మంచు కురిసే వేళలో

కుప్పిలి పద్మ

(పమ్రుఖ రచయితి కుప్పిలిపద్మ కాలమ్‌ పార్రంభిస్తున్నామని తెలపటానికి సంతోషిస్తున్నాం. – ఎడిటర్‌)

యీ శీతాకాలం వుదయం నడుద్దామని యింట్లోంచి బయటకి వచ్చాను. యింటి వాకిట్లోని బంగారు రంగు ముద్దబంతి పువ్వుపై, హేమంత ఉదయపు లేత యెండ పసిమి కాంతులతో పరచుకొంది. రాత్రంతా పుష్పాలతో నిశ్శబ్దంగా వూసులాడిన మంచు తనని పోపోమంటున్న యీ సూర్యరశ్మిని విసుగ్గా చూస్తు ”రేపు చెప్తా నీ పని.యింత కంటే దట్టంగా కమ్ముకొంటాను. యీ రోజు కంటే మరింత ఆలస్యంగా నీ కిరణాలు యీ పూలని పలకరిచేట్టు చేస్తాను” అని తన తీయని ప్రతీకారపు ఆలోచనకి తనే గుంభనంగా ముసి ముసి నవ్వుకుంటూ పయనమైయింది మంచు.

అవును కొన్ని ప్రతీకారాలు అందమైనవి. పక్కింటాబ్బాయి చాలా సమయం వరకు మంచు కమ్ముకొని వుంటే యేమేమి పనులు యెగ్గొట్టొచ్చో మనసులోనే లెక్కలేసుకొని యీ తలంపుని యెంతగానో పొగుడుతున్నాడు. మంచు అంది కదా ‘నేనేంటో నాకు తెలుసు. పొగడ్తలకి లొంగిపోకూడదని పెద్దవాళ్లు చెప్పిన మాటని నేనెప్పుడూ గుర్తుంచుకొంటాను. అతిగా పొగడకు” అంది మంచు.

యెప్పుడు మౌనంగా, యేదో పోగొట్టుకున్నట్టుండే యెదురింటి స్త్రీ ” ఆ విషయం అర్థంకాక నేనా పొగడ్తల వెల్లువలో కొట్టుకుపోయాను. యెలాగంటే నాకు నా యవ్వనారంభంలో అందరూ నన్ను గుర్తించాలనే కోరిక వుండేది. పబ్లిక్‌లో నిలబడి యేవో పనులు చేస్తుండేదాన్ని. నాకేం దశ దిశ లేవ్‌. నువ్వు చాలా బాగా మాట్లాడతావ్‌. విపులంగా యే హద్దులు లేకుండా ఉపన్యాసాలు యివ్వాలి. అందరూ షాక్‌ అయ్యేట్టు మాట్లాడాలి అనేవారు. నేనలాగే మాట్లాడేదాన్ని. మగవాళ్ళు, కొంతమంది స్త్రీలు చాలా చాలా మెచ్చుకొనేవారు.మెచ్చుకొంటున్నారు కదాని నేనింకా యింకా అలానే ఉపన్యసించేదాన్ని. మాట్లాడేదాన్ని. అలా అలా పొగడ్తలు వ్యసనంగా మారిపోయాయి. ఆ ధోరణిలో కొట్టుకుపోకుండా నన్నెవరైనా ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ళు నా పట్ల అసూయతో అలా చెపుతున్నారనిపించేది. యీ ప్రవాహంలో నన్ను నేను యెప్పుడు కోల్పోయానో కూడా తెలీలేదు. చివరికి ఆ పొగిడినవాళ్లు, అలా మాట్లాడమని ప్రోత్సహించినవారు నన్ను, నా మాటలని కించపరిచారు. నాకెప్పుడూ ఆ పొగడ్తల వెనుక వున్న రాజకీయం అర్థం కాలేదు. కాని పొగిడిన నోరే వెక్కిరిస్తుందని మాత్రం అర్థం అయింది. యిప్పుడవన్నీ బాధిస్తుంటాయి. నాకిప్పుడు యింట్లో మాట్లాడాలన్నా భయమే” అందామె.

ఆ అందమైన ఉదయం ఆమె బాధ నన్ను కలవర పెట్టింది. యెందుకంటే వొకప్పుడు మాటలతో గలగలలాడిన ఆమె సంతోషపు స్వరం యిప్పుడు తటపటాయింపుతో తడబడుతుంది. వాటన్నిటిని చెరిపేసి వెనక్కి తిరిగి తెచ్చుకోలేని పద సౌందర్యం అంతరించి పోయింది. పరిహాసం మాటని రద్దు చేసింది. దేన్నైనా బహిరంగంగా మాట్లాడొచ్చనే యితరుల మాటలని నమ్మి గొంతు మూగసైగలకే పరిమితిని విధించింది.

నిజమే.. మనం చాలా విషయాలని అప్పటిక్పుడు సంగ్రహించుకోలేం. స్త్రీలు పొగడ్తలకి తేలిగ్గా పడిపోతారు, అంటుంటారు. దీనిని బలంగానో లేదా మామూలుగా నమ్మిన సమాజాలు లేదా సమూహాలు లేదా వ్యక్తులు మన చుట్టూ వుంటారు. మనం చేసిన పనిని యెవరైనా మెచ్చుకున్నప్పుడు సంతోషం వేస్తుంది. వో పాటిజివ్‌ ఎవ్విరాన్‌మెంట్‌ని క్రియేట్‌ చేస్తుంది. అలానే పొగడ్త మానిప్యులేట్‌ చేస్తుంది. మనలని మెచ్చుకొనేవాళ్ళు వొక ఆరోగ్యవంతమైన వాతావరణం యేర్పర్చటానికి దోహదం చేస్తున్నారా లేక మానిప్యులేట్‌ చేయడానికి చేస్తున్నారాన్నది గుర్తుపట్టటం యేమంత తేలిక కాదు. వెంట వెంటనే అర్థమయ్యేది కాదు. పొగడ్తల వెనుక యెలాంటి పితృస్వామ్య ధోరణి వుంటుందో గుర్తుపట్టటం అనుభవం మీద తెలుస్తుంది.

సమానత్వం వుందంటారు, నిజమైన సమానత్వం వుందనేది భ్రమో నిజమో అర్థం కాదు. వేలవేల అసమానతల్లోంచి గొంతుని సవరించుకోవటం యేమంత తేలిక కాదు. కఠోరమైన సందిగ్ధాల నడుమ మనవైన మాటలని గుర్తుపట్టటం యెంత కష్టం. మాటలకు సరికొత్త పగ్గాలని వేసేసిన యీ పాస్‌వర్డ్‌ కాలంలో మన కాళ్ళ కింద భూమి కదలినప్పుడు దానిని భూకంపమనాలో అనకూడదో కూడా తెలీదు. యెందుకంటే ప్రతిదీ మన స్వయంకృతాపరాధమంటుంది. జరుగుతున్న వాటికి మన బాధ్యత యెంత. సమాజపు బాధ్యత యెంత. యీ సమాజం కలెక్టివ్‌ రెస్పాన్స్‌బులిటీ నుంచి యెప్పుడు తప్పుకొందో కూడా మనకి తెలీనే తెలియలేదు. యెవరి జీవితాలకి వారిదే బాధ్యతనే సంకెళ్ళలనుంచి బయటకి రావటానికి, మనం తాళం చెవులు యే నేలమాళిగలో వున్నాయో తెలియక దారి వెతుక్కుంటుంటే మన తడుములాట వారికి సరికొత్త వినోదం తెరపై, మానిటర్‌లపై.

నమ్మకంతో వినువీధుల్లోకి వస్తాం. చల్లని గాలుల్లో కబుర్లు చెప్పుకొంటూనో, చెవిలో తాడుతో పాటలని వింటూనో, నేలపై నుంచి ఆకాశంలోకి గుంపున యెగిరే కపోతాలని చూస్త్తూ మైమరచిపోతూ మనం నడుస్తుంటాం. ఆకాశంలో అర్థ చందమామ నిండు చందమామగా మారే వరకో, రాత్రి కురిసే రహస్యపు వానని చదువుకుంటునో, కోటి నక్షత్రాకాశం మందార పువ్వులు వికసించే సూర్యోదయానికి చేరువయ్యే ప్రయాణాన్ని చిన్నారులకి చూపించటానికో మనం రహదారుల్లో అడుగులేస్తుంటాం. మిరుమిట్ల లోకంలో అమాయకంగా నడుస్తుంటే యే బీభత్సపు వికట్టాహాసం యే కొనవూపిరి అంచుల్లోకో విసిరేసి చోద్యం చూస్తుంటుందో తెలియదు, కష్టం..చాలా కష్టం.. సమానత్వం సమభావం సాధించామనే వొదొలొదులు మగపొగడ్తలని నమ్మటం కష్టం. మాటలని చూపులని నమ్మటం కష్టం. యీ నమ్మక ద్రోహాన్ని యేయే మాటలతో యెన్నెన్ని ప్లేకార్డ్స్‌పై వ్యక్తపరచగలం.

నడుస్తున్నాను. ఆలోచిస్తూ నడుస్తున్నాను. సూర్యరశ్మి సంమిళితమైన పల్చని మంచుగాలుల్లో నడుస్తున్నాను. చెవిలో వాక్‌మెన్‌ ఆన్‌ అయ్యింది..బాబ్‌ మెర్‌లీ’ నో వుమెన్‌…నో క్రై..’ వినిపిస్తోంది. యేమై వుంటుంది. ఆలోచిస్తున్నాను. మాటలకి, పాటలకి అర్థం యేమిటి…ఆలోచిస్తున్నాను.

Share
This entry was posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు. Bookmark the permalink.

One Response to మంచు కురిసే వేళలో

  1. buchi reddy says:

    బాగుంధి పద్మ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో