హింసను ప్రతిఘటించండి

డా|| విజయభారతి

సమాజంలో స్త్రీలు హింసకు గురి అవుతున్నారనటం వాస్తవం. అది పురుషులకూ తెలుసు. స్త్రీలు తమకంటే తెలివైన వారని కూడా పురుషులకు తెలుసు. ఇది నేను చెబుతున్న మాటకాదు. ”ఓషో” అని ఒక గొప్ప తత్వవేత్త చెప్పిన మాట.

తమకంటే తెలివైన వారితో బతకటానికి పురుషులు ఎన్నకొన్న మార్గం క్రూరమైన అణచివేత ధోరణి. దీనిని ఒక మతవిధానంగా పురుషులు ప్రవేశపెట్టారు. అన్ని మతాలలోనూ పరిస్థితి ఇదే. మనమందరం ప్రతిరోజూ పురుషుల ఆధికృతా ధోరణిని ఎదుర్కొంటున్న వాళ్లమే. ”పురుషులందు పుణ్య పురుషులు వేరయా” అన్నాడా వేమన. కాని అలాంటి వాళ్ళెక్కడా కనిపించరు. ప్రతి సందర్భంలోనూ మనం అణచివేతకు గురిఅవుతూ ఉంటాం. వైరుధ్యాలూ, వ్యత్యాసాలూ మనకు మన కుటుంబంలోనే ఎదురవుతూ ఉంటాయి. అత్తగారిళ్ళలోనే అనే కాదు –

సృష్టిని గురించీ స్త్రీ, పురుషుల పుట్టుకను గురించీ మతాలు ప్రచారం చేస్తున్న సూక్తులు పురుషులలో ఆధికృతా భావాన్ని పెంపొందించుకుని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం పుట్టుకను గురించి రెండు రకాల భావనలు సాధారణంగా వ్యాప్తిలో ఉంటున్నాయి. 1. ఆధ్యాత్మిక భావన 2. హేతువాద భావన. మతపరంగా సృష్టి ఎలా జరిగింది? ఎవరు ముందు పుట్టారు అంటే పురుషుని పక్కటెముకలోంచి స్త్రీని తయారుచేసి అతనికి సేవలు చేయటానికి ఇచ్చారంటారు. అది చాలామంది నమ్ముతున్నారు.

హిందూ పురాణాలలోనూ అలాంటివే కథలు సంకల్ప మాత్రంగా (తొడ నుండి ఊర్వశి-) స్త్రీలను సృష్టించి ప్రజాపతులకు భార్యలుగా, భోగ కన్యలుగా ఇవ్వటం – ఒక్కో పురుషునికీ పది, ఇరవైమంది దాకా భార్యలు ఉండటం – లైంగికావసరాల కోసమో వంశవృద్ధికోసమో మాత్రమే స్త్రీలు అనే సంకేతాలను అందిస్తున్నాయి పురాణాలు…

పురాణాల ప్రకారం ఈ సృష్టి మార్పు లేనిది. అదే చర్విత చర్వణం అవుతూ ఉంటుంది. నాలుగు యుగాలూ – బ్రహ్మ సృష్టీ ప్రళయమూ మళ్ళీ మళ్ళీ వస్తూంటాయి. స్వర్గమూ-నరకమూ మరణమూ పునర్జన్మ- ఈ సిద్ధాంతం మనలను కట్టిపడేసింది. పునరపి మరణం, పునరపి జననం- పునరపి మాత జఠరే శయనం-

అంటూ గీత గోవిందం లోని శ్లోకాలూ, వ్రత మహత్యాల కథలూ మన ఆచరణ శీలతను నియంత్రిస్తున్నాయి.

పుణ్యాలు చేసుకున్న పురుషులకు స్వర్గలోకం- అప్సర స్త్రీలతో సుఖాలు- అక్కడ వాళ్ళకి ఇక్కడి భార్యలు కనబడరు.

స్త్రీలకేమో జగన్మాత దగ్గర ఉండటం- ఆ తల్లి ఒడిలో లాలించబడటం- ఫలం.

స్త్రీలకు ఎట్లాగూ ప్రేమ ఆదరణ ఈ లోకంలో వాళ్లకి లేదు- అది మరణానంతరం ఆ లోకంలో దొరకుతుంది అనే ఆశ. చిన్నతనంలో దొరికిన ముద్దు మురిపాలు తప్ప ఆడేవాళ్ళకు ఆ తర్వాత మంచి జ్ఞాపకాలు ఉండవు. బహుశః అందుకే-

పూజలూ, వ్రతాలు అలవాటు చేసుకున్నారు స్త్రీలు. ఆ విధమైన భావజాలం స్త్రీలకు అలవాటు చేశారు. మతపరమైన కర్మకాండలోనే ఉన్నాయని నాకు అనిపిస్తోంది. హిందూ సమాజంలో ద్విజ అద్విజ అనే వేదాలున్నాయి. ఒక రకమైన కర్మకాండ చేయటం ద్వారా (ఉపనయనం- యజ్ఞోపవీతం భరించటం వంటివి.) మనుషులు అంటే పురుషులు ద్విజులు అవుతారు. అది వారికి మరో జన్మ. రెండో జన్మ- జన్మ ద్వారా కలిగిన అశౌచాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి వాళ్ళు పవిత్రులు అయిపోతారన్నమాట. ఆ వెసులుబాటు పురుషులకే ఉంది. అది అయ్యాక వాళ్ళు చదువుకోవచ్చు. ఎలాంటి పనులయినా చేయవచ్చు. ఎన్ని పాపాలు చేసినా వాళ్ళు పవిత్రులే. ఆ అధికృతా భావం కర్మకాండ ద్వారా వారికి సంక్రమిస్తోంది. స్త్రీలకూ, శూద్రులకూ అలాంటి కర్మకాండ లేదు. శూద్రులు ద్విజులకు సేవలు చేసుకుంటూ బతకాల్సిందే- స్త్రీలు తమ తమ కుటుంబాల లోని పురుషులకు సేవలు చేస్తూ ఉండాలి. ఆ సేవ ద్వారా వారు తరిస్తారు. తమ కుటుంబాలలోని పురుషులు ద్విజుల కాకపోయినా సామాజిక కట్టుబాట్ల ప్రకారం శూద్ర స్త్రీలు తమ కుటుంబాలలో పురుషులకు కట్టుబడి ఉండాలి. ఈ కోణంలో చూసినప్పుడు మతపరమైన కర్మకాండ నుండి విముక్తి పొందటం ద్వారా హిందూ సమాజంలోని స్త్రీలు హింస నుండి విముక్తం కావటానికి ప్రయత్నించాలని నా అభిప్రాయం.

ద్విజ కర్మలే కాక పురుషుల ఆధిక్యతను నిర్ధారించే అనేక కార్యకలాపాలు మన కుటుంబాలలో ఆచారాలుగా నిత్యకృత్యాలుగా స్థిరపడ్డాయి. సంస్కర్తలు మూఢ నమ్మకాలపై జరిపిన పోరాటాలలో ఇలాంటివి చేరలేదు.

ఉపవాసాలు, నోములు, వ్రతాలు చాలామటుకు పురుషుల శ్రేయస్సుకోసం చేసేవే. అవి దురాచారాల కోవలోకి రాలేదు. వితంతు వివాహాలు, వర విక్రయం, కన్యాశుల్కం- సతీసహగమనం వంటి వాటి గురించే పూర్వ సంస్కర్తలు ఆందోళనలు చేసి కొన్ని మార్పులు తేగలిగారు కాని స్త్రీల హక్కుల గురించి వారి మనోభావాల గురించి మాట్లాడినవారు తక్కువ. ఎవరైనా మాట్లాడినా లైంగికావసరాల కోణంలోనే మాట్లాడారు.

ఇహలోకంలోని కర్తవ్యాల గురించే- తప్ప వేదకాలంలో స్త్రీలకు ఆధ్యాత్మికతవైపు రానిచ్చేవారుకాదట. ‘బ్రహ్మజ్ఞానం’ గురించి వాళ్లకు తెలియనిచ్చేవారు కాదు- సంసారాలు వదిలేసి పోతారని భయం-

జ్ఞానానికి దూరం పెట్టటం వర్ణాశ్రమ ధర్మాలు పాటించే దేశంగా ఈ దేశం పేరుపడింది.

”స్త్రీలు శూద్రులు, చండాలురు, అంత్యకులజుకులు-” అందర్నీ స్కంద పురాణం (1-3) ఒకే కోవలో పెట్టింది. చాలా ఆంక్షలు వీరందరికీ వర్తిసాయి. ఒకప్పుడు స్త్రీలను దేవాలయాలలోనికి రానిచ్చేవారు కాదు. సంస్కృతం చదవనిచ్చేవారు కాదు. చదువుకోనిచ్చేవారు కాదు. కడుపునిండా తిన నిచ్చేవారు కాదు. వీధుల్లో తిరగనిచ్చేవారు కాదు. బయటకు రానిచ్చేవారు కాదు. ఇవన్నీ మతపరమైన ఆంక్షలుగా శాస్త్రాలు తయారు చేశారు. శూద్రులకూ, చండాలురకూ ఇవి వర్తిస్తాయని మనకు తెలుసు.

ఒకప్పుడు బౌద్ధ ధర్మం స్త్రీలకు కొంత స్వేచ్ఛ- గుర్తింపుస్థాయి ఇచ్చింది. మునుల ఆశ్రమాలలో స్త్రీలు కుటుంబ పరిధిలోనే ఉండాల్సి వచ్చేది- బౌద్ధ విహారాలలో వారు ఎవరికి వారు తమకు ఇష్టమైన రంగాలలో కృషి చేసి యోగాభ్యసనం చేస్తూ శ్రమలోకులుగా సిద్ధరాళ్ళగా స్వతంత్ర జీవనం సాగించారు. వివాహ వ్యవస్థలో ఇమడలేనప్పుడు యోగినులుగా స్త్రీలకూ శూద్ర కులాలనూ మానవ హక్కులు సాధించిపెట్టే ఉద్యమాలలో బౌద్ధ జైనుల తర్వాత ఇటీవలి కాలంలో మహాత్మా పూలే, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ను చెప్పుకోవాలి.

”భర్తమాట జవదాటకూడదు” అని చెప్పే సూక్తులకు భిన్నంగా వీరు స్త్రీలను గుర్తించారు. అంబేద్కర్‌ స్త్రీలకు చట్టబద్దంగా సమాన ప్రతిపత్తి ఇవ్వటానికి ప్రయత్నించాడు.

ఆయన పెట్టే సమావేశాలలో స్త్రీలను విడిగా కూచోపెట్టి సలహాలు ఇచ్చేవాడట. భర్తలు చెడు అలవాట్లకు లోనైతే వారిని ఎదిరించవచ్చునని ఆయన చెప్పాడు. దురలవాట్లకు, వ్యసనాలకులోనైన భర్తలకు మౌనంగా భరించిన హరిశ్చంద్ర- చంద్రమతి, నలదమయంతి కథలు ఆదర్శంగా పురాణాలు చెబుతుంటే- వాటిని విమర్శించుకోవలసింది ఈనాటి యువతరమే.

సృష్టిలో ప్రతిదానిలోనూ ద్వంద్వాలు తప్పనిసరి. మంచి చెడు అనేవి పరస్పరాశ్రయంగా ఉంటాయి. ఒకరికి లాభం జరిగిందంటే ఎక్కడో నష్టం జరిగిందనే ముందు వెనక అనుకోవాలి.

ప్రతికూల పరిస్థితులలో వైషమ్యాలు పెంచుకోవటం కంటే ఒక అనుకూల వాతావరణానికి మార్గం వేసుకోవటానికి ఈ సమావేశాలు దోహదం చేస్తాయనుకుని నా ఆశ.

మనం చేసేది సంప్రదాయంగా స్థిరపడి పోయిన సామాజిక హింసపైనా కుటుంబ హింస పైనా తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎక్కడికక్కడ ప్రతి కుటుంబాలలోనూ జరగాలి. సంప్రదాయాలకూ కుటుంబ హింసకూ లింగ వివకక్షూ అవినాభావ సంబంధం ఉంది. లింగ వివక్ష నిర్మూలనకు సమాజం తాత్వికంగా సిద్ధం కావాలి. పురుషులను ఆ మార్పుకు సన్నద్ధం చెయ్యాలి.

సాధారణంగా రాజకీయ పార్టీల నిర్మాణ కార్యక్రమాలలో మార్గదర్శక సూత్రాలూ అధ్యయన తరగతులూ ఒక ప్రణాళిక ప్రకారం ఉంటాయి. లింగ వివక్షపై పోరాటం కూడా అదే పద్ధతిలో సాగాలి. సామాజిక దృక్పధాన్నీ- పరిణామాలనూ నిశితంగా అధ్యయనం చేస్తూ పాఠాలు నేర్చుకోవాలి. నేర్పాలి- ఇవన్నీ చెప్పటం సులువే. దీనికోసం చాలా చాలా తీవ్రమైన మౌలికమైన సర్దుబాట్లు – ఆలోచనా రీతులు అవసరమౌతాయి.

నా దృష్టిలో ఇంతవరకూ మనం నమ్ముతూ వచ్చిన విలువలు కుటుంబ సంబంధాలు – మత ధర్మ పరమైన ఆచార వ్యవహారాలు అన్నీ మార్చుకోవలసిన పురాణాలు స్త్రీల పరంగా చెప్పిన ప్రవర్తనా రీతులు- పాతివ్రత్య ధర్మాలు- పూజలు- అన్నీ ఎవరికి వారు తర్కించుకుని కర్తవ్యం నిర్ణయించుకోవాలి.

స్త్రీల ధర్మాచరణవల్లనే ఈ ప్రపంచం ఇంకా నిలబడి ఉందని చెబుతూ లోకం మనల్ని మోసగిస్తోంది. ఇంటికి దీపం ఇల్లాలే- ఆడబ్రతుకేే మధురం వంటి వాటికి మోసపోకూడదు. అది ఎవరికి వారు అర్థం చేసుకోవాలి. అలా చెబుతున్న వాటిని ప్రశ్నించటం నేర్చుకోవాలి.

ఎదుటి వారి ఆలోచనలలో మార్పు కోసం ఎదురు చూడటం అవివేకం- అది భ్రాంతి- భ్రమ- మనవైపునుంచే ప్రయత్నం మొదలు కావాలి. హక్కులు ఒకళ్ళు ఇచ్చేవి కావు. మనం సాధించుకోవలసినవే.

ఇదొక ఉద్యమం లాగా సాగాలంటే ప్రభుత్వం సమాజం వైపునుంచీ, మనవైపు నుంచీ కూడా ప్రయత్నాలుండాలి. కేవలం చట్టాలవల్ల స్త్రీలపై హింసను ప్రతిఘటించటానికి ఎవరికి వారే సన్నద్ధం కావాలి.

ఆత్మగౌరవం కాపాడుకోవాలి. తోటి స్త్రీలకు జరిగే అవమానాలకు స్పందించటం- అలవాటు చేసుకోవాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ- అనే కాన్సెప్ట్‌ ఇక్కడ కుదరదు.

భర్త కొట్టిన దానికంటే తోటికోడలు నవ్విన దానికి బాధ పడిందని సామెత. ఇది పైకి మామూలుగా స్త్రీల మనస్తత్వంగా చెప్పినట్లు ఉంది గాని పరోక్షంగా ఇన్‌డైరక్ట్‌గా భర్త కొడితే పడవచ్చు అని చెబుతోంది. అలాంటి కుట్రలు మన సామెతల్లో ఇమిడి ఉన్నాయి.

ఇలాంటివి ఉన్న పాఠాలు – స్త్రీల దుర్మార్గ ప్రవర్తన, స్త్రీ ధర్మాలు, పాతివ్రత్యం లాంటి కథలు- హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి- నలుని భార్య దమయంతి- ఇవి పాఠ్యప్రణాళికల నుంచి తప్పించాలి.

”కన్యాదానం చేస్తే పుణ్యం” లాంటి మూఢ నమ్మకం- అవి వాడటం మానెయ్యాలి. పురుషుని లైంగిక సుఖానికేనా కన్యాదానం అని ప్రశ్నించుకోవాలి. కుటుంబంలో స్త్రీల సంబంధాలు ముఖ్యంగా అత్తాకోడళ్ళ సంబంధాలు వినోదంగా చూడటం కాకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించేలాగా చూడాలి.

ఇప్పుడున్న వృద్ధుల/వృద్ధాశ్రమాల సమస్యలు స్త్రీల కారణాంగానే వస్తున్నాయనే అపవాదు పోగొట్టుకోవటానికే ఒక మార్గదర్శక ‘సూత్రాలు అవగాహనా పత్రాలు- సాహిత్యం వస్తున్నది- ఇంకా రావాలి.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో