పుస్తకమే మస్తకం

ఆర్‌.వి. రామారావు

(అనుభవజ్ఞులైన పాత్రికేయులు, పాత్రికేయ అధ్యాపకులు, రచయిత, అనువాదకులు అయిన రామారావు గారు వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు వెలుగు” సెప్టెంబర్‌ 2012 సంచికలో ప్రచురించబడింది. వ్యాసాన్ని పుస్తకం నెట్లో ఉంచేందుకు అనుమతించిన రామారావు గారికి, అలాగే దీన్ని అందజేసిన సూరంపూడి పవన్‌ సంతోష్‌కు మా ధన్యవాదాలు – పుస్తకం నెట్‌)

‘చిరిగిన చొక్కా, అయినా తొడుక్కో… మంచి పుస్తకం కొనుక్కో’

అన్నది హితోక్తి. ఉత్తమ గ్రంథాల విలువ అలాంటిది. అంతే కాదు… భాష బాగా అబ్బాలంటే పుస్తకాల్ని చదవడమే మార్గం. పుస్తకం మనిషికి మంచినేస్తం. అపారమైన జ్ఞాన సమద్రాన్ని ఆపోశన పెట్టడానికి పుస్తకంలా పనికివచ్చేది మరొకటి లేదు. గ్రంథ పఠనం అలసట తీరుస్తుంది. సాహిత్య ప్రయోజనం చైతన్యస్థాయిని పెంచడమే కాదు… ఊరట కలిగించడం దిశానిర్దేశం చేయడం, అలసిన గుండెల సేద తీర్చడం కూడా.

‘తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి’ అన్నది నానుడి. అక్షరాస్యత అంతగా పెరగని రోజుల్లో వినడానికి ప్రాధాన్యం ఉండేది. చదువు వచ్చిన వారు చదువుతుంటే చదువు రానివారు విని విషయం గ్రహించే వారు కాని ఇప్పుడు అక్షరజ్ఞానం క్రమంగా పెరుగుతోంది కాబట్టి ఎవరి సహాయం లేకుండానే జ్ఞానం సంపాదించుకోవచ్చు. వింటే మహాభారతమే వినాలి. అనడం చాలా ఔచిత్యంతో కూడిన మాట. మహాభారతంలో అనేకానేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మహాభారతాన్ని నన్నయ తెలుగులో రాసినప్పుడు అది ఎవరెవరికి ఉపయోగపడుతుందో పెద్ద జాబితా ఇచ్చాడు.

అంటే తన మహాభారతంలో ఎవరికేది కావాలంటే అది దొరుకుతుందన్నది నన్నయ భావం. అందుకే దానికి అంత ప్రశస్తి. రామాయణ, మహాభారతాలు చదివి వారికీ వాటిలో కథ స్థూలంగా తెలుసు. అవి మన సంస్కృతిలో అంతర్భాగం. ఒక తరం నుంచి మరో తరానికి వాటి విశేషాలు అందుతూనే ఉన్నాయి. అన్ని గ్రంథాలూ ఇంత మహత్తరమైనవి కాకపోవచ్చు. కానీ ఎంత చెత్త పుస్తకంలోనైనా ఎంతో కొంత తెలుసుకోదగింది ఉంటుంది.

మానవ శరీరంలోని అన్ని అంగాలకూ వాడే కొద్దీ అరుగుదల ఉంటుంది. మెదడు మాత్రం వాడే కొద్దీ రాటుదేలుతుంది. మెదడుకు పదును పెట్టడానికి పుస్తకాలు చాలా తోడ్పడతాయి. పాఠశాలలోనో, కళాశాలలోనో విద్యార్జన పూర్తి అయిపోతుందనుకోవడం అపోహే. చదువు నిరంతరంగా కొనసాగాల్సిన వ్యవహారం. చదువు నేర్చినవారు మంచి పుస్తకాలు చదవకపోతే చదువురాని వారికీ వచ్చిన వారికీ తేడా ఉండదు అన్నాడు మార్క్‌ ట్వైన్‌. టీవీలు, ఇంటర్నెట్‌ల వల్ల చదివే అలవాటు తగ్గిందన్నది వాస్తవమే. అయినా మంచి గ్రంథాలను ఉపయోగించుకునే వారి సంఖ్య ఇప్పటికీ గణనీయమే.

పుస్తక పఠన పద్ధతులు

చాలా మంది పుస్తకాలు చదువుతారు. కాని చదివింది గుర్తుండదు. చదివిందంతా గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ చదువుతున్న కొద్దీ గుర్తుంచుకోవడంతోపాటు చదివిన విషయాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా గొప్ప విషయమే. చదివి ఆకళింపు చేసుకుని అనయించుకునే శక్తి సంపాదించడానికి తమ ఆలోచనలు కూడా జోడించి సరికొత్త సూత్రీకరణలు చేయడం చివరి దశ. ఆ దశకు చేరుకున్నవారినే మేధావులు అంటాం. ఈ దశల్లో ఏ దశకు చేరుతామన్న దాన్ని బట్టి చదివిన చదువులవల్ల ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

1. సౌందర్యాత్మకత (బిలిరీశినీలిశిరిబీరీ)2. వాస్తవికత (జీలిబిజిరిరీళీ)

3. తాత్త్వికత (రిఖిలిళిజిళివీగి)

సౌందర్యాత్మకత

ఒక సినిమానో, నాటకమో చూసినప్పుడు, ఒక పుస్తకం చదివినప్పుడు మనకు అది నచ్చడానికి, నచ్చకపోవడానికి అందులోని సౌందర్యమే కారణం. అది మన మనస్సునో, కంటినో, హృదయాన్నో తాకితే అది సుందరంగా ఉన్నట్లు, అందులో సౌందర్యాత్మకత ఉన్నట్లు లెక్క. బాగుండటం, బాగోలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. సుందరత అనేది వైయక్తికమూ కావచ్చు. సార్వజనీనమైనదీ కావచ్చు. ఉదాహరణకు పూలన్నీ అందమైనవే. అందరికీ ఇష్టమే. కానీ ఆ పూలల్లో కొన్ని కొందరికి ఎక్కువ నచ్చుతాయి. మరికొన్ని అంతగా నచ్చవు. ఈ ఇష్టాయిష్టాలు వైయక్తికమైనవి. దీనినే రీతిలీశీలిబీశిరిఖీలి లీలిబితిశిగి అంటాం. పూలన్నీ అందమైనవేనని అనడం సార్వజనీనమైన (ళిలీశీలిబీశిరిఖీలి), లేదా వస్తునిష్ఠమైన సౌందర్యం. అదే సహజ సౌందర్యం.

ఈ సౌందర్యం చాలా వరకూ బాహ్యమైంది. దాదాపుగా దీన్ని అందరూ గ్రహించగలుగుతారు. ఆస్వాదించగలుగుతారు. అయితే కేవలం సౌందర్యం అన్ని వేళలా ఆకట్టుకోకపోవచ్చు. ఆ సౌందర్యం కేవలం కాల్పనికం అయితే అందరికీ నచ్చదు. జీవిత వాస్తవికతతో మిళితమైన సౌందర్యం పాఠకుడి మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ సౌందర్యం ఆత్మను తట్టి లేపుతుంది. వాస్తవికతతో ముడిపడని సాహితీ సృజన కాలక్షేపానికి పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. అందులో వాస్తవికత పాలు తక్కువ కాబట్టి జీవిత వాస్తవికతను ప్రతిబింబించకపోవచ్చు. ఏ భాషలో అయినా ఈ రకం సాహిత్యమే ఎక్కువ. కాలక్షేపానికి మాత్రమే ఉపకరించే సాహిత్యం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. అది పాఠకుల సంఖ్యను, చదివే అలవాటు పెంపొందించడానికి ఉపకరిస్తుంది.

వాస్తవికత

మనం ఏ పుస్తకం చదివినా నచ్చిందో లేదో గమనించిన తర్వాత వేసుకునే రెండో ప్రశ్న అది వాస్తవమేనా అన్నదే. అది వాస్తవమైనదైతే, లేదా వాస్తవం కావడానికి వీలున్నదైతే ఆ రచన మనల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. జీవిత వాస్తవాల్ని రచయిత వాస్తవికతగా మలుస్తాడు. కేవలం జరిగింది జరిగినట్టు చెబితే అది వాస్తవాన్ని ప్రతిబింబించినట్లు లెక్క. ఈ వాస్తవంలోనూ వైయక్తికమైన అంశాలూ ఉండొచ్చు. సార్వజనీనమైనవీ ఉండొచ్చు. వ్యక్తుల అనుభవాల పరిధిని విస్తృతం చేసి వాటిని సమాజానికి వర్తింపజేయడమే వాస్తవానికి వాస్తవికత స్థాయి కల్పించడం. జీలిబిజిరిరీళీ ఇదే.

వాస్తవికత ఉన్న సాహిత్యం అంతా మేలైంది కాకపోవచ్చు. సమాజాభ్యుదయానికి తోడ్పడకపోవచ్చు. ఉదాహరణకు ‘వేయిపడగలు’ నవలలో విశ్వనాథ సత్యనారాయణ అందించిన సౌందర్యాత్మకత అపారమైనది. ఆయన చిత్రించిన సంఘటనలు వాస్తవికతకు దర్పణాలు. భూస్వామ్య సమాజ పతనావస్థను నిజాయితీగా చిత్రించారు. వేయిపడగల్లో ఒక్కొక్క పడగే ఎలా రాలిపోయిందో చూపించారు. చివరకు ఆ నవలలో కథానాయకుడైన ధర్మారావు అన్న ఒక్క పడగ మాత్రమే మిగిలిందన్న సత్యాన్నీ అంగీకరించారు. భూస్వామ్య వ్యవస్థ అంతరిస్తున్నందుకు విశ్వనాథ పడే బాధను ఈ నవల కళ్లకు కడుతుంది. కానీ ఆ దశ దాటి మరింత మెరుగైన దశకు సమాజ పయనం విశ్వనాథకు నచ్చలేదు. మళ్లీ వెనక్కు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఆయన ళీబిరీశిలిజీ జీలిబిజిరిరీశి, లీతిశి బి జీలిబిబీశిరిళిదీబిజీగి చీనీరిజిళిరీళిచీనీలిజీ. మంచైనా, చెడైనా సమాజం ముందుకే వెళుతుంది అన్న సత్యాన్ని విశ్వనాథ జీర్ణించుకోలేకపోయారు. ఇదీ ఆయన తాత్త్విక దృక్పథం.

తాత్త్వికత

ఒక గ్రంథం చదివిన తర్వాత దానినుంచి ఏం గ్రహించాం అన్న విషయాన్ని పాఠకులందరూ ఆలోచించలేకపోవచ్చు. నీతి కథల్లోలాగా సృజనాత్మక సాహిత్యంలో విధిగా చివరన నీతిబోధ, నీతి వాక్యాలు ఉండకపోవచ్చు. కానీ రచన అంతా చదివిన తర్వాత ఆలోచిస్తే ఏం నేర్చుకున్నాం అని తెలుస్తుంది. ఆ నేర్చుకునే అంశంతో మనం ఏకీభవించవచ్చు. ఏకీభవించకనూ పోవచ్చు. రచయిత చెప్పదలచుకున్న సందేశాన్ని ఆ రచయిత తాత్త్విక దృక్పథమే పట్టిస్తుంది. వాస్తవాంశాలను గ్రహించే శక్తిని అలవరచుకుని భవిష్యత్‌ కార్యాచరణకు పురికొల్పే తాత్త్విక దృక్పథం సమాజ అభ్యుదయానికి తోడ్పాటు అవుతుంది.

ఇక్కడే మరో చిక్కు ఉంది. రచయిత ఒక అంశాన్ని చర్చిస్తున్నప్పుడు మంచికి, చెడుకు ప్రాతినిధ్యం వహించే పాత్రలను సృష్టించవచ్చు. రచయిత తాత్త్విక దృక్పథాన్ని బట్టి అతను ఏ పక్షాన ఉన్నాడో స్పష్టం అవుతుంది. ఉదాహరణకు రామాయణంలో రాముడి పాత్రని తీర్చి దిద్దింది. రావణుడి పాత్రను మలిచిందీ వాల్మీకే. అయితే వాల్మీకి తన తాత్త్విక దృక్పథాన్ని ఆవిష్కరించే క్రమంలోనే ఆయన రాముడి వైపు ఉన్నాడా, రావణుడి వైపు ఉన్నాడా అని తేలుతుంది. వాల్మీకి ఉద్దేశం రావణుడి వంటి లక్షణాలున్న వారిని త్యజించాలని, రాముడి వంటి ఉదాత్త లక్షణాలున్న వారిని అనుసరించాలని ఏ రచనకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ముక్తాయింపు

ఏ కళాఖండంలోనైనా సౌందర్యాత్మకత, వాస్తవికత, తాత్త్వికత అన్న మూడు అంశాలూ ఉంటాయి. వాటిని గుర్తించగలగడం పాఠకుడు, శ్రోత, ప్రేక్షకుడి పరిశీలనాశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ శక్తిని ఎంతగా పెంపొందించుకుంటే కళను అంతగా ఆస్వాదించగలుగుతాం. కాలక్షేపానికి పనికొచ్చేవి ఏమిటో, జీవితాన్ని సుసంపన్నం చేసుకునే సాహిత్యం ఏమిటో వింగడించగలుగుతాం. ఈ దృష్టితో చదవడం మొదలు పెడితే ఉత్తమ సాహిత్యం ఏదో పసిగట్టడం అసాధ్యం కాదు. దాన్ని విశ్లేషించడానికి పనికొచ్చే ఉపకరణాలు అందిపుచ్చుకోవడం అలవడుతుంది. ఈ లక్షణం పాఠకుడిని ఉబుసుపోక చదివే దశ నుంచి ఉత్తమాభిరుచితో చదివే దశకు చేరుస్తుంది.(పుస్తకం.నెట్‌ సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో