ఖాప్‌ పంచాయితీలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

వేములపల్లి సత్యవతి

ఖాప్‌ పంచాయితీలు చట్ట బద్దమయినవి కావని నవంబర్‌ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. ఖాప్‌ పంచాయితీల తీర్పుల ఆధారంగా గౌరవ హత్యలలోని దోషులందరికి మరణశిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తీర్పుకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఖాప్‌ పంచాయితీలున్న రాష్ట్రాలలో ముఖ్యంగా బీహార్‌, రాజస్థాన్‌, హిమాచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ మొదలగు రాష్ట్రాలలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించింది. పరిశీలనాత్మకమైన, లోతైన అధ్యయనం చేసింది. ఆ కమిటీ ఖాప్‌ పంచాయితీలు చట్టబద్దమయినవి కావని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఖాప్‌ పంచాయితీలలో కుల పెద్దల పెత్తనమే కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ‘లా’ కమిషన్‌ పరువు హత్యలను నాన్‌బెయిల్‌బుల్‌ (బెయిల్‌రాని) నేరాలుగా పరిగణనలోనికి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానానికి సిఫార్స్‌ చేసింది. ఈలాంటి కేసుల్లో దోషులందరికి మరణశిక్ష విధించాలన్న సర్వోన్నత న్యాయస్థాన ప్రతిపాదనను ‘లా’ కమీషన్‌ వ్యతిరేకించింది. చట్టం నిషేధం లేనప్పటికి ఖాప్‌ పంచాయితీలు వివాహాలలో జోక్యం చేసుకోకుండ ఖాప్‌ పంచాయితీలను నిషేధిస్తూ కొత్త చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ‘లా’ కమీషన్‌ కోరింది. గౌరవ హత్యల, పరువు హత్యల విషయంలో రాజ్యాంగంలో సవరణలు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవని కేంద్ర ప్రభుత్వ హోమ్‌శాఖ తెలియజేసింది.

ఇది హర్షించదగిన విషయం. ఇప్పటికే ఎన్నో దారుణమైన హత్యలు జరిగాయి. ఖాప్‌ పంచాయితీలు మహిళల విషయంలో అనాగరిక నిర్ణయాలు తీసుకుంటవి. వాటిని ఖచ్చితంగా అమలు జరిగేలా ప్రోత్సహిస్తున్నవి. ప్రేమ వివాహాలు, వర్ణాంతర వివాహాలు చేసుకోరాదని, అలాంటివారు వూరిలో వుండకూడదని తీర్మానాలు జారీ చేస్తున్నవి. కొంతమంది ఆలాంటి వివాహాలు చేసుకొన్నవారిని వారి తల్లితండ్రులు, బంధుజనులు వెతికి, వెంటాడి నిర్ధాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. ఈ సంవత్సరంలోనే నాల్గు-అయిదు మాసాల క్రితం ఒరిస్సాలో పరువు హత్య పేరుతో పెండ్లి చేసుకున్న యువకుడిని వధువు కుటుంబీకులు క్రూరాతి క్రూరంగా చంపివేశారు. చంపటానికి వధువు కుటుంబీకులు అనుసరించిన పద్ధతులు అతిభయంకరమైనవని అక్కడి కోర్టు తీర్పు చెప్పి ఆ కుటుంబంలోని నల్గురికి వురిశిక్ష తీర్పు చెప్పింది. ఆ కేసు కొన్ని నెలలలోనే తీర్పుకు నోచుకుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఆయేషా హత్యకేసు ఏ గంగలో కలిసిందో? ఇప్పటివరకు తేలలేదు. పేర్లు వేరైనా దేశంలో అన్ని ప్రాంతాలలో కుల పెద్దల తీర్పులు అమలు జరుగుతూనే వున్నవి. మూడు లేక నాల్గు సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామంలో 14 సంవత్సరాల బాలిక ఏదో తప్పు చేసిందని కులపెద్దలు ఆ బాలిక సలసలకాగే నూనె పాత్రలోనుంచి చేతితో అందులో వేసిన నిమ్మకాయను బయటకు తీయాలని తీర్పు చెప్పారు. పిల్ల తల్లి తండ్రులు కులపెద్దల కాళ్లమీద పడి వేడకున్నారు. తప్పు చేయకపోతే కాగే నూనెలోనుంచి నిమ్మకాయ బయటకు తీసినా చేయి కాలదని, బొబ్బలెక్కవని బదులు చెప్పారు. ఏ కారణం చేతనో ఆ పని మరుసటి రోజుకు వాయిదా పడింది. ఈలోగా పోలీసులకు ఈ సమాచారం తెలిసి మరుసటి రోజుకు ఆ గ్రామానికి వచ్చి ఆ దురాగతాన్నుంచి ఆ బాలికను కాపాడారు. యువతులు జీన్స్‌ వేసుకోకూడదని, సాంప్రదాయక దుస్తులనే ధరించాలని, మొబైల్‌ ఫోన్‌లు వాడకూడదని, విద్యార్థినులు తలకు స్కార్ప్‌ ధరించి పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లాలని నిర్ణయిస్తారు. ఖాప్‌ పంచాయితీలు కొన్ని 40 ఏండ్లలోపు వయసు గలిగిన మహిళలు షాపింగ్‌లకు, మార్కెట్లకు, బజార్లకు వెళ్లకూడదని, 40 ఏండ్లపైబడిన వారు గడప బయటకు అడుగు పెట్టగానే ముఖం కనిపించకుండ వస్త్రంతో తలపై కప్పుకోవాలని హకుంలు జారీ చేస్తున్నవి. తాలిబన్ల ఆగడాలకంటే ఏమాత్రం తక్కువ కాదు ఖాప్‌ పంచాయితీల తీర్పులు. ఉపేక్షిస్తే యింకా సమాజం నైతికంగా పతనం వైపు పయనిస్తుంది. కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగంలో సవరణలు తెచ్చి ఒక్క ఖాప్‌ పంచాయితీలనే కాకుండ దేశంలోని అన్ని ప్రాంతాల కుల పెద్దల పంచాయితీలను నిషేధించాలి.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో