పరంపర

యం. వసంత కుమారి

అమెరికాకు వచ్చి ఆరు నెలలైంది. వచ్చే ఆదివారమే నా ఇండియా ప్రయాణం. వారం రోజుల నుండి మధన పడ్తున్నాను. ఇండియాకు ఒక్కదాన్ని వెళ్ళగలనా? వచ్చేటప్పుడు కోడలుతో రావటంతో ఏమీ గమనించలేదు.

”వెళ్ళకుండా వుండలేవు. గుంపులో గోవింద లాగా వెళ్ళిపోగలవు” అని ఆట పట్టిస్తున్నారు పిల్లలు. ఆదివారం రానే వచ్చింది. యక్ష ప్రశ్నలు. ఎమర్జెన్సీలో ఏమి చెయ్యాలి? ఏం చెయ్యకూడదు. ఫోన్. నెం., కాలింగు కార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఎయిర్ ఇండియాలో అయితే ఇండియన్స్ వుండే వాళ్ళని, ‘లుఫ్తాన్సా’లో బుక్ చేసారని నసుగుతున్నాను.
”లేదు దీంట్లో కూడా ఫ్రాంక్ఫర్డ్లో దిగగానే ఇండియన్స్ ఏమిటే తెలుగువాళ్ళే కనిపిస్తారని” ఎంత ధైర్యంతో చెప్తున్నా నాకు మొదటిసారి కావడం వల్ల నమ్మటం లేదు నేను.

మా ఫ్లైట్ సాయంకాలం 5 గం||లకు ఫిలడెల్ఫియా నుండి బయలు దేరుతుంది. ఎయిర్పోర్టుకి చేరుకున్నాం. ఫ్లైట్ ఎక్కుతుండగా ఒక్క తెలుగువాడు (ఏదో దేవుడు కనిపించనంతగా) కనిపించాడు. అదీ హైదరాబాదు మా కాలనీలో వుండే ‘మల్లెమాల’ అని డాక్టరుగారి బంధువు ఇక చెప్పలేను నా సంతోషాన్ని. పక్కసీటే అతనిది కూడా. ప్రయాణం చేసినట్టే అనిపించలేదు.
ఫ్రాంక్ఫర్డ్ లో ఉదయం 6.30కి దిగాము. అండర్గ్రౌండ్లో వున్న మార్కు చూసి, ఎలివేటర్లో పైకెళ్ళి ఎలక్ట్రిక్ ట్రైయిన్ పట్టుకుని మాక్కావలసిన గేటు దగ్గర దిగి పోయాము. అక్కడ చూస్తే హైదరాబాదు బస్ స్టేషన్లో జనాలు కూర్చున్నట్టుగా వుంది. కానీ విదేశీలో వున్నట్టు లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళే అంతమంది వున్నారు. ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటిగంటదాక ఇక్కడ గడపాలి. ఎంత బోర్…. రెస్ట్ రూంకి వెళ్ళాను. అక్కడ వెళ్ళి చూస్తే జనం పెళ్ళికి తయారైనట్టు తయారవుతున్నారు. ఇండియా వేషం వేస్తున్నారు. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మా క్కావలసిన గేటు దగ్గరికి వచ్చాను. అక్కడ కాఫీ కోసం వెతుకుతున్నా ఇంతలో ఒక తెలుగు ఆవిడా, వాళ్ళాయన వస్తున్నారు. నేనూ కాఫీ కోసమే అన్నట్టు గ్రహించి, ”అక్కడ ఇన్స్టంట్ కాఫీ వుందండి. చాల బాగుంది కాని” అంది. తప్పదు. మళ్ళీ 7 గం||లు గడపాలి ఇక్కడ. వెళ్ళి కాఫీ తాగొచ్చి ఆవిడకి థాంక్స్ చెప్పి ఆవిడతో కబుర్లలో పడ్డాను.

”మొదటిసారా” అని అడిగింది
”అవును”, ”మీ పేరు” అన్నాను.
”వనమాలి” అంది.
ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుని చివరగా చాలా సీరియస్గా అత్త కోడళ్ళ మీదకు మళ్ళింది. ఇద్దరిదీ ఇంచుమించు ఒకటే వయస్సు 45-50 మధ్య.
”ఈ రోజుల్లో కోడళ్ళు, అత్తలూ స్నేహితుల్లా వుండడం కల్ల. ఈ రోజుల్లోనే కాదు ఏతరంలోనైనా వీలు పడదు. గడుసుతనం, లౌక్యంతో నెగ్గుకు రావల్సిందే ఏతరంలోనైనా” అన్నాను. ఆవిడ ఒప్పుకోలేదు.

”ప్రేమతో దగ్గరైతే గెలవొచ్చు. చలం గారు పిల్లల మీద ప్రేమ చూపితే వ్యర్థం కాదంటారు. అట్లాగే మనం ఎవరి మీదనైనా చూసే ప్రేమ వ్యర్థం కాదనుకుంటాను”. అన్నారు వనమాలి గారు.
”మీరు ఎనై ్ననా చెప్పండి. మీకు అన్ని అనుకూల పరిస్థితులు వుండి వుంటాయి. అత్తగారి మంచితనం, కోడలి అమాయకత్వం మీకున్న అనుభవాలు అలా మాట్లాడిస్తున్నాయి” అన్నాను. ”అవును నేను ఉత్తమ కోడలు”, ”అత్యుత్తమ అత్తగారు” అవార్డులు అందుకున్నాను. కాని నిజజీవితంలో కోడలు, అత్తగారి హోదాలో రివార్డులే అందుకున్నాను. మీరు అను కున్నట్టుగా జీవితంలో అనుకూల పరిస్థితులు కాదు. అన్ని ప్రతికూల పరిస్థితులే” అన్నారు.
”ఏమిటీ, మీ జీవితం తమాషాగా వుందే. ఇంటరెస్టింగుగా వుంది చెప్పరూ”. ఆవిడ గతం నెమరు వేసుకుంటూ….

ఆ రోజు అభినందన ఆర్ట్స్ ఆర్గనైజేషన్ వారి దగ్గర నుండి, ఒక ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. వనమాలి ఆ లెటర్ చూసి నమ్మలేక పోయాను. ‘గుర్తింపు’ అనే విషయం తన డిక్షనరీలో లేదే అసలు. ప్రతికూల పరిస్థితిలో ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. రాసి గోల్డ్మెడల్ తెచ్చుకున్నప్పుడు గానీ, సంసారంలో ప్రపంచ యుద్ధాలంత భీకర పరిస్థితుల్లో యం.ఏ. లో ఫస్ట్ క్లాసులో పాసయినప్పుడుగానీ, యం.ఫిల్. చేసినప్పుడుగాని నాకు ప్రోత్సాహకరంగానైనా ఒక్క మంచి మాట చెప్పి సంతోషపడనివ్వలేదు ఏ ఒక్క మానవుడు (నా పరివారం)
అలాంటిది ”ఉత్తమ కోడలు” బిరుదు అంటే ఆనందమో, దుఃఖమో, సంతోషమో, ఆవేదనో తెలియకుండా వుంది. బొంబాయిలో వున్న తన భర్త ఏమంటాడు ఈ వార్త చెప్తే… నీలాంటి పిచ్చివాళ్ళే వాళ్ళూ అంటూ వెక్కిరిస్తాడు. తప్పకుండా చెప్పకూడదు అనుకుంది వనమాలి తన భర్త నైజం తెలుసు కనుక.
ఆరోజు సాయంత్రం 6 గం||లకు మీటింగు. 5 గురు ప్రసిద్ధ రచయిత్రులు మానసిక నిపుణుడు, మహిళా మాండలి అధ్యక్షురాలు, ఒకరు మంత్రి (చీఫ్ గెస్ట్) వున్నారు.
నేను డిబేట్ జరిగిన రోజున చెప్పిన 4 ముఖ్య విషయాలు జడ్జీలకు నచ్చి, ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. మనల్ని మనం లోపలికి తొంగి చూసుకుని ఎదుటివారిని చూడాలి. (2) ఎదుటివారిని కూడా అంతకు ముందే వున్న అభిప్రాయంతో కాక ఒక విత్తునాటితే మొలకెత్తే మొక్కను పరిశీలించినట్టుగా (3) ఇతరులు చెప్పింది వినటం (4) విన్నదాన్ని ఎలా అన్నారు, ఏమి చెప్పారని అవలోకనం చేసుకోవాలి. ఇన్ని చేసినా ఇతరులు మనల్ని దూషించినా కనీసం మనకు వారిపట్ల విరోధం కనిపించకూడదు.
హాలంతా చప్పట్లతో అదిరింది.

ఆ తర్వాత రెండేళ్ళ తర్వాత మా అబ్బాయి పెళ్ళి జరిగింది. మా అత్తగారి అనుభవాలను చర్విత చరణం కాకూడదని, నా కోడలిని కూతురులాగా చూసుకోవాలను కున్నాను. పల్లె వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయి. కాని సిటీలోనే చదువుకున్న పిల్ల. ముఖ్యంగా కోరిచేసుకున్నాడు. ఆ అమ్మాయిని కూతురులాగా చూసుకుంటున్నానని బంధువులంతా మెచ్చుకున్నారు. మళ్ళీ ఈసారి కూడా అభినందన ఆర్ట్ ్స వాళ్ళు ఆహ్వానించ టం, అత్తగారి హోదాలో పాల్గొన్నాను. ఇప్పుడు అత్తా, కోడల్ని పిల్చి వారికి 4, 5 సమస్యలిచ్చి పరిష్కారం చూపమన్నారు. అందులో ఒక ముఖ్యమైన సమస్యయేమంటే, కోడలుకు గర్భం వచ్చినప్పుడు గర్భసంచికి కొన్ని లోపాలవల్ల వైద్యపరంగా రెస్ట్ 6 నెలలు. మీ బాధ్యత ఏమిటి? అన్నారు.
”ఆలోచనకు తావే లేదు. ఇందులో. నా బిడ్డను రక్షించుకోవటం నా బాధ్యత కాదా” అన్నాను.
మళ్లీ అవార్డు దక్కింది.

అయిదేళ్లయింది. కోడలు, కొడుకు అమెరికా వెళ్లిపోయారు. చదువులు అయి జాబ్లో స్థిరపడ్డారు. పాప కూడా పుట్టింది. అక్కడే (యు.ఎస్.ఎ.) డెలివరీ కనుక. కోడలు అమ్మను పిలిపించుకుంది.
మరో రెండేళ్ల తర్వాత నేను అమెరికా వెళ్లాను. అక్కడ వున్నన్ని రోజులు వాళ్లకు ఏ ఇబ్బంది కల్గకుండా, అన్ని విధాలుగా ఆసరాగా వున్నాను. అంటే పాపను చూసుకోవటం, ప్రీస్కూలుకు పంపటం, ఇంట్లో పని, కారు డ్రైవింగు కూడా నేర్చుకున్నాను. కనుక వాళ్లకు హెల్ప్ చేసేదాన్ని. 5 నెలలు దాటింది, నేను వచ్చి. (6 నె|| వీసా) ఇక 10 రోజులకు వెళ్తాననగా ఒకరోజు రాత్రి పడుకున్నాక బాత్రూంకి లేచి వెళ్లబోతుంటే, బెడ్రూంలోంచి వాళ్ల మాటలు విని అలాగే కొయ్యబారిపోయాను.

”ఏదో ఆశించే మనకంతా సహాయం చేస్తున్నట్టు నటిస్తుందండి, ఇద్దరం సంపాదిస్తున్నాం కదూ, ఇక్కడిదంతా కూతురికి చేరవేయొద్దూ… ఇలాగే వుంటాయి మన ఇండియాలో వాళ్ల బుద్దులు. జాగ్రత్తగా వుండాలి సుమా! నవ్వుతూ పలకరించినట్టుగా వుండి గుట్టు తెలుసుకోవాలి”…
అక్కడ నిలబడలేక నరాలన్నీ ఒక్కసారి బిగుసుకుపోయి వారి! భగవంతుడా, ఇదేమి లోకంరా! గడసరితనంగా వుండకపోవడం కూడా ఒక లోపం అనుకోలేదిన్నాళ్లు. అయినా నన్ను నేను సంభాళించుకున్నాను. ఎలా వుండదల్చుకున్నానో అలానే వుంటాను. నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను.
ఆ సమయంలో… పెళ్లైన కొత్తరోజులు గుర్తొచ్చాయి. మా అత్తగారు నన్ను (అప్పటికి నాకు 15 ఏళ్లు) దగ్గర కూచోబెట్టుకొని వాళ్ల అత్తగారి ఆగడాలు, కోడల్ని రాచిరంపాన పెట్టే కథలు కథలుగా చెప్పేది. ”ఒక్క క్షణం కూర్చోనిచ్చేది కాదని, ఒకసారి ఒక చిన్న చెంచా మట్టిలో పడిపోయి దొరకలేదట గిన్నెలు తోమేటప్పుడు. ఆ సంఘటనతో ఇంట్లోంచి గెంటించడం వరకు వెళ్లిందని బాధపడ్డది ఓ రోజు మా అత్తగారు. ఇవన్నీ చెప్పినా, నాకు జీర్ణించుకోలేని వయస్సు అప్పుడు (జాలిపడేదాన్ని) కానీ, మా అత్తగారు వాళ్ల అత్తగారి పరంపరను కొనసాగించడం ప్రారంభించింది. నరనరాల్లో జీర్ణించుకున్నది.

అప్పటి రోజులు గుర్తుకువస్తే… అనుభవ పాఠాలు ఎన్ని నేర్చుకున్నానో అని గర్వంగా కూడా వుంటుంది.
ఒకసారి ఊరికెళ్తున్నాను. కాలేజిలో చదువుతుండేదాన్ని. శని, ఆదివారాలు మా అమ్మ వాళ్లింటికెళ్లేదాన్ని. ఏవీ నా వస్తువులు దాచుకోవడం అలవాటు లేదు. తాళాలూ వేసుకోవడమూ అలవాటు లేదు… నెల పీరియడ్స్… అస్సలు వొంట్లో బాగోలేదు. నాప్కిన్స్ ఒక కవర్లో పెట్టి బయటికెళ్లేటప్పుడు చెత్తకుండీలో వేయటానికి, ఊరికెళ్లే బ్యాగుతోపాటు తీసుకొని వెళ్తున్నా.
”అందులో ఏమిటో చూపించమన్నది మా అత్తగారు, నేను చూపించటానికి ఇష్టంలేక చూపించలేదు. అంతే.
నేను ఊరెళ్లి వచ్చేటప్పటికి యుద్ధ వాతావరణం మొదలైంది. అది భయంకర పరిస్థితి రెండునెలల వరకు ముగింపుకు రాలేదు. ఏమిటో, దేని గురించో అర్ధం కాలేదు. పెడార్థాలు… విపరీతార్థాలు…
ఒకరోజు మావారు బాంబు పేల్చారు. మీ వూరు వెళ్లిపో… ఇక్కడ ఇష్టం లేకపోతే అన్నారు.
”నా తప్పేమిటో చెప్పండి. అప్పుడు వెళ్తానన్నాను”.
మా అత్తగారు నేనూరికి వెళ్లిన తర్వాత, ఆ పాకెట్ చూపించనందుకు ప్రతీకారచర్యగా నా పెట్టెలో నుండి వుంగరం, చెవికమ్మలు తీసుకుని తన దగ్గర పెట్టుకొని, పైగా ఆ రెండు వస్తువులు మా పుట్టింటివాళ్లకిచ్చానని చెప్పిందట మావారికి.

కాని ఈ విషయాలన్ని నాల్గేళ్ల తర్వాత తెలిసింది. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని నన్ను సాధించడం మొదలుపెట్టారు. నేను తిరగబడడం నేర్చుకున్నాను. కాని నేను ఎప్పుడూ గెలవలేకపోయేదాన్ని. నామీద నిందారోపణలు చేసే వ్యవహారం ఎక్కువైంది. నన్ను నేను కాపాడ్డం నేర్చుకున్నాను. ఇదికాక ఇలాంటి మానసిక వైద్యాలన్నీ నేర్చుకున్నాను. మా అత్తగారి పరంపరను ఆమెతో అంతం కావాలని కోరుకున్నాను…
తెల్లవారి మా కోడలు సుచరితను పిల్చి, అబ్బాయిని కూడా పిలవమన్నాను. ఇద్దరూ కూడా నా ప్రవర్తనతో కొద్దిగా భయపడ్తూ, ఏమీ ఎదుర్కోవలసి వస్తుందోనన్నట్లుగా ఆందోళన కనిపించింది వాళ్ల మొహాల్లో…
”వంగి వంగి దండాలు పెడ్తూ, కాళ్లు లాగే సంస్కృతి మనకి వద్దమ్మా. మనసులోకి ఏ అనుమానమొచ్చినా నిర్భయంగా మొహ మాటం లేకుండా అడిగెయ్యి నన్ను. అత్తాకోడలూ, చిన్నపెద్ద తేడాలకన్నా, స్నేహితులుగా వుంటూ ఒకరి అభిప్రాయా లను ఒకరు గౌరవించడం మంచిది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూర్చొని చర్చించుకోవడం ఇక్కడి విదేశీ సంస్కృతే, అయినా మనం మంచిని గ్రహించే విషయంగాతీసుకోవచ్చు. ఇండియా ఆడవాళ్లైనా విదేశ సంస్కృతిలోనైనా మంచిని గ్రహించి, చెడును వదిలే సంస్కృతే మన పరంపర కావాలమ్మా!
”నేను అదే చెప్పానమ్మా” అన్నాడు మా అబ్బాయి ఆవిడ చెప్పుతుండగానే
ఫ్లైట్ టైం అయినట్టుంది,
మైకులో ఫలాన గేటు దగ్గరికి రమ్మంటూ అనౌన్స్ చేస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఎంతో తేలికైంది నా మనసు. ఎన్ని అనుభవపాఠాలు నేర్చుకున్నాను. ఈ ప్రయాణం నా జీవనప్రయాణానికే సార్థకత నిచ్చింది కదా అనుకున్నాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో