– సిహెచ్‌. సుజాత

చంకలోని బూటుకాళ్ళ బుడతడిని

భుజంపై వేలాడే పుస్తకాల సంచీలని

చేతిలోని బుజ్జాయి చేతిని

భద్రంగా పట్టుకొని

బడివైపు ప్రయాణం మొదలుపెట్టింది

ఈ భారాన్నంతా మోస్తూ నడిచేది

చక్రాలున్న ఏ బండీకాదు

పోనీ ఓ పెద్దమనీషీ కాదు

కాళ్ళకు చెప్పులు కూడా లేని

ఓ బతుకుబండి.

తమ్ముడిని పెంచటం కోసం

తన చదువుని కుదువపెట్టన

ఓ పదేళ్ల పసిప్రాయం

తమ్ముడు ఈ ప్రపంచంలో అడుగుపెట్టిననాడే

తాను అక్షర ప్రపంచం నుండి అడుగు బయటపెట్టిన ప్రేమలత

తమ్ముడికి అన్నీ తానైంది.

తమ్ముడ్ని బడి ఈడు వచ్చే వరకు కావలికాసింది.

తమ్ముడితో పాటు తానూ బడికి వెళ్ళే అవకాశం వచ్చిందని

గంపెడు ఆశతో ఈ రోజు బడిబాట పట్టింది.

తలంపుల తలుపులను తోసుకుంటూ

తలకు మించిన భారాన్ని మోసుకుంటూ

బడి బయటి వేపచెట్టును చూసి

గత మూడేళ్ళుగా తనకోసమే ఎదురుచూస్తుందా అనుకుంటూ

బడిని సమీపిస్తుంది.

సామూహిక అక్షరాభ్యాసంకై ముస్తాబైన బడి ద్వారం

రెండు చేతులు చాపి ప్రేమలతను సాదరంగా ఆహ్వనించింది.

స్నేహితురాళ్ళ పలకరింపులతో వికసించిన పుష్పమైంది ప్రేమలత.

అందరితో పాటు వర్షలత కూడా వచ్చింది.

చిరుజల్లుతో ఆ పాపను పలకరించింది.

వికసించిన పుష్పం క్షణంలో ముడుచుకుంది.

ఆ చిరుజల్లుతో పాపకు ఇల్లు గుర్తుకువచ్చింది. ఆందోళన ఆరంభమయింది.

ఆందోళనకు కారణాలు అనేకం. ఆమె ఇల్లు

ఆ ఇంటి పై కప్పు, పైకప్పుకున్న కంతలు

ఆ కంతలకింద వున్న వస్తువులు, బొంతలు

ఆ బొంతలలో కదలలేక, మెదలలేక పండివున్న అవ్వ

అవ్వ అవస్థ ఆమె ఆందోళనకి ముఖ్య కారణం

అమ్మో! అవ్వ తడిసిపోతే? ఒక్కసారి ఇంటికి వెళ్తాను

అనుమతివ్వండి, ఇంటికి వెళ్ళి బొంతలు జరిపివస్తానంది.

అనుమతి దొరకలేదు, అసహనంగా తిరిగింది.

మా అవ్వను కాపాడుకోవడానికి వేరెవ్వరి అనుమతీ అవసరం లేదనుకుంది.

పరుగు లంకించుకుంది. బడి నుండి అడుగు బయటపెట్టింది

అవ్వకు దగ్గరవాలనుకుంటూ అక్షర ప్రపంచానికి దూరమయ్యింది

ప్రేమలత మళ్ళీ బడికి దూరమయ్యింది.

ప్రేమలత వేగం పెంచింది.

వర్షలత కూడా పోటీపడింది. ఆపోటిని తట్టుకోలేక

అడుగు ముందుకు వెయ్యలేక

అక్కసుతో అరిచింది ప్రేమలత.

”వర్షకాలమంతా ఏం చేసావు?

సరిగ్గా నేను బడికి వచ్చిన రోజే వచ్చావు

ఈరోజు కోసం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాను

కానీ నీ వల్లే వెనక్కి వెళ్ళిపోతున్నాను

అంతా నీ వల్లే పో వెనక్కిపో”

అంతకన్నా రెట్టింపు కోపంతో అరిచింది వర్షలత.

”కాదు కాదు అంతా మీ వల్లే

మీరందరూ చేసిన పనివల్లే నేను ఈ రోజు వచ్చాను”

”మేమేం చేసాము?”

”మా అవ్వ చేనంతా కోసేశారు

మా అవ్వ కోసమే వచ్చే పక్షులను ఎగరగొట్టారు

మా అవ్వ ఏమీ అనట్లేదు కదా అని

మా అవ్వ ఇంట్లో దాచుకున్న నీళ్ళన్నీ గుంజేసుకున్నారు.

మీరు పెట్టే బాధలన్నీ సహిస్తూ జ్వరం తెచ్చుకుంది మా అవ్వ

జ్వరం వచ్చిన అవ్వను చూడటానికి వస్తే నన్ను పొమ్మంటున్నావు”

”అయ్యో! మీ అవ్వకు జ్వరం వచ్చినట్లు నాకు తెలియదు.

నాకు తెలియక నిన్ను వెళ్ళిపొమ్మన్నాను. మీ అవ్వైనా, మా అవ్వైనా ఒకటేగా

ఇంతకీ మీ అవ్వ ఎవరు? పేరేంటి.”

మా అవ్వకు ధరణి, ధరిత్రి పుడమి, భూమాత, అవని ఇంకా చాలా పేర్లున్నాయి”

”ఓహో భూదేవి తల్లా! ఆ తల్లి నీకేంటి మాకూ అవ్వే! మన అవ్వకు

జ్వరం రాకుండా నేను చూసుకుంటానుగా

ఇప్పటికి దయదలచి వెనక్కి వెళ్ళిపో”

నేను వెనక్కి వెళ్ళాలంటే ఒక షరతు.

”నువ్వు మీ అవ్వని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో

అంతే ప్రేమగా మా అవ్వని చూడాలని మీ వాళ్ళందరికీ చెప్పు”.

”ఓ అలాగే చెప్తాను. అవని తల్లిని కాపాడాల్సిన బాధ్యత మా అందరిదీ”’

”నీ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను”.

”పోతున్నాను అనకు, వెళ్ళి వస్తాను అను వర్షాకాలంలో వస్తావుగా”’

”మీరందరూ మా అవ్వను బాగా చూసుకుంటేనే వర్షాకాలంలో వస్తాను”

అంటూ వెళ్ళిపోయింది వర్షలత.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో