స్వయం సహాయక బృందాలు – మహిళా సాధికారత

డా. శిరీన్ రెహమాన్

దేశం జనాభాలో సగభాగం వున్న మహిళల అభివృద్ధి గురించి అందరూ మాట్లాడేవారే.
నిజమైన అభివృద్ధి జరుగుతున్నదా? లేదా? అని ప్రశ్నిస్తే ఇది చట్టాల్లో కాగితాలకే పరిమితమవుతున్నదని చెప్పక తప్పదు.

ఎందుకంటే ఒక చట్టం చేయడం ప్రభుత్వానికి సులువే గాని ఆ చట్టాన్ని ఉపయెగించుకోవడానికి ప్రజలను సమాయత్తం చేసి, ఆ చట్టాన్ని వారు ఉపయెగించుకునే విధంగా చేయనప్పుడు ఆ చట్టం నిరుపయెగమే. అలాంటి చట్టాలే వరకట్న నిషేధం, బాల్య వివాహాలు. అవగాహన లోపం వలన ఈ చట్టాలున్నప్పటికీ నిరుపయెగంగా మారాయి.

అవగాహనకు కావలసిన విద్య గాని, ఆర్ధిక స్వాలంబన గాని లేక పోవడంతో చట్టం అమలుకు వీరే వారిపై ఆధారపడవలసిన పరిస్థితి ఉన్నది. మహిళలకు చట్టరీత్యా సమానహక్కులు ఆస్థి హక్కు ఉన్నప్పటికీ ”అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నది” అనే సామెతలా మహిళల బ్రతుకులు తయరైనవి. మహిళాభివృద్ధి గురించి మాట్లాడే నాయకులు, రాజకీయ పార్టీలు ఎలక్షన్ల ముందు మహిళలు వారి అభివృద్ధి గురించి బాకా వూదటం తప్ప అభివృద్ధి కావలసిన పరిస్థితులు కల్పించడంలో తగిన శ్రద్ధ తీసుకొనరు. ఎందుకంటే సమాజంలో మహిళలు పురుషునితో సమానంగా అన్ని రంగాల్లో ఎదగలేనప్పుడు మహిళాభివృద్ధి జరుగుతున్నదని చెప్పలేం. మహిళా అభివృద్ధి జరగాలంటే ఆర్ధిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం అన్ని రంగాలలో సమాన ఉపాధి అవకాశాలు, లింగవివక్ష. వీటన్నింటికంటే ముందు సామాజిక చైతన్యం మహిళలు తెలుసుకోవాలి. ముఖ్యంగా బడుగు, బలహీన మహిళలు ఇప్పటివరకూ వీటికి దూరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు ఈ బడుగు బలహీన వర్గాల మహిళల జీవన శైలిలో పెను మార్పు తెచ్చిందనే చెప్పాలి.
ఒకప్పుడు ఇంటి గుమ్మందాటి బయట అడుగుపెట్టలేని మహిళ ఈ స్వయం సహాయక బృందాలలో చేరడం వలన పొదుపు గురించే కాకుండా, వారి ఆర్ధికాభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్ కోసం సమాజంలో మహిళలపై జరిగే అన్యాయల గురించి వీటిని ఎలా ఎదుర్కొనాలి. వారికి ఎలా న్యాయం జరిగేలా చూడాలి అని ఆలోచిస్తున్నదంటే అది ఈ స్వయం సహాయక బృందాలుగా ఏర్పడడమే. వారి సావజిక చైతన్యానికి ఎన్నో ఉదాహరణ లున్నాయి. కట్నం కోసం రెండో పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నిస్తే, బృందం సభ్యులు అతనికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పారు. తప్ప త్రాగి వచ్చి, భార్యను హింస పెడుతుంటే సభ్యులందరూ వెళ్ళి, అతనికి బుద్ధి చెప్పారు. లక్ష రూపాయలు చందా వారం రోజులలో ప్రోగుచేసి తోటి సభ్యురాలికి గుండె ఆపరేషన్ చేయించారు. ఈ వార్త రూపాయికి గుండె ఆపరేషన్ అని బి.బి.సి న్యస్ (వార్తలో చదివారు) ఆ ఘనత బృందం సభ్యులదే. ఇప్పుడైనా మహిళలు నిరక్షరాస్యులే ( సంతకం వరకు చేయగలిగిన అక్షరాస్యులు) కానీ చైతన్యానికి కారణం స్వయం సహాయక బృందాలుగా ఏర్పడడమే. ప్రతీనెల వారి సమావేశంలో, బృందంలో సభ్యుల సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు కూడా చర్చించు కోవడం, నేను అని కాకుండా ”మనం” అనేలా వారి ఆలోచనలో మార్పు రావడం సభ్యుల సమస్యలను అందరి సమస్యలుగా తీసుకొని పరిష్కరించుకోవడం, ఈ మార్పు బృందంగా ఏర్పాటు అవడం వలన వచ్చిందే గాని, ఎన్ని చట్టాలు చేసినా మార్పు వచ్చి ఉండేది కాదు.
వరకట్న నిషేధం అమలు అవుతున్న కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకునే వాళ్ళని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఆస్తి హక్కు ఉన్నప్పటికీ భర్త, తండ్రి, కొడుకుల దాతృత్వంపై ఆధారపడే ఆస్తి హక్కే గాని, చట్ట పరంగా వారికి రావలసిన ఆస్తిని పొందడం కష్టమే. సమాజంలో ఎక్కువ శాతం మహిళలు వారి హక్కులపై న్యాయపోరాటానికి సిద్ధంగా లేరు. సమాజమూ సిద్ధంగా లేదు. కట్నం సొమ్ము కూడా మహిళా ఆధీనంలో ఉండదు. భర్త అత్తమామల ఆధీనం. ఆస్థి పేరుకు మన పేరుమీద ఉన్నా ఫలసాయం భర్త ఆధీనంలో ఉంటుంది. ప్రతీ పైసా భర్తను అడిగి తీసుకోవలసిందే వీరి ఇస్టానికి అనుగుణంగా ఏమి చేయడానికి వీలులేని పరిస్థితి. ఈ పరిస్థితి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలలో ఎక్కువగా కన్పిస్తున్నది. కాని ప్రస్తుతం స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉండడం వలన ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వారు చేసే పొదుపు కార్యక్రమం ద్వారా డబ్బు వారి పేరుపై ఉండడమే కాకుండా వారి అనుమతి లేకుండా ఏమీ చేయడానికి వీలు లేని పరిస్థితి. ఇదొక శుభపరిణామం. కుటంబ అవసరాలు తీర్చుకొనడానికి ఉపయెగించడమే కాకుండా ఆదాయ వనరులు పెంపొందించుకొనడానికి చిన్న వ్యాపారాలు చేస్త ఆర్ధిక స్వావలంబన దిశగా పయనిస్తున్నారు.
(స్వయం సహాయక సంఘముల మొత్తం సంఖ్య-330, స్వయం సహాయక సంఘముల సభ్యుల సంఖ్య -5365)
ఇంతకు ముందులా కాకుండా వారు ఏమి చేయగలరో వారే నిర్ణయించుకోగలిగే శక్తి సామర్ధ్యాలు వారిలో పెరిగాయి. ప్రభుత్వం కూడా వివిధ శిక్షణా కార్యక్రవలు ఈ బృందాలు నెలకొల్పడం వలన వారిలో చైతన్యం రావడమే కాక వారి ఆర్ధిక ప్రణాళిక వారే వేసుకున్న స్థితికి బృందంగా ఏర్పడిన మహిళలు ఉన్నారు.
విద్య , ఆరోగ్యాల గురించి అవగాహన ఉన్నప్పటికీ ఆడపిల్లల చదువు, ఆరోగ్యం, వారి కుటుంబ ఆరోగ్యం విషయంలో కొంత వెనుకబడి ఉన్నట్లే. ఆడపిల్లల చదువు విషయంలో కొంత మార్పు కన్పించి, స్కూల్లో చేర్పించిన ఆర్ధిక ఇబ్బందిగాని, కుటుంబంలో వారికి ఆరోగ్య పరిస్థితిగాని బాగో లేకపోతే ముందుగా చదువు మాన్పించేది ఆడపిల్లలనే. ఆరోగ్య శ్రీ, ఆరోగ్య భీవ,తెల్లరషన్ కార్డుల ద్వారా ఉచిత చికిత్స జరుగుతున్నదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్ధితులు భిన్నంగా ఉండడం వలన ఆర్ధికంగావెనుకబడి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించక తప్పడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వమే ఆలోచించి స్వయం సహాయక బృందాలకు తక్కువ రుసుంతో ఆరోగ్య భీమా చేయించగలిగితే వారికి మేలు చేసిన వారవుతారు.
విద్య యొసగును వినయంబు, వివేకంబు, విచక్షణ జ్ఞానంబు అని తెలిసినప్పటికీ ”ధనం మూలం ఇదం జగత్”. ధనం లేక ప్రభుత్వ పాఠశాలలకు విద్య కొరకు పంపిస్తున్నప్పటికీ సరియైన సదుపాయలు లేక ఆడపిల్లలను స్కూల్ మాన్పించవలసిన పరిస్థితిలు కొన్ని ప్రదేశాలలో ఉన్నవి. స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్నా, వారి ఆలోచనలో మార్పు ఉన్నప్పటికీ వారిలా వారి పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండకూడదని, చదువు ద్వారా వారి పిల్లల అవగాహనా శక్తిని పెంచాలనే వారి ఆలోచనలకు జోహారులు. ఎందుకంటే ఒకప్పుడు సంతకం చేయలేని వారు ఇప్పుడు కాగితాల్లో వ్రాసిన విషయన్ని అడిగి తెలుసుకొని మరీ సంతకం చేస్తున్నారు. ప్రతీవారు సంతకం చేయలనే నిబంధనకు కట్టుబడి సంతకం చేయడం నేర్చుకున్నారు. లింగవివక్ష వ్యవహారానికి వస్తే కుటుంబంలో ఆడపిల్ల అణిగి, మణిగి ఉండాలనే ఆలోచనలో మార్పు. పిల్లలు ఎవరైనా ఒక్కటే అనుకోవడం, మగపిల్లవాడి కొరకు తపించి, ఎక్కువ మంది పిల్లల్ని కనడం వంటి విషయల్లో మార్పు వచ్చింది. అత్తవమల ఆజ్ఞ అని వారికి ఇష్టం లేకపోయినా మగపిల్లవాడు కలిగే వరకూ గర్భాన్ని దరించేవారు. ఇప్పుడు వారికి ఇష్టం లేని విషయన్ని ఖచ్చితంగా చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
విద్య ఉపాధి కల్పనలో 33 % రిజర్వేషన్ కల్పించినప్పటికీ అణిచివేత వల్ల యిప్పటివరకు మహిళలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. ప్రభుత్వ పరంగా విద్యా, ఉపాధి అవకాశాల గురించి స్వయం సహాయక బృందాలకు అవగాహన కల్పించాలి. మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలను చదువుకోడానికి పంపక పోవడంవలన స్త్రీలు ఎక్కువ శాతం నిరక్ష్యరాస్యులుగా ఉంటున్నారు. ఉపాధి కల్పనలోను జీతభత్యాల విషయంలో లింగవివక్షతతో వీరిశ్రమ దోచుకొనకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొనవలెను. అవకాశం కల్పిస్తే మేము చేయగలం అని బృందం సభ్యులు అప్పుడప్పుడు అనడం వింటుంటాం. ప్రభుత్వ పరంగా వీరి స్థాయికి తగిన శిక్షణను ఇచ్చి ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించి చూడాలనేది వీరి భావన. సమాన అవకాశాల వలన వీరి బ్రతుకులు బాగుపడతాయని అన్ని విధాల సమాజంలో మంచి స్థాయిలో ఉండగలమని స్వయం సహాయక బృందాల సభ్యులంటుంటే వీరిలో ఎంత మార్పు వచ్చిందో అనే ఆలోచన రాకమానదు.
స్వయం సహాయక బృందాలు పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా నా అనుభవాలను, వాస్తవ పరిస్థితులను మీ ముందుకు తీసుకొని రావాలనే తపనతో రాస్తున్నాను. స్వయం సహాయక బృందాలవలన మహిళా చైతన్యం ప్రముఖంగా బడుగు బలహీన వర్గాల మహిళల్లో ప్రస్ఫుటంగా మహిళలలో కన్పిస్తుంది. ఒకప్పుడు అణగారిన వర్గం, ప్రతిరోజు రూపాయి పొదుపు వారికి ఇంత శక్తి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. వారి హక్కుల కోసం మంత్రులను, అధికారులను నిలదీయడం అనేది మహిళా సాధికారతకు, మహిళా అభివృద్ధికి నిదర్శనం అని చెప్పక తప్పదు. 60 సం.ల స్వాతంత్య్ర భారతంలో రాని మార్పు గత పది సం. ల మహిళలల్లో కన్పిస్తుంది.
ఆర్థిక స్వావలంబనే మహిళాభివృద్ధికి, మహిళా సాధికారతకు మంత్రమనే ఈ స్వయం సహాయక బృందం మహిళలు చెప్పకనే చెబుతున్నారు. రూపాయి పొదుపుతో మొదలై వారి పొదుపు వేలకు చేరి బ్యాంకుల ద్వారా ఋణాలు, ప్రభుత్వ ప్రోత్సహకాలు, చిన్న వ్యాపారులు, వృత్తి శిక్షణలు, ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నాలు, సమాజ సేవలో కూడా పాల్గొనాలి అనే వారి తాపత్రయం చూస్తుంటే వారిని మెచ్చుకొనక తప్పదు. మద్యపానం వలన గృహహింస ఎక్కువగా ఉంటుందని మగ వారిలో మార్పు కొరకు కరపత్రం ముద్రించి అవగాహన పెంచడానికి ప్రయత్నించినది కూడా ఈ మహిళలే. నిరక్షరాస్యులైన తోటి సభ్యులకు సంతకంతో పాటు, ఆసక్తి గలవారికి చదువు చెప్పడం కూడా ఈ సభ్యుల దినచర్యలో ఒక భాగం. ప్రతీ విషయం తెలుసుకొనవలననే ఆసక్తి ముఖ్యంగా ఏ వ్యాధి గురించి మాట్లాడనికి సమాజం భయపడుతుందో, ఆ వ్యాధి గురించి అవగాహన పెంచుకొని, సమాజానికి ఉపయెగపడాలనే ఆత్రుత తోటి సభ్యులకు కష్టాల్లో అండగా నిలబడడం, నేను అనేది మర్చిపోయి మన మహిళలు ఎలా అభివృద్ది సాధించాలి అనే ఆలోచన కలగడం చూస్తే, వారి జీవిత విధానంలో మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. 10 సం.లలో వచ్చిన ఈ మార్పు నాంది అయినప్పటికీ ఇంకా ఎన్నో విషయలలో ముందడుగు వేయల్సి ఉన్నది. మేము ఇచ్చిన రిజర్వేషన్తో ముడిపడివుండండి అనే రోజులు పోయయి. సిసలైన మహిళా సాధికారత, మహిళాభివృద్ధి సాధించటానికి స్వయం సహాయక బృందాల వలనే సాధ్యమవుతుందనే విషయం తేటతెల్లమయినది. ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కొరకు కావలసిన అన్ని వనరులు సమకూర్చి కార్యక్రవల పర్యవేక్షణ నిరంతర ప్రక్రిలాలా జరిగేలా చూడడం వలన కార్యక్రమ పురోగతి ఎప్పటికప్పుడ ఎలా జరుగుతున్నదో తెలుసుకొని అవసరమైన మార్పులు చేసుకోడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేసి, స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో కొన్ని కార్యక్రవలు జరిగేలా ఉండాలనేది కొందరి అభిప్రాయం.
ఏమయినప్పటికీ యిప్పటివరకు నిర్వీర్యంగా వున్న సగభాగం మహిళలను చైతన్య పరిచి జాతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించే విధంగా మార్పు తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది . మహిళలు జాతీయ ఆర్ధిక ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా ఏ దేశ అభివృద్ధి జరుగదు. కాబట్టి మహిళలను ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారత ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా ప్రయత్నిద్దాం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో