మే నెల వస్తుంటే చాలు …. భగ భగ మండే సూర్యుడు గుర్తొస్తే చాలు… అబ్బ! సంవత్సరంలో ఒక్క మే నెల లేకుండా వుంటే బాగుండు…. అమ్మో! ఏమి ఎండలు, నాయనో ఏమివేడి… ఈ ఉ్కపోత ఎపుడైనా చూసామా? జనాల ఆపసోపాలు. నీళ్ళు లేక, కరెంటులేక అష్టకష్టాలు, వడదెబ్బకి పిట్టలు రాలినట్టే… నోళ్ళు తెరిచి ప్రాణాలు విడుస్తున్న ప్రజలు. పరీక్షలు రాస్తున్న పిల్లలు, కూలీ నాలీ చేసుకు బతికే పేదలు వందల సంఖ్యలో మృత్యువాత పడిన విషాదకర దృశ్యాలు. ప్రతి సంవత్సరం ఎండవేడి పెరిగిపోతున్నదే కానీ తగ్గే అవకాశాలు అస్సలు లేవు. ముందు ముందు మరింత మండిపోయే ఎండలే కానీ చల్లదనాల ఊసే ఉండదు. వేసవి అంటే ఠారెత్తిపోయే పరిస్థితుల్నే ఇంకా చూడబోతున్నాం.

హైదరాబాదు 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ చేసుకుంది. ఇంకా పెరిగే అవకాశమే వుంది. హైదరాబాదు అభివృద్ధి అష్టవంకర్లుగా సాగి, ఆకాశ హార్మ్యొలు, అద్దాల మేడలూ అడ్డూ అదుపూ లేకుండా పుట్టుకొచ్చాయి. వెయ్యి, రెండువేల సముదాయాల అపార్ట్‌మెంట్లు, వీటి కోసం భూగర్భాన్ని చీల్చుకుంటూ, లోతుల్లోంచి నీళ్ళను పైకి లాగి, ఇరవై అంతస్తుల దాకా పారించడంతో, గ్రౌండ్‌వాటర్‌ లెవల్స్‌ భూమిలోపల అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాయి. గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకు వెళ్ళినపుడు అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, భవన సముదాయాలు, అద్దాలు మేడలు, ఆ మేడలకి బిగించిన ఎ.సి.లూ, అవి వదిలే వేడిగాలులూ ఇవన్నీ నగరంలో చల్లదనాన్ని పంచేవి కాదు కదా! విశాలమైన రోడ్లయితే వేసుకుంటున్నాం గానీ… దానికి చెల్లించే మూల్యం మాత్రం చల్లదనాన్నిచ్చే పచ్చని చెట్లు అని మర్చిపోతున్నాం. హైదరాబాదు – విజయవాడ రోడ్ల విస్తరణలో దాదాపు పదివేల చెట్లు… అందులో ఎంతో పురాతనమైన, అపురూపమైన చెట్లని కోల్పోవలసి వచ్చింది. ఎక్కడ రోడ్డు విస్తరణ జరిగినా ఇదే పరిస్థితి. సుఖవంతమైన ప్రయాణానికి రహదారులు నిర్మించుకుటున్నాం కానీ…. దాని ద్వారా పర్యావరణానికి ఎంత నష్టం కలిగిస్తున్నామో తెలుసుకోలేకపోతున్నాం.

హైదరాబాదు నగరం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నగరం చుట్టూ నీళ్ళతో కళకళల్లాడే జలాశయాలుండేవి. వాటిని కబ్జాచేసి, కుదించేసి మేడలు కట్టేశాం. పెద్ద పెద్ద తోటలుండేవి. ఉదా: మలక్‌పేటలో మహబూబ్‌ గంజ్‌ పేరుతో పెద్ద మార్కెట్‌ నడుస్తున్న ప్రాంతంలో పెద్ద అడవి లాంటి తోట వుండేది. ఎనభైలలో నేను ఆ ప్రాంతంలో వుండేదాన్ని. రోజూ బస్‌లో ఆఫీసుకు వెళ్ళివచ్చేటపుడు…. ఆ ప్రాంతానికి రాగానే అడవిలో ప్రవేశించిన ఫీలింగ్‌ వుండేది. పచ్చటి తోట, విస్తారంగా వీచే గాలి, వొళ్ళంతా చల్లబరిచే చల్లదనం… అలాంటి తోటలన్నీ సిమెంట్‌ మయమైపోయాయి. కాంక్రీట్‌ జంగల్‌ చల్లగాలిని ఎక్కడి నుండి తెస్తుంది. తన సహజమైన వేడి గాలుల్నే వీస్తుంది కదా! అలాగే బాగ్‌లింగంపల్లి ప్రాంతం కూడా పెద్ద పెద్ద చింత చెట్లతో అడవిలాగా వుండేదట. నిజాం ఇక్కడ వేటాడేవాడని కూడా చెబుతారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు చెట్లకి బదులు ఇళ్ళతో, మనుషులతో, కార్లతో కిక్కిరిసిపోయి ఉక్కపోతని పెంచిపోషిస్తోంది. ఇలాంటి ఎన్నో తోటలు నాశనమైపోయాయి. ముందు ముందు నగరంలో 50 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ఏం చేద్దాం మరి? దీనికి విరుగుడు ఒక్కటే. వంద చెట్లు కొట్టేసిన చోట వెయ్యి చెట్లు నాటాలి. వెయ్యి చెట్లు కొట్టేసిన చోట పదివేల చెట్లు నాటాలి. పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు వగైరాలకి పిండి వంటలు చేసుకుని భోంచేసినట్లు మొక్క నాటడం ఆచారంగా చేసుకోవాలి. గ్రామాల్లో ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తోంది. మొక్కలు నాటి, రక్షించిన వాళ్ళకే పథకాలు వర్తిస్తాయని ఒక ఆర్డర్‌ తెస్తే చాలు పల్లె, పట్టణ ప్రాంతాల్లో మొక్కలే మొక్కలు. పారెస్ట్‌ డిపార్ట్‌మెంటువాళ్ళు పచ్చ సర్టిపికెట్‌ ఇస్తేనే.. మీ ఊరికి అభివృద్ధి పథకాలు అని స్కీమ్‌ పెట్టండి. ఇలా ఎన్నో కొత్త ఆలోచనలు చెయ్యాలి. నా ఫ్రెండ్‌ గీత అన్నట్లు అన్నీ ఉచితంగా పంచుతున్న ప్రభుత్వం ప్రజల్ని సోమరులుగా చెయ్యకుండా, ఉచితంగా మొక్కలిచ్చి పెంచమని నియమం పెడితే ఇళ్ళన్నీ పచ్చగా, ఊరంతా ఆకు పచ్చగా కళ కళలాడిపోదా! ఎండవేడికి విరుగుడు ఆకుపచ్చని చెట్లే కదా? ఏమంటారు???

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో