– వారణాసి నాగలక్ష్మి

భూమిక అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. మార్చి పన్నెండున ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు గంటలదాకా భూమిక సభ్యులంతా ఆక్స్‌ ఫాం ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ సంస్థలతో కలిసి జరుపుకోబోయే ఉత్సవానికి ముందుగానే ఆహ్వానాలందడంతో సరిగా పదయ్యేసరికి నేనూ మరొక రచయిత్రి శ్రీమతి సుజలగారూ కాచిగూడాలోని తుల్జా భవన్‌కి చేరుకున్నాం. పూల సజ్జలోంచి కొండ మల్లెలు విచ్చుకుంటున్నట్టు ఎదురుగా నవ్వులు పంచుతూ సత్యవతి, మేము లోపలికి అడుగు పెట్టిపెట్టక ముందే ఎదురొచ్చి ఆప్యాయంగా హత్తుకుంది. కలుసుకుని చాలా రోజులైందేమో ఇద్దరం మైత్రీ బంధంలో ఒక్క క్షణం పరిసరాలు మరిచాం. తేరుకునేసరికి చేతిలో కెమేరా క్లిక్‌ చేస్తూ సుజాతా మూర్తిగారు.

తుల్జాభవన్‌ ప్రాంగణమంతా షామియానాలకింద తెల్లని వస్త్రంతో అందంగా అలంకరించబడి ఉంది. వేదిక ధవళకాంతులతో అతిధులకోసం ఎదురుచూస్తోంది. అటూ ఇటూ వరసగా కర్రలు పాతి, తెలుపు రంగు వస్త్రాలు చుట్టి సిద్ధం చేసిన స్టాల్స్‌. అన్నీ మహిళలకి సంబంధించిన సమస్యలూ, వాటిని ఎదుర్కొనే విధానాలూ, వారికి తోడ్పడే చట్టాలూ… వీటి గురించి తెలియజేసే చిత్రాలతో నిండి కనిపించాయి. ఒకవైపు ఎండిన ఆకులూ, పూరేకులతో ముక్తవరం వసంత లక్ష్మి గారు తయారు చేసిన అందమైన కళాఖండాలు ప్రదర్శనకు తయారవుతున్నాయి. రెండొవైపు ఓల్డ్‌ సిటీ నుంచి వచ్చిన మహిళలు తయారుచేసిన అందమైన ఎంబ్రాయిడరీ చీరలూ, వస్త్రాలూ. జుఆఖఐఐ , అస్మిత, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌, ఐజుఓజు |దీఖిరిబి, షాహీన్‌, ష్ట్రజూఈఐ, ఐఇజుష్ట్రఈ సంస్థలు, రోడా మిస్త్రీ కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విద్యార్ధులు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

శ్రీవిద్యా స్పెషల్‌ స్కూల్‌ విద్యార్ధులు ఉప్పొంగే ఉత్సాహంతో ఒకవైపు కుర్చీల్లో సర్దుకుంటుంటే రెండో వైపు రెయిన్‌ బో హౌస్‌ విద్యార్ధులు హరివిల్లులై విస్తరించారు. ఎదురు చూస్తున్న అతిధులంతా వచ్చే సరికి మరో గంట పట్టింది.

ముందుగా శ్రీవిద్యా స్పెషల్‌ స్కూల్‌ విద్యార్ధులు కొన్ని పాటలకి నాట్యం చేసారు. వారెన్నుకున్న కళాప్రదర్శనలో వాళ్లు చూపించిన నిమగ్నత ముచ్చట గొలిపింది. వాళ్ళకి శిక్షణ నిచ్చిన ఉపాధ్యాయునులు అక్కడే నిలబడి స్వంత తల్లుల్లాగా ఆతురపడడం చూస్తే తల్లిదండ్రుల పక్కనే గురువుకి దైవసమానమైన స్థానం ఎందుకిచ్చారో అర్ధమైనట్టనిపించింది!

సత్యవతి అప్పటిదాకా చేస్తున్న తన పర్యవేక్షణ ముగించి, చురుగ్గా సభ ప్రారంభించింది. ఆహూతులంతా వేదిక నలంకరించగానే అందర్నీ పరిచయం చేసింది. ఎదురుగా కూర్చుని ఉన్న చిన్నారుల్ని ఉద్దేశ్యించి ”ఈ రోజు ప్రత్యేకత ఏమి”టని అడిగింది నవ్వుతూ.

వాళ్ళు కోలాహలంగా ”మహిళాది నోత్సం” అన్నారు. ”ఇది ఉత్సవమేనా?” అని సత్యవతి ప్రశ్నించగానే ఏమాత్రం తడబాటు లేకుండా అవునని వాళ్ళు జవాబిచ్చారు.

”ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండగ? మనం ఏమన్నా సాధించామా?” అనడిగింది.

”అవును సాధించాం” అని ముక్త కంఠంతో పిల్లలంతా సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

”ఏం సాధించాం?” అని సత్య అడగ్గానే ”మన హక్కులు” అన్నారు వాళ్ళు.

”మన హక్కులు కొన్ని సాధించాం… ఇంకా కొన్ని సాధించాలి కదా?” అంటే అవున న్నారు. ముఖ్యంగా ఏం సాధించాల్సి ఉంది?’ అంటే ‘స్త్రీలకు భద్రత’ అని కొంచెం పెద్ద పిల్లలు చెప్పారు. నిర్భయకి ముందూ తరవాతా దేశ యువతలో వచ్చిన మార్పుని ప్రస్థావించి ఈనాటి ఉత్సవం అంతా ఒక ఫ్రేంలో బిగించినట్టు కాకుండా కలిసి మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుం దామని సూచించింది సత్య. ముందుగా ఆక్స్ఫాం ప్రోగ్రాం ఆఫీసర్‌ రంజన గారిని మాట్లాడమని కోరింది. రంజన నేటి స్త్రీలూ పిల్లలూ ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి కొద్ది సేపు మాట్లాడి మనమంతా వాటినెలా ఎదుర్కోవచ్చో వివరించి, మనమంతా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఎంతో అందంగా చేయగలమని చెపుతూ ముగించారు.

తర్వాత ఐఇజుష్ట్రఈ ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో మహిళ లంతా కలిసి ‘మహిళా దినోత్సవం’ మొదటిసారి జరుపుకుని వంద సంవత్సరాలు దాటిందని, మన గ్రామాల్లో ఈ ఉత్సవం జరుపుకోవడం మొదలైనది ఎనభయ్యవ దశకం నుంచని చెప్పారు. ‘మహిళలకి ఓటు హక్కు, వేతనాల్లో సమానత్వపు హక్కు ఇలా ఎన్నో సాధించినా ఇంకా ఆడవాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ హింస జరుగుతూనే ఉంది. మహిళకి ఇంకా తన శరీరంపై తనకు హక్కు లేని విధంగా జీవిస్తూ ఉంది. రేప్‌ అంటే అదే కదా!’ అన్నారు. ‘గృహ హింసకి, రేప్‌కి గురైన అమ్మాయిలు చాలా కుంగుబాటుకి లోనౌతారు. సరిగ్గా మాట్లాడలేరు. కేవలం అలాంటి వాళ్ళని మాట్లాడించడానికే దాదాపు ఏడెనిమిది సిట్టింగ్స్‌ తీసుకోవలసి వస్తుంది. ఇంక వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం అవసరమౌతుందో ఊహించవచ్చు’ అన్నారు.

తర్వాత ప్రముఖ నటి జమున గారమ్మాయి, చిత్రకారిణి స్రవంతి జూలూరి మాట్లాడారు. వంద సంవత్సరాలుగా అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ స్త్రీలు ఉద్యమిస్తున్నా తీలిళీబిజిలి తీలిశిరిబీరిఖిలి, ఖిళిళీలిరీశిరిబీ ఖీరిళిజిలిదీబీలి, జీబిచీలి వంటి నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయే గాని తగ్గుముఖం పట్టకపోవడానికి కారణమేమి టని ప్రశ్నించారు. ”మహిళలు మౌనంగా హింసని భరించినన్నాళ్ళూ, ప్రతిఘటించ కుండా పరువు కోసం పాకులాడినంత కాలమూ ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఒక గృహ హింస బాధితురాలిగా, హింసని ప్రతిఘటించి బయటికి వచ్చిన స్త్రీగా తోటి స్త్రీలు తమపై తమ తోటి వారిపై జరుగుతున్న హింసను వ్యతిరేకించాలని ”జాగో స్త్రీ” అనే శీర్షికతో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశాను. నా రక్షణ కోస కరాటే నేర్చుకు న్నాను. ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నాను” అన్నారు.

”చాలా సందర్భాలలో గృహ హింసకి లోనై బయటపడిన స్త్రీ తనని తాను నిందించుకుంటుంది. తనవల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని నమ్ముతూ ‘గిల్ట్‌ ఫీలింగ్‌’కి లోనవుతుంది. అది సరికాదు. నిర్భయ సంఘటన తర్వాత సమాజపు ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. హింసని సమాజం కూడా ఎదిరించాల్సిన ఆవశ్యకత ఉందని, అప్పుడే కాలం చెల్లిన చట్టాల్లో మార్పు వస్తుందని నిర్భయ ఉదంతం తెలియజేసింద”న్నారు. ఒకవైపు చట్టం హక్కులకోసం పోరాడమంటుంది. మరోవైపు బాధితులనే పీడిస్తుంది. కేరళలో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్న అమ్మాయి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసినపుడు ఆమెపైనే కేసు రిజిస్టర్‌ అయింది. ఇలాంటపుడు చట్టం ఎవరి వైపుందా అని అనుమానం వస్తుంద న్నారు. ఎప్పుడైతే మౌనం వీడి మనం మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతామో, సహించడం మాని ఎదిరించడం నేర్చుకుం టామో అప్పుడే సమాజంలో మంచి మార్పు సాధ్యమౌతుందని చెపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

శ్రీవిద్య ప్రత్యేక పాఠశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శాంతి వెంకట్‌ గారు మాట్లాడుతూ అన్ని రకాల వైకల్యాల కన్నా మానసిక వైకల్యం ఎంతో బాధాకరమని, అలాంటి వైకల్యానికి లోనైన పిల్లల్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం చాలా కష్టమని చెప్పి, వాళ్ళని తమ పనులు తామే చేసుకోగలిగేలా తీర్చిదిద్దడమే తమ ముందున్న పెద్ద సవాలు అన్నారు.

తర్వాత మాధవిగారు ప్రసంగిస్తూ ”సమాజంలో సగభాగమైన మహిళల హక్కులకు సంబంధించి, వారు గౌరవాదరాలతో జీవించే అవకాశాల గురిచి ఇలాంటి సభ జరుగుతున్నపుడు అందులో ఆధిక భాగం స్త్రీలే ఉంటే ఆ సభ సఫలం కానట్టే” అన్నారు. మగవాళ్ళు కూడా సమసంఖ్యలో పాల్గొన్నపుడే, తమతో సహజీవనం సాగించే మహిళల మనోభావాలు, అవసరాలు వారికి అర్ధమై, ఆ సభ లక్ష్యం నెరవేరుతుందనీ, పితృస్వామ్య సమాజంలో సరైన మార్పు రావాలంటే ఆ భావజాలానికి అలవాటు పడ్డ స్త్రీ పురుషులిరువురూ మారాలని చెప్పారు. కేవలం హింస పోవడంతోనే మంచి మార్పు రాదు. వ్యక్తి సరైన గౌరవం పొందుతూ జీవించగలగాలి. ఇలాంటి విషయాల్లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించాలంటే జనం నుంచి ప్రొటెస్ట్‌ రావాలి. దాన్ని మీడియా ఫోకస్‌ చెయ్యాలి. నిర్భయ విషయంలో రెండూ జరిగాయి. అన్నిసార్లూ అలా జరగదు. ఎందుకంటే దానికి ఎన్నో కారణాలుంటాయి. ఇదీ అని చెప్పలేం. 2000 సంవత్సరంలో ఇంఫాల్‌లో – విమానాశ్రయం సమీపంలో సైన్యం 10 మంది పౌరులను కాల్చి చంపినందుకు నిరసనగా, క్రూరమైన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఆఫ్‌స్పా)కు వ్యతిరేకంగా మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోంచాను షర్మిళ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆ దీక్షమొదలుపెట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. క్రితం సంవత్సరం అన్నా హజారేకు మద్దతుగా ఆమె ఒక ప్రకటన చేసేవరకు ఆమె గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ ప్రకటన తర్వాతే అంతా తనని గమనించారు. తన ప్రాంతంలో ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడుతూ చివరికి ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది. అది నేరమని తనపై కేసు పెట్టింది ప్రభుత్వం. విచారణ జరుగుతోంది. ఇప్పుడీ విషయం మీడియాలో కనిపిస్తోంది. అలాగే సూర్యనెల్లి కేసు ట్రయల్‌ కోర్టు నించి సుప్రీమ్‌ కోర్టు దాకా సుదీర్ఘ ప్రయాణం! నిర్భయ తర్వత లైంగిక అత్యాచారాలు ఇంకా పెరిగాయని అంతా అంటున్నారు. అత్యాచార ాలు పెరగలేదు. వాటిని పరువుపోతుందని భావిస్తూ మౌనంగా భరించే స్థితి నించి, ప్రతిఘటించి ధైర్యంగా రిపోర్ట్‌ చేసే స్థితి వచ్చింది. అంతే ఇప్పుడు సమాజం నించి సపోర్ట్‌ లభించి, సరైన శిక్షలు సకాలంలో పడితే ఇలాంటి అత్యాచారాలూ, హింసలూ తగ్గుముఖం పడతాయనడంలో సందేహంలే దని చెపుతూ ముగించారు.

మహిళా కమిషన్‌ కార్యదర్శి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రభుత్వం సదుద్దేశ్యంతో స్త్రీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా అది సామాన్య ప్రజ వరకు వచ్చే సరికి మధ్యలో పనిచేసే ఎందరో వ్యక్తుల వల్ల వారి చిత్తశుద్ధి లోపం వల్ల, కొంత ఖిరిజితిశిలి అయిపోతుంది. దానికి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. సమాజంలో సరైన మార్పు రావాలంటే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వీలిదీఖిలిజీ రీలిదీరీరిశిరిచిబిశిరిళిదీ చేయాలి. రేపటి పౌరుల తయారీలో కుటుంబం పాత్ర చాలా ఉంది. పిల్లల్ని పెంచేటపుడు ఏది సాధించినా, సాధించకపోయినా మంచి పౌరులుగా మాత్రం మిగలాలని వారికి నేర్పాలి. ఆడపిల్లలకి వీళిళిఖి శిళితిబీనీ, లీబిఖి శిళితిబీనీ మధ్య తేడాని తెలియజెప్పాలి. ఇంట్లో, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక దాడి జరిగే సూచన కనబడితే వెంటనే ఎలా అప్రమత్తం కావాలో చెప్పాలి. చేతికి ఏది దొరికితే దానితో తమని రక్షించుకుంటూ, నలుగురికి వినిపించేలా అరుస్తూ ప్రతిఘటించాలని ఆడపిల్లలకి నేర్పించాలి. ఉత్తర ప్రదేశ్‌లోని గులాబీ దండు నుంచి స్ఫూర్తి పొందిన మన రాష్ట్రపు ‘సమత దండు’ సభ్యులు వంగపూల రంగు చీరలు ధరించి, ఎ్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడతారు. ‘సమత దండు’ పేరిట ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన వీరు సాటి మహిళల సమస్యలపై సమరభేరి మోగిస్తారు. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండంలోని పది గ్రామాల్లో వీరు సేవలంది స్తున్నారు. గృహ హింస, బాల్య వివాహాలు, కట్నం వేధింపులు, ఆస్తిహక్కు సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో వీరు మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. సమాజ సేవకు చదువు, హోదాతో పనిలేదని వీరునిరూపిస్తూ మేధా పాట్కర్‌ చేతుల మీదుగా నవీన అవార్డు కూడా పొందారు. బాధలను మౌనంగా భరించకుండా మహిళలు నిరసన గళం విప్పినపుడే మార్పు సాధ్యమౌతుందని చెపుతూ బాధిత స్త్రీలకు బాసటగా నిలిచిన భూమికను అభినందిం చారు రాజ్యలక్ష్మిగారు.

తర్వాత వికలాంగ మహిళల తరపున కొల్లి నాగేశ్వర రావుగారు ప్రసంగించారు. అడ్వొకేట్‌ శేషవేణిగారు మాట్లాడుతూ వజు చీజీళిళీరిరీలి రిరీ బి చీజీళిళీరిరీలి-ఊళి లిదీఖి ఖీరిళిజిలిదీబీలి బివీబిరిదీరీశి గీళిళీలిదీవ అంటూ ఈ సంవత్సరం ఏశ్రీ ప్రకటించిన నినాదాన్ని గుర్తు చేశారు. చాలా మంది తమ పక్కింట్లోనో, తెలిసిన చోటో గృహ హింస జరుగుతుంటే తమకు సంబందించిన వారు కాకపోవడంతో మౌనంగా ఉండిపోతారనీ, ఖిళిళీలిరీశిరిబీ ఖీరిళిజిలిదీబీలి కి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చనీ, వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదనీ వివరించారు. ఈ విషయం చాలా మందికి తెలియదనీ, దీనికి ప్రచారం అవసరమని చెప్పారు.

కార్యక్రమం జరుగుతుండగా అమన్‌ వేదిక రెయిన్‌బో హోమ్స్‌ నుంచి సాహితి అనే ఎనిమిదేళ్ల అమ్మాయిని పిలిచి మాట్లాడమని కోరింది సత్యవతి. ఇంకా పసి ప్రాయం వీడని ఆ పాప ధైర్యంగా మైక్‌ అందుకుని తల్లిదండ్రులు తమ కన్న పిల్లలని పెంచేటపుడు ఆడపిల్లలకి మగపిల్లలకీ మధ్య చూపించే వ్యత్యాసాన్ని ప్రశ్నించింది. మగ పిల్లలు ఏడిస్తే ‘ఆడపిల్లలా ఏడుస్తావేమిరా’ అంటారనీ, ఆడపిల్లలు హాయిగా నివ్వితే ‘ఏమిటది మగపిల్లల్లాగా?’ అంటూ తిడతారనీ, పుస్తకాల సంచీ బడిలో పడేసి ఆటలకి పారిపోయే మగపిల్లల్ని సంతోషంగా బడికి పంపుతారనీ, శ్రద్ధగా చదువుకునే ఆడపిల్లల్ని చదువు మానిపించి ఇంటి పనిలో పెట్టేస్తారనీ చెప్పగానే అంతా ఆపాప పరిశీలనకి, అన్యాయాన్ని ప్రశ్నించిన తీరుకి హర్షధ్వానాలు చేశారు.

సభ పూర్తవుతూనే అంతా కలిసి కబుర్లు చెప్పకుంటూ భోజనాలు చేశాం. విరామం తర్వాత శ్రీ విద్య పాఠశాల నుంచి రీచీలిబీరిబిజిజిగి బిలీజిలిఖి పిల్లలు హృదయం గమంగా బృంద నాట్యాలు చేశారు. వారందరి తరపునా ఒక పాప తమకు శిక్షణ నిచ్చే గురువు గారి గురించి పసి హృదయ ంతో మనసారా పొగుడుతుంటే అక్కడున్న వాళ్ళ కళ్ళు చెమర్చాయి.

భోజన విరామం తర్వాత మధ్యాహ్న కార్యక్రమం ఆర్టిస్ట్‌ పూర్ణ గారి ఇన్‌స్టలేషన్‌ ఆర్ట్‌ షోతో ప్రారంభమయ్యింది. ఇందులో కుంకుమ, పసుపు, ముగ్గు వంటి వాటిని ఉపయోగిస్తూ మనిషి పుట్టుక ఏ విధంగా ఏర్పడుతుంది, అందులో మొదటగా తల్లి కడుపులో పిండం అభివృద్ధి, శిశు జననం, పిత్రస్వామ్య కుటుంబంలో కట్టుబాట్లు, సాంప్రదాయాలుతో ఆడపిల్లలను పెంచే విధానం, అదే విధంగా కౌమార దశలో ఆడ పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, తనపై తల్లిదండ్రుల నియంత్రణతో పాటు తనకు తానే ఏర్పరచుకొంటున్న పరిధులు, వాటిని ఎదిరించే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, తనపై జరుగుతున్న అత్యాచా రాలను ఎదుర్కొనలేని పరిస్థితులలో బయట వ్యక్తుల సహకారం లభించక పోవడం, దాని కారణంగా అత్యాచారాలకు గురై మరణించ డం వంటి విషయాలను ఈ ఆర్ట్‌ షోలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు పూర్ణ గారికి కార్యక్రమానికి విచ్చేసిన వారందరి నుండి ప్రశంసలు అందాయి.

ఈ ప్రదర్శనపై విశ్లేషణ చేస్తూ చాలా మంది ప్రదర్శనకి పాజిటివ్‌ ముగింపు ఇస్తే బాగుంటుందని చెప్పారు. తర్వాత పి. ప్రశాంతి, స్టేట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, మాట్లాడుతూ ఆడపిల్లల పై అత్యాచారం జరిగి మరణించే విధంగా కాకుండా ఆమె వాటిని ఎదిరించి అలాంటి స్థితి నుంచి తనను తాను రక్షించుకొని బయటపడ గల సందర్భాలను చూపిస్తే బాగుంటుందని విశ్లేషిస్తూ, మనందరం కూడా మన చుట్టూ జరిగే విషయాలపై దృష్టి సారించి, మానవత తో ఆడపిల్లలను ఆదుకోవాలని, ప్రతి ఒక్క ఆడపిల్లకు జీవన నైపుణ్యాలతో కూడిన విద్యను అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూమికను అభినందించారు.

అలాగే సామాజిక అంశాలపై రెయిన్‌బో హోమ్స్‌ పిల్లలు ప్రదర్శించిన నాటికలు వాళ్ళని చూస్తుంటే ఆర్ధికంగా పై తరగతిలో పుట్టి అన్ని సౌకర్యాల మధ్య పెరుగుతున్న పిల్లల కన్నా తమ హక్కులూ బాధ్యతల గురించి తెలుసుకోవడంలో వీళ్ళెంత ముందున్నారో అనిపించి ఆశ్చర్యం కలిగింది. పాత నగరం నుంచి వచ్చిన షాహీన్‌ బృందం ఘాెషాని ప్రశ్నిస్తూ ఖవ్వాలీని ప్రదర్శించారు.

చుట్టూ ఏర్పాటు చేసిన అంగళ్ళలో స్రవంతి గీసిన చిత్రాలు, వసంత లక్ష్మిగారి కళాకృతులు, షాహీన్‌ సంస్థవారి ఎంబ్రాయిడరీ చీరలూ, స్త్రీ హక్కులూ చట్టాల గురించిన అవగాహన కోసం ప్రదర్శనకు పెట్టిన ప్లకార్డులూ, బొమ్మలూ తీరిగ్గా అస్వాదించి వెనుదిరిగాం నేనూ, సుజలగారూ, బిందువుగా మొదలై సింధువుగా మారబోతున్న మహిళా శక్తికి నిదర్శనం అక్కడ కనిపించి, ప్రకృతిలో సంఖ్యలోనూ, సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి ఆవశ్యకమైన మార్పు త్వరలో రాబోతోందన్న ఆశతో ఇల్లు చేరాం.

సాహితి

ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే (లేదా) పంపాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొడుకుని పాఠశాలకు పంపితే ముందు మనకు (తల్లితండ్రులకు) ఇంత తిండి పెడతారు అని ఆలోచిస్తున్నారు. కాని కూతురుని పంపాలంటే ఆ ఎందుకులె ఖర్చు అని అంటున్నారు. కాని నిజానికి జరిగేది. అబ్బాయిలు పాఠశాలలకు అని ఇంట్లో నుంచి వెళ్లి బడిలో బ్యాగ్‌ పెట్టి, ఆటలు ఆడడానికి బయటకెళ్లి సరదాగా తిరుగుతున్నారు. కాని అమ్మాయిలు తన తల్లితండ్రుల నా మీద నమ్మకంతో బడికి పంపుతున్నారు కాబట్టి నేను పాఠశాలకు వెళ్లి బాగా చదువుకోవాలి అని, చదువుతున్నారు.

అమ్మాయి పుడితే ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగెే అమ్మాయిలు ‘లక్ష్మిదేవి ఇంటికి’ ”అవనికి వెలుగు” అంటారు కాని ఆ వెలుగు ఏది, సమాన హక్కులు ఎలా వస్తాయి అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అమ్మాయిలు చదువుకోకపోతే వెలుగు ఎలా వుంటుంది ఇంకా, మా అమ్మ చదువుకోలేదు నేను మా అమ్మని ఏం అడుగుతాను? అందుకే ఆడపిల్లకు చదువు చాలా ముఖ్యం అని అంటాను.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

One Response to

  1. వారణాసి నాగలక్ష్మి గారు, అంతర్జాతీయ మహిళా దినొత్చవము రిపొర్టు కళ్ల కు కట్టీనట్టూ రాసారు బాగుంది . కాని నాపెరు ముక్థవరం వసంత కుమారి అండీ. వసంత లక్ష్మి అని రాసారు భూమిక సత్యవతి గారికి దన్యవాదాలు.

    ముక్తవరం వసంత కుమారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.