– పిట్ట నర్సింగం,

స్త్రీల హక్కులు మానవ హక్కులలో ఒక భాగం. మానవ సమాజంలో స్త్రీలు సగభాగం కనుక మానవ హక్కులు వారికి వర్తిస్తాయనేది వాస్తవం. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో హెచ్‌జీ వెల్స్‌ మానవహక్కుల ప్రణాళిక తయారుచేయదలిచి ప్రపంచ నాయకుల సహాయం కోరుతూ మహాత్మగాంధీని కూడా కోరారు. గాంధీజీ బాధ్యతల మీద కూడా నొక్కి పెట్టమని ఆనాడు సలహా చెప్పారు. 1948లో మానవహక్కుల ప్రకటనను (డిసెంబర్‌ 10, 1948) ఐక్యరాజ్యసమితి వారు ఆమోదించారు. సపావట్‌ సుందర్‌, యం.బి. భాస్కర్‌ బాలికల హక్కులు

బాలిక అనే పదానికి అనేక రకాలుగా అర్థాలు చెప్పవచ్చు. 1929 బాల్య వివాహా నిషేధ శాసనం ఇప్పటివరకు అనేక సార్లు సవరణ చేయబడింది. ఆ శాసనం ప్రకారం, ఆంధ్ర బాలబాలిక శాసనం ప్రకారం 18 సంవత్సరాలు నిండని స్త్రీని మాత్రమే ”బాలిక” అంటారు. భారతీయ శిక్షాస్మృతి మైనర్ల నేరాల గురించి ప్రస్తావిస్తుంది. రైలు, బస్సు టికెట్ల సందర్భంగా 12 సంవత్సరాలు నిండకపోతే బాలికగా పరిగణించబడుతుంది. అయితే భారతీయ సమాజంలో 14 ఏళ్లు నిండని ఆడపిల్లను బాలికగా పిలవడం సర్వసాధరణం. విశ్వమానవ హక్కుల ప్రకటన భారత రాజ్యాంగంలో మౌలిక హక్కుల విభాగం, ఆదేశిక సూత్రాల విభాగాలను ప్రతిపాదికగా చేసుకొని బాలికల హక్కులను నిర్వచించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన పదేళ్లలోగా 14 సంవత్సరాలు నిండే వరకు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఇది కేవలం ఒక ఆశగా, ఆకాంక్షగా మాత్రమే మిగిలిపోయాయి.

రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఆరుదశాబ్దాలు దాటినా బాలబాలికల ఉచిత నిర్భంధ విద్య నేతి బీరచందంగానే మారింది. ఈ వైఫల్యానికి తల్లిదండ్రులు నిరక్షరాస్యతే కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. విద్యను అభ్యసించే సమయంలో మధ్యలోనే బడిమానేసిన వారి సంఖ్య బాలురకంటే బాలికల సంఖ్యే ఎక్కువ. పాఠశాలల్లో బాలికల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్యతో పాటు, రెసిడెన్షియల్‌ సిస్టంను తీసుకొచ్చింది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దూరప్రాంతాల నుంచి పాఠశాలలకు తరలివచ్చే బాలికలు ఇబ్బందిపడుతున్నారని గమనించి వారికి సైకిళ్లను అందచేశారు.

బాలికల హక్కులపై అమెరికా ఏమంటోంది…!

ప్రకృతి సిద్ధమైన మానవ హక్కులు (శ్రీబిశితిజీబిజి జీరివీనీశిరీ) స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు మూలమని అమెరికా రాజ్యం ఉద్ఘాటిస్తోంది. ఇతరులు ఎవరు హరించడానికి వీలులేని హక్కులని విశ్వమానవ హక్కులని పేర్కొంటుంది. వాటికి గీటురాళ్లు మానవుని అస్తిత్వం, వ్యక్తిత్వం, విలువలు, హుందాతనం, జీవిత సాఫల్యం, మానవ మూలిక హక్కుల పట్ల విశ్వాసం, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక అభ్యుదయం, వ్యక్తి శ్రేయస్సు, జీవన ప్రమాణ పెంపుదల తద్వారా విస్తృత స్వేచ్ఛా వాతావరణం సృష్టికి ఇవి కీలక ఆధారాలు.

అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడకపోవడం నాటి సంస్కృతి. అసలు అమ్మాయినే పుట్టనివ్వకుండా చేయడం నేటి సంస్కృతి. జీవించడానికి స్వేచ్ఛకు భద్రతకు ప్రతి వ్యక్తికి హక్కు ఉంది. వి.మా.ప్ర.ఆ (అధ్యాయం 3) ఆడపిల్ల పుట్టగానే చంపే సమాజాలు, అమ్ముకునే తెగలు భారతదేశంలో ఉన్న చట్టం వివిధ సాంఘిక దురాచారాల నుంచి స్త్రీలకు రక్షణ కల్పిస్తుంది. ఆడ శిశువుల హత్య, స్త్రీలను కించపరచడం, మానభంగం చేయడం, కిడ్నాప్‌ చేయడం, పనిస్థలంలో అక్రమంగా నిర్బంధించడం, లైంగికంగా వేధించడం వంటివి కొన్ని ఉదాహరణలు. ఆడశిశువులను హత్యచేయడం, గర్భ విచ్చిత్తికి పాల్పడమని భార్యను బలవంతం చేయడం ఐపీసీ కింద నేరాలుగా గుర్తించిన గృహహింస చట్టం కిందకి (ఈళిళీలిరీశిరిబీ ఙరిళిజిలిదీబీలి) వస్తుంది. 15 ఏళ్లు నిండితే వివాహాన్ని కాదనవచ్చని ముందు స్త్రీకి అధికారం ఇచ్చిన (హిందూ వివాహ శాసనం), రజస్వల అయిన తర్వాత పెళ్లికి నిరాకరించవచ్చని ముస్లిం స్త్రీకి అధికారం ఉందని ప్రకటించినా (ముస్లింలా) 18 సంవత్సరాలు నిండని బాలికలు, యువతులు, అయిష్టంగా దాంపత్యం సహించవలసి వస్తుంది. ఇవి నేరమని తెలిసినా కానీ స్త్రీలు, సమాజాన్ని ఎదిరించడం లేదు. యువతుల స్వతంత్ర వివాహాలకు సమ్మతించని సమాజాలు ఎన్నో ఉన్నాయి.

భారతదేశంలో సామాజిక – ఆర్థిక సమస్యలలో ఒకటి బాలకార్మిక వ్యవస్థ. ఇటీవల అంటే అక్టోబర్‌ 10, 2006 నుంచి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని అమలుచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకోసం నిర్బంధ విద్యను మరింత బలోపేతం చేయాలి. నేటికి మన దేశంలో 8.7 కోట్ల బాలకార్మికులున్నారని అంచనా. రాజ్యంగ 23వ ప్రకరణలో 14 ఏళ్లు నిండని బాలబాలికలను ప్రమాదకర పనుల్లో ఉండకూడదని, దోపిడికి గురికాకూడదని, మానసిక శారీరక దౌర్భల్యానికి గురికాకూడదని ఉంది. భారతదేశం జనాభారీత్యా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, బాలకార్మిక విషయంలోకి వస్తే అగ్రస్థానంలో ఉండటం దౌర్భాగ్యం. పారిశ్రామిక విప్లవంతో మొదలైన ఈ బాలకార్మిక వ్యవస్థ పెట్టుబడిదారి విధానం వివిధ దశలలో ముందుకుసాగే క్రమంలో చివరకు ధనిక పారిశ్రామిక దేశాలను వదిలి భారతదేశంలాంటి వర్ధమాన దేశాల్లో కేంద్రీకృతమైంది.

ఆరోగ్యానికి హానికరమైన ప్రమాదకర పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలతో ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ పిల్లలు శాశ్వతంగా బానిసత్వంలోకి మగ్గిపోతున్నారు. శారీరక, మానసిక వికాసాన్ని దెబ్బతీసే వాతావరణంలో కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు దూరంగా గొడ్డు చాకిరిచేస్తూ జీవించడం అలవాటైపోయింది. చదువుకునే అవకాశాలకు దూరమై విలువైన బంగారు భవిష్యత్‌ బుగ్గిపాలవుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ.) నిర్వచనం ఇచ్చింది. ఇది ఇలా ఉంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వచనం ప్రకారం బాలకార్మికులు అంటే 5-14 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండి పాఠశాలకు వెళ్లని బాలబాలికలని చెప్పడం జరిగింది.

తమిళనాడులోని శివకాశిలో అగ్గిపెట్టెల తయారీ, బాణాసంచా విభాగాల్లో పిల్లలకు మందు నింపడం, బాణాసంచాలు లెక్కించడం, చుట్టలు అంటించడంలాంటి పనులు బాలికల చేతనే చేయించడం జరుగుతుంది. గాజు పరిశ్రమలలోనూ వారి వినియోగం ఎక్కువే. గాజు పరికరాలను శుభ్రపరచడం, తయారైన ఉత్పత్తులను నగిషీ పెట్టడం, లోపాలు ఉన్న వస్తువులను వేరుచేయడం, కరిగించిన గాజును మోసుకుపోవడం చేస్తున్నారు. ఇంకా మన రాష్ట్రంలో పత్తిపంట సాగులో బాలికలను పనిచేయిస్తున్నారు. చిత్తు కాగితాలు స్వీకరించడం, బూటు పాలిష్‌తో పాటు అసాంఘిక కార్యకలాపాలైన స్మగ్లింగ్‌, వ్యభిచారం, దొంగసారా, మాదక ద్రవ్యాల రవాణా అమ్మకాల పనుల్లో, తివాచీలు నేయడం, వజ్రాలను సానబెట్టడం వంటి పలు ప్రమాదకరమైన పరిశ్రమల్లో బాలకార్మికులు కనిపిస్తారు. ప్రతిరోజు కుళ్లిన చెత్తను ఏరడంతో వారు అనేక చర్మవ్యాధులకు గురి అవుతున్నారు. 2010లో దేశంలో జరిగిన అత్యాచారాలు జరిగిన 22,254 బాధితుల్లో 14 ఏళ్లలోపు వారు 1,975, 14 నుంచి 18 ఏళ్ల లోపు వారు 3,770. దేశంలో 34 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. ప్రతి పది అత్యాచారాల్లో ఆరు బాలికలపై జరుగుతున్నాయని గణాంకాలు తెలియచేస్తున్నాయి. 16 సంవత్సరాలలోపు వయసు గల స్త్రీ అంటే మైనర్‌ బాలికతో సంబంధం పెట్టుకోవడాన్ని మానభంగంగా పరిగణించాలి. 1860 బాలిక శిక్షాస్మృతి చట్టంలోని 16 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తిని మేజర్‌గా లేదా వయోజన వ్యక్తిగా ఏ చట్టం పరిగణించదని గమనించాలి. తల్లిదండ్రుల కారణంగా 16 సంవత్సరాల వయసులో బాలిక వివాహం చేసుకున్నట్టయితే ఆ వివాహాన్ని బాల్యవివాహంగా పరిగణిస్తారు. అందువల్ల అది నేరం కిందకి వస్తుంది. ఈ పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఐపీసీలోని 375 విభాగం ఎక్కువగా స్త్రీలకు అనుకూలమైంది. మానభంగం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈ విభాగంలో లొసుగులున్నాయి. ఒక మానభంగం కేసులో బాలికను పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నందున మానభంగం చేసిన వారికి శిక్ష లేకుండా కేరళ హైకోర్టు తీర్పు చెప్పడం ముఖ్యంగా గమనించదగినది. అందువల్ల స్త్రీలకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ సందర్భంగా 18 సంవత్సరాలలోపు వయసు గల స్త్రీల సమ్మతితో లేదా సమ్మతి లేకుండా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని మానభంగంగా పరిగణించడానికి 1860 ఐపీసీకి ఒక సవరణ చేయడం జరిగింది.

జాతీయ మానవహక్కుల సంఘం

జాతీయ మానవహక్కుల సంఘం, బాలల, స్త్రీల మానవహక్కుల పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. జైళ్లలో, అబ్జర్వేషన్‌ హోంలలో, బాల నేరస్తుల కేంద్రాలలో హింస, మరణాలు, మానభంగాలు సంభవించినప్పుడు కమిషన్‌కు వెంటనే తెలియచేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తుంది. బాలలతో వ్యభిచారం చేయించడం పట్ల, స్త్రీలపై పెరుగుతున్న హింస, దోపిడి, నేరాల పట్ల కమిషన్‌ తన వార్షిక నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కమిషన్‌కు చెప్పిన ఫిర్యాదులపై విచారణ నిర్వహిస్తుంది.

ప్రభుత్వ చర్యలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేసి అనేక పథకాలను కార్యక్రమాలను ప్రారంభించాయి. బ్యూరో ఆప్‌ మైక్రో క్రెడిట్‌ డెవలప్‌మెంట్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌, పబ్లిక్‌ ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, రాష్ట్రీయ మహిళకోడ్‌, సెంట్రల్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు మొదలగునవి ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.

వివక్ష : ఈ విషయంలో మానవహక్కుల ప్రకటన ఏమంటుందో చూద్దాం. ”శాసనం దృష్టిలో అందరూ సమానం. వివక్ష లేకుండా అందరికి శాసనం వల్ల సమానమైన శిక్షణ ఇవ్వాలని వివక్ష నుంచి అందరికి రక్షణ కావాలి. అంతేకాదు వివక్షను ప్రోత్సహించడం తగదు”.

”మతం, జాతి, కులం, లింగ భేదం, జన్మస్థానం లేదా వీటిలో ఏ ఒక్కదానిపైన ఆధారపడి ఏ పౌరుని ఎడల రాజ్యం వివక్ష చూపరాదు. భారత రాజ్యాంగం (15) (1). అయితే 15 (3) అధికరణ ప్రకారం స్త్రీలకు, బాలబాలికలకు అనుకూలంగా ప్రత్యేక సదుపాయాలను రాజ్యం కల్పించవచ్చు.

ఈ సందర్భంగా దీనికి విశ్వమానవ హక్కుల ప్రకటన తీసిపోలేదు. బాల్యం యెడల, మాతృత్వం యెడల ప్రత్యేక శ్రద్ధ చూపెట్టవలెను, సహాయం చేయవలెను. వివాహ బంధంలో కాని బంధం వెలుపల కాని జన్మించిన బాలబాలికలందరికి సమానమైన రక్షణ ఇవ్వవలెను.

పిల్లలు వివాహితులకు జన్మించినా, అవివాహితులకు జన్మించినా సమానులు. సామాజిక రక్షణకు పాత్రులు (వి.మా.హ.ప్ర.అ 25 (2)) భారత రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలు ఇంత స్పష్టంగా లేవు. ప్రైవేటు రంగంలో ఈ సూత్రాన్ని అమలుపరిచే అధికారులు లేకపోవడం బాధాకరం.

భారత రాజ్యాంగం ఇలా చెబుతుంది. బాలబాలికలను, యువతీయువకులను ఇతరులు దోచుకోకుండా దుర్మార్గంగా వాడుకోకుండా రక్షించవలెను. అలాగే వారు భౌతికంగా, నైతికంగా నిరాధరణకు పాత్రులు కాకుండా కాపాడబడాలి. ఇంత ఆడంబరంగా, ఆర్భాటంగా, చేసిన ప్రకటనల సారాంశం ఏమిటి?

1) బాలిక యెడల వివక్ష పనికిరాదు

2) బాలికను దోపిడి నుంచి, నిరాదరణ నుంచి రక్షించవలెను

సమాజంలో స్త్రీల యెడల వివక్ష ప్రబలంగా ఉన్నదని సామాజిక శాస్త్రజ్ఞులందరికి తెలుసు. బాలికల విషయంలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఆహారము, వస్త్ర వసతి, వేతనాల విషయంలో వివక్షకు గురవుతూనే ఉన్నారు. చివరకు కుటుంబంలోనూ అదే పరిస్థితి. పొలాల్లో, ర్మాగారాల్లో పనివిషయంలోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది.

ఐక్యరాజ్యసమితి (ఏశ్రీం) ”మానవ హక్కుల ప్రకటన 1948 ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన మానవహక్కుల కమిషన్‌ ప్రతిపాదనలను 1989లో వెలుగులోకి తెచ్చి పిల్లల హక్కులను పరిరక్షణకు దారి సుగమం చేసుకునేందుకు ఒక ప్రత్యేక నివేదికను తయారుచేసింది. దానినే ‘కన్వెన్షన్‌ ఆన్‌ రైట్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌’ అని పిలుస్తున్నారు. మానవజాతి చరిత్రలో పిల్లల హక్కుల విషయంలో సీఆర్‌సీ ఒక మైలురాయి వంటిది. పిల్లలకివ్వవలసిన గౌరవం, కల్పించాల్సిన రక్షణ, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు అన్ని ఇందులో స్పష్టంగా ఉన్నాయి. సీఆర్‌సీలో ఉన్న 54 నిబంధనలలో నాలుగు రకాల హక్కులను ప్రస్తావించడం జరిగింది.

అవి

1) ఉనికికి సంబంధించిన హక్కులు (సర్వైకల్‌ రైట్స్‌)

2) అభివృద్ధికి సంబంధించిన హక్కులు (డెవలప్‌మెంట్‌ రైట్స్‌)

3) రక్షణకు సంబంధించిన హక్కులు (ప్రొటెక్షన్‌ రైట్స్‌)

4) భాగస్వామ్య హక్కులు (పార్టిసిపేషన్‌ రైట్స్‌)

ఈ ప్రతిపాదనలను అంగీకరించిన 159 దేశాల్లో ఒకటిగా భారతదేశం 1992వ సంవత్సరంలో సీఆర్‌సీపై సంతకం చేసింది. ఫలితంగా బాలల హక్కుల అమలుకు నాగరిక జీవనానికి మార్గం సుగమం చేయడంతో మన దేశం భాగస్వామి అయింది.

బాలికల హక్కుల ప్రాధమికతను, ప్రాధాన్యతను గుర్తించాలి. బాలికల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. ఇది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకు సానుభూతికి పరిమితం కాకూడదు. మన జాతీయ విధానాలకు, కార్యక్రమాలలో బడ్జెట్‌ ఓ బహిరంగ వ్యక్తిగత జీవితాలలో ఇది ప్రతిఫలించాలి. కేవలం పేదరికం కారణంగా బాలకార్మికులు ఏర్పడటం లేదు. పేదరికానికి గల కారణాలలో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. దీన్ని నిర్మూలిస్తే పేదల పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

వ్యాసరచనలో ఉపకరించిన వ్యాసాలు :

1) మానవహక్కులు, మహిళల హక్కులు, బాలికల హక్కులు – మల్లాది సుబ్బమ్మ (తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక – మే 1991)

2) భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ – ఒక పరిశీలన – ఆర్‌. రవికుమార్‌ (తెలుగు జనవరి – మార్చి 2008)

3) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన – నిర్బంధ విద్య, క్షేత్ర స్థాయి అధ్యయనం – డాక్టర్‌ టి. సత్యనారాయణ, కే. వీరస్వామి (తెలుగు మాసపత్రిక జనవరి – మార్చి 2008)

4) మహిళలు – మానవహక్కులు – ప్రొఫెసర్‌ బి. సుగుణ (తెలుగు మాసపత్రిక జులై-సెప్టెంబర్‌ 2008)

5) ఆకాశంలో సగం ఆత్మఘోష – డాక్టర్‌ శ్రీమతి సి. శేషారత్నం (తెలుగు విద్యార్థి విద్యా సాంస్కృతిక మాసపత్రిక మార్చి 2013.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.