మాటలు – వెలివేసే పద్ధతులు

మునీజా షంసీ
అనువాదం: ఓల్గా

పాకిస్తాన్లో ఫ్రీలాన్స్ ఫీచర్ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా చాలా సంవత్సరాలనుండి అనేక రచనలు ప్రచురించాను.జండర్ కారణంగా నా దారిలో పెద్ద అవరోధాలేమీ యేర్పడలేదనే అను కుంటాను. ఎందుకంటే నేను ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం పోటీ పడటం లేదని నాకు తెలుసు. అలాగే పత్రికా రచనలో అసలైన విషయాలై, కొద్దికాలం క్రితం వరకూ కేవలం పురుషుల ప్రాంతంగా ఉన్న రాజకీయాలు, ఆర్ధిక వ్యవహారాలు వీటిలోకి నేను చొచ్చుకు పోవటం లేదు.

1970వ దశాబ్దంలో జుబేదా ముస్తఫా పాకిస్తాన్లోని ఒక జాతీయ దినపత్రికకు రాసిన మొదటి మహిళ. పూర్తిగా పురుషుల ప్రాంతమైన ”అంతర్జాతీయ వ్యవహారాలు” లోకి తలదూర్చ సాహసించింది. ఆ రోజుల్లో డాన్ దినపత్రికలో పూర్తికాలం పనిచేసే ఉద్యోగులలో ఆమె ఒక్కతే మహిళ. 1982లో నేను ‘డాన్’ కు రాయటం మొదలు పెట్టినపుడు అక్కడ చాలామంది స్త్రీలు పనిచేస్తున్నారు. మతం పేరుతో జనరల్ జియాఉల్ హక్ మిలటరీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘోరమైన, వివక్షా పూరితమైన చట్టాలకు వ్యతిరేకంగా వచ్చిన రాజకీయ దృష్టి ఉన్న స్త్రీల ఉద్యమంలో పాకిస్తాన్లో ఇంగ్లీష్ ప్రెస్లో పనిచేసే మహిళా జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారు.
2000 నాటికి పాకిస్తాన్ ఇంగ్లీష్ ప్రెస్లో చాలా ప్రసిద్ధులైన స్త్రీలున్నారు. ‘జమీన్’ అనే పత్రికలో వచ్చిన వ్యాసం నుంచి నేనీ విషయం చెబుతున్నాను. వాళ్ళలో చాలా మందికి మగవారితో సమానమైన వేతనం లేదు. వాళ్ళకు పురుషులకు అప్పగించే పనులు అప్పగించరు. ఇదంతా పత్రిక పాలసీ ప్రకారం జరుగుతుంది. మిరుమిట్లు గొలిపే జర్నలిస్టు వృత్తిలో ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో జాతీయ దినపత్రిక సంపాదకురాలైన మొదటి మహిళ మహీహ లాఢీ కూడా స్పష్టంగా జండర్ వివక్షకు గురయ్యింది. ఆమె నాతో యిలా చెప్పింది.
”సీరియస్ సమస్యల గురించి, విషయాల గురించి రాసే మహిళా జర్నలిస్టులు నిరంతరం తమను తాము నిరూపించుకుంటూ ఉండాలి. ఇది అంతమనేది లేని క్రమం. ఎందుకంటే వాళ్ళు అసమర్ధులనే పురుష భావజాలాన్ని తప్పని నిర్విరామంగా నిరూపిస్తూ పోతుండాలి” ఈ పరిస్థితి మారిందని నేననుకోవటం లేదు.
ఐతే ప్రముఖురాలైన నేషాబా బర్నీ డాన్ ఆఫీసు కొచ్చి జర్నలిజంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి తను పొందిన మాస్టర్స్ డిగ్రీ చూపించి ఉద్యోగం అడిగినప్పటినుంచి మనం చాలా దూరం వచ్చాం. ఆమెకు వెంటనే ముఖం మీదనే చెప్పేశారు ”స్త్రీలు రిపోర్టర్లు కాలేరు” అని.
రచయితని అవ్వటానికీ, నా గొంతు నేను కనుగొనటానికీ నేను చేసిన యుద్ధమంతా జండర్కి సంబంధించినదే. యుద్ధం అడుగున వలసపాలన, కథనం, భాష అన్నీ దాగి ఉన్నాయి. మానాన్న తన ఎనిమిదవ ఏటనుంచే పదహారు సంవత్సరాల పాట ఇంగ్లండులో చదువుకున్నాడు. కరాచీలోని ఒక బ్రిటీష్ కంపెనీలో పనిచేశాడు. మేం ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతాం. మా అమ్మ మాతృభాష ఉర్దూ. మా అమ్మ చనిపోయినపుడు ఉర్దూ భాషలోని అరుదైన మంచి గ్రంథాలు ఎన్నో నాకు దొరికాయి. చాలావాటిమీద భారతదేశంలోని ఆమె చెల్లెళ్ళు పంపినట్లు రాసి ఉంది. అప్పటి వరకు నాకు మా ఇంట్లో ఆ పుస్తకాలున్నా యనే తెలియదు. పుస్తకాల బీరువా అడుగు అరల్లోకి నెట్టివేయబడ్డాయి. ఆ అడుగు అరలు మేమెప్పుడూ చూసేవాళ్ళం కాదు. మా కళ్ళ కెదురుగా కనపడేటట్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు చర్చిల్ రచనలు, హోమర్, మావ్ జె డాంగు తదితరుల రచనలుండేవి.
మా అమ్మ మౌనం, తన భర్తగానీ, కూతుళ్ళుగానీ చదవని సాహి త్యాన్ని గట్టిగా మొండిగా పట్టుకున్న ఆ మౌనంలో అణచివేతతో నిశ్శబ్దమైపోయిన స్త్రీలందరి గొంతులూ కలిసి ఉన్నాయి. ఆమె తన స్మృతులకు రాసే నాటికి ఎనభై ఏళ్ళ వయసు. వాటిని అచ్చులో చూసుకునేంత వరకూ ఆమె బతికింది. కానీ ఆమె తన కూతుళ్ళకు అధికారానికి ఆధిపత్యానికి నెలవైన ఇంగ్లీషు భాషలో గొంతునివ్వాలను కుంది. తన ప్రపంచంగా ఎప్పుడూ భావించని ప్రపంచంలోకి, ఆ ప్రపంచంలో ఆమె ప్రశంసనీయంగా ప్రవర్తించినప్పటికీ, తన యిద్దరు పిల్లల్నీ, నన్నూ నా సోదరినీ పంపించింది. ఇంగ్లండులోని స్కూల్లో చేర్పించింది.
ఆ రకంగా నేను నా మాతృభాషైన ఉర్దూను కోల్పోయారు. నా తండ్రి భాషైన ఇంగ్లీషులో మరింత పట్టు సంపాదించాను. ఐతే తొందరలోనే సమస్య ముందుకొచ్చింది. చిన్నపిల్లగా ఉన్నపుడు ”ట్రెజర్ ఐలాండ్” ”రాబిన్సన్ క్రూసో” వంటి సాహస గాధలను, మా నాన్నకు యిష్టమైన వాటిని నేను ఆనందించలేకపోయాను. నాకు ”లిటిల్ విమెన్” ”వాట్ కేటీ డిడ్” వంటి పుస్తకాలంటే పరమ యిష్టం. మా నాన్నకు ఈ పుస్తకాలు తెలియదు. అవి అమెరికన్లు రాసినవి. ఆ రోజుల్లో అమెరికన్లకు అంత విలువలేదు.

ఐఫర్ ఇవాన్స్ రాసిన ”ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ 1940లో మొదట ప్రచురించబడి, 1970 వరకూ ప్రతి సంవత్సరం పునర్ముద్రణకు వెళ్ళింది. దానిని చదివితే దానిలోని వివక్ష ఆశ్చర్యకరంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కామన్వెల్త్ రచయితలెవరూ అందులో పేర్కొనబడలేదు. అమెరికన్ సాహిత్యమంతా ఒక పేరాగ్రాఫ్లో ఎర్నెస్ట్ హెమింగువే, విలియమ్ ఫక్నీర్, యుజీన్ ఓ నైల్ వీళ్ళకు మాత్రమే పరిమిత మైంది. ఎలిజబెత్ బారెట్ బ్రౌంనింగు కవిత్వం గురించి కంటే ఆమె రాబర్ట్ బ్రౌనింగుతో లేచిపోయిన విషయం గురించే ఎక్కువ ఉంది ఆ పుస్తకంలో. జేన్ ఆస్టిన్, అక్క చెల్లెళ్ళైన బ్రాంటేలిద్దరూ అవివాహితలనే, జార్జి ఇలియత్ ఒక తిరస్కృత ప్రేమికురాలనే ఆ పుస్తకం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. వర్జీనియా ఉల్ఫ్ ప్రతిభ అంతా ఐవి కాంప్టన్ బర్నెట్తో కలిపి బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది.

యుద్ధానంతరపు బ్రిటన్లో పెరుగు తున్న నాలాంటి యువతికి ఈ సాహిత్య విశ్లేషణ, అంచనాలతో రచయిత్రి కావటమంటే అసాధారణ మానసిక స్థితిలో ఉండే ఉన్మాదిలా, బహుశ చావు కంటే ఘోరంగా అవివివాహితగా ఉండటం యివే కనిపిస్తాయి. రచన అనేది నాకు తేలికగానే పట్టుబడింది. అది మా కుటుంబంలో స్త్రీలు చేసిన పనే. మా అమ్మమ్మ ఉర్దూలో రాసిన యాత్రా రచన, మా అత్త ఇంగ్లీషులో రాసిన నవల, ఇంకో అత్త స్త్రీల హక్కుల గురించి, సంక్షేమం గురించీ ఇంగ్లీషు వార్తా పత్రికల్లో రాసిన వ్యాసాలు యివన్నీ ససెక్స్లో ఉన్న నాకు ఏమాత్రం తెలియదు.
నేను శాస్త్రవేత్తను కావాలనుకున్నాను. మా నాన్నలాగే ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలనుకున్నాను. 17 ఏళ్ళ వయసులో నాకు తెలిసింది పాకిస్తాన్లో స్త్రీలు శాస్త్రవేత్తలు కాలేరని నన్ను హైస్కూల్లో చేర్చారు.

మా ప్రధానోపాధ్యా యినికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె వల్ల నేను లండన్లోని సెక్రటేరియల్ కాలేజీకి వెళ్ళాను. లండన్లోని సుసంపన్నమైన సాంస్కృతిక జీవితం నాకు చాలా ఉపయోగపడుతుందని ఆమె అనుకుంది. 19 సంవత్సరాల వయసులో అరుదైన అభిరుచులతో – సంప్రదాయ సంగీతం, వర్తమాన బాలే, థియేటర్ మొదలైన వాటిపట్ల ఆసక్తితో పాకిస్తాన్కి తిరిగొచ్చాను. ఐతే ఆ విషయాల గురించి ఎవరితోనూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. దాంతో నేను నిజంగా మా అమ్మ పరిస్థితిలోకి వెళ్ళాను. మౌనంలోకి, నిశ్శబ్దంలోకి.
వలసపాలన సారాంశమంతా పితృ స్వామ్యమే. దానినే వలస పాలన తర్వాతి మేధావులు, ఆంగ్లీకరణ చెందిన మేధావులు అనుసరించారు. కాబట్టి వలస పాలనలో ఉన్న ప్రజలు తెలుసుకున్న ఇంగ్లీషంతా పాలనకూ, కంట్రోలుకు సంబంధించినది. ఐతే కళ అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద వికసిస్తుంది. స్వభావరీత్యానే అది అధికారాన్ని కూలదోసే తిరుగుబాటుకి చెందింది. తిరుగుబాటు, ప్రశ్నించటం అనే వాటిని నేనిష్టపడతాను.
పాకిస్తాన్లో సర్దుకుని బతకటం నాకు చాలా కష్టమైంది. నేను పది సంవత్సరాలుగా అక్కడ లేను. అక్కడ ఏమి ‘చెయ్యొచ్చు’ ఏవి ‘చెయ్యకూడనివో’ నాకు అర్థం కాలేదు.

ఫెమినిస్టు విప్లవం వచ్చింది. పాకి స్థాన్లో ఉన్న నా మంచి మిత్రులిద్దరూ నేనూ పడక్కుర్చీ విప్లవకారులమయ్యాం. విముక్తి భాషగా మేం ఇంగ్లీషు గురించి ఆలోచించాం. ఒకరోజు టెలివిజన్లో ఒక యువతి తన ఉర్దూ కవిత్వాన్ని చదువుతూంటే విన్నాం. ఉర్దూ భాష అంతా మూసేసినట్లు బంధించబడినట్లు, ప్రగతి నిరోధకమైనట్లు మాకు అనిపించేది. కానీ ఆ యువతి కవిత్వం చాలా రాడికల్గా, ఎంతో శక్తివంతంగా ఉంటేే మేం ముగ్ధులమై పోయాం. ఆమె ఫమిదా రియాజ్, పాకిస్తాన్ లోని మొదటి ఫెమినిస్టు కవయిత్రి.
చిన్నతనంలో నేను ‘మనం రాసేది ఏ మాత్రం బాగున్నా అది ఇంగ్లండ్లో ప్రచురించబడుతుంది అంతే” అనుకునే దాన్ని. పాకిస్తాన్ వచ్చాక, ఇంగ్లీషు భాషలో వచ్చే స్త్రీల పత్రికలతోగానీ, ఆ రోజుల్లో ఎక్కువగా ఉన్న పాకిస్థానీ ఇంగ్లీషు కాల్పనిక సాహిత్యంలో గానీ నాకు సంబంధం ఉందని అనుకోలేదు. ‘జనం ఏమనుకుంటారు?’ అనేది నిరంతరం నన్ను వెంటాడుతుండేది. నేను చెప్పే విషయాల్లో ఎవరికీ ఆసక్తి లేదనే విషయం కూడా నాకు స్పష్టమైపోయింది. ఇంగ్లండ్కి కూడా నా మాటల్లో ఆసక్తిలేదని తెలుసు కున్నాను. పాకిస్తాన్ సమాజం ఆడపిల్లలు ”సంప్రదాయికంగా అదే సమయంలో ఆధునికంగా” ఉండాలని బోధిస్తే, ఇంగ్లీషు వాళ్ళు ”రెండు ప్రపంచాల్లోని ఉత్తమమైన వాటిని స్వీకరించాలనే వాళ్ళు.

సాంస్కృతిక సామ్రాజ్యవాదం రేసిజం వంటిదే. లోపల ఒకటే రకంగా ఉంటుంది. జాత్యహంకారంతో జరిగే అత్యాచారాన్ని గుర్తించవచ్చు. కానీ మనలో మనమీద కలిగే సందేహాన్ని తిరిగి విధించగలిగే రేసిస్టు తత్త్వాన్ని అన్నిసార్లూ మనం గుర్తించలేం. నీ రచన ఇంగ్లండ్లో తిరస్కరించబడి తిరిగి వస్తే, నీ లాగే నీ అంతమంచిగానో, చెత్తగానో రాసే నీ ఆంగ్ల స్నేహితురాలి రచన ప్రచురించబడితే అప్పుడు నువ్వు ”నిజంగానే నేను పనికిమాలిన రచనలు చేశానని” అను కుంటావు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, ఒక జర్నలిస్టుగా నేను బ్రిటన్లో నాటక రచయిత్రి నవలా రచయిత్రి అయిన రుక్సానా అహ్మద్ను కలిశాను. రహీలా గుప్తాతో కలిసి ఆమె ఆసియా రచయిత్రుల సంఘాన్ని ప్రారంభించి బ్రిటీష్ ఆసియన్ స్త్రీలకు ఒక వేదికను కల్పించింది. ఎందు కంటే ఆ స్త్రీలకు బ్రిటీష్ ప్రచురణ సంస్థలలో స్థానం గానీ వారి గొంతు వినిపించటం గానీ లేదు.
నేను 1968లో నా వివాహం జరిగిన తర్వాత రాయటం మొదలు పెట్టాను. నన్ను ప్రోత్సహించటానికి నా భర్త ఒక టైప్రైటర్ని కానుకగా యిచ్చాడు. మేధాపరమైన పని చేసి చాలాకాలం కావటంతో ఒక మంచి వాక్యం కూడా పలకించలేకపోయాను. అప్పుడు నా అంతట నేను నేర్చుకునే సుదీర్ఘమైన కష్టతర మైనా క్రమం మొదలయింది. చదవటం మొదలెట్టాను. రాయటం కాగితాలు నలిపి పారెయ్యటం. ఇదంతా రహస్యంగా సంవత్స రాలు గడిచిపోయాయి.
ఒకరోజు నా చిన్న కూతురు సామన్ తన తరగతిలో కాంపోజిషన్ రాస్తూ మా అమ్మ రచయిత అని రాసింది. టీచర్ ఆ వాక్యం తప్పని ఇంటూ గుర్తు పెట్టారు. అప్పుడు నేనిక ధైర్యం తెచ్చుకోవాలని నిర్ణయించు కున్నాను. నా స్నేహితురాలి చొరవతో నేనూ నా కజిన్ వారిస్ హుస్సేన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన టెలివిజన్ దర్శకుడిగా ‘బాఫ్టా’, ‘ఎమ్మీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఆ ఇంటర్వూని ఒక స్థానిక వార్తాపత్రికకు పంపాను. ఆ తర్వాత అది ప్రచురించబడింది. చాలామంది చదివారు. బాగుందన్నారు. ఆ తర్వాత యిక వెనక్కు తిరిగి చూడలేదు.
ఇదంతా ఒక సమీక్షకురాలిగా, విమర్శ కురాలిగా నేను నా రచనలలోకి తెచ్చిన చైతన్యాన్ని రూపుదిద్దింది. ఐతే నేను రాయటం మొదలు పెట్టినపుడు ఒకరోజు నా కూతురు కమీలా కూడా రచయిత్రి అవుతుందని నాకు తెలియదు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో