” ”

- సామాన్య

నా చిన్ని పాపాయి ప్రతి రాత్రి ఒక కధ చెప్పించుకుంటుంది. గత మూడు రోజులు వివిధ ప్రచురణల వారి బుద్దుడి కధ విన్నది. బుద్దుడు దానికి బాగా నచ్చాడు. ఇవాళ రాత్రి భోజనం చేసి నన్ను సంతోష పెట్టాలంటే ఒక కధ చెప్పాలంటూ ”ది లరిస్టో కాట్స్‌” అనే పుస్తకాన్ని చేత పట్టుకొచ్చింది. ఈ పుస్తకం డిస్నా వారి ”వండర్‌ ఫుల్‌ వరల్డ్‌ అఫ్‌ రీడింగ్‌” కలక్షన్‌లో భాగం. డిస్నీ మూవీ కలక్షన్స్‌కి స్పెషల్‌ అడాప్షన్‌ ఈ పుస్తకాలు. కధ బాగుంది సింపుల్‌గా, కానీ మాకు బోలెడు పిల్లుల్ని పెంచిన అనుభవం చేత కొన్ని ప్రాధమిక ప్రశ్నలు ఉదయించాయి. మొదట కధ చెప్తా….

డచెస్‌ ఒక ఉన్నింటి పిల్లి. ఒంటరి ధనిక స్త్రీకి గారాబపు పెంపుడు జంతువు. తోక ఎలానిలబెట్టాలో, ఎలా అడుగులు చప్పుడు కాకుండా నడవాలో వంటి ధనిక షోకులు దానికి బాగా తెలుసు. దానికి మూడు పిల్లలు. ఈ పిల్లి వున్న ఇంట్లోనే పనిచేస్తున్న ఎడ్గార్‌ అనే పని వాడు తన స్వార్ధ ప్రయోజనం కోసం ఒకసారి డచేస్‌నీ, దాని పిల్లల్నీ కిడ్నాప్‌ చేసి ఎక్కడో వదిలేస్తాడు. అక్కడ డచేస్‌కి ”టాంమెలి” అనే మగ వీధి పిల్లి పరిచయమౌతుంది. ”నేను వీధి పిల్లిని” అని టాం పరిచయం చేసుకోగానే కధల పుస్తకంలో మిగిలిన వాక్యాలు ఇలా ఉంటాయి ఖితిబీనీలిరీ బీళితిజిఖి రీలిలి శినీబిశి నీలి నీలిజిఖి నీరిరీ శిబిరిజి బిజిజి గీజీళిదీవీ. ఆ తరువాత డచేస్‌ టాం తో. ”మేం సిటీకెళ్లాలి దారి చెప్పగలవా” అంటుంది. అప్పుడు, మగ పిల్లి ”నీ లాంటి అందగత్తెకి కేవలం దారి చెప్పడమేనా? నా మేజిక్‌ కార్పెట్‌పై నేనే స్వయంగా నిన్ను తీసుకెల్తా” అంటుంది. మేజిక్‌ కార్పెట్‌ అన్న మాట విని అంత వరకు అటు వైపు ఉన్న డచేస్‌ పిల్లలు ”నీ దగ్గర నిజంగా మేజిక్‌ కార్పెట్‌ ఉందా…” అని పరిగేట్టుకొస్తాయ్‌. పిల్లి పిల్లల్ని చూసి మగ పిల్లి ”బాప్‌రే! పిల్లలు!, నీకు పిల్లలు కూడా ఉన్నాయా? నేను మేజిక్‌ కార్పెట్‌ మనిద్దరికే అనుకున్నాను” అంటూ బోలెడు ఆశ్చర్యము, నిరాశా పడుతూ అచ్చు మనిషి మగవాళ్ల లాగా మాట్లాడుతుంది. మళ్లీ డచేస్‌ టెక్కు చూసి కాస్త సర్దుకుని సహాయం చేస్తుంది. అడుగడుగునా కాపాడుతుంది. ఇంటికి చేరుస్తుంది… అయినా సరే డచేస్‌, అంత సహాయం చేసిన మగ పిల్లి గురించి, దాని పిల్లలు అమాయకంగా అనుకున్నట్టు ”నాకు ఓ మెలీతో కలిసి వుండాలని వుంది” అనుకోదు ”మేము నిన్ను మిస్సవుతాం కాతీ, మేడం మాకోసి ఎదురు చూస్తూ వుంటుంది, మేం త్వరగా వెళ్ళాలి” అని వెళ్లడం కోసం తొందర పడుతుంది. ఎందుకంటె మరి అది అరిస్టో కాట్‌ కదా అలాగే ప్రవర్తించాలనమాట. ఇట్లా అనేక సహాయాలు చేసి ఇంటి వరకు దించిన ఆ వీధి పిల్లిని మర్యాదకైనా ఇంట్లోకి పిలవకుండా వీడ్కోలు చెప్తుంది, కానీ ఎడ్గార్‌ మళ్లీ వాటిని కిడ్నాప్‌ చేస్తాడు. యధావిధిగా ఓ మెలి మళ్లీ రక్షిస్తుంది. ఈ సారి విషయమంతా మేడంకి తెలుస్తుంది, ఎడ్గార్‌ని వెళ్ళకొట్టేస్తుంది.. అంతే కాక మేడం మగ పిల్లితో ”నా ఆడపిల్లికి ధైర్య వంతుడైన తెలివైన మగ పిల్లి తోడు, అవసరం ఎంతైనా వుంది” అని చెప్తుంది.. దాంతో సరే అని ఓ మెలి వాళ్ళింట్లో ఉండి పోతుంది. చివర్లో మేడం ఎట్లాగు ఒప్పుకున్నది గనుక డచేస్‌ ఓ మెలి తో ”నువ్వు లేకుంటే మేమెలా ఉండగలిగే వాళ్ళం చెప్పూ?” అని అంటుంది. అందుకు ఓమెలి చిర్నవ్వుని సమాధానంగా ఇవ్వడంతో కధ ముగుస్తుంది.

ఈ కధ నాకు నా బిడ్డకి చెప్పదగ్గదిగా తోచ లేదు.. ఎందుకో మొదట పిల్లుల వైపు నుంచి చెప్తాను. పిల్లుల పెంపకం తెలిసిన వాళ్లందరికీ తెలిసిన విషయం ఏంటంటే. మగ పిల్లులు తమ స్వంత పిల్లల్ని వీలయినంతగా ఇగ్నోర్‌ చేసేస్తాయి. తమ పిల్లలు కాని వాటిల్ని కరుస్తాయి. ఆడ వాటిని త్వరగా హీట్‌ లోకి తీసుకు రావటానికి సింహం, తన పిల్లల్ని ఎలాగైతే చంపుకుటుందో ఇవీ ఇంచు మించు అలానే ప్రవర్తిస్తాయి. అదీ కాక ”ఒక ఈతలో పుట్టిన పిల్లి కూనలకి ఒకటి కంటే ఎక్కువ తండ్రులుండే అవకాశముందని” వెటరినరీ సైన్స్‌ చెప్తుంది. అంచేత చాలా సార్లు మగ పిల్లులు, తమ పిల్లల పట్ల శత్రు ధోరణితోనే వుంటాయి. పోతే తన పిల్లల్ని రక్షించుకోడానికి ఏ ఆడ పిల్లి కూడా, ఎటువంటి పరిస్థితుల్లోను మగ పిల్లి సహాయం కోసం చూడదు. ఎన్ని దగ్గర్లకు పిల్లల్ని మార్చినా ఆ పనంతా అదే చేసుకుంటుంది. పిల్లలు పెరిగి పెద్దవయి ప్రపంచంలోకి అడుగు పెట్టే వరకు బాధ్యతంతా ఆడ పిల్లిదే.. ఇది పిల్లులు పెంచే వారికి బాగా తెలిసిన విషయం. కనుక ఒక అపరిచిత మగ పిల్లి, ఒక ఆడ పిల్లి పిల్లల్ని ఇలా రక్షించింది అనడం తప్పు. కొంచెం కూడా పరశోధన లేకుండా, అత్యంత నిర్లక్ష్యంగా పిల్లుల గురించి సినిమా గా తీసిన, రాసిన పుస్తకం ఇది.

అలా కాదు అదంతా మనుషుల కథే… ఊరికే పిల్లి వేషంలో మన కథలు మనం చెప్పుకుంటున్నాం అనుకున్నా, దానికీ ఒక అభ్యంతరం ఉంది. చిన్నప్పట్నుండి పిల్లలకి ఇలాటి సినిమాల ద్వారా ”నువ్వు ఆడ పిల్లవి కనుక ఇంటికి దారి తెలుసుకోలేవు, నీ స్వంత పిల్లల్ని రక్షించుకోవాలంటే నీకు ఓ మగ తోడు అవసరం. నువ్వు ఫలానా తరగతి నుండో, ఫలానా వర్గం నుండో వస్తే ఇలాగే ప్రవర్తించాలి. అసలు మరీ వ్యక్తిత్వం ఉంచుకోకూడదు. నీకు వారసత్వంగా అందిన జ్ఞానాన్ని అనుసరించి ఆయా సందర్భాల్లో నీ ఇష్టాలకి వ్యతిరేకంగానైనా వ్యవహరించాలి” అని బోధించడం చాలా తప్పు, అదే కాక, మగ వాళ్ళే ధైర్యంగా ఉండగలరు అన్నట్లు, ఒక మగ పిల్లిని ఉద్దేశించి ధైర్యం గురించి మేడం మాట్లాడటం, తన తగ్గరున్న పిల్లి ఆడది కనక ధైర్యం లేనిదని అన్యాపదేశంగా చెప్పడమే. ఇది చాలా పొరపాటు. ఇటువంటి సూచనలు మగ పిల్లల బుర్రల్లో తాము మాత్రమే ధైర్య వంతులమని ఆడ పిల్లల బుర్రల్లో తాము అబలలమనే భావాన్ని ఇంతంత లేత వయసుల్లోనే నాటి వేస్తాయి. జీలిరిదీతీళిజీబీరిదీవీ రీగిలిజీలిళిశిగిచీలిరీ. ఇది ఉపేక్షించ దగ్గ వియమేం కాదు.

ఈ మూవీ మొదట 1970లో రిలీస్‌ అయింది. ఆ పై 1980లో రీ రిలీస్‌ అయింది. అప్పట్నుండి మాస్టర్‌ పీస్‌ కలక్షన్‌ అని, గోల్డెన్‌ కలక్షన్‌ అని 2008 దాకా వివిధ పేర్లతో విడియోగా రిలీస్‌ అవుతూనే ఉంది. నేను కధ పూర్తి చేసాక పాపాయిని అడిగాను ”ఈ కధ నీకు అభంతరకరంగా ఏమన్నా అనిపించిందా” అని.. పీపీయికి గబుక్కున ఏం తోచలేదు.. అప్పుడు నేను, జానీ అని పిలవబడే మా జానకి అనే పిల్లి గురించి, దాని పిల్లల గురించి గుర్తు చేసి, ”వాళ్ళనాన్నని నేవ్వేమయినా చూసావా? పిల్లల్ని అక్కడికి ఇక్కడికి మార్చేప్పుడు దాని భర్త జానకికి ఎప్పుడన్నా సహాయం చేసాడా.? అని అడిగాను. అపుడు పాపాయి అసలు జానకి పిల్లల నాన్న ఎవరో తనకు తెలిమనే తెలియదని అంగీకరించి ఇప్పుడు నువ్వు చెప్తే అర్ధమయిందమ్మ. ఈ కధంతా తప్పు అంది!

ఈ పిత్రు స్వామ్య సమాజం పిల్లల లేత బుర్రల్లోకి ఇంత విషాన్ని ఎక్కించేస్తున్నపుడు మనం కోతైనా అప్రమత్తంగా వుడటం తప్పనిసరి కదా? మీరే చెప్పండి!

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>