ఒక నిశ్శబ్ధ సంగీత మధురిమ

రమాహరిత

నేను సాధారణంగా జీవిత చరిత్రలు చదవటానికి ఇష్టపడుతుంటాను. అవి జీవితానికి అతి చేరువలో వుంటాయని నా అభిప్రాయం. మనిషి జీవితంలో ఎంతో తపనతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలు పొందటానికి చేసే ఆ ప్రయత్నం మనలో చైతన్యం కలిగిస్తుంది. అందుకే అవి మనస్సుకు హత్తుకుంటాయి. మనలో స్పందన కలిగిస్తాయి.

జుదీ ఏదీనీలిబిజీఖి ఖలిజిళిఖిగి: జుదీదీబిచీతిజీదీబి ఈలిఖీరి లీగి ఐగీబిచీబిదీ చతిళీబిజీ ఔళిదీఖిళిచీబిఖినీగిబిగి: ఈ పుస్తకం నా మనస్సులో ఒక చెరగని ముద్రవేసింది. చదివిన వెంటనే నాకు కలిగిన మొట్టమొదటి సందేహం ”రీతిబీబీలిరీరీ/విజయం లేక కార్యసిద్ధి అంటే ఏమిటి? మనిషి జీవితంలో ఎప్పుడు విజయం సాధించేడు అని అంటాము? అసలు కార్యసిద్ధికి సరైన నిర్వచనం ఏమిటి? దానికి కొలమానం ఏదైనా వుందా? ఏ వృత్తిలోనైనా పూర్తి నైపుణ్యత సంపాదించిన తరువాత ఏమి చెయ్యాలని అనుకుంటారు? విద్యలోని నైపుణ్యత కీర్తి ప్రతిష్టలు, ధనం సంపాదించ డానికా లేక ఆవిద్యని నిరంతరం సాధన చేసి జీవితంలో ఎనలేని, సంతోషాన్ని, తృప్తిని పొందటానికా?

నిఘంటువులో కార్యసిద్ధి అనగా సఫలత లేక విజయం సాధించుట అని చెప్పబడింది. లోకం పోకడలో ఏ వ్యక్తి తన జీవితంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు, గౌరవం, ధనం సంపాదించేరో వారు జీవితంలో విజయం సాధించినట్లు చెప్పుకుంటారు. నిజానికి ఒక వ్యక్తి దృష్టి కోణంలో ఆలోచిస్తే కార్యసిద్ధి లేక విజయం నిర్వచనం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళిమీద ఆధారపడి వుంటుంది. అందుకే కార్యసిద్ధి లేక రీతిబీబీలిరీరీ అర్థం సమాజంలో వుండే అందరికీ ఒకేలా అన్వయించలేము.

ఈ పుస్తకం చదివిన తరువాత కార్యసిద్ధి అనే పదానికి నిజమైన అర్థం తెలిసింది. ఇప్పటి వరకు మనం ఐతిబీబీలిరీరీ అనే పదాన్ని ఎంత తప్పుగా వాడుతున్నామో అని ఆశ్చర్యం కలిగింది. ఆ పదం యొక్క కొత్త అర్థం విద్యలో పరిపూర్ణత సాధించడం తద్వార జీవితంలో సంపూర్ణత (సంపూర్ణమైన ఆనందం) పొందటం అని తెలుసుకొన్నాను. ఈ పుస్తకంలో ఒక నిశితమైన, సూక్ష్మ బుద్ధిగల ఒక అద్భుతమైన సంగీత వేత్త, అన్నపూర్ణా దేవి జీవితం వర్ణించబడినది. ఆమె ప్రఖ్యాత సంగీతకారుడు, ఆస్థాన విద్వాంసుడు, మైహార్‌-శైవ ఘరానా వ్యవస్థాపకుడు బాబా అల్లాయుదిన్‌ ఖాన్‌ పుత్రిక. సోదరుడు ప్రఖ్యాత సరోద్‌ వాద్యకారుడు ఉస్తాద్‌ అలీ అఖ్బర్‌ ఖాన్‌, భర్త సితార్‌ వాద్యకారుడు పండిత్‌ రవిశంకర్‌. ఆమె తన జీవితం నిరంతర సంగీత సాధనకు, అభ్యాసానికి అంకితం చేసి, ఆడంబరాలకి దూరంగా సాధారణ జీవనం సాగించారు. ఆవిడ భారతదేశం గర్వించగల ఏకైక సుర్బహర్‌ వాద్యకారిణి.

ఆమె సంగీతాన్ని దైవతుల్యంగా భావించి అందులోని అమృతత్వాన్ని, మాధుర్యతనూ అలుపెరుగని సాధనతో తన్మయత్వం పొందేవారు. స్వయంగా తండ్రి దగ్గర విద్యను అభ్యసించడం వలన వారి ద్వారా లభించిన అపురూపమైన హిందుస్థాని రాగ సంపదకు వారసురాలయ్యారు. అనన్యమైన మైహార్‌-శైవ ఘరానా యొక్క సాంప్రదాయపు సంగీతం భావితరాలకు అందించే బాధ్యత విధిగా నిర్వర్తించుట వారు తన కర్తవ్యంగా భావించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు సంభవించాయి. భర్తతోని సంబంధాలు వికటించటం, చివరకు తమ ఏకైక కుమారుడైన సుబెంద్ర శంకర్‌ హఠాత్‌ మరణం వారిని ఎంతో మానసిక వేదనకు గురిచేసాయి. జీవితంలో ఎన్ని కష్టాలకు గురైనా వారు నిరంతర సంగీత సాధనతో తన మనోధైర్యాన్ని బలోపేతం చేసుకొని జీవితాన్ని కొనసాగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కఠోర సంగీత దీక్షని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒక సన్యాసినిలా ఏకాంతంగా వారి వ్యక్తిగత జీవితంలో సంభవించిన కష్టాలకు సమాధానాలు అంతర్గత సాధన ద్వారా పరిష్కారం పొందగలిగే వారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె గడప దాటక నిరంతర సాధనతోనే కాలం గడిపేరు.

అన్నపూర్ణాదేవి, పండిత్‌ రవిశంకర్‌ రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు గలవారు. సంగీతమే వారి జీవన మార్గంగా ఎంచుకొని తమదైన జీవన శైలిని ఏర్పరచుకున్నారు. అన్నపూర్ణదేవి ఏకాంత జీవితం అలవరచుకొని బహిరంగ సంగీత ప్రదర్శనలు ఇవ్వడానికి ఇష్టపడక తన తండ్రిద్వారా లభించిన సంగీత సంపత్తి యోగ్యులైన మేధోవంతులకు నేర్పించటం తన కర్తవ్యంగా భావించి ప్రపంచం గర్వించదగ్గ సంగీత విద్వాంసులను తయారు చేయడానికి పూనుకున్నారు. పండిత్‌ హరిప్రసాద్‌ చౌరాసియా వేణు వాదకుడు, నిఖిల్‌ బెనర్జీ సితార వాదకుడు, నిత్యానంద్‌ హల్గిపుర్‌ వేణు వాదకుడు, బసంత్‌ కబ్రా, సురేష్‌ వ్యాస్‌, సరోద్‌ వాదకులు విశ్వఖ్యాతి గాంచినవారు ఆమె శిష్యులు. తన వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలకు తాపత్రయ పడక, సంగీతాన్ని ఆశ్రయించి నిరంతరం సుర్బహార్‌ సాధనలో అంతర్లీనమై ఎనలేని సంతోషాన్ని, ఆనందాన్నీ పొందగలిగేరు. ఇందుకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం గలవారు పండిత్‌ రవిశంకర్‌. బహిరిర్ముఖుడు, తన సంగీత పటిమను, సాంప్రదాయ హిందుస్థానీ సంగీతంలోని కమ్మదనాన్ని ప్రపంచానికి చాటిచెపుతూ వ్యక్తిగత పేరు ప్రతిష్టలు కూడా మెండుగా సాధించారు.

ప్రస్తుత సమాజంలో ఈ విద్వాంసురాలి నైపుణ్యత ”అశ్రుతమైన స్వరమాధుర్యం”గా స్వచ్ఛమైన సంగీతానికి, తార్కాణంగా, వంశపారంపర్యంగా వస్తున్న సంగీత సుధని ప్రపంచానికి అందించిన మహామనిషిగా అందరి గౌరవ మన్ననలకు పాత్రులయ్యారు. కార్యసిద్ధి అనే పదానికి నిఘంటువులోని అర్థం మనమధ్య వున్న ఈ మహామనీషి యొక్క విశిష్టమైన గుణాలను గుర్తించలేకపోయింది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.