ఒక వృత్తిగా గ్రామీణాభివృద్ధి

రాజ్యంసిన్హా

(గ్రామాలు అన్ని రకాలుగాను విధ్వంసం వేపు అడుగులేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ నేపధ్యంలో 1985 రాజ్యంసిన్హా రాసిన ఈ వ్యాసం ప్రచురించడం ఒక అవసరంగా భావించాం. ఈ వ్యాసాన్ని అందించిన వి. హనుమంతరావుగారికి ధన్యవాదాలు.)

(1985 డిసెంబరులో ”గ్రామీణా భివృద్ధి”ని ఒక వృత్తిగా చేపట్టగల అవకాశాలు ఎలావున్నాయి? ప్రస్తుతం కొన్ని విశ్వవిద్యాలయాలలో గ్రామీణాభివృద్ధి అనే పాఠ్యాంశాన్ని తీసుకున్న విద్యార్ధులకు ఉద్యోగాలు ఎంతవరకు లభించాయి? వగైరా అంశాలను చర్చించడానికి హైదరాబాదులోని ‘రాజేంద్రనగర్’ లోని వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గల (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) గ్రామీణాభివృద్ధి జాతీయ సంస్థలో ‘జాతీయ సదస్సు’ జరిగింది. ఈ సదస్సులో ‘గ్రామీణాభివృద్ధి’ అంశాన్ని భోదిస్తున్న విశ్వ విద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి కొరకు పోటీపడుతున్న సంస్థలవారు, స్వచ్చంధ సేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ, గుజరాత్, బీహారు, పశ్చిమబెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర మొదలగు రాష్ట్రాలనుంచి వివిధ రంగాలలో పనిచేస్తున్న వీరు మూడు రోజులపాటు యీ విషయాలను చర్చించారు. ‘భారతజాతీయ మహిళా సమాఖ్య’ తరపున ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి శ్రీరాజ్యంసిన్హా యీ గోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి సిన్హా గోష్టిలో చదివి చర్చించబడిన పత్రాన్ని యీ వ్యాసంలో ప్రచురిస్తున్నాం. సం||)

‘గ్రామీణాభివృద్ధి’ అంటే ఎలా వుండాలి? అనే విషయం గురించి 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఏదో ఒక రూపంలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగా, భావాలకు, ఊహలకు ఒక రూపకల్పన జరిగింది. అదే సహకార సంస్థలు, పంచాయతీ రాజ్యవ్యవస్థ, కమ్యూనిటి డెవలప్మెంటు, బ్లాకుల స్థాపన లాంటివి అని స్థూలంగా చెప్పవచ్చును. వీటి పనితీరు, నిర్మాణం, కాలానుగుణంగా వివిధ రూపాలలో, చాలా రాష్ట్రాలలో మార్పులు వచ్చాయి.

”లెక్కల ప్రకారం చెప్పాలంటే, దారిద్య్ర తీవ్రతను తగ్గించడానికి ఆరవ ప్రణాళిక లక్ష్యాలుగా నిర్ణయించబడిన స్వయం ఉపాధి, ఉద్యోగభృతి కార్యక్రమాలు సాధించబడ్డాయి. కాని వాస్తవరూపంలో, ఎవరికోసమైతే యీ ప్రయోజనాలు ఉద్దేశించబడ్డాయో వారిలో బహు సంఖ్యాకులకు యివి అందలేదు. అందుకు కారణం యీ ప్రయోజనం ఎవరికి అందాలి? కార్యక్రమాలు ఎలా ఉండాలి? అన్న విషయాలు సక్రమంగా అమలు జరుగ నందువల్లనే” అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి క్రిందటి నెలలో అన్ని రాష్ట్రాల నుండి హాజరయిన గ్రామీణాభివృద్ధి మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ”ప్రస్తుతం వున్న గ్రామీణ బీదల సంఖ్యను 22 కోట్ల నుండి 1989-90 సంవత్సరం నాటికి 16 కోట్లకు తీసుకురాగలం” అని కూడా సమావేశంలో కేంద్ర మంత్రిగారు అన్నారు.

ఈ వ్యాఖ్యలు, ప్రకటనలు, గ్రామీణా భివృద్ధి సమస్యను ఒక విశాల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

మన దేశం స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత అవసరమైన దశలో అభివృద్ధి త్వరగా అమలు పరచబడలేదు అన్న నిజం తెలుస్తోంది. ఈ క్రింద ఉపహరించబడిన కొన్ని ప్రధాన కారణాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చును.

(ఎ) ఆర్థిక కేటాయింపులు – ఈ పెద్ద జాతీయ సమస్యకు అంటే, 80 శాతం ప్రజలు పల్లెలలోనే నివసించే జనాభా గల మన దేశంలో తగినంతగా ఆర్థిక కేటాయింపులు జరుగలేదు.
(బి) అమలుపరచే యంత్రాంగం – రెండు దశాబ్దాలుగా వివిధ ఉద్యోగాలలోను, స్త్రీ శిశు సంక్షేమశాఖ, సమాచార పౌర సంబంధాల డైరక్టర్గాను, నాకు గల అనుభవంతో యంత్రాంగంకు తగిన సౌకర్యాలు కలిగించకపోవడం ఒక కారణమని చెప్పగలను. గ్రామాలలో పనులు జరగాలంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళి ఉండే వ్యక్తులకు, స్త్రీలు గాని, పురుషులకు గాని కనీస సౌకర్యాలు కలుగచేయాలి. ఉండటానికి వసతి, ఆరోగ్య సౌకర్యాలు, పిల్లలకు చదువుకునే అవకాశం లాంటివి లేకపోతే ఆ గ్రామాలలో పనిచేయడానికి పంపించబడే వ్యక్తులు చిత్తశుద్ధిగా, మనస్ఫూర్తిగా పనిచేయలేరు. జీతాలు తీసు కుంటూ దేశానికి సేవచేయగల అవకాశం వున్న ఉద్యోగాలు అని తెలిసి గ్రామాలలో పని చేయడానికి కొంత ముందుకు వచ్చినవారు యీ సౌకర్యాల కొరతవల్ల ఉత్సాహం చూపలేదు.

గ్రామాలలో ఉద్యోగాలకు నియామకాలు చేసేటప్పుడు కేవలం డిగ్రీలే కాక, తక్కిన అర్హతలు కలవారికి ప్రాముఖ్యత యివ్వవచ్చును. పల్లెటూరులోపుట్టి, అక్కడ కొంతకాలం స్కూళ్ళలో చదువుకుని, లేక చిన్న చిన్న పట్టణాలలో వున్న కాలేజిలలో డిగ్రీ వరకు చదువుకున్నవారు సహకార సంస్థలు లాంటి ఉద్యోగాలలో అనుభవం వున్న ప్రభుత్వోద్యోగులను ప్రోత్సహించాలి. ఒక్కొక్కప్పుడు పల్లెటూళ్ళలో పుట్టినవారు తిరిగి గ్రామాలలో పనిచేయడానికి యిష్టపడని వ్యక్తులు కూడ వుంటారు. పల్లెల పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకుని అక్కడ పనిచేయడానికి సుముఖులుగా వున్న వారిని సాధ్యమైనంత వరకు పంపించాలి.

‘గ్రామీణాభివృద్ధి’ కి వృత్తిగా తర్ఫీదు అనేది ఆచరణీయంగా వుండాలి. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రం, విజ్ఞానం సహాయంతో పరిష్కరించగల దృక్పథంతో ప్రణాళికలు తయారు చేయాలి. ఉదాహరణకు, ఇండ్లు, వీధులలో దీపాల కొరకు ‘సోలార్ ఎనర్జీ’ని ఉపయోగించాలి. అందరకు అందుబాటులో ఉండేటట్లు బావులు, స్నానం చేయడానికి వసతులు, మరుగుదొడ్లు, స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు, చిన్న చిన్న చేతి పరిశ్రమలు, పాడిగేదెలు, కోళ్ళఫారంలు, ఆధునిక వ్యవసాయానికి పనికి వచ్చే చిన్న చిన్న పరికరాలు తయారుచేయ గలిగే కార్ఖానాలు, యీ సామానులను బాగు చేసే వర్కుషాపులు, సహకార సంస్థలు, కట్టెలు, ఇనుప సామానులతో చిన్న చిన్న పరిశ్రమ లకు పనికి వచ్చే సాధనాలు తయారుచేయడం లాంటివి స్థాపించాలి.

ఇది గ్రామీణాభివృద్ధికి పునాదులుగా ఏర్పడి సక్రమంగా అమలు జరిగితే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని చెప్పవచ్చును.
పైన వుదహరించబడ్డ యీ అంశా లన్నింటిపైన విశ్వవిద్యాలయాలు, నిపుణులు, స్వచ్చంద సంస్థలు జరిపిన పరిశోధనలను, స్వయంగా ఆ రంగాలలో చూచి సేకరించిన విలువైన సమాచారాన్ని గ్రామాలలో నివసించే వారికి, పనిచేసే వర్కర్లకు సులభమైన శైలిలో రాసిన పుస్తకాలు అందజేయాలి.

1. గ్రామాలలో నివసిస్తున్న ప్రజల జీవన పరిస్థితులు ఎలా వున్నాయి? అనే విషయంపై మనకు సరియైన అవగాహన లేకపోతే, అసలు గ్రామీణాభివృద్ధి పని అంటే ఏమిటో కూడ మనం అంచనా వేయలేము. మొదటి విషయం వివిధ వర్గాల ప్రజల స్థితి గతులు ఏమిటి? ఏ వర్గాలకు ఎలాంటి సహాయం కావాలి? అసలు యీ వర్గాలు ఏవి? అని నిర్వచించాలంటే స్థూలంగా నాలుగు తరగతులుగా విభజించవచ్చును.

(1) ధనవంతులు, (2) మధ్య తరగతికి చెందిన వారు (3) బీద రైతులు, (4) ఆఖరిది నాలుగవ వర్గం, ఏ ఆస్తి లేకుండా కేవలం కాయ కష్టంతో జీవించేవారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన వర్గం మరొకటి వుంది. అదే అందరి కంటే హెచ్చుగా నిరక్షరాస్యులుగా వుండి, అణగద్రొక్కబడిన స్త్రీలు, బ్యాంకుల ద్వారా అప్పులు, సబ్సిడీలు, ఉచిత సరఫరాలు, చదువుకోవడానికి సౌకర్యాలు, సాంకేతిక విద్య నేర్పే సంస్థలు, మొదలగు వాటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలలో, వివిధ వర్గాలకు చెందిన ప్రజల నిజమైన అవసరా లను, సక్రమంగా,సరిగ్గా అంచనాలు వేయాలి.
(2) పైన ఉదహరించిన లక్ష్యాలకు అనుగుణంగా, ఆ లక్ష్యాలను సాధించాలనే దీక్షతో పనిచేయాలనే ఉత్సాహాన్ని కలిగించ డానికి, స్ఫూర్తినివ్వడానికి ఒక జాతీయ వినోద, విజ్ఞాన కార్యక్రమాన్ని కూడా తయారు చేయాలి. పత్రికలు, సినిమాలు, రేడియో, టెలివిజను, వూరూరా తిరిగే ప్రచార వాహ నాలు, సాంస్కృతిక ఉద్దరణకు అభ్యున్నతికి, కృషి చేయాలి.

నిరక్షరాస్యత కారణంగా అవివేకమైన సంప్రదాయాలకు అంటిపెట్టుకుని, మూఢ నమ్మకాలలో, దురాచారాలలో మునిగి ఉన్న స్త్రీల సమస్యలకు ప్రాముఖ్యత నివ్వాలి. ప్రత్యేక ప్రాధాన్యాతతో యీ సమస్యలను పరిష్కారం చేయాలి.

ఈ కార్యక్రమాలతో పాటు దేశ జనాభా అందరకూ వయోజన విద్యా ప్రణాళిక నొకదానిని అమలు పరచాలి.

గ్రామీణాభివృద్ధిని స్థాపించాలను కుంటున్న సంస్థల్లోని ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, కొంతమంది ప్రముఖులయిన వ్యక్తుల మధ్య తరచుగా సంప్రదింపులు జరగాలనే నియమం వుండాలి.

కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి, నిర్దేశించిన లక్ష్యాలు ఎంతవరకు అమలు జరిగాయి? ఇంకా ఏ లోపాలున్నాయి? అందుకు కారణాలు ఏమిటి? వాటిని అధిగమించడానికి క్రొత్తగా తీసుకోవలసిన చర్యలు ఏమి? అనే అంశాలు తరచుగా సమీక్ష చేయడానికి యీ సొసైటీలో ప్రత్యేకంగా ఒక విభాగం వుండాలి.

(విశాలాంధ్ర దినపత్రిక సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో