మట్టిలో కలిసిపోతున్న మన అణిముత్యాలు

పుష్ప, డిగ్రీ 3వ సం||,
కోఠి ఉమెన్స్స్ కాలేజీ

వేరేవాళ్ళ ప్రోత్సాహం కొంత, నేను ఏదైనా సాధించగలను అనే ధీమా, 100% కష్టపడి చదివితే మన భూమిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవా అనే ఆశ కొంత, అన్నీ కల్సి నన్ను చదువుకొని పై దిశగా ఆలోచించడానికి కారణం అవుతున్నాయి.

ఒకరోజు అమ్మ నాన్నని చూడాలని ఎంతో కుతూహలంతో ట్రెయిన్లో సికింద్రాబాద్ నుండి బయలుదేరాను. ఇంటికి వెళ్ళగానే అమ్మనాన్న ఎవరు కూడా లేరు. దాంతో ఒక్కసారిగా కళ్లనిండ నీళ్ళు తిరిగాయి. మసకమసక చీకటి ఆవరిస్తోంది. పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. అయినా అమ్మనాన్నని చూడాలని ఒంటరిగా వెళ్ళాను. వాళ్ళ ముద్దులతో ముగ్దురాలనై పోయాను. అదే సమయంలో నా వయసులో ఉన్న ఓ అమ్మాయి కూలీపనికి వచ్చింది. తను నన్ను చూస్తూ దీనంగా ఉండిపోయింది. ఒకవైపు ఏమీ తెలియని అమాయకత్వం కన్పించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని నీవు ఎందుకు చదువుకోలేదు అంటే మా నాన్న ”అమ్మాయికి చదువెందుకు,

కానీ అబ్బాయికి చెప్పిస్తే పోలా” అని అతడిని బడికి నన్ను పనికి పంపించాడు అంది. ‘నీకు ఇప్పుడు ఏమి అన్పిస్తుంది, పని ఈజీగా ఉందా’ అని ప్రశ్నించేసరికి తప్పదు కదా! పుష్ప ‘రేపటిరోజు పెళ్ళి చేసుకుంటే అత్తవారింటి దగ్గర కూడా ఈ పనిచేయకపోతే నన్ను పలువురు పలురకాలుగా నిందిస్తుంటారు. అయినా అమ్మాయిగా ఉన్నందుకు ఈ చాకిరి తప్పదు. నేను నీలాగ చదువుకొని వుంటే అందరితో కల్సి మాట్లాడేదాన్ని, వారిని నిలదీసేదాన్ని. నాకు నేను సమాధానం చెప్పుకునేదాన్ని కాబట్టి ఇప్పుడంటూ చేసేది ఏమీ లేదు. ఇంత పెద్దగా అయ్యాను’ అంటూ తనగోడు చెప్తూ చేతులు చాచి వాపోతుంటే ఆ చేతులను పరిశీలించాను. తెల్లగా నీటుగా ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన చేతులు మాసిపోయి కొడవలి గాతలతో కరుకుబండిలాగ కన్పించింది. దాంతో ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

మళ్ళీ ఒకరోజు సంక్రాంతి సెలవులకోసం అని ఎంతో ఉత్సాహంతో ఇంటికి వెళ్ళాను. అమ్మ వచ్చి పుష్ప ఏమి బాగున్నావా అంది. దాంతో ఏంటీ ఈమె సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది అనుకున్నాను. తర్వాత నిర్మల (తన కూతురు) పెళ్ళి అంటూ శుభలేఖ తెచ్చి ఇచ్చింది. ఏంటత్తమ్మా ఈ చిన్నవయసులో పెళ్ళా అని అన్నాను. నిర్మల రెండు సం||ల క్రితం ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఉండేది. ప్రకృతికి సంబంధించిన ఒక పాటకు నేను డ్యాన్స్ నేర్పించాను. నాకే కొన్ని కొత్త స్టెప్పులు చూపించింది. అలాంటి అమ్మాయి చూస్తుండగానే పెద్దగా అంటే శరీరపరంగా పెద్దగా అయ్యింది. దాంతో పెళ్ళిచేయకపోతే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ చదివించినా ఎక్కువ కట్నం వస్తుందని 5వ తరగతిలోనే చదువుకి ఫుల్స్టాప్ పెట్టించింది. ఆ తరువాత పెళ్ళిసంబంధాలు చూడటం ప్రారంభించింది. అబ్బాయిలు చాలామంది తాగుబోతులు, పొగరుబోతులు కూడా. అమ్మాయిలు అంటే వాళ్ళ దృష్టిలో పనిమనిషి. అలాంటి వాళ్ళ చేతుల్లోకి పోయి కీలుబొమ్మలాగ వాళ్ళు చెప్పిన పనికి తలవంచి పనిచేయాల్సిందే. లేనిచో విడాకులు ఇస్తారు. ఇంకో భార్యను చేసుకుంటాను అంటే ఇటు అమ్మాయి గుండెల్లో అటు అమ్మాయి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాల్సిందే.

ఇదంతా చూస్తుంటే నా మనసు మనసులో లేదు. ఏమిచేయాలో తోచక అర్థంకాని పరిస్థితి. చూస్తూ కనీసం డిగ్రీ కూడా అయిపోలేదు. ఒకవేళ సివిల్స్ రాసి కలెక్టర్గా జాబు చేస్తే కనీసం ఒక జిల్లాలోనైన మార్పులు చేయవచ్చు. అమ్మాయిలపై కూడా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవచ్చు. ఆ అమ్మాయిలను కనీసం చదివించి కొంతమంది స్త్రీలకు, పురుషులకు వున్న వ్యత్యాసాన్ని వివరించి ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎలా అనే కారణాలు నూరిపోసినట్లయితే వాళ్ళకంటూ ఒక ఉద్యోగం చూపిస్తే తిరుగులేని శక్తిగా వారు తయారు అవుతారు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెళ్ళిపెటాకులు అన్నా పెద్దవాళ్ళకు సమాధానం చెప్పగలిగే స్థాయిలో వుంటారు. తనకంటూ ఆ ఊర్లో కొంత విలువ సంపాదించు కుంటారు. ఎవరైనా మగవారిని ఎక్కువచేస్తూ మాట్లాడితే నాకేంటి తక్కువ అని నిలదీసి అడుగగలుగుతుంది. మరి ఈ సమాజం మారేదెప్పుడు?

అప్పుడు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం ఒక ఆంటీ పరిచయం అయ్యింది. మళ్ళీ ఒకసారి పిల్చి ఆంటీ బాగున్నారా అని పలుకరించగా, ‘ఆ బాగున్నానమ్మా’ అంటూ ఆప్యాయతతో పలుకరించింది. ఆ తర్వాత మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ‘చదువుతుంది’ అనే సమాధానం వచ్చేది. కాని ఇప్పుడు ఆ స్థానంలో వచ్చే ఉగాదికి పెళ్ళి అంటూ సమాధానం చెప్పింది. అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశారా. పక్కా తిరుగుబోతు, తాగుబోతు, గుట్కా మింగే అలవాటు, పెళ్ళైన అమ్మాయిలతో తిరిగే బేవర్సు ఇలా తనకి లేని అలవాటంటూ లేదు. అయినా కూడా కట్నం తక్కువని ఒప్పుకుంది అంటీ. కష్టపడి చదివే అమ్మాయిల కోసం సిటీలో అనాథ ఆశ్రమాలు బిసి, ఎస్.టి., ఎస్.సి. గర్ల్స్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి, కనీసం ఆ అమ్మాయిని హాస్టల్లో అయినా జాయిన్చేయాలి అనుకున్నాను. ఆంటీ ఇప్పుడు ఆ అమ్మాయిని పంపించు అంటే ఎంగేజ్మెంట్ కూడా ఐపోయింది. పెళ్ళి చేయకపోతే ఊర్లో పరువుపోతుంది. చదివిస్తే జాబ్ వస్తుంది అని చెప్తున్నావు కానీ అలా ఎవరు చేస్తున్నారు.

అదే ముందునుండి మనం సమాజంలో చైతన్యం కల్గించి తల్లిదండ్రులకు తగిన మాటలతో ఒప్పించి అమ్మాయిలకు ప్రత్యేక క్లాస్లు తీసుకోవటం వల్ల తప్పకుండా వాళ్ళలో మార్పు కన్పిస్తుంది. ప్రతి ఊర్లో కూడా ఆ అమ్మాయి అంటే ఊర్లో హడలయ్యే పరిస్థితిని మన కళ్ళముందు చూసి ఆనందించవచ్చు.

పై మూడు సందర్భాల్లో మనం మన అమ్మాయిల ధోరణి ఏంటో గమనించవచ్చు.

అమ్మాయిలు అనగానే ముఖ్యంగా పల్లెటూర్లలో అబ్బాయిలకంటే తక్కువచేసి చూస్తారు, అమ్మాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు, కొందరమ్మాయిలు ఐతే మనకీ పరిస్థితి తప్పనిసరంటూ బాధతో అలాగే కుమిలిపోతారు.

తల్లిదండ్రుల ధోరణి కూడా అలాగే ఉంటుంది. అమ్మాయిలు అనగానే కొన్ని పనులు వీరికి, మగవారు అనగానే కొన్ని పనులు వారికి కేటాయిస్తారు. అంటే అక్కడ వారిలోపం కాకపోవచ్చు. వారికి ఏమీ తెలియదు. కాబట్టి తెల్సినవాళ్ళం మనమే పోయి వారిలో అవగాహన తేవచ్చు. కానీ మనం పల్లెటూర్లకి ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళ పరిస్థితుల్ని ఎక్కడ గమనిస్తున్నాం?

ఇలా చేస్తే సమాజంలో, అమ్మాయిల్లో మార్పు తప్పనిసరి:
హలో! యూత్ ఫ్రెండ్స్ మనమే జాబ్స్ చేస్తూ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పడి పల్లెటూళ్ళలోకి అడుగుపెట్టి అక్కడ ఉండే పరిస్థితులను గమనించి 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అయిపోయాక చాలామంది బడి మానేస్తుంటారు. కానీ అలా జరుగకుండా వారికి పై చదువులు చదివితే, ఏం చేయవచ్చు అని వివరించి చెప్పాలి. ఆ తరువాత వారి తల్లిదండ్రుల్లో నిరాశనిస్పృహలను దూరం చేస్తూ వారిలో మనోధైర్యాన్ని తీసుకురావాలి. చాలామందిలో అమ్మాయిలకు అబ్బాయిలకంటే ముందు పెళ్ళి చేయాలనే ధోరణి ఉంటుంది. మగవారు ప్రవర్తించే రాక్షసతత్వాన్ని కళ్ళకు కట్టినట్లుగా ముందే వివరిస్తే వారు అప్పుడు పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా సిటీలో ఉపాధి అవకాశాలు బోలెడు. వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పదిమందిలో వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకుంటారు.

కొందరు అమ్మాయిలు ఫెయిల్ అవ్వగానే ఇంట్లో కూర్చోబెడుతారు. అదే అబ్బాయిలు అయితే రెక్కలుకట్టి ఆకాశాన విహరించినా పట్టించుకోరు. అదే అమ్మాయి విషయంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తుంటారు. మరి మనమే స్వయంగా అటువంటి అమ్మాయిల దగ్గరికిపోయి వారిలో చైతన్యాన్ని నింపినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా పక్షుల్లాగే స్వేచ్ఛగా ఆ పంజరం నుండి బయటపడతారు. ఈ అంశాలన్నింటిని దృష్టిిలో పెట్టుకుని పల్లెటూర్లోనే కాదు సమాజంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఈ అంశాలను గురించి చర్చించి ఆలోచింప చేయగలిగితే సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.