…..

-జూపాక సుభద్ర

‘అక్కా నేనస్సలుబోను వానింటికి, యీన్నే ఏదన్న పంజేసుకుంట, వానితోని నేనింక బడలేను, పెండ్లయిన కాన్నుంచి యిదే రసరస వానితో సంసారం జేసుడు నానుంచిగాదు, వాడు యెముడు యెతుక్కంట నా యెన్కని వస్తడేమో! నన్ను వానితోనైతె తోలొద్దు’ మా చుట్టం చిన్ని మా యింటి కొచ్చి ఏడుస్తూ చెప్పింది.
యింకా ‘వాడు వుప్పురాయి పంజేయడు కట్టె అనడు, పిడికెడు అనడు అన్ని నేనే తెచ్చిపెట్టాలె, వాడు వూరిమీద బలదూర్‌గ తిరుగుడు యింట్ల పైసలు ఎత్కపోయి తాగుడు నన్ను కొట్టుడు, తిట్టుడు గిదేపని వానిది. అయినా సరె పిల్లలున్నరు గదా అని వాడు ఆడినట్లు సూసిన. యీ మద్య కొత్త పాట బట్టుకున్నడు నీకు వాడున్నడు వీడున్నడని అనుమానాలతోని నా ప్రాణం దీస్తుండు వారి సెరలు యిగ పడలేను. ‘అరేయ్‌ నీకు నాకు గాదునన్ను యిడిసి పెట్టరా’ అంటె యిడ్చిపెట్టడడాట యీని పడ నుంచి నన్నెట్లయిన యిడుపు కాయితమొచ్చేటట్టు సూడక్క. తిన్న తిండి పెయికి బడ్తలేదు. నేపంజేసే హాస్టలు కాడికొచ్చుడు, గోడల పక్క పోంటి పొంచులు సూసుడు కావలున్నట్లే హాస్టలు చుట్టు తిరుగుడు, హాస్టల్ల పంజేసే టోల్లను నా మీద చెక్కు బెట్టుడు, నేందుస్సుకున్నా, మంచిగ తయారైనా సుబ్రంగున్నా అనుమానమే, సీ..సీ… నా మీద నాకే రోత బుడ్తంది యిప్పుడు వాడొస్తడేమో తెల్లారేటప్పటికి నన్నెక్కన్నైనా బెట్టు అని మా చిన్న ఏడుపు, బతిమిలాట ఆ రాత్రి.

చిన్న వాల్ల వూర్లె హాస్టల్‌లో పంజేస్తది కామాటిగ. అదీ ఔట్‌ సోర్సింగ్‌లో అదే హాస్టల్‌లో వాచ్‌మెన్‌గ ఒకతను పంజేస్తుంటడు. ఆ వాచ్‌మెన్‌కు నీకున్నదని చిన్నిని ఆమె భర్త సతాయిస్తుండు. చిన్ని పంజేస్తెనే ఆ యింట్ల తిన్నట్టు లేకుంటె వుపాసమే. చిన్ని తెలివితోనే పిల్లల్ని రెసిడెన్షియల్‌ హాస్టల్లో పెట్టి చదివిస్తుంది. చాలా ఆత్మ గౌరవంగా వుంటది. చాలా కష్టపడ్తది. హాస్టల్లో అందరి పని చేస్తుంటది. హస్టల్లో ఎవరు రాకున్నా చిన్ని ఒక్కతొస్తే చాలనుకుంటారు హాస్టల్‌ స్టాఫ్‌. అందరి పట్ల గౌరవంగా మర్యాదగుంటది. ఎవ్వరు పంజెప్పినా కాదనకుంట చేస్తది. వూర్లె గూడ మంచి పేరు చిన్నికి. అది ఆమె మొగడు భరించలేకపోయి వూరందరికి ‘అది హాస్టల్ల నొకన్ని వుంచుకున్నది నన్ను లెక్క జేత్తలేదు’ అని ప్రచారం జేసిండు. కుటుంబంలోని బంధువులందరికి జెప్పిండు. పాపం చిన్నినే ‘తప్పుడిది’ అని చెప్పుకుంట తిరిగిండు. చిన్ని పంచాయితి పెట్టింది. ‘అయ్యా పెద్ద మనుషులు మీరే చెప్పుండ్రి మీకు నా అసోంటి అక్కా చెల్లెండ్రు, బిడ్డెలున్నరు. నేను నా రెక్కలు బొక్కలు తెల్లబడేట్లు యింట్ల బైట పంజేసుకుంట నీయింటిని నడుపుతున్న. పేరుకు మొగడే గాని వాడేంపని జేత్తండు ఏంజేత్తలేడు మీకెరికే. వాడు పంజేయకున్నా, తాగినా, యిల్లు పట్టిచ్చుకోకున్నా, పిల్లలబట్టిచ్చు కోకున్నా హాస్టల్‌కు పొద్దున 5 గం|| నుండి రాత్రి తొమ్మిద్దాక పంజేసి యింట్ల యీనికి అన్ని యెల్లదీస్తే…. పిల్లల్ని.. సదివించుకుంటాంటే… గిప్పుడు నన్ను, నాపనిని ఓర్వలేక కొత్తగ గీ ‘అనుమానం’ మీదేసి తిన్నతిండిపెయికి బట్టకుంట జేత్తండు. హాస్టల్ల పంజేసే టోల్లు వార్డనొచ్చిం డని, యీపని, ఆ పని అని అర్జెంటని ఫోనులు జేస్తే వాచిమెనే చేయిస్తుండు నీ కోసమంటడు, పూలుబెట్టు కుంటే వాని కోసమే పెట్టుకున్నవని చెప్పంచి బూతులు తిడ్తడు. వీంతోని నాకు బడది మాకు విడుపుకాయితాలు రాయుండ్రి నేనీని తోని సంసారం జేయలేను. నేను నా పిల్లల్ని మంచిగ సాదుకుంట. యీని కొర్తి నేబడలేను నాకు యిడాకులు గావాలె గదే నాకు న్యాయం. గీ పని జేసి పున్యెంగట్టు కోండ్రని, పంచాయితి పెద్దమనుషుల్ని బతిమి లాడిందట. వాల్లు ‘వాడు నిన్ను వొదులుకోడట నువ్వే కావాలట, మేము యిడుపుకాయితం రాస్తె ఎండ్రిన్‌ తాగిసస్త అని వాడు ఎండ్రిన్‌ సీసగూడ తెచ్చుకున్నడు. నిన్ను హాస్టల్‌ పని మానుకొమ్మంటండు మానెయ్యి’ అన్నరట. నాకు నా పనే యింత బువ్వబెట్టి జెర తెల్లగ బతికేటట్టు, నా పిల్లలు చదివేటట్టు జేసింది. వాడున్నా లేకున్నా వొక్కటే. నన్ను అనుమానించే మొగడు నాకొద్దు. నేను పని మానెస్తె వీడు వుపాసముంచుతడు. వుద్యోగం కంటే వీన్నే వొదులుకుంట’ అని చెప్పిందట. పంచాయితి పెద్దలు చిన్న నిర్ణయాన్నే తప్పు బట్టిండ్రట. అతన్నే సపోర్టు జేసిండ్రట….. యీ పరిస్థితిల చిన్ని ఎవరికి చెప్పక చెయ్యక మా యింటికొచ్చింది. మేము చిన్ని నిర్ణయాన్నే గౌరవించి ఆమె భర్తని నిలదీయనీకి సిద్దపడ్డము ఆ రాత్రి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో