ఇది కథ కాదు

డా. కె. సీత

ఎండాకాలం సెలవుల్లో మేము సిమ్లా వెళ్ళడానికి ప్లాన్‌ చేసుకున్నాము. న్యూఢిల్లీ – కాల్కా ట్రేన్‌ ఎక్కడానికి ఇంకా రెండు గంటలు టైమ్‌ వుండడం వల్ల వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చున్నాము. ఇంతలో మా ఆయన వాటర్‌ బాటిల్‌ తెస్తానని బయటకు వెళ్ళారు. నాకు ఎదురువైపు పది గజాల దూరంలో కూర్చుని వున్న ఓ కుర్రాడిపై నా దృష్టి పడింది. చాలా ఆశ్చర్యపోయాను. చూపు మరల్చుకోలేకుండా అతనివైపు అదే పనిగా చూడడం మొదలు పెట్టాను. వెంటనే అతను నా వైపు చూసి నవ్వినట్లుగా అనిపించింది. అయినా అతను నా దగ్గరకు ఎందుకు రావటం లేదు అనిపించింది. అదిగో! నా వైపు మళ్ళీ చూస్తున్నాడు… చాలా దగ్గరి పరిచయం వున్న, వాత్సల్యపూరితమైన అదే ముఖం. అదే చుబుకం, చెంపలు, మెడ తిప్పడం; అచ్చం అలాగే ఎడమచేత్తో క్రాఫ్‌ సరిచేసుకోవడం అదే మానరిజం. నాకు చాలా ఇష్టమైన రూపం, ప్రేమ పెల్లుబికించే ఆ నవ్వు, ఆ చూపు అంతా వాడిలాగే. ఎందుకు నా దగ్గరికి రాడు? నాతో ఎందుకు మాట్లాడడు? అర్థం కావటం లేదు. మొన్ననే ఫోన్‌ చేసి తన ప్రాజెక్ట్‌ గురించి చాలా డీటేయిల్డ్‌గా చెప్పాడు. వాళ్ళ బాస్‌ చాలా మెచ్చుకున్నాడని, తానే స్వయంగా బాంబే వచ్చి కొన్ని రోజులు తనతో గడుపుతానని అన్నాడనీ చెప్పాడు. బాస్‌ రాకుండా తననే ఢిల్లీ పిలిపించుకున్నాడా? నాలో సందేహం. బాగానే నా వైపు దొంగచూపులు చూస్తున్నాడు. కావాలనే నన్ను ఫూల్‌ చేస్తున్నాడా? ఏడిపించడానికా? అస్సలు అర్థం కావడం లేదు. చాలా అయోమయంలో పడిపోయాను. నేను ఆ టైమ్‌లో కనపడడం ఇష్టం లేదా? ఏదైనా అఫైర్‌ ఉందా? ఎంతో భరించరాని బాధ కలుగుతోంది. ఇంతలో మా ఆయన వాటర్‌ బాటిల్‌ పట్టుకొని వచ్చారు. నేను ఆ కుర్రాడిని చూపించి అతనివైపు చూడమని చెప్పాను. ఆయన ఆశ్చర్య పోయారు. నమ్మలేకపోయారు. మమ్మల్ని మోసగించే ఆ నవ్వు ముఖం, ఆ చూపు అతను మా ఇద్దరివైపు చూసి వెంటనే తల తిప్పేసుకున్నాడు. మా వారిని అతనికి దగ్గరగా వెళ్ళి మాట్లాడకుండా ఎదురుగుండా నిలబడమని చెప్పాను. ఆ కుర్రాడు ఏం చేస్తాడోనని చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. నాకు మెల్లగా బ్లడ్‌ప్రషర్‌ పెరగడం మొదలైంది. జ్వరం వచ్చినట్లుగా ఒళ్ళు సలసల కాగుతోంది. ముఖం ఎర్రబారి రక్తం అంతా ముఖంలోకి చిమ్మినట్లైంది. అతను ఏం తెలవనట్లు తలతిప్పి వేరేవైపు చూస్తున్నాడు. చేసేదింక ఏమీ లేక మావారు కొంచెంసేపు నిలబడి వచ్చేశారు. అయినా మళ్ళీ వెళ్ళి మాటల్లోంకి దించి పలకరించి రమ్మన్నాను. నేనింక వెళ్ళను. అతను గుర్తు పట్టనట్లు నటిస్తున్నాడు. కావాలంటే నువ్వే వెళ్ళు అన్నారు. చివరికి భరించలేక నేనే ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి చిన్నగా నవ్వాను. నువ్వెవరు? ఏం చేస్తూంటావు? ఎక్కడికి వెళ్తున్నావు అని పలకరిస్తూ ప్రక్కన కూర్చున్నాను. నా ఈ హాటాత్ప్రవర్తనకు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే అతను నా కొడుకు కాదు కనుక. అచ్చంగా వాడి రిప్లికాలాగా ఉన్నాడు. బుగ్గలు కాస్త వుబ్బి నున్నగా ఉండడం మాత్రమే నేను దగ్గరినుంచి గమనించిన తేడా. మనుషుల్లో ఇంత సిమిలారిటీ వుంటుందా? అని నేను తెగ ఆశ్చర్యపోతున్నాను. మా వాడి పక్కన ఈ కుర్రాణ్ని నిలబెడితే ఇద్దరూ ఐడెంటికల్‌ ట్విన్స్‌లా వుంటారు. చివరికి ఆ కుర్రాడికి చెప్పాను. నువ్వు టోటల్‌గా నా కొడుకులాగే వున్నావని. అతను ఆశ్చర్యపోయి నావైపు వెర్రిగా చూస్తున్నాడు. మా ఆయన కూడా నమ్మశక్యం కావటంలేదని ఆశ్చర్యపోతున్నారు. నాకే ఇంకా నమ్మబుద్ధి కావటంలేదు. ఇది కలా, నిజమా తెలియని అయోమయంలో వుండిపోయాను. ఇంతలో మేము ఎక్కాల్సిన ట్రెయిన్‌అనైన్స్‌మెంట్‌ హోరు చెవుల తుప్పు వదలగొడుతుంటే బాహ్యలోకంలోకి వచ్చిపడ్డాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో