ఇస్లాం పితృస్వామ్యంపై ముస్లిం మహిళాలోకం ఢంకారావం

షాజహానా – నఖాబ్
యం. రత్నమాల

నల్లటి బురఖాల్లోపల కదులుతున్న అగ్నిపర్వతాలు ముస్లిం స్త్రీలు. బురఖా, నఖాబ్కి కంటిచూపు కోసం కళ్ళ ప్రాంతంలో వలలాంటి అతుకుదారాల సందుల్లోంచి ఎగజిమ్ముతున్న తీక్షణ వీక్షణ లావా షాజహానా కవితాసంపుటి నఖాబ్ –
పితృస్వామ్యం ఏకాండి శిలారూపం కాదు (ఏకశిలాసదృసం-మొనోలితిక్) పితృస్వామ్యానికి, కుల, మత, ప్రాంత, వర్గ ప్రత్యేక స్వభావమూ ఉంటుంది.

ఇస్లాం పితృస్వామ్య ప్రత్యేకత బురఖా, తలాక్, నిఖా ఇంకా… (ఉత్తరాది హిందూ స్త్రీ తలమీదుగా లాక్కుని ముఖం కనపడకుండ వేసుకునే పైట-గూంగట్ కొన్ని ప్రాంతాలకే కొన్ని కులాలకే పరిమితం) కాని బురఖా రూపుదాల్చిన ఇస్లాం పితృస్వామ్యం. ఏ మతం స్త్రీని పురుషునితో సమంగా చూడదు. అన్ని మతాలు స్త్రీపై పురుషుడి ఆధిపత్యాన్ని ఆదేశిస్తున్నాయి. మతం స్త్రీకి నిర్దేశించిన పాత్రని కుటుంబవ్యవస్థ వాహికగా సమాజం రాజ్యం మద్దతుతో కొనసాగిస్తూ వస్తున్నది.
ప్రపంచ వ్యాప్త్తంగా మహిళాలోకం పితృస్వామిక మతం, పితృస్వామిక కుటుంబం, పితృస్వామిక రాజ్యం, పితృస్వామిక సమాజ వ్యవస్థలపై పోరాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇస్లాం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఉద్యమిస్తున్నారు. 1980 నించి కొంతవరకు 1990 నించి విస్తృతంగా మనదేశంలో ముస్లిం మహిళా సమాజం ఇస్లాం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడుతున్నది. ఈ నేపధ్యంలోనే 1990ల నించి తెలుగులో ముస్లిం స్త్రీవాద సాహిత్యం వస్తున్నది.

షహనాజ్ ఫాతిమా, షంషాద్బేగం జవేరియా, వున్వరున్నిసా, మహెజబీన్, షాజహానా (ముస్లిం కవులు రచయితలు ఖాజా, స్కైబాబా మొదలైనవారు) ముస్లిం స్త్రీవాద రచనలు (కవితలు, కథలు) చేస్తున్నప్పటికీి షాజహానా ‘నఖాబ్’ తెలుగులో మొదటి స్త్రీవాద కవితాసంకలనం. షాజహానా వ్యక్తీకరణ స్పష్టంగా, సూటిగ, సునిశితంగా, నిక్కచ్చిగా, బలంగా ఉంటుంది. పుస్తకం పేరు నఖాబ్ కనుక ఈ పుస్తకం బురఖా గురించిన కవిత్వమే అనుకుంటే తప్పిదమే అవుతుంది. పేదరికం, తాము పుట్టి పెరిగిన నేలమీద తమని పరాయివాళ్ళుగా పరిగణించడం పట్ల ఆవేదన, ఆవేశం, ఇస్లాంలో కూడా అగ్రకుల ఆభిజాత్యం, దూదేకులు మొదలైన ఉపకులాల పట్ల నిమ్నతాభావం పట్ల నిరసన, ధిక్కారం పదహారేళ్లైనానిండని ఆడపిల్లల్ని 60 ఏళ్ళ అరబ్షేక్లకు నిఖా పేరిట అమ్ముకోవడం పట్ల ఆగ్రహం మొదలైన 20కి పైగా కవితల సంపుటి నఖాబ్ –

”జీవితం పర్దాల మాటున
ఖైదీ అయినచోట
అణగదొక్కబడుతున్న కొద్ది ఆడదాన్ని అణచాలనుకునే
వెఱ్ఱి ఆచారాల మర్రివృక్షాలున్నచోట
ఒక్కసారి ముసుగుతీసి చూడు…..
………………………….
మీరు బిగించగల ఇనుపసంకెళ్ళలను విదిల్చేయగల గుండెధైర్యం నాకున్నద’ని ప్రకటిస్తుంది – స్త్రీ ఆర్థికంగా నిలదొక్కు కోవలసిన అవసరాన్ని, అసమానత్వాన్ని ఎదిరించే గుండెధైర్యాన్ని సంతరించుకుని సంపూర్ణ సమానత్వాన్ని సాధించుకోవడానికి ముందుకడుగేయడమే మార్గం అని తేల్చి చెప్పుతుంది – 1970ల నుండి 1980ల వరకు స్త్రీలంతా ఒకటే – స్త్రీలందరి ఎజెండా సమస్యల స్వరూపస్వభావాలు ఒకటే అన్న భావన 1990ల నించి అస్థిత్వ ఉద్యమాలు బలపడుతున్న క్రమం కుల, మత, ప్రాంత, వర్గ ప్రాతిపదికపై స్త్రీ సమస్య స్వరూప భావాల్లో ప్రత్యేకంగా ఉంటాయన్న చైతన్యం బలపడుతూ వచ్చింది.

కులాల ఉపకుల చైతన్యం పెరుగుతూ వచ్చిన నేపథ్యంలోని కవిత (లద్దాఫ్ని) స్త్రీవాద ముస్లింవాదాల ఉపకుల అస్థిత్వ వాదాల మేళవింపు షాజహనా కవిత్వం.
తెలియని రీతిరివాజుల గురించీ
పలుకని దురూద్ సూరాల గురించి….
……. అ సౌబార్ సబ్కి చిల్లావూంగీ హ…..మై లద్దాపి హై లదాప్ని రహుంగీ….
అంటూ ఖండితంగా చెంపమీద చెళ్లున చాచి కొట్టినంత బలంగా ప్రకటిస్తుంది.
స్ఫటికమంత పారదర్శకమైన మనసు ప్రతిస్పందన థుత్కార్. ప్రతిచర్యకి సమానమైన ప్రతిస్పందన ఉండి తీరుతుంది. అయితే అందరిలో ఇది మనస్సు పొరల్లోనే, గుండె లోతుల్లోనే ఉండిపోతుంది. పెదవిదాటి బయటపడదు. అందులోనూ సన్నిహితులు – సంబంధీకులు పట్ల ప్రతిచర్య ప్రతిస్పందన ప్రకటించడానికి నిర్భీతి మాత్రమేకాదు, నిజాయితీ కావాలి. పురుషుడి పురోగామి కత్వానికి స్త్రీ తల్లిగా, భార్యగా బంధనమవు తోంది అన్న అర్థంలో షాజహానా జీవిత భాగస్వామి, జీవన సహచరుడు స్కైబాబా కవితకి ప్రతిస్పందనే థుత్కార్ – ఎటువంటి శషబిషలు మొహమాటం లేకుండా స్కైబాబా కవితకి ప్రతిస్పందన అని ప్రకటించడానికి నిజాయితీ, నిష్కల్మషత ఎంత ఉందో సహృదయంతో అందుకున్న స్కైబాబాది అంతే సంస్కారం.

ఇటువంటి అవగాహన భావజాలం పరస్సర స్వీకారం కుటుంబా లని, మానవసంబంధాలని ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల ప్రజాస్వామికీకరణకి దోహదం చేస్తుంది.
వెనుకబాటుతనం అల్లాకా దేన్హై
అని నమ్మించి
జోకొడ్తుంది తానేనని
తెలియనంత అమాయకపుదాన్నే కావచ్చు…
………………
(థుత్కార్ స్కైబాబా కవితను నిరసిసూ)్త పితృసామ్యానికి మతం, తండ్రి, మొగుడు మూడు స్తంభాలు. వారసత్వ కొనసాగింపుగా కొడుకు నాలుగో స్తంభం – ఈ నాలుగు స్తంభాల పితృసామ్య కుటుంబం స్త్రీని తరతరాలుగా పురుషుడి అధీనను చేసి అణగదొక్కుతున్నది –
పుట్టిపెరిగిన నేలమీద పరాయివాళ్ళుగా పరిగణించడం నుంచి కమ్ముకొస్తున్న అభద్రతాభావం డిసెంబర్ ఆరు దురాగతం, గుజరాత్ మారణహోమాల సాకు చూపి స్త్రీలను పరదాల వెనక్కి, బురఖాల్లోపలికి తరుముతున్న మతం మౌఢ్యాన్ని ఎండగట్టే ‘కాలీదునియా’.

ఇప్పుడు వేసినా వేయకున్నా ప్రపంచమంటే కాషాయశిల
కత్తిమొన, పొడుచుకొచ్చిన పురుషాంగం ….
……. అయినా స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు
ఎప్పటిలాగే ప్రపంచం నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే’ అన్న ఔదార్యం – డిసెంబర్ ఆరు దురాగతం, గుజరాత్ మారణహోమం తర్వాత కాలంలో చాలామంది ఉపన్యాసాల్లో, రచనల్లో కనిపించిన పాలిటిక్స్ ఆఫ్ రివేంజ్ (పగతీసుకునే రాజకీయాలు) పాలిటిక్స్ ఆఫ్ ప్రొవకేషన్ (రెచ్చగొట్ట్టుడు రాజకీయం) షాజహానాలో మచ్చుకైనా కనిపించదు. గొప్ప సృజనాత్మక ఆలోచనా ధోరణి షాజహానాది – ఎంతో సమ్యక్ దృష్టి ఉంటేనే ఇది సాధ్యం.
అనార్కలి, దూస్రా ఆస్మాన్ కవితలు సార్వజనీనమైనవి. ఇవి కేవలం ఇస్లాం పితృస్వామ్య పరిధిలోనివి కావు- స్త్రీలందరివి. సార్వజనీన మానవ సమస్య దూస్రా ఆస్మాన్. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కొల్లగొడుతున్న దేశాల నుంచి మేధోవలస, శ్రమవలసల్లో భాగంగా కుటుంబాలు ఛిద్రమై ఎదురుచూపుల ఒంటరి జీవితాల వ్యధ- ఒంటిచేత్తో పిల్లల్ని పెంచి పోషించే బరువుబాధ్యతల్తో కృంగి, కృశించి కాలి కొవ్వొత్తులై కరిగిపోతున్న స్త్రీలు అన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పీడిత దేశాల్లో కోకొల్లలు.
ఇక ప్రేమ పేరుతో అనాదిగా ఎందరో అనార్కలులు. ఆడవాళ్ళు మాత్రమే విధ్వంస మయి పోతారు సజీవ సమాధి అవుతారు. మగవాళ్ళు ఆ విషాదాన్నించి బయటపడి సమాజం సానుభూతి సహాయ సహకారాలతో చిగురించి రెమ్మలు కొమ్మలై విస్తరిస్తారు. ఆనాటి అనార్కలినించి మొన్నటి ప్రత్యూష, నిన్నటి ప్రతిమ నేటి మరో ఆడకూతురు.
అందుకే షాజహానా ‘అనార్కలి’ కవితలో
అనార్కలీ!
ఇప్పుడైనా త్యాగాల పేజీని బతుకు
లోంచి చించి….
రివాజుల ముందేస్తున్నా
నీ ఆగిపోయిన శ్వాసని
పునరుద్ధరించడానికి
ఒక్కొక్క ఇటుకనే పెళ్ళగిస్తున్నా…
నంటూ ప్రేమోపహత యువతులకు ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది షాజహానా.
1990- 2000లలో కూడా ఇస్లాం మతవాదులే కాదు కొందరు స్త్రీవాదులు కూడా (ముస్లిం స్త్రీ రచయిత్రులు) తమ రచనలో, ఉపన్యాసాలో, ఇంటర్వ్యూలో బురఖాను సమర్ధిస్తూ మాట్లాడిన వారున్నారు.

అన్ని మతాలలాగే ఇస్లాం పితృస్వామ్యం కూడా అభద్రతాభావం నెపంతో బురఖా పునరు ద్దరణ (1950ల తర్వాత కొంతవరకు నిర్బంధ బురఖా పద్దతుల్లో అనేకానేక కారణాల వల్ల ఇక్కడ చర్చించడం, స్థలాభావం వల్ల కుదరదు. మేం చదువుకునే రోజుల్లో కొంత వెసులుబాటు కనబడేది. ముస్లిం విద్యార్దినులు ఎంతోమంది బురఖా లేకుండా వచ్చేవాళ్ళు. పేదముస్లిం స్త్రీలు అంతగా పాటించేవాళ్ళు కాదు (కాయకష్టం చేసేవారు)) కాని ఇటీవల కొద్ది సంవత్సరాలుగా ముఖ్యం గా డిసెంబర్ 6, గుజరాత్ మారణహోమం తర్వాత బురఖా తప్పనిసరిగా వేసుకొనే వారి సంఖ్య బాగా పెరిగింది, పెరుగుతున్నది. బురఖా (నఖాబ్) కేవలం శరీరాన్ని కప్పి ఉంచే ముసుగు మాత్రమే కాదు ఇస్లాం పితృసామ్యానికి ప్రధానమైన ప్రతీక. ముస్లిం జనజీవన పాశ్వాలనేకం కవితల్లో ఉన్న ఈ సంకలనానికి నఖాబ్ అని నామకరణం చేయడం ప్రస్తుతం ఇస్లాం పితృస్వామ్య పునరుద్దరణ తీవ్రస్థాయిలో ప్రయతిస్తున్న స్థితిలో ఎంతో సమంజసంగా అర్ధవంతంగా ఉంది.

పర్దా హఠాకే దేఖో అని హెచ్చరించినా, బుర్ఖాల్ని, దుపట్టాల్ని పీలికలు చేసి విసిరేస్తున్నా కలిపి బొంత కుట్టుకొని పొర్లుకో అని ఛీత్కరించినా మళ్ళీమళ్ళీ గంతంకంటే బలంగా పునరావృతమవుతున్న బురఖా-తలాఖ్ వంటి ఇస్లాం పితృసామ్యరూపాలను తిరస్కరించ వలసిన, తగలేయవలసిన అవసరాన్ని గుర్తెరగడం వల్లనే ఇస్లాం పితృసామ్యంపైనా, తాను పుట్టి పెరిగిన దేశంలోనే తమని పరాయివాళ్ళుగా చూస్తున్న మతోన్మాదులపైనా షాజహానా ధిక్కార కవిత్వం నఖాబ్కి మనసారా అభినందనలు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.