భూమిక పాఠకులకు, అభిమానులకు విజ్ఞప్తి

భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ రోజు వరకు దృఢంగా నిలబడగలిగింది. అశేష పాఠకుల అపారమైన ఆదరాభిమానాలు మూటగట్టుకుని తెలుగు సమాజం మీద తనదైన ముద్రను బలంగా వేయగలిగింది.

భూమిక వ్యాపార పత్రికల్లా పాఫ్యులర్ కాకపోవచ్చుగాక, ఇబ్బడి ముబ్బడిగా ప్రకటలను రాకపోవచ్చుగాక కానీ స్త్రీల సమస్యలను సీరియస్గా స్త్రీవాద దృక్కోణంతో విశ్లేషించే పత్రికగా భూమిక నిలువెత్తూ ఆత్మవిశ్వాసంతో నిలబడింది. సర్వం వ్యాపారాత్మకమైపోయిన ఈనాటి పరిస్థితులలో కూడా వ్యాపార ధోరణికి అతీతంగా నిలబడింది భూమిక. సెన్సేషనల్ కథనాలు, నాన్ సీరియస్ అంశాలకు భూమికలో చోటు లేదు.

భూమిక మలి అడుగు దృఢం కావడానికి పాఠకుల, అభిమానుల ఆదరాభిమానాలే ముఖ్యమైన వనరులుగా నిలిచాయి. భూమిక విజయవంతమైన ప్రయాణంలో మాకు తోడూ నీడగా నిలిచింది “నిర్ణయ” అనే స్వచ్ఛంద సంస్థ.’నిర్ణయ’ భారతదేశంలోనే ఏకైక “వుమెన్ ఫండింగు” సంస్థగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా “నిర్ణయ” మానేజింగు ట్రస్టీ ఇందిరా జెన గారి సహాయ సహకారం వెలకట్టలేనిది. దాదాపు ఆరు సంవత్సరాలుగా వారందిస్తున్న ఆర్ధిక సహాయం వల్లనే భూమిక సకాలంలో మీ ముందుకు వస్తోంది. నెల నెలా భూమిక ప్రింటింగు ఖర్చుల కోసం వెతుక్కో వలసిన పని లేకుండా “నిర్ణయ” నుండి ఆ సహాయం అందడంవల్ల “మెటీిరియల్” మీద దృష్టి పెట్టగలగడం, ప్రత్యేక సంచికలు సైతం ఎలాంటి వత్తిడి లేకుండా వెలువరించగలిగాను. నిజానికి భూమిక లాంటి ప్రత్యామ్నాయ పత్రిక ఇంతకాలం నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగ గలగడం వెనుక అశేష పాఠకజన అభిమానం, సహకారంతో పాటు ఇందిరా జెన లాంటి ఆత్మీయుల విలువైన ఆదరాభిమానా లున్నాయి. వారికి కృతజ్ఞతాభివందనాలు.

‘భూమిక’ ప్రస్థానం సజావుగా, ఆర్థిక పరమైన ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కోకుండా సాగిపోవడం వెనుక భూమిక పట్ల ఇందిర జెన అభిమానం స్ఫష్టంగా కనబడుతుంది. ముఖస్తుతి కోసం నేను ఈ మాటలు రాయడం లేదు. నా గుండె లోతుల్లోంచి వస్తున్న కృతజ్ఞతా పూర్వక అభిమానం తోనే నేను రాస్తున్నాను.

“నిర్ణయ” సహకారానికి తోడుగా భూమిక పాఠకుల, అభిమానుల తోడ్పాటు కూడా అదే స్థాయిలో లభించాలని నేను ఆశపడుతున్నాను. ఒక్కొక్కరూ మరో చందాదారుని చేర్పించే ప్రయత్నం చేస్తే భూమిక మరింత మందికి చేరువవుతుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలని అభ్యర్ధిస్తున్నాను. ఇప్పటికే చాలామంది మిత్రులు ఈ పని చేస్తున్నారు.

‘భూమిక’ వెబ్సైట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. గత నవంబరులో వెబ్సైట్ ప్రారంభించిన నాటి నుండి దాదాపు 10,000 మంది దీనిని దర్శించారు. రోజు రోజుకూ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అన్ని ఖండాల నుంచి భూమికకు అభిమానులున్నారన్నది స్పష్టం.

ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికను, ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పదిహేనేళ్ళుగా నడుపుకుంటూ రావడం వెనుక నాకు తోడుగా నిలబడిన వారందరికీ నా మన: పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, భవిష్యత్లో కూడా మీ సహకారం సమృద్ధిగా అందాలని ఆశిస్తూ….
భూమికను మరెంతో మంది స్త్రీల చేతుల్లోకి చేరేలా మేము చేసే ప్రయత్నాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో