లైంగిక వేధింపులు, హింస

అనువాదం, సమన్వయం : కాంతి

స్త్రీలపై జరిగే అత్యాచారాలన్నింటిలో పైకి కనబడకుండా ఎన్నో సార్లు, మరల మరలా ఆమెపై జరిగే అతిహేయమైన అత్యాచారం ఈ ‘లైంగికపరమైన వేధింపులు, హింస.

పైగా యింకా ఘోరమైన విషయమేమిటంటే, ఆ రకమైన హింసని ఒక సర్వ సాధారణమైన విషయంగా భావిస్తున్నారే తప్ప ఆమె ‘ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేదానిలా ఎవ్వరూ భావించడం లేదు.

1. అసలు ‘సెక్సువల్ హెరాస్మెంట్’ అంటే అర్ధం ఏమిటి?
కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం, తాకడం లేదా అసభ్య కరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి ‘సెక్స్’ పరమైన అనుచితమైన ప్రవర్తనను ‘సెక్సువల్ హెరాస్మెంట్’ గా అనవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినదేమిటంటే ఈ ‘సెక్స్పరమైన హింస, వేధింపులు, ఎక్కువగా అధికార పూర్వకమైన సంబంధాలలో లేక ఒక వ్యక్తిపై అవమానించి కక్ష తీర్చుకునే విధంగానో (బలిపశువును) చేయడానికో ఉపయెగించ బడుతోంది. పురుషాధిక్య సమాజంలో ఆడవారి కంటే మగవారిని ఎక్కువ అధికారాలు వుండడంతో ఈ సెక్స్ పరమైన హింస’ ఆడవాళ్ళ మీదే ఎక్కువగా జరుగుతోంది. తాము చాలా గౌరవించే వ్యక్తులు తమ మీద లైంగిక పరంగా దాడి చేస్తే స్త్రీలు నిశ్ఛేష్టులవుతున్నారు. తమ ఇంటి జరుగుబాటు కోసం ఉద్యోగం చేసే స్త్రీలను, ఆమె అవసరాలను అడ్డం పెట్టుకుని ఆమెపై ఈ రకమైన హింసకు పాల్పడేవారు వుంటారు. ఒక్కోసారి తనపై అధికారి అటువంటి దాడికి పాల్పడితే, తన ఉద్యోగం పోతుందన్న భయంతో ఆమె చెప్పలేకపోవచ్చు. ఆ విధంగా ఈ ‘సెక్సువల్ హెరాస్మెంట్’ వెలుగులోకి రాకుండా వుండిపోతోంది.
2.ఈ హింస ఏ విధంగా ప్రకటితమవుతుంది?
స్థలంగా చెప్పాలంటే , ఈ సెక్సువల్ హెరాస్మెంట్, ప్రకటితంగా, అప్రకటితంగా అని రెండు విధాలుగా వుంటుంది. అప్రకటిత హింస అన్నది బూతు చేష్టలు, సైగలు, శృంగారపరమైన చిత్రాలు, బూతు పుస్తకాలు చూపించడం వంటివి చేసి ఆ స్త్రీని అసౌకర్యానికి గురి చేయడం జరుగుతుంది. దానిని రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి ఉద్యోగంలో పొందే ప్రయెజనాల కోసం శృంగార పరమైన కోరికలు తీర్చమని అడగడం, రెండోవది అదే పనిగా అధికార దుర్వినియెగం చేస్తూ ఒక వ్యతిరేకమైన ఆఫీసు వాతారణం కల్పించడం అనగా మాటలద్వారా, శారీరకంగా, దృశ్యాలద్వారా బాధ పెడుతూ ఆ వ్యక్తి పనితనాన్ని దెబ్బతీయడం జరుగుత వుంటుంది. ఈ అనారోగ్య పూరితమైన ఉద్యోగ సంబంధాలను సరిదిద్దే బాధ్యత ఆ యజమాని మీదే వుంటుంది.
3. ఈ లైంగిక హింసను అరికట్టే ఆచరణ యెగ్యమైన విధానం ఏదైనా వుందా?
దేశ అత్యున్నత న్యాయస్థానం అమలులో పెట్టదగిన కొన్ని నిబంధనలను రూపకల్పన చేసి, పనిచేసే చోట స్త్రీలపై జరిగే ఈ హింసనరికట్టే ప్రయత్నం చేసింది. ఈ సూత్రాలనమలు పరిచే బాధ్యత అక్కడి యజమానికే అప్పగించింది. తన వద్ద పనిచేసే ఉద్యోగస్థులను ఈ రకమైన హింసకు గురి కాకుండా తగిన ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, మహిళా ఉద్యోగులకు విశ్రాంతి కోసం తగిన స్థలం కేటాయించడం, సంస్థల సర్వీసు నిబంధనలలో ఈ రకమైన హింసను చేర్చి. అది ఒక శిక్షకు గురి కాబడే నేరంగా స్పష్టంగా తెలియజెయ్యలి. ఇటువంటి నేరాలను ఫిర్యాదు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసి, ఫిర్యాదికి న్యాయం జరిగేలా చెయ్యలి.
4.ఈ ‘మార్గదర్శక సత్రాలు’ ఏ విధంగా రపుదాల్చాయి?
1985లో, భన్వారీదేవి అనే మహిళ, మహిళ గ్రామోద్యోగినిగా మహిళా అభ్యున్నతి కార్యక్రమంలో భాగంగా, రాజస్థాన్ ప్రభుత్వం చే నియమించబడింది. గ్రామస్థులకు తమ పిల్లలను పాఠశాలలకి పంపేలా నచ్చచెప్పడం, బాల్యవివాహాలు జరుపకుండా చూడడం, విధవలకు పెన్షన్లు వారికందేలా చేయడం వంటివి ఆమె ఉద్యోగ బాధ్యతలు. 1992లో, బాల్యవివాహాలనడ్డుకుంటోందన్న కోపంతో, పై జాతికి చెందిన ఐదుగురు మగవారు ఆమెపై ‘సామూహిక అత్యాచారం’ చేసారు. దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఒక పెద్ద ప్రభంజనమై మహిళా అత్యాచార్ విరోధి జన్ ఆందోళన్’ (ఖజుఙఅజు) అనే సంస్థ, 20 మంది మహిళలు, మానవ హక్కుల సంఘాలతో కలిపి ఏర్పడింది. జైపూర్లో జరిగిన ఒక పెద్ద ఉద్యమ ఊరేగింపులో ఆ మహిళాగ్రామోద్యోగినులు, నీళ్ళు, జీతాలు, ఆరోగ్యం, హింస అన్నింటిపై ధ్వజమెత్తారు. ఈ వ్యతిరేకత, సామూహిక నిరసనలు న్యాయస్థానాలను ప్రతిస్పందింపజేసాయి. నిరంతరంగా సాగిన ఈ ‘లైంగిక హింస’ వ్యతిరేక ఉద్యమం సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రకమైన ”విశాఖ కేసు తీర్పు”గా వెలువడింది. 1997లో ఇచ్చిన ఈ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం, భారత రాజ్యాంగం లోని 14,19,21 ఆర్టికల్స్ క్రింద, ఉద్యోగిను లైన స్త్రీల ప్రాధమిక హక్కులను అమలు పరిచేలా చర్యలు చేపట్టింది. మన భారతదేశ న్యాయవ్యవస్థలో ‘నిర్ధారిత సూత్రాలు’ లేకపోవడంవలన, సుప్రీంకోర్టు ఇతర దేశాల న్యాయసత్రాలను పరిశీలించి, మహిళలపై జరిగే అన్ని అణచివేత, వివక్షతో కూడిన అన్ని రకాల బేధతత్వాన్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఈ ‘మార్గదర్శక సత్రాలు” రూపొందించింది.
5.ప్రస్తుతం మనదేశంలో వున్న చట్టాలు ఈ ‘లైంగికపరమైన హింస’ అంశాన్ని గుర్తిస్తున్నారా?

అవును గుర్తిస్తురన్నాయనే చెప్పవచ్చు. ఇండియన్ పీనల్కోడ్ మాటలు, శబ్దాలు లేక సైగలు మరియు ఏదైనా ఒక వస్తువుని ప్రదర్శించి తద్వారా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించడంలాంటి చేష్టలతో, ఆమె గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో, చేస్తే శిక్ష తప్పదని చెప్పింది. సెక్షన్లు 354, 509 ఈ విధమైన హింసను క్రిమినల్ లైంగికపరమైన నేరంగా పరిగణిస్తోంది.
ఏది ఏమైనా ఉద్యోగం లేక పని చేసే చోట్ల స్త్రీలపై జరిగే లైంగికపరమైన అత్యాచారాలు, హింసలు నిరోధించే ఒక ప్రత్యేక చట్టం అవసరం చాలా వుంది. ‘విశాఖ’ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన ‘మార్గదర్శకసూత్రాలు’ ఈ సమస్యకు సంపూర్ణమైన నివారణోపాయలు అందించలేకపోయింది. జాతీయ మహిళా కమీషన్ తయరు చేసిన సూచనల బిల్లు ఇంకా ఏవో కూడా ఈ విషయంలో ప్రతిస్పందించేలా, ఆలోచించేలా చేయలి.
10. చాలామంది మహిళలు మాటలద్వారా వ్యక్తపరిచే లైంగిక ప్రవర్తన అనగా వెకిలి మాటలు, రెండర్ధాల హేయమైన మాటలు, కామెంట్స్ లాంటివి నిరపించలేమని భయపడతారు.. ఆ విషయంలో వాళ్ళేం చేయలి?
నిజమే నిరూపణ చెయ్యాలి అన్నది ముఖ్యమైన విషయమే. కాని అటువంటి హింస ఫిర్యాదియొక్క ఉద్యోగ బాధ్యతల లేక పని మీద ప్రభావం చూపి ఆమె నిర్వహణ సామర్ధ్యం తగ్గిందన్నది చూపించడం ద్వారా పరోక్షంగా జరిగే ఈ హింస, ఈ పరిస్థితులనర్ధం చేసుకోవచ్చు. ఆమెపై మానసిక ఒత్తిడి పెరిగి, హాని జరిగిన ఎడల, దానిద్వారా ఆ హింసని నిరూపించవచ్చు. ఇంకా ఆ హింస జరుగుతూనే వుంటే, ఎప్పుడు, ఎక్కడ ఏం జరిగిందో ఎవరెవరు దానికి సాక్ష్యులో అన్న విషయలతో ఒక డైరీ రాయడం కూడా మంచిదే.
11.ఎటువంటి తరహా కేసులు ఎక్కువగా వస్తూంటాయి?
”లైంగిక పరమైన హింస” కేసులే కాని వాటిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఒక మహిళా పోలీసు ఆఫీసరు ఈ హింసకు గురైన కేసులో, ఆమె పిర్యాదును విచారణకు ఒక్కరినే నియమించారు. ఇది పూర్తిగా ”మార్గదర్శక సూత్రాలకు” వ్యతిరేకం. ఎంతమందిని విచారణ కమిటీలో వెయ్యాలన్నది స్పష్టంగా ఆ సూత్రాలలో లేకపోవడంవలన ఈ విధంగా జరిగింది.
12. ఈ హింస విచారణలో ఎదుర్కొనే సమస్యలేమిటి?
నా అనుభవంలో విచారణ కమిటీ సభ్యులలో సరియైన సున్నితమైన స్పందన కరువౌతోంది. భరించలేని బాధ, అవమానంతో శారీరకంగా, మానసికంగా అలజడికి గురైన బాధితురాలిని అడగకూడని ప్రశ్నలు వేసి, మనస్సును గాయపరిచే విధంగా విచారణ జరుపుతున్నారు.
13. నేరం చేసిన వ్యక్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసులు ఉన్నాయ?
అటువంటి కేసులు ఉన్నాయి. ఒక జడ్జి, ఎవరి మీదనైతే లైంగిక హింసకి పాల్పడిననట్లు నేరారోపణ జరిగిందో, అతని ‘ప్రమోషన్’ ఆపివేయబడింది. రాజస్థాన్లో చాలామంది విద్యార్ధినులను వేధించినట్లు రుజువు అయిన ఒక ఉపాధ్యాయుని చర్య చాలా హేయమైనదని, ఇంచుమించు ”రేప్”తో సమానమని భావించి అతనికి 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించారు.
14. సంస్థలు, ఉద్యోగాలనిచ్చే వ్యక్తులు నిజంగా బాధితురాలికి సహాయం చేస్తారా?
”వివిధ” అనే సంస్థ ఈ విషయంలో ఎంతో పరిశోధన జరిపి, ఎన్నో కార్యాలయలకు వెళ్ళి, వార్తా పత్రికల కార్యాలయలకు కూడా వెళ్లి వారి సంస్థలలో ఇటువంటి హింస జరిగే అవకాశమే లేనట్లుగా చెప్పారు. అటువంటివి బయటపడితే వారి పేరు దెబ్బ తింటుందని భావిస్తున్నారు. చాలా తక్కువమంది బాధితురాలికి అండగా నిల్చి, తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతోంది. సంఘాలు సంఘటితమై ఈ విషయన్ని బహిర్గతం చేసి తగిన న్యాయం జరిగేలా చూడాలి. ముఖ్యంగా సమాచార, ప్రసార సాధనాలు ఎంతోమందికి చేరువ కాగలవు కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా కృషి చెయ్యలి.
15.నిందితుల నేరం నిరూపణ అయి, శిక్ష పడ్డ కేసుల నిష్పత్తి ఎలా వుంది? ఒక విచారణ పూర్తి అవడానికి ఎంతకాలం పడుతుంది?
సరైన సమాచారం లేదు కాని నిష్పత్తి చాలా తక్కువే. ”ఉదయపూర్ స్కల్ ఆఫ్ సోషల్ వర్క్” లో ఒక ఉపాధ్యాయురాలు ఒక సీనియర్ ఉపాధ్యాయుని వలన యిటువంటి హింసకు గురి కాబడింది. ఆర్ధికంగా వెనుకబడిన ఆమెను వారు సులభంగా లొంగదీసుకోవచ్చని భావించారు. ఆమె ఫిర్యాదు చేసినప్పుడు, కమిటీ వేసి, అతన్ని ‘సస్పెండు’ చేసారు. కాని అతను ఆ నిర్ణయన్ని వ్యతిరేకిస్తే, మరల యింకొక కమిటీ వేశారు. అక్కడ విచారణ సరిగ్గా జరుగక, ‘మహిళా ఆయెగ్’ వద్దకు వెళ్ళి, ఒక సంవత్సరం కాలం ఆలశ్యం అయింది. ఈ లోగా ఆమెని ప్రమోషన్ యివ్వక, పని ఇవ్వక, అన్ని విధాలా అష్టదిగ్భందనం చేసి నానా హింసలు పెట్టారు. ఆ స్కూలు ప్రిన్సిపాలు, యితర కార్యనిర్వాహక వర్గం కూడా నిందితుడికే సపోర్టు యిచ్చారు. అతను ఆ స్కూలులో చాలా సీనియర్ కాబట్టి. ”విమెన్ కమీషన్” విచారణ చేసి అతన్ని ఉద్యోగంలోంచి తీసెయ్యలని ఆదేశాల్నిచ్చింది కాని అది ఆచరణ జరిగిందా, లేదా అన్నది పట్టించుకోలేదు. ఆఖరుకి, ఆ కేసు హైకోర్టు ముందుకి వచ్చి, అప్పుడు ఆ నిందితుడు ఉద్యోగంలోంచి తప్పించబడ్డాడు. ఈ విచారణకి ఇంతకాలంలో పూర్తి చెయ్యాలన్న సరైన నిబంధన లేక విపరీత కాలయపన జరిగి, బాధితురాలి గుండె బద్దలై నానా బాధాపడుతోంది.
(మహిళల సమస్యలపై విమర్శనాత్మకంగా క్రియ శీలకంగా పనిచేసే ”వివిధ” అనే సంస్థ యొక్క సెక్రటరీ మమతా జైట్లీని సిజోమెర్రీజార్జ్ అనే ఆమె చేసిన ఇంటర్వ్యకి తెలుగు అనువాదం.)

Share
This entry was posted in న్యాయదర్శనం. Bookmark the permalink.

2 Responses to లైంగిక వేధింపులు, హింస

  1. muralidhar says:

    10 పాయింటు: అస్భ్యకర వ్యాక్యల్ని ప్రవరతని నిరూపించె సాధనాలు మార్కెటులొ ఎన్నొ దొరుకుతున్నాయి.చాలా థక్కువ ధఅర్లొ కూడ వుంటున్నై.

  2. Pingback: adderall blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో