‘దేవుడు మరణిస్తాడా?’

‘మరణిస్తాడు, తనను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన మరుక్షణంలో దేవుడు మరణిస్తాడు….’

దేవుడు మరణించిన మరుక్షణమే మృత్యువు గుండె నిండా తొలిశ్వాస తీసుకుంటుంది. గర్భవిచ్ఛిత్తిగా, రక్తస్రావంగా, సిగరెట్‌ పీకల నిప్పు మచ్చలుగా, చీకటిబిలాలుగా మృత్యుశ్వాస తుఫానులై కమ్ముకుంటుంది. ఆ తుఫానుల్లో మానవత్వం ప్రతిరోజూ వేనవేల సార్లు అత్యాచారాలకు గురవుతుంటుంది. అలాంటి వేనవేల మరణ జ్ఞాపికలు మన మధ్యే నిస్సహాయంగా రోదిస్తుంటాయి. మౌనంగా నినదిస్తుంటాయి. నిలువెల్లా నిస్తేజంగా చితిమంటలవుతుంటాయి.

‘నాకేం కావాలి, నా కోరికలేమిటి?’

‘నాకే కోరికలూ లేవు…., లేవు…., లేవంతే….!’

ఏ కోరికలూ లేవన్న ఆ జవాబు వయస్సు పధ్నాలుగేళ్ళు. కోరికలు చివుళ్ళెత్తాల్సిన పచ్చి పసి తరుణం తనకు ఏ కోరికలు లేవంటోంది. అవును మరి, ఏడేళ్ళ వయసులో బిస్కెట్‌ని ఆశ చూపించి వేశ్యావాడలకి అమ్మేస్తే, ఏడేళ్ళ పసిబిడ్డని ఇనుప రాడ్లతో కొట్టి, చీకటి గదుల్లో బంధిస్తే, పద్నాలుగేళ్ళకే అబార్షన్‌ చేయిస్తే, విపరీతమైన రక్తస్రావంలోనూ విటుల కామక్రీడలకు బలిచేస్తే, ఇంకా ఇంకా ఎన్నెన్నో దారుణాల్ని చవిచూస్తే…., పద్నాలుగేళ్ళకే కోరికలెండి, గుండె బీటలు వారడంలో అసహజత్వం ఏముందీ?! కన్న బిడ్డకు న్యుమోనియా సోకి పందొమ్మిదేళ్ళ తల్లి డాక్టర్‌ దగ్గరికి పరిగెట్టింది. బిడ్డను కాపాడడం తనవల్ల కాదని, సిటీలోని పెద్దాసుపత్రుల్లోనే చేర్పించాలని డాక్టర్‌ చెప్పాడు. భర్త కూడా అందుబాటులో లేడు. ఏం చేయాలో తెలియని ఆ యువతి బస్టాండులో కన్నీళ్ళొత్తుకుంటూ నిలబడింది, తొమ్మిదేళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి పాపను సిటీలో పెద్ద డాక్టరుకు చూపిస్తానంటే నమ్మడం ఆమె తప్పు కాదు కదా! ఆ వ్యక్తి పాపతో సహా ఆ తల్లినీ అమ్మేస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో పడిపోయినా, తప్పించుకుందామె. కానీ వెంటనే ‘వాళ్ళు’ ఆమె ఫోటోను పేపర్లో ప్రచురించి, వ్యభిచారం చేస్తున్న విషయాన్ని బాహాటం చేశారు. అంతవరకు భార్యకోసం వెదుకుతున్న ఆ భర్త గుండె పగిలిపోయింది. వెంటనే నేపాల్‌లోని ‘మైతీ’ శరణాలయం సహాయంతో ఆమెను, పాపను రక్షించుకున్నాడు. ‘నేనిక నీకు భార్యగా ఉండలేను’ అని ఆమె చెబితే, అతను, తన భార్య, బిడ్డతో సహా ‘మైతీ’ శరణాలయ సేవకే అంకితమై పోయాడు.

అక్కడి మురికి గదుల్లో పద్నాలుగేళ్ళ పిల్లలకు గర్భస్రావాలు సర్వ సాధారణం, కనీసార్హతలు కూడా లేని నకిలీ వైద్యులతో గర్భస్రావాలు చేయిస్తారు. మురికి బట్టల్లోనే ఈ తంతంతా జరిగి పోతుంది. రోజుల తరబడి రక్తస్రావం అవుతుంది. అయినా గర్భస్రావం జరిగిన కొన్ని గంటల్లోనే ఆ పిల్లని మళ్ళీ విటుల కామానికి సమిథను చేస్తారు. ఇన్‌ఫెక్షన్లతో ఇలాంటి పిల్లల శరీరాలు కుళ్ళిపోతుంటాయి.

ముంబయిలోని వేశ్యావాటికల్లో పసిపిల్లల్ని వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్న వైనాన్ని యధాతథంగా చిత్రీకరించింది ‘ది డే మై గాడ్‌ డైడ్‌’ అనే డాక్యుమెంటరీ. రోజుకు ముప్ఫై నుంచి నలభై మంది విటుల చేతుల్లో నలిగే పసిపిల్లల దీనగాథ ఇది. నేపాల్‌ సరిహద్దుల నుంచి, కాశ్మీర్‌ నుంచి పిల్లల్ని, స్త్రీలని ఎత్తుకొచ్చి, హింసించి వేశ్యావృత్తిలోకి దింపుతుంటారు. చీకటి గదుల్లో బంధించి, నానా హింసలకీ గురిచేస్తుంటారు. రోజుకు ఒక్క పూట ఆహారం, వారానికి ఒక్కసారి స్నానం…, ఇంకా ఇలాంటి దురవస్థలెన్నో వాళ్ళని ఎయిడ్స్‌ బారిన పడేస్తుంటాయి. ఇలా నేపాల్‌నుంచి అపహరణకు గురైన పిల్లలకోసం అనురాథా కొయిరాలా ‘మైతీ’ అనే శరణాలయాన్ని స్థాపించి, ఈ అనాగరికతను అంతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఒక్క నేపాల్‌ నుంచే కాదు, మన అనంతపురం జిల్లా కరువు ప్రాంతాల నుంచి కూడా పిల్లల్ని తల్లిదండ్రులే వేశ్యావాటికలకు అమ్మేస్తుంటారు.

సాటి మనుషుల్ని నమ్మడమే నేరమైన ఈ ప్రపంచంలో తమ నమ్మకం వమ్మయిన రోజే దేవుడు మరణించాడన్నది బాధితులైన ఈ పసిపిల్లల నోటి వెంట వచ్చిన విషాదవాక్యం. లైంగిక బానిసత్వమంటే మరణమే. మానవహక్కుల గురించి పోరాటాలు జరుగుతున్న ఈ వ్యవస్థలో పసిపిల్లల మానవ హక్కుల గురించి కూడా గుర్తు చేసిన ఈ డాక్యుమెంటరీ మనుషులు నివసించే ఈ భూమ్మీది అమానుష కోణాన్ని ఏ తెరలు పొరలు లేకుండా నగ్నంగా చూపించింది. ఈ సామాజిక దురవస్థను అంతం చేయడానికి ‘మైతీ’లాంటి శరణాలయాలతో పాటు, ఒక శాశ్వత పరిష్కారం కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరాన్ని ఆండ్రూ లెవిన్‌ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ నొక్కి చెబుతోంది.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

2 Responses to ‘దేవుడు మరణిస్తాడా?’

  1. TVS SASTRY says:

    దేవుడు మరణిస్తాడా? ఈ ఆలోచనే దారుణంగా ఉన్నది.

    టీవీయస్.శాస్త్రి

    Sent from http://bit.ly/f02wSy

    • ప్రసాద్ says:

      ఏ ఆలోచన దారుణంగా ఉన్నదీ?
      భయంకరమైనా, దౌర్భాగ్యకరమైనా, నిస్సహాయా పరిస్థితుల్లో వున్న ఆడ పిల్లలు, “దేముడు మరణిస్తాడు” అని అనుకోవడం దారుణంగా ఉన్నదా?
      లేక ఎవరి తోనూ సంబంధం లేకుండా, “దేముడు మరణిస్తాడు” అని అనుకోవడం దారుణంగా వుందా?
      ఇక్కడ ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో చావ లేక బతుకుతున్న స్త్రీలు అలా అనుకుంటున్నారు. ఆ ఆలోచన ఎంత మాత్రమూ దారుణం కాదు. అలా ఆలోచించడం దారుణం అని అంటున్న వారి మాటలే చాలా దారుణంగా వున్నాయి.

      ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.