– డా. కె. సీత

మేము వేసవి సెలవులలో మే నెలలో చల్లగా సాగే స్ఫితి హిమాలయాల ట్రైబల్‌ రూట్‌లో చూసి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము.

సికింద్రాబాద్‌ నుండి మే, 8న ఉదయం బయలుదేరి 19రోజులు ట్రిప్‌ పూర్తి చేసుకుని తేదీ 28 మేనెల మధ్యాహ్నం 2గం.. తిరిగి సికింద్రాబాదు చేరాము.

మేము సికింద్రాబాద్‌ స్టేషన్లో ఉదయం 7.50 గం|| రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి మే 9 ఉదయం 5.50గం|| ఢిల్లీ చేరాము. ఢిల్లీలో 7.40గం|| ఉదయం బయలుదేరి కాల్కా శతాబ్ధి ట్రైన్‌లో ప్రయాణించి ఉదయం 11.45గం|| కాల్కా చేరాము. మళ్ళీ కాల్కా నించి సిమ్లా కి ఉదయం 12.10 ని|| బయలుదేరీ హిమాలయన్‌ క్వీన్‌ ట్రేన్‌లో బయలుదేరి సాయంత్రం 5.20గం|| సిమ్లా చేరుకున్నాము. టైమ్‌ తక్కువ ఉండడం వల్ల కాల్కా స్టేషన్‌లోనే బిస్కట్స్‌, టీ తీసుకున్నాము. మధ్యాహ్నం మా దగ్గర ఉంచుకున్న డ్రైఫ్రూట్స్‌తో ఆరోజు లంచ్‌ పూర్తి కానిచ్చాము. సిమ్లా స్టేషన్‌ నుంచి హోటల్‌ చేరుకుని ఆరోజు విశ్రాంతి తీసుకున్నాము. సిమ్లాలో మరుసటి రోజు మా హోటల్‌ మేనేజర్‌ ద్వారా ఒక కారు మాట్లాడుకున్నాము, కారు, డ్రైవర్‌ మరుసటిరోజునించి మాతో 13 రోజులపాటు వుండేవిధంగా. డ్రైవర్‌కి ట్రైబల్‌ వాయేజ్‌ మార్గం బాగా పరిచయం అయినదని తెలిసి హాయిగా ఫీల్‌ అయ్యాము.

నాకో గ్రామానికి ఆనుకొనే నాకో సరస్సు వుంది. ఇది ఉదయం సమయంలో చూడడానికి చాలా అందమైన ప్రదేశం. సరస్సు నీటిలో నాకో గ్రామ నీడలు, చుట్టూ వుండే హిమాలయ శిఖరాల నీడలు నీటిలో ప్రతిబింబించి చాలా సుందరంగా కనిపిస్తుంది. గ్రామంలో ఒక చిన్న బౌద్ధ ఆరామం కూడా వుంది. ఇది క్రీ.శ. 996 సం||లో రింగ్‌-చెన్‌-జాంగ్‌-పో చే నిర్మించబడింది. ఆరామంలో చిన్న చిన్న మందిరాలు అనేకం ఉన్నాయి. వాటిలో పురాతన శిల్పాలు, కుడ్య చిత్రాలు చెప్పుకోదగినవి.

మే నెల 11వ తేదీ ఉదయం 9గం|| సిమ్లాలో బయలుదేరి నార్కండా చేరుకోవడానికి 6గం|| సమయం పట్టింది. సిమ్లా నుంచి నార్కండా 70కి.మీ. ప్రయాణం పూర్తి అయేసరికి సాయంత్రం 4గం|| అయింది. ఆ రోజు రాత్రికి మా బస నార్కండా హోటల్‌లో. మరుసటి రోజు బ్రేక్‌ ఫాస్ట్‌ కానిచ్చి 9గం|| బయలుదేరి సర్‌హన్‌కి 106 కి.మీ. ప్రయాణానికి 7గం|| పట్టింది. సాయంత్రం 5గం|| సరహన్‌లోని హిమాచల్‌ టూరిజం వారి హోటల్‌కి చేరాము. ఆరోజు రాత్రికి మా బస అక్కడే. సాయంత్రం 7గం|| బయలుదేరి భీమ్‌కాళి దేవాలయాన్ని దర్శించుకున్నాము. మరుసటి రోజు ఉదయం 9గం|| బయలుదేరి 87 కి.మీ. ప్రయాణించి రికాంగ్‌పియో చేరేసరికి 6గం|| పట్టింది. ఆ రోజు రాత్రికి రికాంగ్‌లోని హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాము. మే 14వ తారీకున ఉదయం రికాంగ్‌పియో నుండి బయలుదేరి 114 కి.మీ. ప్రయాణించి ‘నాకో’ చేరుకున్నాము. ఈ ప్రయాణం మొత్తం 9గం|| పట్టింది. నాకోలో రాత్రి మా బస నాకో సరస్సు వద్ద వున్న హోటల్‌లో. మా ప్రయాణంలోని 7వ రోజుకు ట్రైబల్‌ వాయేజ్‌లోని ఆరంభ ప్రాంతం నాకో చేరుకోగలిగాము

‘నాకో’ కిన్నూర్‌ లోయకు తూర్పు వైపు చివరగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 11800 అడుగుల ఎత్తుపై ఉంది. తరువాత కొండచరియలు విరిగిపడే ప్రాంతం ‘ముల్లింగ్‌ నాలా’ గుండా ప్రయాణిస్తాము. నాకో ఇండోటిబెటన్‌ బార్డర్‌ పై వుండడం వలన విదేశీయులకు ప్రవేశ అనుమతి (ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌) అవసరం ఉంటుంది. స్వదేశీయులు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రయాణం అంతా స్ఫితీ లోయగుండానే సాగుతుంది.

నాకో గ్రామానికి ఆనుకొనే నాకో సరస్సు వుంది. ఇది ఉదయం సమయంలో చూడడానికి చాలా అందమైన ప్రదేశం. సరస్సు నీటిలో నాకో గ్రామ నీడలు, చుట్టూ వుండే హిమాలయ శిఖరాల నీడలు నీటిలో ప్రతిబింబించి చాలా సుందరంగా కనిపిస్తుంది. గ్రామంలో ఒక చిన్న బౌద్ధ ఆరామం కూడా వుంది. ఇది క్రీ.శ. 996 సం||లో రింగ్‌-చెన్‌-జాంగ్‌-పో చే నిర్మించబడింది. ఆరామంలో చిన్న చిన్న మందిరాలు అనేకం ఉన్నాయి. వాటిలో పురాతన శిల్పాలు, కుడ్య చిత్రాలు చెప్పుకోదగినవి. ఇంతేకాక గ్రామం ప్రవేశద్వారం రాతి-కలపతో నిర్మించబడి అందమైన వర్ణ చిత్రాలతో చాలా సుందరంగా వుంటుంది. 15వ తేదీ ఉదయం నాకో గ్రామం, ఆరామం, సరస్సు చూస్తూ స్ఫితిలోయ గుండా మా ప్రయాణం సాగించాము.

స్ఫితి: స్ఫితి నది కుంజుయ్‌ హిమాలయాలలో పుట్టి తూర్పు దిశగా ప్రయాణించి కిన్నూర్‌ జిల్లాలోని ఖాబ్‌ వద్ద సట్లెజ్‌ నదితో సంగమిస్తుంది. స్ఫితి నదీ లోయ అనేక శతాబ్ధాలుగా జనసాంద్రత నుంచి దూరంగా వుంది. ఇక్కడ బౌద్ధ ఆరామాలు, బౌద్ధ సంస్కృతి మాత్రమే దర్శనమిస్తాయి. ఇది శతాబ్దాలుగా నానో రాజ వంశీకుల పాలనలో ఉంది. వీరు ‘గేలుక్‌-పా’ తెగకి చెందినవారు. ఇక్కడి ప్రజలు, ఓం-మణి-పద్మే-హం మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రం అన్ని పాపాలనించి విముక్తిని కలుగజేసి సంపదనిస్తుందని వీరి నమ్మకం. స్ఫితి చాల అందమైన పచ్చని లోయ. సహజమైన ప్రకృతి సంపద చెక్కు చెదరకుండా వుంది. ఇక్కడికి చేరుకోవడం కష్టం కనుక జనసాంద్రత చాలా తక్కువ. వేసవిలో మాత్రమే టూరిస్ట్‌లతో కళకళలాడుతుంది. ఇక్కడి జంతు సంపదలో స్నో లెపార్డ్‌, ఐబెక్స్‌ చెప్పుకోతగ్గవి. ఒకవైపు ఆల్ఫైన్‌ వృక్షాలతో కూడిన పచ్చని లోయ, మరోవైపు శీతల ఎడారిలో ఉన్నతంగా వున్న గ్రేటర్‌ హిమాలయ పర్వతాలు. డ్వార్ట్‌ జునిఫర్‌ చిట్టడవులు, అనేక ఔషధ మొక్కలు ఈ లోయలో వున్నాయి. ఇక్కడ హైందవ సంస్కృతి, బౌద్ధ సంస్కృతి యొక్క వింతైన అద్భుతమైన కలయికను చూడగలుగుతాము. ఇది ట్రైబల్‌ వాయేజ్‌లోని గొప్ప అనుభవాన్ని యాత్రీకులకు కలుగజేస్తుంది.

స్ఫితిలోయను ”ప్రపంచ శిలాజ పార్కు”గా అభివర్ణిస్తారు. స్ఫితి లోయలోని ముఖ్యమైన 3 గ్రామాలు కాజా, కిబ్బర్‌, కై శిలాజాలు కనపడే మార్గాలు. ఈ గ్రామాలు స్ఫితిలో 13500 నుంచి 14400 అడుగుల ఎత్తున ఉన్నాయి. లాంగ్‌ జా కూడా సముద్ర శిలాజాలకు ప్రఖ్యాతి గాంచింది. ఈ శిలాజాలు ఈ గ్రామం యొక్క కాంగ్‌యూర్‌, పాపెన్‌యూ నాలాల వద్ద కనిపిస్తాయి. అనేక మిలియన్‌ సంవత్సరాల క్రిందట నివసించిన జంతు, సముద్ర జీవుల కళేబరాలు మట్టి, ఇతర ఖనిజాలతో తాపటమైపోయి అప్పుడు బ్రతికి వున్నపుడు ఏ ఆకృతిలో ఉండేవో అదే ఆకృతిలో రాయి వలె(శిలవలె) మార్పు చెందినవి. ఒక జంతు శాస్త్రజ్ఞురాలిగా, జంతుశాస్త్ర అధ్యాపకురాలిగా నేను, వృక్ష శాస్త్రజ్ఞుడిగా అధ్యాపకుడుగా నా సహచరుడు వీటిని చూడగలగడం మా జన్మ ధన్యమైనట్లుగా భావించాము. ఇది ఒక అద్భుతమైన సంపద. శిలాజ నిదర్శనాల ద్వారా గతకాలంలో నివసించిన, ఇప్పుడు నివసిస్తున్న జీవుల మధ్య లింకును మనం శాస్త్ర బద్ధంగా తెలుసుకోగలుగుతాము.

నాకోనుంచి స్ఫితిలోయను, అద్భుతమైన హిమగిరుల సౌందర్యాన్ని చూస్తూ దాదాపు 70 కి.మీ. ‘టాబో’ ప్రయాణానికి మాకు 7గం|| సమయం పట్టింది. టాబోలో విశ్రాంతి గృహాలు చాలా ఉన్నాయి. మా హోటల్‌ చేరుకుని లంచ్‌ పూర్తి చేసేసరికి చాలా అలసిపోయాము.

టాబో: అదేరోజు సాయంత్రం బయలుదేరి టాబో బౌద్ధ ఆరామాన్ని దర్శించుకున్నాము. టాబో హిమాచల్‌లోని స్ఫితిలోయలోని అద్భుతమైన ప్రాంతం. గ్రామం సముద్ర మట్టానికి 3050 మీటర్ల ఎత్తుపై వుంది. ఇక్కడికి సాహస యాత్రలు చేసేవారు ట్రైక్కింగ్‌ అనుభవం వున్న సాహసీకులు మాత్రమే వస్తారు. చాలా అందమైన ప్రశాంతమైన ప్రకృతి పరిసరాలు. జనసాంద్రత అస్సలు లేదు. టాబో గ్రామం మధ్యలో బౌద్ధారామం వుంది. ఇది చాలా ప్రసిద్ధి పొందింది. ట్రైబల్‌ వాయేజ్‌ను బుద్దిస్ట్‌ వాయేజ్‌ అనికూడా పిలుస్తారు. ఈ ఆరామంలో 9 దేవాలయాలున్నాయి, 23 చోర్టెన్లున్నాయి. ఒక బౌద్ధ సన్యాసుల ఆరామం వుంది. టాబో ఆరామం క్రీ.శం. 996 లో నిర్మించబడింది. ఆరామం గోడలపై కుడ్యవర్ణ చిత్రాలు అద్భుతంగా చిత్రించబడ్డాయి. అందుచే టాబోను ”హిమాలయ అజంతా”గా వర్ణిస్తారు. ఇవి అనేక విధాలుగా అజంతా (ఔరంగాబాద్‌) చిత్రాలను పోలి వుంటాయి. దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశంనుంచి, పొరుగున వున్న టిబెట్‌ దేశంనుంచి బౌద్ధమత జ్ఞాన సముపార్జన కొరకు పండితులు ఇక్కడికి వచ్చారు. అందువల్ల ఇక్కడి కళారూపాలు ఇండో-టిబెటన్‌ సంస్కృతికి మిశ్రమంగా చెప్పవచ్చు. ఇక్కడి ముఖ్య దేవాలయం ‘టుగ్‌-లా-ఖాంగ్‌’, ఈ దేవాలయంలో చాలా పెద్ద సమావేశ మందిరం, దానిలో చాలా పెద్ద వైరోచన బుద్ధ శిల్పం (ద్యాన బుద్ధుని శిల్పం) వుంది. ఈయన ఆదిబుద్ధుని అయిదుగురు కొడుకులలో ఒకరు. ఇక్కడ 30 వరకు వజ్రయాన మండల ప్రతిరూపాలున్నాయి. గోడలపై బుద్ధుని జాతక కథలకు సంబంధించిన అపురూప వర్ణ చిత్రాలు చిత్రించబడ్డాయి. గర్భ గుడిలో బోధిసత్వుని 5 ప్రతి రూపాలున్నాయి. ఇక్కడి స్వర్ణదేవాలయం, బోధిసత్వ మైత్రేయ దేవాలయం మహాకాళి వజ్ర-బైరవ దేవాలయం చెప్పుకో తగ్గవి. మహాకాళి వజ్రభైరవ మందిరంలో ‘గేలుక్‌-పా’ తెగకి చెందిన ”టెంపుల్‌ ఆఫ్‌ హారర్‌” ఉంది. ఇక్కడే సింహం పై అమృత ప్రభ మూర్తిని కూడా చూడవచ్చు. నెమలి వాహనం నుంచి సింహవాహనానికి జరిగిన మార్పు, బుద్ధుడు బోధి సత్వునిగా మార్పు చెందడాన్ని సూచిస్తుంది.

మరుసటి రోజు ఉదయం మేము బ్రేక్‌ ఫాస్ట్‌ ముగించుకుని బయలుదేరడానికి సిద్ధమైన సమయంలో హోటల్‌ వంట అతను, సర్వర్లు మా వివరాలు అడిగి తెలుసు కొని చాలా ఆత్మీయంగా మాట్లాడారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 కిలోల గోల్డెన్‌ ఆపిల్స్‌ను అతి తక్కువ ధరకు మాకు తెచ్చిపెట్టారు. ఈ ఆపిల్స్‌ వాళ్ళుతిరిగి ఆపిల్‌ సీజన్‌ వరకూ బద్రపరచు కుంటారట. వాతావరణం అతిశీతలంగా డీప్‌ఫ్రీజర్‌లో లాగ ఉండడంతో ఇవి అసలు పాడు కావని తెలిపాడు. ఈ గోల్డెన్‌ ఆపిల్స్‌ మాకు ఆహారం దొరకనప్పుడు, తినలేనిదిగా ఉన్నపుడు మాకు చక్కగా ఉపయోగపడ్డాయి. పచ్చని పసుపు బంగారు వర్ణంలో ఉండి చాలా రుచికరంగా జ్యూస్‌తో నిండి ఉన్నాయి.

మే 18వ తేది ఉదయం అనగా మా ట్రిప్‌లో పదవ రోజు టాబోకు వీడ్కోలు చెప్పి ‘ధనకర్‌’ దిక్కుగా మా ప్రయాణం కొనసాగించాము. దాదాపు 32 కి.మీ దూరం 2 1/2 గం|| పట్టింది.

ధన్‌కర్‌ః- 17వ శతాబ్దంలో స్ఫితి లోయకు ధన్‌కర్‌ ముఖ్య పట్టణం. 3870 మీటర్ల అతి ఎతైన కొండలపై ధన్‌కర్‌ బౌద్ద ఆరామం నిర్మించబడింది. ఆరామం పైభాగం నించి స్ఫితిలోయ సర్వాంగ సుందరంగా కన్నుల పండగగా కనిపిస్తుంది. ఇక్కడే పురాతన కాలంలో నోనో (శ్రీళిదీళి) రాజవంశీకులు శత్రువులను ఎదుర్కోడానికి, వారినుంచి కాపాడుకోడానికి ధన్‌కర్‌ కోటను కట్టుకున్నారు. దురాక్రమణ దారులు వచ్చినపుడు పెద్దఎత్తున మంటలు పెట్టుకుని రాళ్ళవద్ద రక్షిత ప్రాంతాలలో సమావేశమయి శత్రువుల నుంచి కాపాడు కోవడానికి వ్యూహరచనలు చేశారు. కోటలోని చీకటి గుహలను కారాగారాలుగా ఉపయోగించు కునేవారు.వీటికి తలుపులు లేవు, రూఫ్‌పైన వున్న చిన్న రంధ్రాలగుండా ఖైదీలను క్రిందికి జారవిడిచేవారు వారికి ఆహారం, నీరూ రంధ్రం గుండానే క్రిందికి పంపేవారు. జనసాంద్రతనుంచి చాలా దూరంలో ఉండడం వల్ల ఆధునిక ఛాయలు ధన్‌కర్‌ సంస్కృతినీ, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయలేదు.

ధన్‌కర్‌ బౌద్ధారామం స్ఫిణి, సిన్‌ నదుల సంగమ స్థానంలో వుంది. ఇది 7-8 శతాబ్ధాల మధ్య అతి ఎత్తైన పర్వతంపై నిర్మించ బడింది. దీనికే ‘లా-ఓ-పా’ ఆరామమని కూడా పేరు. ఆరామం అనేక నిర్యాణాల సమూహం. దీనిలో 5 సమావేశ మందిరాలు వున్నాయి. దీనిలోని ‘దుభానా’ మందిరంలో వెండితో నిర్మించబడిన ‘వజ్రధారి శిల్పం’ గాజు పేటికలో భద్రపరచబడింది. ఇక్కడే సాఖ్యముని చిత్రాలు కూడా వున్నాయి. కై (చలిగి) ఆరామం తరువాత రెండవ అతి ఎత్తైన ఆరామం ధన్‌కర్‌. ఇది ముఖ్యమైన బౌద్ధ జ్ఞానసముపార్జన కేంద్రము. ఆరామం మద్యగా ధ్యానమూర్తి అయిన బోధిసత్వుడు (వైరోచన బుద్ధుడు) ఆశీనుడయ్యాడు. ఈ ఆరామం గేలుక్‌-పా రకానికి చెందిన టిబేటన్‌ బుద్ధిస్టులకు చెందినది. ఇక్కడి రమణీయమైన కుడ్య చిత్రకళ చాలా గొప్పది. పవిత్ర బౌద్ధ గ్రంధాల నుండి శ్లోకాలు గోడలపై లిఖించబడ్డాయి.

మరో కొత్త ఆరామం ‘షి చిల్లింగ్‌’ గ్రామంలో ఉంది. దీనిలో 150 మంది లామాలకు నివాసం ఉంది. ధన్‌కర్‌ కి 2.5 కి. మీ. దూరంలో ధన్‌కర్‌ సరస్సు వుంది. హిమాలయ మంచు పర్వత శిఖరాలు చాలా ఎత్తుగా ఉన్నతంగా కనిపిస్తాయి. ఇక్కడనించి (సరస్సు) పిన్‌ వాలీ నేషనల్‌ పార్కు చాలా దగ్గరలో ఉంది. కాలి నడకన మాత్రమే ఇక్కడికి చేరగలము. ధన్‌కర్‌ సరస్సులో కార్ప్‌ రకానికి చెందిన చేపలున్నాయి. చేపలు పట్టడం ఇక్కడ నిషద్ధమైనది.

కాకతాళీయంగా మేము ధన్‌కర్‌ చేరేసరికి అక్కడంతా కోలాహలంగా, అత్యంత అట్టహాసంగా బ్ధుపూర్ణిమ (వైశాఖపూర్ణిమ) ఉత్సవం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న బౌద్ధమతస్థులు బుద్ధపూర్ణిమనాడు ఇక్కడికి వేలాదిగా చేరుకున్నారు. వీరంతా చాలా క్రమశిక్షణతో బుద్ధుని ప్రతిమలను పల్లకీలలో మోస్తూ, వారి సంస్కృతీ చిహ్నాలను, రకరకాల రంగురంగుల వస్త్రాలతో చేసిన జెండాలను మోస్తూ అనేకమంది లామాలు నేలపై చీమల బారుల్లా బారులు కట్టి ఊరేగిస్తూ బయలుదేరారు. ఈ ఊరేగింపులో భాగంగా అనేకమంది స్త్రీలామాలు, అతి చిన్న వయస్సులో ముక్కుపచ్చలారని ముద్దుగొలిపే బాల, బాలికా లామాలు, కౌమార లామాలు కూడా వున్నారు. వారి ఊరేగింపు వివిధ రకాల వాయిద్యాలు మేము నిలబడిన ఎత్తైన కొండపై చేరగానే మా గుండెలు విచిత్రంగా లయ తప్పడం మొదలైంది. బౌద్ధ మతేతరుల పట్ల వారి వినమ్రత, హావభావాలు, హుందాతనం మా హృదయాంతరాళలో వారిపట్ల మాకు మాటలకందని గొప్పనైన భావజాలం, ఆ సుందర దృశ్యాలు శాశ్వతంగా ముద్రించబడ్డాయి అంటే అతిశయోక్తి లేదు. వారి ఊరేగింపు మమ్మల్ని దాటి కాస్త జనసందోహం పలచబడ్డాక మేము ఆరామం లోపలికి దారితీశాము. చీకటి, ఇరకైన మెట్లతో, లక్నోలోని భూల్‌భులయ్యాని తలపించేలా ఉంది. కొన్నిచోట్ల మెడ, నడుము వంచుతూ, దాదాపు పాకుతూ సాగాల్సి వచ్చింది. పెద్ద పెద్ద మందిరాలలోని యోగ బుద్ధమూర్తులను, ధ్యానముద్ర బుద్ధ మూర్తులను, గోడలపై వున్న చిత్రకళను చూస్తుంటే అవి ఇప్పటికీ తళతళ మెరిసే రకరకాల రంగులతో అద్భుతంగా ఏ మాత్రం చెక్కుచెదరకుండా వున్నాయి. మేము ఈ లోకంలోకాక మరేదో ఇతర లోకంలో కలలో ప్రయాణిస్తున్నట్లు తన్మయత్వం కలిగింది. ఆరామం లోపల నిచ్చెన మెట్లెక్కి వారు జెండా కట్టిన అతి ఎత్తైన ప్రదేశాన్ని చేరాము. అక్కడ నిలబడితే మొత్తం స్ఫితీ లోయ, స్ఫితీ నది, కొండలవాలు ప్రదేశాలు, పిన్‌లోయ, పిన్‌నది, స్పితి నదుల సంగమం, ఎత్తైన ఊర్ధ్వ లోకాన్ని అంటుకున్నట్లున్న గొప్ప హిమాలయ శిఖరాల (స్త్రజీలిబిశిలిజీ కరిళీబిజిబిగి ఆలిబిదిరీ)ను చూసి మనస్సు పారేసుకోని మానవ మాత్రుడు వుండడంటే అతిశయోక్తి కాని, అబద్ధం కాని ఉండదు. ఒక గంటకు పైగా దిగుతూ మేము తిరిగి సమావేశ స్థలానికి చేరుకున్నాము. అక్కడ ముఖాలపై రంగు రంగుల మాస్క్‌లు ధరించిన స్త్రీ, పురుషులు, వారి నృత్యాలు, వాయిద్యాల హోరును చూస్తూ ఉంటే ఆరోజు మొత్తం మేము నిరాహారంగా వున్నామనే విషయం స్పృహలోకి రాలేదు. ఆ అపురూప సన్నివేశాలను దృశ్యాలను ఫోటోలు తీస్తూ వుండేసరికి సాయంత్రం 5గం|| అయింది. భారీ వర్షం మొదలైంది. మా డ్రైవర్‌ వెంటనే బయలుదేరకపోతే ఆ జనసందోహం నించి తప్పించుకోవడం చాలా కష్టమని హెచ్చరించడంతో మేము తిరుగుప్రయాణమయ్యాము. దాదాపు ఒక ఫర్లాంగు దూరం కదలడానికి 2గం|| పట్టింది.

ధన్‌కర్‌లో ఉండడానికి హోటల్స్‌ కాని, లాడ్జింగ్‌లు కాని ఏమీ లేవు. తినటానికి ఏమీ దొరకదు.

పిన్‌ నేషనల్‌ పార్కు: దారిలోనే పిన్‌వాలీ నేషనల్‌ పార్కు పోయే దారి ఉంది. నడకతో మాత్రమే చేరుకోగలం. పిన్‌వాలీ నేషనల్‌ పార్కు 330 మీటర్ల ఎత్తునుంచి 6632 మీటర్ల ఎత్తుపై ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -180్పు నుంచి 270్పు వరకు చాలా వ్యత్యాసాన్ని కలిగి వుంటాయి. ఇక్కడ టిబేటన్‌ స్నో ఫించ్‌ పక్షులు, బ్లూ షీప్‌, తోడేలు, హిమాలయన్‌ కాక్‌, చుకోర్‌, స్నో పాట్రిడ్జ్‌ మొదలైన అరుదైన హిమాలయన్‌ పక్షులు, ఇండియన్‌ హోడ్గ్‌ సోరిస్‌, పార్కుపైన్‌, ఊలీ ఊలీ హిమాలయన్‌ మాస్‌ హేర్‌ (కుందేలు), టిబేటన్‌ గెజిల్‌ (జింకల వంటి ఆంటిలోప్స్‌), రేడ్‌ ఇండియన్‌ పాక్స్‌, మొదలైన అరుదైన జంతువలకిది ఉనికిపట్టు. స్నో లెపార్డ్‌, ఏబెక్స్‌ ఇక్కడ తప్ప మరెక్కడా కనబడవు. మేము మెయిన్‌ రోడ్డుపైకి చేరి తిరిగి 34 కి.మీ. ప్రయాణం రెండు గంటలలో పూర్తి చేసుకొని కాజా చేరుకొనేసరికి రాత్రి బాగా పొద్దుబోయింది. ఎలక్ట్రిసిటీ బోర్డువారి విశ్రాంతి గృహం కాజా(చబిచిబి)కి 4కి.మీ. దూరంలో ఉంది. ఇది రాంగ్రిక్‌ (ష్ట్రబిదీవీజీరిది)అనే ప్రదేశంలో ఉంది. ఇది ఈ వాలీ మొత్తంలోని పెద్ద విశ్రాంతి గృహం. మేము రాత్రికి దీనిలోనే బసచేశాము.

కాజా(చబిచిబి): ఇది స్పితి యొక్క సబ్‌డివిజనల్‌ హెడ్‌క్వార్టర్‌. ఇది స్ఫితి నదియొక్క ఎడవైపు ఒడ్డున 12500| అ|| ఎత్తున ఉంది. చాలా ఎత్తునించి లోయవైపు క్రిందికి సాగే హిమాలయ పర్వత శ్రేణులు, స్లోప్‌లు కలిగి వున్నాయి. ఈ పనోరోమా దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుండి దాదాపు లడాఖ్‌ హిమాలయాలను పోలి ఉంటాయి. ఇతర కాలాలలో నిద్రాణంగా వున్న కాజా వేసవిలో టూరిస్ట్‌లతో (కొద్దిపాటి) కళకళలాడుతుంది. విదేశీయులకి ఇక్కడ పర్మిట్లు, ఫారిన్‌ ఎక్చేంజ్‌, టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌, వసతి, వాహనాలకు పెట్రోలు దొరుకుతుంది. ఇక్కడ జరిగే సంవత్సరాంతపు సంత లడాఖ్‌ హిమాలయాలలోని సంతలలాగ అనిపిస్తుంది. కాజా స్ఫితిలోయలోని ట్రెక్కర్లకు బేస్‌కాంప్‌ ట్రెక్కింగ్‌ పర్మిట్లు కూడా ఇక్కడే ఇస్తారు.

కాజాలోని బౌద్ధారామం ‘సా-క్యా-పా’ తెగలోనిది. మరో ఆరామం ‘హిక్కిమ్‌’ లో వుంది. కాజాకి సరిగ్గా ఎదురువైపున స్ఫితి నది కుడి ఒడ్డున వున్న ‘కైయులింగ్‌’ నుండి నోనో(శ్రీళిదీళి) రాజవంశస్థులు స్ఫితిని పరిపాలించారు. రాజ వంశీకులలోని చవరి రాణి దమయంతి గడచిన రాజవంశీయుల తాలూకు చిహ్నాలను, వైభవ ప్రాభవాలనూ కాపాడుతూ, కాజాలోనే నివసిస్తున్నారు. ఆరామం ఫోటోలు, హిమాలయాల ఫోటోగ్రఫీ చేస్తూ ఆ రోజు గడచి పోయింది. సాయంత్రానికి విశ్రాంతి గృహానికి చేరాము. మరుసటి రోజు ఉదయం త్వరగా అల్పాహారాలు ముగించుకొనిత్వరగా తయారై కారులో కై (చగిలి) ఆరామాన్ని చూడడానికి బయలుదేరాము.

కై (చగిలి): ఇది కాజానుంచి 12 కి.మీ. దూరంలో 13500 అడుగుల ఎత్తుపై ఉంది. ఇది స్ఫితిలోయలోని అతిపెద్ద ఆరామం. క్రమపద్ధతిలేని లోతైన గదులు, ఇరుకైన కారిడార్లు కలిగి వుంది. ఇది ఎత్తైన త్రిభుజాకారపు (కోన్‌) కొండపై వుంది. ఇది దూరంనించి చూస్తే లే (లడాఖ్‌)లోని థిక్సి (ఊనీరిదిరీలిగి) బౌద్ధారామాన్ని తలపిస్తుంది. ప్రార్థనా మందిరాలు చిన్న ద్వారాలతో ఇరుకైన అతి ఎత్తైన మెట్లతో అనేక అంతస్థులతో నిర్మించబడి వుంది.

వేలాదిమంది బౌద్ధ సన్యాసులు (లామాలు) వారి మతపరమైన శిక్షణ పొందుతారిక్కడ. బౌద్ధ మతగ్రంథాలు, గోడలపై మ్యూరల్స్‌, థన్‌కాస్‌, స్టూకో ఇమేజ్‌లు కలిగి పైకి ఎక్కే కొద్దీ గాలి చిత్రమై వాయులీన వాయిద్యాలలాగ మ్రోగిస్తుంది. బౌద్ధుల వాయిద్యాలు, ఆర్కెస్ట్రా మనమెన్నడూ చూడని మరో లోకాన్ని తలపిస్తాయి. ఇక్కడి ఆరామంలో (గోపా) ఆయుధాగారాలున్నాయి. బౌద్ధారామ శాసన ధిక్కారాన్ని చేసిన జనులను శిక్షించడానికి, దాడులనుంచి ఇతరులను ఎదుర్కోడానికి ఈ ఆయుధ సామాగ్రి ఉపయోగపడుతుంది.

ఆగస్టు 2000 సం||లో జరిగిన కాలచక్ర దీక్షా కార్యక్రమం చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న బౌద్ధులు, భక్తులు వేలసంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ‘దలైలామా’ చేసిన కాలచక్ర పూజావిధి ఆరంభంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో జరిగిన అభిషేకం, టిబెటన్‌ వాంగ్‌ చాలా దీర్ఘంగా జరిగే మతపరమైన విధి విధానం మాత్రమే కాదు. కాలచక్రంలో ఆచార్యుడు, శిశ్యుడు వారి యొక్క అంతరంగంలోని బౌద్ధతత్వాన్ని జాగృతం చేసే ప్రక్రియ అయిన బోధన, ప్రార్థన, ఆశీర్వాదం, భక్తి, మంత్రం, యోగ, ధ్యాన మార్గాలలో జరిగే విశిష్ట ప్రక్రియ. ప్రతి బౌద్ధుడు నమ్మే సత్యశోధన, అజరామరమైన శాంతి కాముకతను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఈ దీక్షా కార్యక్రమం కొద్దిరోజులపాటు జరుగుతుంది. ప్రతి భక్తుడు తన బాధలనించి విముక్తిపొంది దివ్య ఆశీస్సుల ప్రభావంతో ఆత్మ ప్రక్షాళన గావించబడుతాడని నమ్ముతారు.

ఈ కాలచక్రంలోని 5 ముఖ్యాంశాలైన కాస్మాలజి, సైకోఫిజియాలజి, దీక్ష, సాధన, బౌద్ధతత్త్వం అనే అంశాలపై కేంద్రీకరించబడుతుంది.

మేము మధ్యాహ్నం లంచ్‌ చేసిన తరువాత కాస్సేపు విశ్రాంతి తీసుకుని తిరిగి కాజానుండి 16కి.మీ. దూరంలో వున్న కిబ్బర్‌ (చరిలీలీలిజీ) చేరుకున్నాము.

కిబ్బర్‌: ఈ గ్రామం సముద్ర మట్టానికి 14200 అడుగుల ఎత్తున చాలా ఇరుకైన లోయ ప్రాంతంలో వుంది. కొండలన్నీ సున్నపు రాతి లక్షణాలతో వున్నాయి. కిబ్బర్‌ చాలా అందమైన అతి ఎత్తైన గ్రామం. చుట్టూ పచ్చని పైర్లతో అతి సుందరంగా వుంది. చాలా చిన్న గ్రామమిది. 80 ఇళ్ళు మాత్రమే వున్నాయి. ఇళ్ళను రాతితో నిర్మించుకున్నారు. ఇటుకలు గాని, మట్టిగాని వాడరు. ఒక హైస్కూలు, సివిల్‌ హాస్పిటల్‌, ఒక పోస్టాఫీస్‌, టెలిగ్రాఫ్‌ ఆఫీసు, కమ్యూనిటీ టెలివిజన్‌ కలిగి వుంది.

కిబ్బర్‌లో బౌద్ధారామం కూడా వుంది. ఆరామం టాబోలోని సర్‌కాంగ్‌ రింపోచ్చి లామా పేరుతో నిర్మించబడింది. 1983లో ఈ లామా కిబ్బర్‌లో మరణించాడు. అతన్ని సమాధి చేసిన స్థలం నుండి ఒకనీటి వూట బయలుదేరింది. అదే గ్రామానికి మొత్తానికి నీటి సరఫరా చేస్తుందట.

కిబ్బర్‌నుంచి లడాఖ్‌ హిమాలయాలకు వెళ్ళే వ్యాపార మార్గం వుంది. కిబ్బర్‌, స్ఫితి ప్రజలు వారి గుర్రాలకు బదులుగా లడాఖ్‌నించి యాక్‌ (అడవి దున్న) లను వస్తు మార్పిడి పద్ధతిలో కొనుగోలు చేస్తారు. ట్రెక్కింగ్‌ ద్వారా ఈ గ్రామస్థులు 3 పగళ్ళు పయనించి రాత్రులు విశ్రాంతి తీసుకుంటూ లడాఖ్‌ చేరుకుంటారు. ఈ ట్రెక్కింగ్‌కి ఇతరులకి పర్మిట్‌ అవసరం ఉంటుంది. కై, కిబ్బర్‌ ఆరామాలు చూసి సాయంత్రం అయ్యేసరికి మేము తిరిగి కాజాలోని మా బసకి చేరుకున్నాము.

మరుసటిరోజు ఉదయం 8గం||లకే, బయలుదేరి కాజా నించి 65 కి.మీ. దూరంలో వున్న ‘లోసార్‌’ దిక్కుగా ప్రయాణ మైనాము. దారి అంతా పెద్దపెద్ద గుండ్రాళ్లతో దుర్భరంగా భయంకరంగా వుంది. మా కారు ఎగిరెగిరి పడుతూ లేస్తూ 4గం|| ప్రయాణం తరువాత 12 గం||లకి మధ్యాహ్నం లోసార్‌ చేరుకున్నాము.

లోసార్‌: లోసార్‌లో పచ్చని పొలాలు, విల్లో వృక్షాలతో గ్రామం చుట్టూ నిండి వుంది. చిన్న బౌద్ధారామం కూడా వుంది. ప్రతి ఇంటిపై తెల్లని జెండాలు కట్టబడ్డాయి. ఇవి చెడు ఆత్మలని తరిమి కొట్టి సంపదని సమకూరుస్తాయని వారి నమ్మకం. లోసార్‌లో ఒకేఒక గెస్ట్‌హౌస్‌ వుంది. విశ్రాంతి గృహానికి కొద్ది అడుగుల దూరంలోనే స్ఫితీనదీ ప్రవాహం వుంది. గ్రామస్థుల వస్త్రధారణ టిబెటన్లని పోలి వుంది. పంట చేతికొచ్చాక ‘లా దార్బా’ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో చమరీమృగాల(ఖబిది ఖిబిదీబీలి)తో చేయించే నృత్య రీతులు అద్భుతం. లోసార్‌లో ఆల్ఫ్స్‌ వృక్షాలు, పచ్చని పచ్చిక బీళ్ళతో పచ్చగా ఉంది. కాంగ్రా, చాంబాకులూ, బిలాస్‌పూర్‌ నుండి గొర్రెల కాపర్లు వచ్చి కొద్ది నెలలు వాటిని ఇక్కడ మేపుతే అవి రోగాలనించి కాపాడబడి, వాటి సంతానం రెట్టింపవుతుందని భావిస్తారు. మేము ఆరోజు లోసార్‌లోని బసలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయమే కుంజుం పాస్‌ దిక్కుగా మా ప్రయాణం కొనసాగించాము.

కుంజుంపాస్‌: నరసంచారం అసలే లేని ప్రాంతం గుండా ప్రయాణిస్తూ 30కి.మీ. ముందుకు సాగాము. అసలే మెట్లులేని మొత్తం మంచుతో కూడిన ఇరుకైన బాట, బాటకిరు ప్రక్కన మంచుగోడలు, అతి ఎత్తైన కుంజుం హిమశిఖరాలు కొన్ని చోట్ల అసలే దారి లేకుండా గ్లేషియర్స్‌, పెద్దపెద్ద మంచులోయల ప్రదేశాలలో ప్రవేశించేసరికి ఒకపక్క భయం మరోపక్క అద్భుత హిమశిఖర సౌందర్యాన్ని చూస్తున్నందుకు ఆనందం కలగలసిన భావోద్రేకాలతో వుండేసరికి మా కారు మెత్తని మంచులో కూరుకుపోయింది. డ్రైవర్‌ కుర్రాడు ఎంత ప్రయత్నించినా టైర్‌ బయటికి రాలేదు. అక్కడక్కడే తిరిగి వేడెక్కిపోయింది. తనవల్ల కాదని ఎవరి సహాయమైనా దొరుకుతుందేమోనని మమ్మల్ని దించేసి ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు. కనుచూపుమేరలో మైళ్ళకొద్దీ హిమాలయాలు, గోడలు పెట్టినట్లున్న హిమప్రాంతం, అక్కడక్కడ కరిగి నీరుగా మారి చిత్తడియైన ప్రాంతాలు తప్ప మానవ సంచారం అసలేలేదు. అతను రాళ్ళు రప్పలకోసం ప్రయత్నించి టైర్లకింద దట్టించుదామంటే రాళ్ళేవీ? మొత్తం మంచే. ఈ లోపు మేము మా ఫోటీగ్రఫీ పని మొదలు పెట్టాము. సూర్యకిరణాలు తీక్షణంగా మంచు శిఖరాలపైబడి మాపై ప్రతిఫలించడం వల్ల కళ్ళుమండి కళ్ళనుంచీ, ముక్కునుంచి నీటిధారలు కారడం మొదలెట్టాయి. ఆక్సీజన్‌ తక్కువై చర్మంపై అల్ట్రావయొలెట్‌ కిరణాల రేడియేషన్‌ ఎక్కువై పోయింది. మేం వున్నది కుంజుంపాస్‌ అని అర్థమైపోయింది. మేమిద్దరం డ్రైవర్‌ కలిసి కారుని నెట్టగా నెట్టగా అది కదిలి దిగబడ్డ గోతిలోంచి బయటికొచ్చింది.

కుంజుంపాస్‌ 4551 మీటర్ల ఎత్తున వున్న పాస్‌. ఇక్కడే కుంజుందేవి (దుర్గాదేవి) ఆలయం కనబడింది. ఇక్కడినుంచి 6 కి.మీ. నడకన మాత్రమే చంద్రలాల్‌ సరస్సును చేరుతాము. ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన పెద్ద గ్లేషియర్‌ మంచు ఖండాలు, బడా మరియు చోటా శిరి హిమగిరులు బాగా కనిపిస్తాయి. ఇక్కడ హిమాలయాల అద్భుతమైన పనరోమా(ఆబిదీబిజీళిళీబి) చూడగలు గుతాము! దీన్నే బారాసిగం(12 శిఖరాల హిమాలయాలు) ప్రపంచంలోనే అతి పొడవైన, పెద్ద గ్లేషియర్స్‌, హిమశిఖరాలు దర్శనమిచ్చాయి. కుంజుందేవి అతి ఎత్తైన శిఖరంపై వుంది. ఆలయాన్ని బయటినించే దర్శించుకున్నాము. ఫోటోలు తీస్తూ అక్కడక్కడ ఆగుతూ మా ప్రయాణం సాగింది… సాయంత్రం 5గం||లకి మళ్ళీ మా కారు మెత్తని పెద్ద మంచు దిబ్బలో కూరుకొని పోయింది. కొద్ది దూరంలో మరో రెండు పెద్ద వాహనాలు, ఇన్నోవా, బొలేరో కూరుకొని పోయి కనిపించాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, వాహనాలు ఆగిపోయిన విషయం ఎలా తెలిసిందో కానీ రెండు స్నో క్లియరింగ్‌ బుల్డోజర్స్‌ వచ్చేశాయి. ఇవి మంచును తవ్వి రోడ్డు రెండు పక్కలా గుట్టలుగా పోయసాగాయి. 2గం||పాటు కష్టపడ్డాక కొద్దిగా దారి ఏర్పడింది. దాదాపు పదిమంది కార్మికులు నెట్టగా మా ముందున్న పెద్దవాహనాలు రెండు కదిలి ముందుకెళ్ళాయి. మా కారు మాత్రం ఏం చేసినా బయటికి రాలేదు. మేమిద్దరం, డ్రైవర్‌, కార్మికులు మిగిలిపోయాము. చలికి కార్మికులంతా చలినెగళ్ళేసుకున్నారు. కాస్సేపు చలికి కాగి ఇక వాపస్‌ పోదామని లేచారు. ఏమనుకున్నారో ఏమో కాని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని పదిమంది కలిసి కారుని గాలిలోకి లేపి బయటపడేసి డ్రైవర్ని స్టార్ట్‌ చేయమని చెప్పారు. మమ్మల్ని త్వరగా పరిగెత్తి కారెక్కమని చెప్పారు. అడుగుతీసి అడుగేద్దామంటే షూ మంచులో కూరుకుపోయి సాక్సులు మంచుతో నిండిపోయి కాళ్ళు గడ్డకట్టుకుపోయాయి. మా తలలపై ఏటవాలుగా వుండి నీరు కారుతున్న మంచు ఖండం ఎప్పుడు నెత్తిన పడుతుందోనని వారు మమ్మల్ని తొందరపెట్టి పరుగెత్తించారు. 50 గజాలు అతికష్టంపై నడిచి కారెక్కి బ్రతికామనుకున్నాము. ఆ కార్మికులంతా ఆనందంతో మాకు వీడ్కోలు చెప్పారు. మేము వారికి మనస్సులోనే జోహార్లర్పించాము. మా కారు తిరిగి ప్రయాణించడం మొదలుపెట్టి 30 కి.మీ. ప్రయాణించాకా ‘బటాల్‌’ చేరుకున్నాము.

‘బటాల్‌’ నించి దారి అంతా మంచు కరిగిన నీటి ప్రవాహాలే. టైర్లు మునిగిపోయి కారు నీటిలో తేలిపోయే పరిస్థితులలో భయంతో గడ్డ కట్టిపోయాము. ఒకవైపు హోరున గాలి, వర్షం మొదలైంది. కారు హెడ్‌లైట్లు కాంతి తప్ప మరేమీ కనిపించడం లేదు. డ్రైవర్‌ అసలే భయం తెలియని కుర్రవాడు కావడం వల్ల 16 కి.మీ. ప్రయాణించి ‘దాషోర్‌’ చేరాము. దాషోర్‌ నించి 50కి.మీ. ప్రయాణించి రోహతంగ్‌పాస్‌ ప్రవేశించాము.

రోహతంగ్‌పాస్‌: ఇది సముద్ర మట్టానికి 4112 మీటర్ల ఎత్తుపై ఉంది. ఇది చుట్టూ హిమశిఖరాలను దర్శించడానికి అనువైన ప్రాంతం. రోహతంగ్‌ అంటే శవాల గుట్టలు కలిగిన భూమి అని అర్థం. ఇది పీర్‌పాంజాల్‌ హిమాలయ శ్రేణుల వద్ద వుంది. రోహతంగ్‌ కుల్లూ లోయను లాహోల్‌ స్ఫితి లోయను కలిపే మార్గంగా వుండి లడాఖ్‌ హిమాలయాలకు పోయే మార్గానికి కూడా ప్రధాన రహదారి. ఈ పాస్‌లో హిమాలయ శిఖరాలు, గ్లేషియర్స్‌ యొక్క సుందర దృశ్యాలను చూడగలుగుతాము. ఇది చినాబ్‌, బియాస్‌ నదీ తీర ప్రాంతాల మధ్య ఏర్పడింది. ఇక్కడ అనుకోకుండా సడన్‌గా వచ్చే ఈదురుగాలులు, మంచు తుఫాన్లతో ప్రమాదభరితంగా వుంటుంది. రోహతంగ్‌లో స్కీయింగ్‌, స్లెడ్జ్‌ రైడింగ్‌ వంటి సాహసక్రీడలు యాత్రికులని, పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. రోహతంగ్‌ కల్లూ లోయలోని హైందవ సంస్కృతికి, స్ఫితిలోయలోని బౌద్ధ సంస్కృతికి మధ్య వారధిగా చెప్పవచ్చు.

మంచు కరిగి ప్రవహించే నీటి ఒరవడికి మాకారు కొట్టుకుపోయే పరిస్థితిలో ఆర్మీ జవాన్లు వారి వాహనంలో మమ్మల్ని ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటి ఎత్తైన దిబ్బపైకి చేరాక మా కారుని డ్రైవర్‌ నీటిలో ఈదించి బయటపడేశాక మళ్ళీ ఆర్మీవాహనం దిగి మా కారెక్కాము. వాన తగ్గి బాగా వెన్నెల కనబడింది. వెన్నెలలో హిమాలయాలు అద్భుతంగా వెండి కొండల్లా మెరిసిపోతూ కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాలను చూస్తూ, అంతకుముందు మేం రోహతంగ్‌ గుండా ప్రయాణించి కీలాంగ్‌ వెళ్ళేటప్పటి మా ప్రయాణ స్మృతులను మననం చేసుకుంటూ మేం పడ్డ తిప్పల్ని, కష్టాలని మరిచిపోయాము. మరో 2గ|| ప్రయాణించి 8గం||లకి మనాలి చేరాము. మనాలీలో ప్రవేశించి మా హోటల్‌ చేరేసరికి రాత్రి 9గం|| అయింది. మొత్తం 15రోజుల ట్రైబల్‌వాయేజ్‌ ఒక ఎత్తు, ఒకేరోజు కుంజుంపాస్‌, రోహతంగ్‌ పాస్‌ ప్రయాణం మరో ఎత్తు అయింది. ఇది ఒక అతి సాహసమైన ప్రయాణంగా మా మనస్సులలో నిలిచిపోయింది.

మనాలి చేరగానే చాలా రిలీఫ్‌ పొందాము. హోటల్‌ సర్వర్‌ ఇచ్చిన వేడివేడి పరోటాలు తిని అలసిన శరీరాలను పడకలపై చేర్చగానే గాఢమైన నిద్రలో మునిగిపోయాము. అలా విశ్రాంతిగా మనాలిలో రెండురోజులు వుండిపోయి రెస్టు తీసుకుంటూ అనేకసార్లు చూసినదైనా మనాలీలో తిరుగుతూ పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నాము.

మనాలిలో మే నెల 24 వ తేదీ బయలుదేరి కుల్లూ మీదుగా మా ప్రయాణం సాగించాము. కుల్లూ నించి బిలాస్‌పూర్‌ 180 కి.మీ. ప్రయాణించి ఆరాత్రికి అక్కడే బస చేశాము.

మరుసటిరోజు ఉదయం బిలాస్‌పూర్‌లో 25మే ఉదయం మొదలుపెట్టి సిమ్లా వరకూ 80 కి.మీ. ప్రయాణించి సిమ్లా చేరుకుని ఆ రోజుకి సిమ్లాలో ఉండిపోయాము.

మే 26 సాయంత్రం 4.25గం||లకి మొదలై సిమ్లానించి కాల్కా చేరాము. కాల్కాలో రాత్రి 11.55 గం|| ట్రేన్‌ ఎక్కి ఢిల్లీ చేరుకున్నాము. ఢిల్లీ నుంచి సాయంత్రం 3.50గం|| బయలుదేరి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మరునాటి మధ్యాహ్నానికి మే 28న 2గం|| సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకున్నాము. మొత్తం 19రోజుల మా ప్రయాణం ట్రైబల్‌వాయేజ్‌ని అనుక్షణం గుర్తుంచుకునేవిధంగా మా హృదయాలలో మధుర జ్ఞాపకమైంది. ఆ ఫోటోలని చూసినప్పుడల్లా హిమాలయాలలో తిరిగిన మా అనుభవాలు ఇంకా మధురంగా మారుతూ వుంటాయి.

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.