-శీలా సుభద్రాదేవి

పాప్యులర్‌ రచనలతోనే కీర్తి కిరీటాలు అలంకరించుకున్న కొంత మంది రచయిత్రుల సరసన పేర్కొనదగిన రచయిత్రి శ్రీమతి గంటి వెంకటరమణ. కొద్ది పాటి ప్రతిభతో, ఒకటి రెండు ప్రచురణలతో, సాహిత్య రంగంలోకి చొచ్చుకొని పోయి వాక్చాతుర్యంతోనో ప్రముఖుల అండదండలతోనో సాహితీ సంస్థల వెన్ను దన్ను తోనో అవకాశాలను కల్పించుకొని కొందరు ప్రముఖులుగా ఎదిగిపోతున్న సాహిత్య రంగంలో అవేమీ పట్టించుకోకుండా ఉపాధ్యాయ వృత్తిని భుక్తి కోసమైతే మనసులో ఎగసిపడే వూహావల్లరులను అవిశ్రాంతంగా నలభై ఏళ్లకుపైగా అక్షరీకరించుకుంటూ 80 కిపైగా నవలలూ, అనేక కథలూ రాసిన గంటి వెంకటరమణ నవలా ప్రభంజనం నాటి పాఠకులకు తప్ప ఇతరులకు అనామకంగానే వుండిపోయింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వెంకటరమణ తన పిల్లలకి నటరాజు రామక్రిష్ణ గారి దగ్గర నృత్యం నేర్పించటానికి తీసుకువెళ్ళి ఆసక్తితో తాను కూడా అభ్యసించింది. సంగీతంపై అభిరుచితో సంగీత సాధన చేసింది. భానుమతి పాటల్ని ముఖ్యంగా మల్లీశ్వరి పాటల్ని మధురంగా పాడేది. పాత హిందీ పాటలంటే ఆమెకు మరీ మరీ ఇష్టం. పాఠశాలలో పాఠాలు విద్య సంబంధమైన సృజనాత్మకమైన చార్టులతో పిల్లల్ని ఆకర్షించేది. ఇవన్నీ ఆమె విద్య, ఆసక్తులుగా అనుకుంటే వెంకటరమణ ప్రధాన ప్రవృత్తి రచనా వ్యాసంగం.

1966లో ఆంధ్రప్రభ ఉగాది నవలల పోటీలో ఆనాటి రచయితలతో పోటీపడి ”చదరంగం” నవలకు బహుమతి పొందింది. అప్పటి నుండి మరి వెను తిరగలేదు. ఆంధ్రపత్రిక, ప్రభ, యువ, స్వాతి, ఆంధ్రభూమి, చతుర వంటి ప్రముఖ పత్రికలలో పుంఖాను పుంఖాలుగా నవలా రచనలు చేసింది.సుమారు 80కిపైగా నవలలు రాస్తే వాటిలో మూడోంతులకు పైగా ధారావాహికలుగా రావటమే కాక వివిధ ప్రముఖ ప్రచురణకర్తల ద్వారా పుస్తకాలుగా రూపొంది 65-75 మధ్య ఉవ్వెత్తున లేచిన నవలా ప్రభంజనంలో తనకూ ఒక గుర్తింపుని సాధించుకొంది.

స్వాతి అనిల్‌ అవార్డ్స్‌ పోటీలలో మూడు నాలుగుసార్లు మొదటి బహుమతిని సాధించుకొంది. అంతేకాక ”అద్దెకు అమ్మానాన్న” అనే బహుమతి నవల స్వాతిలో ధారావాహికంగా వచ్చినప్పుడు దర్శక నిర్మాత కె. ఎస్‌. రామారావు స్వయంగా ఇంటికి వచ్చి 60,000 రూ||లుతో నవలా హక్కులని కొనుక్కున్నారు.స్వాతి అనిల్‌ అవార్డ్స్‌ పోటీలలో మూడు నాలుగుసార్లు మొదటి బహుమతిని సాధించుకొంది. అంతేకాక ”అద్దెకు అమ్మానాన్న” అనే బహుమతి నవల స్వాతిలో ధారావాహికంగా వచ్చినప్పుడు దర్శక నిర్మాత కె. ఎస్‌. రామారావు స్వయంగా ఇంటికి వచ్చి 60,000 రూ||లుతో నవలా హక్కులని కొనుక్కున్నారు.

గంటి వెంకటరమణ స్నేహశీలే కాక దగ్గరైన ప్రతీ వారినీ దగ్గర బంధువరసతో పిలుస్తూ ఆత్మీయంగా దగ్గర అయ్యేది. ఆమె మాటలలో కల్మషం వుండదు. పసిపిల్ల మనస్థత్వం కలిగి వుండేది. ఒకొక్కప్పుడు అమాయకంగా మాట్లాడే ఈమేనా ఇన్ని నవలలు రాసింది అనిపిస్తుంది. కానీ రచన చేయాలనుకున్నప్పుడు పాఠశాలలో ఏ ఖాళీ పిరియడులోనో కూర్చొని ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళినట్లుగా పరిసరాలు పట్టించుకోకుండా పేజీలకు పేజీలు రాస్తూండేది. అవి చదివి ఏవైనా లోపాలు చెప్పినా సహృదయంతో వాటిని అంగీకరించేది.

ఎవరికైనా ఏమైనా సరే అన్యాయం జరిగినప్పుడు వెంటనే పోరాటస్ఫూర్థితో ముందుకి దూసుకువచ్చేది. ఆ విధంగానే తాను పనిచేసిన పాఠశాల నిరంకుశ యాజమాన్యాన్ని ఎదిరించి సహచర ఉద్యోగినులతో కలసి పోరాటం జరిపి పాఠశాలను మూయించి పోస్ట్‌తో సహా ఆర్టీసి వున్నత పాఠశాలలో చేరింది. అన్యాయాలని ఎదుర్కోడానికి ముందుండే వెంకట రమణ సంప్రదాయాలకీ భక్తి శ్రద్ధలకి తలవంచింది. అవసరాల కోసం, ప్రేమానురాగాలకోసం జీవితంలో చాలా విలువైనవి కోల్పోయింది. ఒకసారి రచయిత్రుల సభలో పాల్గొనటానికి వెళ్ళి సాహిత్యానికి, జీవన విధానానికి, ప్రవర్తనకి కనబడుతున్న వ్యత్యసాలు గమనించి సాహిత్య సభలకి, సంస్థలకి దూరంగా వుండాలని నిర్ణయించుకొంది వెంకట రమణ.

తర్వాత కాలంలో నేను ఎంతగా ప్రయత్నించినా ఆమె సభలకి, సమావేశాలకి రావటానికి అంగీకరించలేదు. తన సాహిత్యంతో మమేకమై తన ఇంట్లోనే వుండటానికి ఇష్టపడేది.

ప్రముఖ రచనలు చేసినవాళ్లలో ఎంతో మందికి అనేక అవార్డులూ, సత్కారాలూ కొన్ని ప్రయత్న పూర్వకంగానో ప్రతిభా పరంగానో వరిస్తూనే వున్నాయి. మన రాష్ట్రంలోనే చిన్నవో పెద్దవో ప్రభుత్వ పరమైనవీ, వివిధ సంస్థలకి చెందినవీ అధిక సంఖ్యల్లోనే అవార్డులు ప్రతీ ఏడాదీ సాహితీవేత్తలకు ప్రకటింపబడుతున్నాయి. కానీ 40ఏళ్ళకు పైగా అవిశ్రాంతంగా రచనలు సాగించిన శ్రీమతి గంటి వెంకట రమణకు ఒక్క అవార్డు అయిన రాకపోవడం బాధకరమైన విషయమే. ఇందుకు ఆమె జనంలోకి రాకపోడం ఒక కారణమైతే, 65-80లలోని పాఠకాదరణతోనే ఆమె తృప్తి చెందడం మరో కారణం.

గంటి వెంకట రమణ నవలల్లో లయ విన్యాసం, మృదంగ తాళం, మొగలిపొదలు, పూదోటలో గంటు ముళ్ళు, జీవనధార, భవబంధాలు, పేయింగ్‌ గెస్ట్‌, డాక్టర్‌ కరుణ, హోటల్‌ కార్నర్‌, గాజుబొమ్మలు, మరుద్వతీ కన్య ప్రణయగాధ అత్యంత గుర్తింపు పొందినవి. 2005 తర్వాత అప్పుడప్పుడు రాసినా పార్కిన్‌ సన్స్‌ వ్యాధి బారిన పడి కలానికి విశ్రాంతి ఇవ్వక తప్పలేదు.

ఆమెతో సుమారు 15 సంవత్సరాల పాటు సహ ఉద్యోగిని గానే కాక తదనంతరమూ సాహిత్య సాన్నిహిత్యం, స్నేహబంధం కలిగివున్నందుకు సాహిత్యరంగంతరపున శ్రీమతి గంటి వెంకట రమణకు ప్రేమతో నా ఈ అశ్రునివాళి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.