– రమాహరిత

ఈ పుస్తకం చదవటం ద్వారా మన పురాణాలను అర్థం చేసుకోగలిగే ఒక అవకాశం లభిస్తుందన్న చిన్న ఆశతో చదవటం ప్రారంభించాను. సాధారణంగా ఏ కథనైనా నాయకుడిని దృక్పథంలో పెట్టుకొని చెబుతుంటారు. ఈ పుస్తకంలో రామాయణంలోని తీవ్రంగా త్రుణీకరించబడిన ప్రతినాయకుడైన రావణుడి పాత్ర యొక్క ఔచిత్యాన్ని ఆకళింపు చేసుకొనే రీతిలో సరికొత్త విధంగా అభివర్ణించడం జరిగింది. ప్రతినాయకుడి యొక్క జీవన సరళి, మరియు వారి మానసిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడింది. ఇది ఆనంద్‌ నీలకంటన్‌ కలం నుంచి జాలువారిన మొదటి రచన వజురీతిజీబి – ఊనీలి శిబిజిలి ళితీ శినీలి ఙబిదీవితిరిరీనీలిఖి. ఊనీలి రీశిళిజీగి ళితీ ష్ట్రబిఖీబిదీబి బిదీఖి నీరిరీ చీలిళిచీజిలివ. ప్రస్తుత కాలంలో ప్రత్యామ్నాయ పురణాధారిత రచనలు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆమిష్‌ త్రిపాటి వ్రాసిన ఊనీలి |ళీళీళిజీశిబిజిరీ ళితీ ఖలిజితినీబి, ఊనీలి ఐలిబీజీలిశి ళితీ శ్రీబివీబిరీ బిదీఖి ఊనీలి ంబిశినీ ళితీ ఙబిగిబిచీతిశిజీబిరీ ఈ కోవకు చెందిన పుస్తకాల్లో అత్యంత ఆదరణ పొందినవే. ఈ ఆధునిక తరానికి చెందిన రచయితలు పురాణాలలో ఖ్యాతి గాంచిన వ్యక్తులకు సంబంధించిన కథలను మిక్కిలి నాటకీయంగా సమర్పించి కొత్త తరానికి మనోరంజకంగా అందజేస్తూ ప్రజాధరణను పొందుతున్నారు. ఇటువంటి కొత్త కాల్పనిక సాహిత్యం యువతను పౌరాణిక పాత్రల యొక్క ప్రాసస్త్యాన్ని అర్థం చేసుకోవడానికి, వారికి మన పురాణాల మీద వున్న జిగ్ఞాసని తీర్చడానికి దోహద పడుతున్నాయి. కాబట్టి ఈ రచనలు అందరి అభిమానాన్ని పొందుతున్నాయి.

మహర్షి కశ్యపుని సంతానమైన దేవతలు అసురులు వుండే కాలాం దగ్గర్నుంచి ఈ కథ చెప్పటం ఆరంభించారు. ఇరువురూ నిరంతరం ప్రతీ విషయానికి పొట్లాడుకుంటూ వుండేవారు. ఋగ్వే వేదం నాటి కాలంలో దైత్యులను, దానవులను అసురులుగా భావించేవారంట. వారూ నీతికి, సామాజిక విషయములకు అధినేతలుగా వ్యవహరించగా, దేవతలు ప్రకృతికి సంబంధించిన వ్యవహారాలను నిర్వర్తించేవారు. కాలాంతరంలో అసురుల ప్రవర్తన ప్రతికూలముగా మారినది పర్యవసానంగా అసురులు అసుర సంపద కలవారుగా, దేవతాలు దైవీ సంపద కలిగినవారుగా యోచించడం జరిగినది. దైవీ సంపద అనగా దైవత్వం లేక సూక్ష్మమైన లక్షణములతో కూడిన వారుగా, అసుర సంపద భౌతిక లేక స్థూలమైన విషయములతో కూడినది. కనుక వీరు సామాజికంగా, సాంఘికంగా, ధర్మపరంగా భిన్న ప్రవర్తనలతో మెలిగేవారు.

బహుశా రామాయణం గురించి తెలియని వారు ఎవరు వుండరేమో. ఈ పుస్తకంలోని ప్రత్యేకత రావణుడి పాత్రకు గల అసమానమైన గుణములను, యోగ్యతలను భిన్నమైన రీతిలో సమర్పించబడటం మరియు రావణుడు అసురులలో అత్యంత శ్రేష్ఠమైన రాజుగా కొని యాడబడటం. నిరంతర కృషితో, దీక్షతో రావణుడు అసురుల యొక్క కీర్తి ప్రతిష్ఠలు తారా స్థాయికి చేర్చడానికి ఎంతో దోహద పడినాడు. అచంచలమైన పట్టుదలతో యావత్‌ భారతదేశానికి రాజు కావాలన్న కాంక్షను కూడా సుసాధ్యం చేసుకున్నాడు. రావణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, జ్యోతిష్యం, ఖగోల శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కలవాడు. రావణుడు కేవలం ఒక మానవ మాత్రుడు, కాని ఒక లక్ష్య సాధనతో, దృఢ సంకల్పంతో గొప్ప అసుర సామ్రాజ్యం స్థాపించి మహాబలి నాటి కాలంలో అసురజాతికి వున్న వైభవం తిరిగి సంపాదించాలని కాంక్షించాడు. అతని వ్యక్తిత్వంలో సగటు మానవుడికి వుండే అన్ని అంశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి – మోసం, ద్వేషం, పగ, కుట్ర, మిధ్య, గర్వం, అహంకారం, దురాభిమానం, పక్షపాతం మెండుగా గోచరిస్తాయి. వీటితో పాటు తీవ్రమైన నిర్ణయ లోపాలు వల్ల ఎంతో కష్టపడి నిర్మించుకున్న అసుర సామ్రాజ్యం రాముడితో జరిగిన యుద్ధంలో నేలమట్టమైంది.

అసురులు దేవతల మధ్య పరస్పరం భారతదేశం యొక్క ఆధిపత్యం కొరకు యుద్ధాలు జరుగుతూనే వుండేవి. దేవతల యొక్క ప్రతినిధి రాముడు. రావణుడు పూర్తిగా భిన్నమైన స్వభావం కలిగినవారు. మితిమీరిన ఛాందసంతో, తీవ్ర ధర్మ నిరతితో, దుష్కరమైన పద్నాలుగు ఏళ్ళ అరణ్య వాసంలో తనని వెన్నంటి వున్న భార్యని, తమ్ముడిని కూడా పోగొట్టుకున్నాడు. తనకు అత్యంత ఆప్తులైన వారిని దూరము చేసుకొని ఎనలేని దుఃఖాన్ని, మనోవేదనని, తీవ్రమైన అసంతృప్తిని మూటగట్టుకున్నాడు.

ఈ నవలలోని మరి యొక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి భద్ర. అతిసామాన్యుడు, నిర్ధిష్టమైన స్వభావం లేని వాడు. కాని అతనికి వున్న ఒకే ఆయుధం తీవ్రమైన ప్రతీకార వాంఛ. దానితో రావణుడికి అతి కీలకమైన విజయాన్ని అందించి ఈ కథ యొక్క పూర్తి పరిణామాన్ని అసురులకు అనుకూలంగా మార్చివేస్తాడు. కాని అంతటి దుస్సాయధ్యమైన కార్యాన్ని సాధించుటకు అతను అనుభవించిన చిత్రవదని, వేదనని ఎవ్వరూ గుర్తించరు, అభినందించరు. చివరకు ఆదరణ కూడా చూపరు. ప్రాణాలను పణముగా పెట్టి సాధించిన విజయాన్నీ ఎవ్వరూ ఆదరించనందున అణగబడ్డ మనుస్సు రాక్షస పూరిత ఆలోచనలతో, నిస్పృహ నిర్వేదనలకు గురౌతాడు.

ప్రతీ అధ్యాయములో అసురులు మరియు దేవతల జీవన విధానము, సమాజంలో మహిళల యొక్క స్థానం, ఆచారాలు, పద్ధతులు, సామాజిక విలువలు గురించి కూడా చక్కటి ఉదాహరణలతో వివరించారు. ఈ నవల ద్వారా కథలోని పాత్రలు మన ప్రస్తుత సమాజంలో వుండే వివిధ రకములైన మనుషులను అన్వయించి వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా విశ్లేషించారు. మొదట రాముడు లాంటి వారు – వీరిని దేవుని యొక్క అవతారంలా భావిస్తాము, ఎందుకంటే వీరు శక్తి వంచన లేకుండా నిరంతరం ధర్మ మార్గంలో పయనిస్తుంటారు. శాస్త్రానుసారముగా జీవిస్తారు, సాధారణంగా వీరు అసంతృప్తిగా వుంటారు. ఎందుకంటే వారు శాస్త్రాలను ఛాందసముగా నమ్ముతారు. దీని పర్యవసానంగా ఒక్కోసారి మానవత్వం కాదని తెలిసినా అది శాస్త్రబద్ధమని అనుకొని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ధర్మం కోసం సర్వం త్యాగం చేస్తారు. తరువాత కోవకు చెందినవారు రావణులు – వీరు మొండి పట్టుదల కలవారు, ఎవ్వరి మాటా లక్ష్యపెట్టరు, ఆచారాలకు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వుంటారు, మూర్ఖులు, వారికి ఇష్టమైన పద్ధతిలో జీవితాన్ని సాగిస్తూ వితండ వాదనతో, తొట్టరు పాటు నిర్ణయాల వల్ల ఇక్కట్ల పాలు అవుతారు. దీని పరిణామంగా జీవితాన్ని కూడా నష్టపోతారు. మూడవ కోవకు చెందిన వారు భద్ర లాంటి వారు. వీరికి ఒక అస్తిత్వం వుండదు, జీవితంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కూడా వుండదు, ఉన్నతమైన ఆలోచనలకు, ఆదర్శాలకు చాలా దూరంగా వుంటారు. ఈ విశాల ప్రపంచంలో ఎంతో మంది పుడుతారు చనిపోతారు వీరు కూడా అందులో ఒకరు. ఎవ్వరికీ వీరి గురించి తెలియదు, ఎవ్వరూ వీరిని పట్టించుకోరు. ఇక ఒక ప్రత్యేక కోవకు చెందిన వారు విభీషణులు. వీరు బ్రతకనేర్చిన వారు, శాస్త్రాలను, సాంప్రదాయాలను, తమ సౌలభ్యానికి మార్చుకొని, ఎంటువంటి దుశ్చర్యలకైనా వెనకాడక జీవితాన్ని గడుపుతారు. వీరికి నీతి, నియమం, బాంధవ్యంతో పని లేదు. ఇతరుల గురించి చింత అసలే లేదు. వారి జీవితం వారికి ముఖ్యం.

ఈ విశాల ప్రపంచంలో పలు విధములుగా బ్రతకవచ్చు. కాని ఎవరైతే వారి జీవితాన్ని సన్మార్గంలో మలుచుకుంటూ, నీతి నియమములతో మెలుగుతూ ఎనలేని పేరు ప్రఖ్యాతులు గణిస్తారో వారే ధన్య జీవులు. అటువంటి వారి జీవన విధానము, వారి నమ్మకాలు, ఆశయాలు, ఆమోదయోగ్యమైనవి. ఒక ఆశయం, లక్ష్య సాధన లేని జీవితం నిరర్ధకం. మనము ఎప్పుడైతే క్రోధం, ప్రేమ, అసూయ, భయం, అభిమానం, స్వార్థం, కార్యసిద్ధి, ఆడంబరం, అత్యాస, సమద్రుప్తి/బుద్ధి లాంటి ఉద్వేగాలను స్వాధీనంలో పెట్టుకుంటామో మన వ్యక్తిత్వాన్ని మనకు అనుగుణంగా / మంచి దిశలో మలచుకో గలుగుతాము.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో