్రభుత్వాలు ఏమీ చేయక పోవడానికి ఒక కారణం ఏమిటంటే ఓటు చాలక రాజకీయాలు అని చెప్పవచ్చు. కాని స్వచ్ఛంధ సంస్థలు మాత్రం వీటిని గురించి అధ్యయనం చేస్తూ ప్రభుత్వాలకు సహాయపడడం అభినందనీయం అని చెప్పాలి.

మన రాష్ట్ర ప్రభుత్వం 2002 సంవత్సరంలో బాల్య వివాహాలు నిరోధించుటకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం అబ్బాయి వయస్సు 21 సం||లు, అమ్మాయి వయస్సు 18 సం||లు నిండితేనే ఆ వివాహం చెల్లుబాటు అవుతుంది. లేకుంటే ఆ వివాహం చట్ట ప్రకారం చెల్లదు.

అదే సమయంలో బాల్య వివాహాల విషవలయం నుంచి రాష్ట్ర మహిళా లోకాన్ని జాగ్రత్త పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుపుతుంది. అందుకు అనేక కార్యక్రమాలు అమలు జరుపుతుంది. బాలిక సంరక్షణ పథకం క్రింద ఇద్దరు పిల్లలు ఉన్న వారికి అంటే బాలిక ఉంటే వారికి ఈ పథకాన్ని వర్తింపచేస్తుంది. పుట్టిన రోజు నుండి డిగ్రీ వరకు వివిధ దశలలో దాదాపు రూ. 25 వేలు వారికి సమకూర్చడం జరుగుతుంది. ఆడపిల్ల భారం కాకుండా ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం అయితే విద్యా, ఉపాధికి సహాయం అందచెయ్యాలని ఆడపిల్లల గురించి కస్తూరిబాయి విద్యాలయాలు, మండలానికి ఒక్కొక్కటి స్థాపించి పిల్లలకు విద్యతోపాటు సంస్కారం, వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం, రేపు వారి భవిష్యత్తుకు తమ కాళ్ళ మీద నిలబడటం ప్రభుత్వ ఉద్దేశ్యం.

బాల్య వివాహాలు పట్టిక :

రాష్ట్రం                 సం||ము   15-18 సం||లు     24-29 సం||లు     25-29 సం||లు

భారతదేశం          1981         43-44%              84.46%              94.35

మొత్తం                1991           31.28               75.34                  90.71

ఆంధ్రప్రదేశ్‌

1981            56.23               90.21                  91.68

1991            41.98              80.20                  83.57

1991            09.49             51.90                 79.43

సంఘటిత రంగంలో స్త్రీల విభజన :

రాష్ట్రం               ప్రభుత్వ రంగం            ప్రైవేటు రంగం               మొత్తం

ఆంధ్రప్రదేశ్‌        10.2                         20.2                          12.3

కేరళ                  28.0                      44.3                             35.4

నేషనల్‌ శాంపిల్‌ సర్వే 1993 ప్రకారం :

రాష్ట్రం                         0-4           5-14            15-34      45-49     50పైన        అన్ని వయస్కులు

భారతదేశం   మగ      25.9            2.0             2.5                6.00   35.3            10%

ఆడ        27.2            2.2             2.9                4.4         29.6         9.6

ఆం.ప్ర          మగ        24.8           1.6             3.2               6.5          40           10.7

ఆడ          17.6         1.4             2.7              4.7         32.6          8.7

కేరళ             మగ          5.2           0.5              1.8             4.6           33.3        7.0

ఆడ           3.4         0.3               0.9             2.3          24.6         5.1

స్త్రీలు – పురుషులు వయస్సును జోడించి మనం చేసిన మరణాల రేటు ప్రతి వెయ్యిమందికి.

 మనం ముఖ్య విషయం మర్చిపోతున్నాము. అది ఏమిటంటే మనది పితృస్వామిక వ్యవస్థ. కావున మనం ఎన్ని చట్టాలు చేసినా, మనలో (ఆలోచనలో) మార్పు రావాలి. మారాలి కానీ మన ప్రభుత్వాలు చేసే చట్టాలు, శాసనాల వల్ల కాదు. రోజు రోజుకు చాపకింద నీళ్ళులా పుట్టుకొస్తున్న బాల్య వివాహాలను మనం నిర్మూలించాలంటే ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారాలు, చర్చ జరపవలసి వస్తుంది. ఇది ఒక యజ్ఞంగా జరపవలసి వస్తుంది.

పై పట్టికలు 1981 వ సంవత్సరంలో భారతదేశం మొత్తం 15-19 సం||లకు 43.44 శాతం ఉండగా, 20-24 సం||లకు 84.46 శాతం ఉంది. అదే సమయంలో 25-29 సం||లకు 94.35 శాతం ఉంది.

1991 సంవత్సరం నాటికి 15-19 సం||లకు 31.28 శాతం, 20-24 సం||లకు 75.34 శాతం, 25-29 సంవత్సరాలకు 90.71 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 1981 నాటికి 15-19 సం||లకు 56.23 ఉండగా, 20-24 సం||లకు 90.21 ఉంది. 25-29 సం||లకు 94.92 శాతం ఉంది.

ఇంకా కేరళ విషయానికి వస్తే 15-19 సం||ల వయస్సుకు 28 శాతం, 14-13 శాతం, 20-24 సం||లకు 57.16 శాతం, 25-29 సం||లకు 91.68 శాతం, 1991 సం||లో 20-24 సం||లకు 9.49 శాతం, 79.43 శాతం కలిగి ఉంది.

సంఘటిత రంగాలలో స్త్రీల విభజన :

ప్రభుత్వ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ 10.2 ఉండగా, ప్రైవేటు రంగంలో 20.2 శాతం ఉంది. మొత్తం దేశంలో 12.3 ఉంది. కెేరళ విషయానికి వస్తే 25% శాతం ప్రభుత్వ రంగాలు ఉండగా, ప్రైవేటు రంగాలు 44.3 స్త్రీలు విభజన ఉంది. మొత్తం వృద్ధి రేటు 35.4 ఉంది. దాదాపు రెండింతలు వృద్ధిరేటు ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే, కేరళలో ఉండటానికి కారణం అక్కడ స్త్రీల అక్షరాస్యత, వివాహ వయస్సు, ఆరోగ్యమే కారణం అని చెప్పవచ్చు.

భారతదేశం మొత్తం మగ 0-4 సం||ల వారు 25.9 శాతం ఉండగా, ఆడవాళ్ళు 27.02 ఉన్నారు. అదే విధంగా 5-14 సం||లకు ఆడవారు ప్రతి వెయ్యి మందికి ఇందులో ఉండే ఆడవాళ్ళు 2-2 ఉండటం జరిగింది. 15-34 మంది మగవారు 2-5 మంది మరణరేటు ఉండగా ఆడవారు 2-9 ఉండటం జరిగింది. 35-49 శాతం మధ్య ప్రతి వెయ్యిమందికి మగవారు 6-1 మంది చనిపోతే, ఆడవారు మాత్రం 4-4 మంది చనిపోవడం జరిగింది. 50 పైన వారు ప్రతి వెయ్యిమందికి 35.3 మంది అని, ఆడవారి విషయానికి వస్తే 50 పైన ఉన్న 29.6 శాతం ఉండగా అన్ని వయస్సుల వారు 9.6 శాతం ఉండటం జరిగింది. 35-49 మధ్య గల మగవారి విషయానికి వస్తే ప్రతి వెయ్యి మందికి 4.6 శాతం ఉండగా ఆడవారి విషయానికి వస్తే 2-3 శాతం కలిగి ఉంది. 50 పై బడిన వారి విషయానికి వస్తే 33.3 శాతం మరణాల రేటు ఉంది. మగవారిలో కంటే ఆడవారి 24.6 శాతం ఉంది. అన్ని వయస్సులు 7 నుంచి 5-7 వరకు ఉంది.

పై పట్టిక ద్వారా సూక్ష్మంగా పరిశీలించినట్లైతే 20 సం||లోపు ఎవరైనా వివాహం చేసుకొంటే వారి ఆరోగ్యం, మరణాల మీద, వారికొ పుట్టబోయే సంతానం కలిగి ఉందని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చినప్పుడు కేరళలో మహిళల మరణాల రేటు ప్రతి వెయ్యి (1000) మందికి ఆంధ్రప్రదేశ్‌ కంటే తక్కువగా ఉండడానికి అక్కడ బాల్య వివాహాలు ఉండవు. దానికి కారణం విద్యవంతులు కావడం అని చెప్పవచ్చు. అక్కడ ప్రతి స్త్రీ కనీసం 18 సం||ల పై బడిన తర్వాతనే వివాహం చేసుకోవడం వల్ల వారి యొక్క ఆరోగ్యం అభివృద్ధి పెరుగుదల సైతం ఉంటుంది. ఇది దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

ముగింపు :

మనం ఈనాడు రాతియుగం నుండి రాకెట్‌ యుగం వరకు ప్రయాణం చేస్తున్నామని చెప్పుకొన్నప్పటికీ కొన్ని సామాజిక రుగ్మతల నీడలు వెంటపడుతున్నాయి. అందులో ముఖ్యమైనది బాల్య వివాహాలు అని చెప్పవచ్చు. చిన్నతనంలో వారి పెండ్లి చేసి సమాజంలో సర్దుబాటుగాక పోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాని వలన సమాజంలో ప్రగతి అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాము. మన ఆర్థికాభివృద్ధి 9 శాతంపైకి దూసుకొస్తున్న అదే సమయంలో సామాజిక రుగ్మతులైన బాల్య వివాహాలు, గృహ హత్యలు, వరకట్నం చావులు నిర్మూలించినప్పుడు మనం అనుకున్న ప్రగతి సాధ్యం అవుతుంది. దానికి విద్యకు సాధనంగా ఉపయోగించుకోవడము వలనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.

దీని గురించి సమాజంలో అందరూ కృషి చేసినప్పుడే ఇవి సాధ్యం అవుతుంది.

1) నేషనల్‌ శాంపుల్‌ సర్వే – 1989

2) మహిళ ఉద్యమాలు. ఎస్‌.డి.ఎల్‌.సి.ఇ., బుక్స్‌, కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌.

3) తెలుగు అకాడమీ మహిళా చట్టాలు, అకాడమి హైద్రాబాద్‌

4) మహిళాభివృద్ధి, ఆంధ్రజ్యోతి దిన పత్రిక, మార్చి 8, 2012

5) వార్త దినపత్రిక, 10-11-2012

 

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో