స్త్రీల మనుగడ ఇంకా అగాథంలోనే వుండాలా…? పితృస్వామ్యం యొక్క చివరి వలస సామ్రాజ్యాన్ని కూల్చుదాం!

ఢిల్లీలో ఇటీవల ప్రముఖ ఫెమినిష్ట్‌ రచయిత్రి కమలా భాసిన్‌ ప్రసంగాన్ని విని స్పందించి ”ద హిందూ”లో వ్రాసిన వ్యాసం

వ్యాసకర్త : హర్ష్‌ మందిర్‌ అనువాదం : కొండేపూడి నిర్మల

వంశపారంపర్యంగా పీడించే వ్యాధుల్లాగా వివక్ష కూడా ఒక మానసిక వ్యాధిగా భావించాల్సిన అవసరం వుందేమో అనిపిస్తోంది. ఇది కుటుంబాలకు పరిమితమై వూరుకోలేదు. సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా విస్తరించిన విష వాస్తవం. ఈ మాట కోపంతోనో, హాస్యంతోనో అనడం లేదు. నిజంగానే ఇది ఒక బలహీనమైన స్థితి. దీని కారణంగా భూమ్మీద సగం జనాభా అణచివేతకు గురవుతున్నారు. స్త్రీ పురుషుల మధ్య వుండాల్సిన ప్రేమ సాన్నిహిత్యం రోజురోజుకీ కొరవడుతూ ఒకర్నొకరు నరుక్కుంటున్న దశలో వాలంటీన్స్‌ డేలు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొంతమంది ఈ ఒక్కరోజు పండగ చేసుకోవడం కోసం ప్రేమికుల వేటలో పడుతున్నారు. ప్రేమించడం, ప్రేమించబడటం ప్రకృతి సహజమే కాదు మానవతా దృక్పథం కూడా. అయితే వీటి రూపం ఇప్పుడెలా వుంది….? పాలలో కోవా లేనట్టే ప్రేమికులలో ప్రేమే లేదు. ప్రేమికుడిలో కూడా ప్రేయసిని సొంత ఆస్తిగా భావించే ధోరణి కనబడుతోంది. ఆస్తిని వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదయినా చెయ్యచ్చు. ఈనాటి యువకులు అదే చేస్తున్నారు. ఐలవ్‌యూ అంటే అంగీకరించిన పాపానికి అన్ని విధాలుగా మోసపోతున్నారు. సమాజంలో వున్న ద్వంద నీతి అపరిచిత స్త్రీని వేధించడానికి కూడా పనికొస్తోంది. ప్రేమకి ఇంత మార్కెట్‌ తెరచిన సమాజానికి స్త్రీల ఉనికి ఓటర్ల సంఖ్య గాన, భావోద్వేగాలు మార్కెట్‌ సరుకులు గానూ చెలామణి అయిపోతున్నాయి. కాబట్టి ఈ 2013వ సంవత్సరంలో జరగబోయే వాలెంటైన్స్‌డే రోజున ఒక నూరు కోట్ల మంది ప్రజలు స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సంసిద్ధులవుతున్నారు. ”ప్రపంచంలో అందరికన్నా తక్కువగా చూడబడుతున్నది స్త్రీల జాతే” అంటారు. లింగ వివక్షత, సమాన హక్కుల గుర్తించి భారతదేశంలోనూ, దక్షిణ ఆసియాలోనూ నిరంతర పోరాటం సాగిస్తున్న కమలాభాసిన్‌. ఈమె కార్యకర్త మాత్రమే కాదు, స్త్రీ అస్తిత్వాన్ని, ఆందోళనల్ని అక్షర ఆయుధాలు చేసుకున్న రచయిత్రి కూడా. పెరుగుతున్న నాగరికతా క్రమంలో మిగిలిన జాతులు ఎంతో కొంత స్వాతంత్య్రాన్ని పొందగలిగాయి. కాని స్త్రీల జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ వాళ్ళ శ్రమ, శక్తి అవకాశాలు, ఆఖరికి వాళ్ళ స్త్రీత్వాన్ని కూడా పితృస్వామ్య సమాజం దోచుకుంటునే వుంది. ”1971వ సంవత్సరంలో టోరెంటోలో జరిగిన మహాసభలో స్త్రీ జాతిని ఇంకా అణచివేతకు గురి అవుతూ, స్వాతంత్య్రం కోసం అలమటిస్తున్న ఫోర్త్‌ వరల్డ్‌ కింద గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినదంతా మౌలికమయిన అభివృద్ధి తప్ప దృక్పథానికి సంబంధించిన మార్పు కానే కాదు.

ఫిబ్రవరి 14, 2013న జరగబోయే ప్రజా ఉద్యమంలో నూరు కోట్ల మంది స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారు. అంటే పరోక్షంగా ఇది ఏడు వందల కోట్ల మంది స్త్రీ పురుషుల్ని ఉద్దేశించి చేస్తున్న సంభాషణ. ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇంటిలో, పనిలో బహిరంగ ప్రదేశాల్లో హింసకు గురవుతున్నారు. అంటే నూరుకోట్ల మంది జీవితాల్లో హింస నిత్యకృత్యమై పోయిందన్న మాట. ఈ ధోరణిని ఆపడమే వీరి లక్ష్యం.

”బిలియన్‌ రైజింగ్‌ సందర్భంగా ఒక వంద కోట్ల మంది స్త్రీలు, బాలికలు నిశ్శబ్దాన్ని చేదించి” ఇంతవరకు జరిగింది చాలు, ఇకముందు ఏమాత్రం సహించం!” అంటూ ఎలుగెత్తి చాటుతారు. హింసను ఎదిరించడమే కాదు, ఈ ఉద్యమంలో కొన్ని లక్షల మంది పురుషులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్ళంతా స్త్రీల పట్ల తమకు గల సహానుభూతి అందిస్తూ వారిపై జరుగుతున్న హింసను, లింగ వివక్షతను వ్యతిరేకిస్తున్నామని చాటి చెబుతారు. ఇదంతా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా జరుపుకునే ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌ డే) న నిర్వహించేందుకు నిర్ణయించారు. దానికి కారణంగా ”మేము ప్రేమకు చిహ్నంగా, న్యాయబద్దమైన ప్రేమను, సమానత్వాన్ని ఎలుగెత్తి చాటే ప్రేమను, స్త్రీల పట్ల గౌరవంతో కూడిన ప్రేమకు ప్రతీకగా నిలబడతాం” అంటూ నిరూపించ బోతున్నారు.

ఈ సమాజం కులం, మతం, వర్గం అనే తేడాలతో చీలిపోయి వుంది. అయితే అన్నింటికన్నా లింగ వివక్ష మరింత క్రూరంగా, అమానుషంగా ఒక జాతినే అవమానిస్తోంది. ఆహారం, వైద్యం, విద్య, వికాసం లాంటి విషయాల్లో కూడా తేడా కనబరుస్తూ ప్రాధమిక మానవ హక్కుల్ని కూడా ప్రమాదంలో పడేస్తోంది. ఉత్పత్తి ప్రత్యుత్పత్తి రంగాల్లో స్త్రీల శ్రమ ఇంకా గుర్తింపుకు రావడం లేదు. ఒక్క కుటుంబ రంగంలో స్త్రీలు చేసే శ్రమకు విలువ కడితేనే సంవత్సరానికి సుమారు పదకొండు ట్రిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. ఇంటర్‌నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ లెక్క ప్రకారం, ప్రపంచంలో మొత్తం 66 శాతం శ్రమ స్త్రీలే చేస్తున్నారు. కాని 10 శాతం వేతనం మాత్రమే పొందుతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, ఒక శాతం కన్న తక్కువ ఆస్తి మాత్రమే వాళ్ళు అనుభవిస్తున్నారు.

కమలా భాసిన్‌ చెప్పినట్లు, కుటుంబాలలో అసమానతల వల్లే భారతదేశంలో అసమానతలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని భాషలన్నింటిలో ”హజ్బెండ్‌” అనే పదానికి భాషాపరంగా ”మాస్టర్‌” అనే అర్థం వస్తుంది కాని, భాగస్వామి అని ఎక్కడా లేదు. ఈ మాస్టర్‌ అనబడే భాగస్వాములు నలభై శాతం మంది భార్యలను కొడతారు. నాలుగు గోడల మధ్య సాగే సంసారాల్లో హింసలు, అణచివేతలు గుట్టుగా సాగిపోతాయి. ప్రతిష్టాత్మకంగా మనం ఏర్పాటుచేసుకున్న రాజధాని అయిన ఢిల్లీలోనే ప్రతి వెయ్యి మందిలో నూట ఇరవై మంది బాలికలు మరణిస్తున్నారు. కేవలం, వైద్య కొరత, మూఢనమ్మకాల కారణంగా ప్రతి ఏడూ పెద్ద సంఖ్యలో స్త్రీలు, బాలికలు గర్భస్రావాల వల్ల మరణిస్తున్నారంటే ఇందుకు చింతిస్తే చాలు.

కుటుంబ హింస అకస్మాత్తుగా, అనుకోకుండా ఒక మనిషి వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. చరిత్ర మొత్తంలో జరిగిన ఆధిపత్యం కోశమే చేసిన యుద్ధాలన్నింటిలో భయపెట్టి హింసించడం ద్వారానే అధికారం సాధ్యమయింది. కానీ భిన్న జాతుల, తెగల మధ్య జరిగిన యుద్ధాల్లో కనీసం బలాబలాల ప్రసక్తి అయినా వుంటుంది. కుటుంబ హింసలో చివరికి యుద్ధనీతి కూడా లేదు. దోచుకుంటున్న వారు, శారీరకంగా హింస పెడుతున్నవారు, అనుభవిస్తున్న వారి కంటే ఏరకంగానూ బలవంతులు కాని, మేధావంతులు కాని కాదు. ఇది సమాజం ఇచ్చిన బలమే తప్ప మరోటి కాదని అర్థం చేసుకోవాలి. అసలీ సమాజం ఆడపిల్లల్ని, మగపిల్లల్ని పెంచడంలోనే ఎంత తేడా చూపిస్తుంది. వాళ్ళకి మనం ఎంతో ప్రేమగా ఇచ్చే ఆటబొమ్మల్ని చూడండి. మగ పిల్లవాడికి బొమ్మ తుపాకిని ఇస్తాం. గోళీలు, గాలిపటాలనూ ఇస్తాం. అంటే హింసకి స్వేచ్ఛకి చిహ్నాల్ని పరిచయం చేస్తామన్న మాట. ఒకవేళ పిల్లవాడు రబ్బరు బొమ్మలతో ఆడుకున్నా, తొక్కుడు బిళ్ళ ఆట ఆడినా అందరూ నవ్వుతారు. అంటే అక్క కంటే చెల్లి కంటే తాను అధికుడు అనే భావన అనివార్యంగా కలగజేస్తారు. అంతేకాదు, భయం, దుఃఖం, కరుణ లాంటి సున్నిత భావాలు దాచుకోవాలని కూడా చెబుతారు. మీ మూసలో ఒదగడానికి మగపిల్లలు ఒంటరిగా చాలా వత్తిడికి గురవుతారు. ఇదంతా పకడ్బందీగా ఒక మిలట్రీ శిక్షణ లాగానే జరుగుతుంది. సహజం అని మనమంతా అనుకునే అనేక ఆడ, మగ స్వభావాలు రాజకీయమైనవి. అవి ఒక ఒరవడిలో కొనసాగుతున్నవే తప్ప వ్యక్తిగతమైనవి కాదు అని స్త్రీవాద శాస్త్రం చెబుతుంది.

మధ్యయుగాల నుంచి ఇప్పటి వరకూ స్త్రీలను భయపెట్టేందుకు, అణచివేసేందుకు పురుషులు ప్రధానంగా వాడే ఆయుధం అత్యాచారం. పగకీ ప్రతీకారానికి తమ శరీరాల మీద దాడి చెయ్యడమూ తిరిగి అవే శరీరాల్ని శక్తి రూపాలుగా కొలవడం, ఆకర్షణీయంగా అలంకరించుకొమ్మనడం, ప్రేమిస్తున్నాను అనడం, ఇదంతా స్త్రీలను అయోమయంలో పడేస్తోంది. బంధించడం, అవమానించడం, లొంగదీసుకోవడం లాంటి చర్యలు జంతువుల మీద ఉపయోగించే అస్త్రాలు, స్త్రీల మీద కూడా అవే అమలువుతున్నాయి.

కమలా భాసీన్‌ లాంటి ఉద్యమ కార్యకర్తలు ప్రపంచంలో ప్రకృతి విపరీతాలు, యుద్ధాలు, సైనిక పాలన ,స్వార్థం, అసమానతలు, పెట్టుబడిదారితనం లాంటి అన్ని ముఖ్య సమస్యలకు ఆధిపత్యం చెలాయించే పితృస్వామ్య పద్ధతులే మూల కారణం అంటారు.

డేల్‌ స్పెండర్‌ అనే రచయిత్రి ”ఫెమినిజం ఏ యుద్ధాలు చెయ్యలేదు. తమను వ్యతిరేకించే వారిని చంపలేదు. శత్రువుల కోసం యుద్ధ ఖైదీల క్యాంపులు నడపలేదు. ఎవరినీ తిండి పెట్టకుండా మాడ్చలేదు. ఏ ఇతర క్రూరత్వాన్ని చూపించలేదు. ఫెమినిజం ఇవాళ యుద్ధం చేస్తున్నది.

స్త్రీలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు అమలయ్యేలా చూడాలని, అవసరమయిన చోట్ల మార్పులు చెయ్యాలని, హింస, అణచివేత లేని జీవితం కావాలని అంతే స్త్రీ విద్య, ఓటు హక్కు, సామాజిక భద్రత, అత్యాచార బాధితుల కోసం, కుటుంబ సామాజిక హింసల నుంచి విముక్తి కోరుకునే వారికి సంక్షేమ కార్యాలయాలు ఇవన్నీ మనకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడల్లా నాయకులు వల్లించే మంత్రక్షరాలు. అమలులో వున్న వివక్షను ప్రశ్నించే హక్కు మనం వినియోగించుకోవాలి. సమాచార హక్కు మనకుంది.

స్త్రీల హక్కుల్ని గురించి మాట్లాడేవారెవరూ కుటుంబాన్నీ, సమాజాన్నీ, పురుషజాతిని ద్వేషిస్తున్న వారు కాదు. ప్రపంచాన్ని, చరిత్రనీ వక్రీకరిస్తున్న వారు కాదు. చాలా మంది ఇదేమీ ఆలోచించక ‘నేను ఫెమినిస్ట్‌ కాను’ అంటు ఉపన్యాసం మొదలుపెడతారు.

ఫెమినిజం మానవతావాదానికి వ్యతిరేకమని ఎవరు చెప్పారు. మానవతా వాదమంటే వివక్ష లేని సమాజం కాదా…? స్త్రీలని హింసించే చోట మానవతా వాదం ఎలా వికసిస్తుంది? ఫెమినిజాన్ని ద్వేషిస్తున్న వారిని నేను ఈ ప్రశ్నలే వేస్తాను అంటారు కమలా భాసిన్‌.

ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోయే ప్రేమికుల రోజు (వాలంటీన్స్‌ డే) సందర్భంగా యువతీ యువకులు అంతా కలిసి తమ సమస్యల గురించి ఆలోచిస్తారు. బాధపడతారు నినాదాలు చేస్తారు…. ప్రతిజ్ఞ చేస్తారు. కలలు కంటారు. కలలు కనడమే కాదు, స్త్రీలు పురుషులూ ఆకాశంలో చెరి సగమనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి ఏమేం చేయాలో ప్రణాళిక వేసుకుంటారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో