ఉర్దూ సాహిత్యంలో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు

(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన
ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.)
అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి

(‘పూరే కద్ కా ఆఇనా’, ‘ఉర్ద, ఫునన్ ఔర్ అదబ్’, ‘గాఅబ్ ఔర్ ఫుననే లతీషా’, ‘గర్దిశ్-ఏ-పా’ లాంటి 10 పుస్తకాల రచయిత, ‘జెహన్-ఏ-జదీద్’ అనే (ప్రముఖ త్రైవసిక సాహిత్యపత్రిక సంపాదకుడు జుబేర్ రిజ్వీ (జననం 1936) ప్రసిద్ధ ఉర్ద కవి, విమర్శకుడు. 1991 నుండి ఈ పత్రికను వెలువరిస్త ఈయన భారతదేశంలో రచించబడిన ఉర్ద, హిందీ రచనలను దేశ-విదేశాల్లోని ఉర్ధు పాఠకులకందజేస్తున్నారు. (ఆకాశవాణిలో డైరెక్టరుగా పనిచేసి పదవీవిరమణ చేసిన శ్రీ రిజ్వీ బాల్యం హైదరాబాదులో గడిచింది. కాచిగూడా హైస్కలు నుండి హైయర్ సెకండరీ పాసయిన తర్వాత ఉత్తర భారతదేశం వచ్చేశారు. ఆ తర్వాత కూడా హైదరాబాదులో జరిగిన అనేక ఉర్ధు ముషాయిరాల్లో పాల్గొన్నారు. హైదరాబాదును తన రెండో ఇల్లుగా భావిస్తారు.) డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కథన్’ అనే త్రైవసిక హిందీ సాహిత్య పత్రిక సంపాదకులు, పేరువెసిన హిందీ రచయిత. 25కు పైగా నవలలు, కథా సంపుటాలు, అనువాదాలు, వ్యాససంపుటాలు వెలువరించారు. వీరు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రీడరు పదవి నుండి పదవీవిరమణ చేశారు.)

రమేశ్ ఉపాధ్యాయ: ఉర్ధు సాహిత్యంలో స్త్రీవాదం ఏ స్థితిలో ఉందో చెప్పండి.
జుబైర్ రిజ్వీ : ఉర్ధు సాహిత్యంలో స్త్రీవాదం మొదటినుండీ బలంగానే ఉంట వచ్చింది. కానీ, మీరు దాన్ని వేరుగా గుర్తించడానికి అది ఏదో ఒక ఫ్యాషన్ రూపంలో లేదు. స్త్రీల పక్షం వహించి మొదట పురుషులు చాలా రాశారు. తర్వాత స్త్రీలు రాయడం మొదలుపెట్టారు. ఇస్మత్ చుగ్తాయ్, కుర్రతులైన్ హైదర్ మొదలైన వారి గురించి మీకు తెలుసు. పాకిస్తాన్లో బానో కుద్సియ ఉంది, కిశ్వర్ నాహీద్ ఉంది, ఫహమీదా రియజ్ ఉంది, అజరా బాజ్ ఉంది. జమీలా హశ్మీ మొదలైనవారున్నారు. ఈ మధ్య పాశ్చాత్యదేశాలనుండి వచ్చిన స్త్రీవాదం కూడా కనిపిస్తుంది, సాహిత్యానికి స్త్రీలు ఇచ్చింది ఏమిటి? స్త్రీలగురించి పురుషులు రాసిన దానికి, స్త్రీలు రాసిందానికి మధ్య తేడా ఏమిటి? అనే అంశాల గురించి చర్చ జరుగుతంది. ఇదికాక, కేవలం స్త్రీల రచనలనే తీసుకొని పత్రికలు ప్రత్యేక సంచికలు ప్రచురించడం, లేదా కవితాసంపుటాలు, కథాసంపుటాలు ప్రచురించడం కూడా జరుగుత ఉంటుంది. దీనివల్ల స్త్రీల రచనలకు, పురుషుల రచనలకు మధ్య ఉండే కొంత తేడా తెలిసివచ్చేవట నిజమే అయినా రెండింటి మధ్య విరోధం ఏమీ లేదు. ఎందుకంటే స్వాతంత్య్రానికి, సమానత్వానికి సంబంధించిన విలువలు వ సాహిత్యంలో చాలావరకు మునుపునుంచీ ఉన్నాయి. అందువల్ల పురుషుల రచనల్లో కూడా స్త్రీవాదం ఉంది.

రమేశ్ ఉపాధ్యాయ : మరి భారతదేశంలోని ముస్లిం కుటుంబాల్లో ఇప్పుడు స్త్రీ పరిస్థితి ఎలా ఉంది?
జుబైర్ రిజ్వీ : చూడండి, ముస్లిం సమాజం కూడా మొత్తం భారతదేశ సమాజంలోని భాగమే. అందువల్ల బయటి సమాజంలో ఏది జరుగుతందో, దాని ప్రభావం ముస్లిం సమాజం పైన పడకుండా ఉండదు. ముస్లింలు ముస్లింవాడలో నివసిస్త ఉండినా, రోజూ 8-10 గంటలు తమ పనిపాటల కోసం బయటే ఉంట ఉంటారు. స్కూలు, కాలేజీ, ఆఫీసు, బజారు, ఎక్కడ పనిచేసినా జనసావన్యంలో కలిసి జీవిస్తారు. అందువల్ల సాయంత్రం ఆ స్త్రీగానీ, పురుషుడుగానీ, ఇంటికి తిరిగివచ్చినప్పుడు బయటి సమస్యలుగానీ, బయటి సంగతులుగానీ, చర్చలుగానీ తనతో తీసుకురాకుండా ఉండడం సాధ్యపడదు. అంతేకాక ఇంట్లో టీ.వీ., రేడియె, వార్తాపత్రికలాంటివి ఉండనే ఉంటాయి. ఎవరైనా వీటినుండి ఎలా తప్పించుకోగలరు? కళ్ళు మూసుకొని ఉండలేరు కదా! వీటి అన్నింటివల్ల ముస్లిం సమాజంలో చాలా మార్పు వచ్చింది, చాలా ఆధునికత వచ్చింది. అయినా ఒక సమస్య ఉంది. అదేమిటంటే మీడియ మొదలైనవాటిలో ఈ కొత్త ఆధునిక ముస్లిం తన సవజానికి ప్రతినిధిత్వం చేస్త కనిపించడం లేదు. అక్కడ కనిపించేది మతవాదులు, మతం పేరుతో రాజకీయలు నడిపేవాళ్ళు, వాళ్ళను కూడా ముందుకు ఎందుకు తెస్తారంటే ముస్లింలను నమాజుతో, మసీదుతో ఫండమెంటలిజంతో జోడించి చపడానికి. అయెధ్యలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఎవరో ఒక మౌలవీని పట్టుకొచ్చి, దీనికి పరిష్కారం ఏమిటో చెప్పండి అని అడుగుత ఉంటారు. 12-15 కోట్ల ముస్లింలలో మిగతావాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేదాన్ని పట్టించుకోరు. ముస్లింలు ఏమేమి సాధించారు, మొత్తం సవజంలోని ఏ ఏ రంగాల్లో ఎంత విలువైన కృషిచేశారు అనేది కూడా చెప్పరు. నేటి ఆధునిక ముస్లిం జీవితపు యథార్థ చిత్రణ ఉండే సాహిత్యం చాలా తక్కువగా రాయడం జరుగుతంది. అలాంటి చలనచిత్రాలు కూడా తక్కువగానే తయరవుతున్నాయి.
రమేశ్ ఉపాధ్యాయ : మీరు మనదేశంలో వెలువడిన ఉర్ద సాహిత్యంలో నుంచి స్త్రీవాద రచనలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? అంటే నేటి ముస్లిం కుటుంబాల గురించి స్త్రీలు రాసిన కథల గురించి…..

జుబైర్ రిజ్వీ : నిజానికి హిందీ, ఉర్ద సాహిత్యాల్లో కొంత తేడా ఉంది. మా ఉర్ధులో భూస్వామ్యవ్యవస్థకు చెందిన సమాజంలో ఉండే అన్నివైపులనుండి మూసుకున్న బంధనాల్లో చిక్కిన, ఊపిరి సలపనివ్వని వాతావరణ చిత్రణ, అక్కడినుండి ఎలా బయటపడాలి అనే చింత ఉన్న కొన్ని రచనలు ఉండడమేవె ఉన్నాయి. కానీ, హిందీలోలాగా ఆధునికతగల, సాహసంతో కూడిన రచనలు చేసే రచయిత్రులు లేరు. కారణమేమంటే, ముస్లింలలో 50-60 సంవత్సరాల మునుపు వరకు కూడా ధనికవర్గానికి చెందిన, పరువు-ప్రతిష్ఠలు కలిగిన కుటుంబాలు ఉంటే ఉండేవి. ఆ కుటుంబాల్లోనివారు ఆడపిల్లలకు చదువు చెప్పించకుండా ఉండటమే గౌరవప్రదంగా భావించేవారు. చదవడం-రాయడం సన్నకారు మనుషులు చేసే పని అనీ, తమ పని కాదనీ వారు భావించేవారు. వవద్ద డబ్బు బాగా ఉంది, మా పిల్లలకు చదువు చెప్పించడం వల్ల ప్రయెజనమేమిటి? అని అనుకునేవారు. నవాబులు, జాగీర్దార్లు ఆడపిల్లలకు చదువు చెప్పించడం మంచిది కాదని భావించే సంస్కృతిని ఈ విధంగా పెంపొందించారు. అందువల్లనే ఉర్దలో రచయిత్రులు ఎక్కువగా కనిపించరు. ఎక్కడో ఒక ఇస్మత్ చుగ్తఈ, ఒక జిలానీ బానో కనిపిస్తే కనిపిస్తుంది, అంతే. అంతేగాని, ఆడపిల్లలు చాలావరకు చదువురానివాళ్ళుగానే ఉండిపోయేవారు. వారికి – ”ఇస్లామ్ నియమనిబంధనల్లో ఉండండి, మిమ్ములను మీరు శుచిగా, పవిత్రంగా ఉంచుకోండి, చెడునుండి దూరంగా ఉండండి” అని బోధించేవారు. మతంనుండి వచ్చిన ఈ సామాజిక విలువలన్నీ సాహిత్యంలో కూడా అభివ్యక్తి పొందాయి. అలాంటప్పుడు ఉర్ధులో స్త్రీల స్త్రీవాద రచనలు వచ్చే అవకాశం ఎక్కడుంది? స్త్రీల దశ-దుర్దశ గురించి పురుషులు రాయడం మాత్రం జరుగుత వచ్చింది, వాళ్ళు బాగా రాశారు కూడా.

రమేశ్ ఉపాధ్యాయ : ముఖ్యంగా అభ్యుదయవాదయుగంలో…..
జుబైర్ రిజ్వీ : అవును. కాని హిందీ, ఉర్ద సాహిత్యాల్లో మరో తేడా కూడా ఉంది. ఉర్ధు సాహిత్యంలో భయాందోళనలతో కూడిన వాతావరణం ఉండడం మీరు చడవచ్చు. హిందీలో అది అంతగా కనిపించదు. ఉర్ధు సాహిత్యంలో భయంతో కూడిన మనిషి చిత్రణ తరుచుగా జరుగుతుంది. నేనేమైపోతాను? నా ఉద్యోగం, లేదా నా వ్యాపారం ఉంటుందా, పోతుందా? నా ఇల్లు కాల్చివేయడం జరగదు కదా? నేను ప్రాణాలతో ఉంటానా, లేదా? నా పిల్లల భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలు, భయలు మనిషిని పీడిస్త ఉంటాయి. ఈ భయం మతకలహాల గుండా ఉర్ద సాహిత్యంలోకి వచ్చింది. ఈ భయం కారణంగానే ఉర్ధు సాహిత్యంలో కొన్ని విషయల ఆవృత్తి సారిసారికి జరుగుత ఉంటుంది. ఉదాహరణకు వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోవడం, మనిషి గాయపడడం, అద్దం ముక్కలు-ముక్కలు కావడం, పడవ మునిగిపోవడం, లేదా నలువైపులా అంతులేని అంధకారం వ్యాపించడం, ఇలాంటివి. కవిత్వంలోనే కాదు, ఉర్ధు కథాసాహిత్యంలో కూడా మీరు అశాంతితో దారిన నడిచిపోతున్నట్లు, మిమ్మల్నెవరో వెంటాడుతున్నట్లు, లేదా మీరు అడవిగుండా పోతంటే తారసపడిన ఒక పరిచితవ్యక్తి హఠాత్తుగా శత్రువుగా వరినట్లు, అతడు నన్ను చంపేస్తాడేవెననే భయం మీకు కలిగినట్లు చిత్రించడం కనిపిస్తుంది. ఉర్ధుసాహిత్యంలో ఇలాంటి భయం, అభద్రతాభావం ఉన్నప్పుడు జనవాదం, స్త్రీవాదం లాంటి విషయలు అణిగిపోతాయి, లేదా ఉపేక్షకు గురి అవుతాయి.
రమేశ్ ఉపాధ్యాయ : మీరు స్వయనా కవులు. ‘జెహన్-ఏ-జనీద్’ అనే ఉర్ద సాహిత్య పత్రిక నడుపుతున్నారు కదా, మీ కవిత్వం ద్వారా, మీ పత్రిక ద్వారా మీరు చేస్తున్న పనిలో అన్నిటికంటే ప్రధానమైంది ఏమిటి?

జుబైర్ రిజ్వీ : మతతత్వ దుష్ప్రచారం వల్ల భారతదేశంలో ముస్లింల, పాకిస్తాన్లో హిందువుల చిత్రణ ఏదైతే జరుగుతందో అది తప్పు, నిరాధారమైంది అనే మాటను అనుభతి, అవగాహన రెండు స్థాయిల్లో ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకు భారతదేశ ప్రజలకు ముస్లింలు ఈ దేశం కోసం ఎలాంటి మంచిపనులు, గొప్పపనులు చేశారు, మొత్తం భారతీయ సమాజంలో వాళ్ళు ఏ విధంగా విడదీయరాని రీతిలో కలిసిపోయి ఉన్నారు, అనే విషయన్నీ, పాకిస్తాన్ ప్రజలకు హిందీ కేవలం హిందువులకు చెందిన భాష, ఉర్ద కేవలం ముస్లింలకు చెందిన భాష కాదు, హిందీ, ఉర్ద సాహిత్యాల్లో మూలాధారమైన భేదం ఏమీ లేదు, అనే విషయం అర్థమయే విధంగా చెప్పాలనేది నా ప్రయత్నం. మా పత్రిక పాఠకులు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. పత్రికలో మేము హిందీ కథలు కూడా చాలా ప్రచురించాం. మీ కథ కూడా ప్రచురించాం. దాని ప్రభావం కూడా అక్కడ కొంత కనిపించింది. వివేకవంతుడైన ఒక రచయిత ఎలా ఆలోచించాలో, ఆ విధంగానే హిందీవాళ్ళు కూడా ఆలోచిస్తారని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ విధంగా మేము భారతదేశంలో అందర కాదు, కొందరే మతతత్వ భావనతో వట్లాడతారు అనేదానికి ఋజువులు ప్రోగుచేశాం.

రమేశ్ ఉపాధ్యాయ : ఒక చిన్న ప్రశ్న. మీ స్వంత రచనల్లో కుటుంబం, ప్రజాస్వామ్యం, వీటికి సంబంధించిన విషయలేమైనా ఉన్నాయ?
జుబైర్ రిజ్వీ : ప్రజాస్వామ్యం పైన నాకు నమ్మకం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచిస్తాను కూడా. అందువల్ల ప్రజాస్వామ్యం నా రచనల్లో తప్పక ఉంటుంది. కుటుంబానికి సంబంధించినంత వరకు నా కవితల ఒక పూర్తి సీరీజ్ కుటుంబానికి చెందిందే ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పమంటారా? మీ సాహిత్యంలో ఉన్న ‘అర్ధాంగి’కి సంబంధించిన భావన (కాంసెప్ట్) ఉర్ధులో లేదు. ఉర్ధులో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు. గాలిబ్ లాంటి కవిలో కూడా ప్రేయసే ఉంది. భార్య లేదు. భార్య ఆయన గద్యంలో ఉంది. కవిత్వంలో లేదు. ఇక అర్ధాంగి వత్రం మొత్తం ఉర్ద సాహిత్యంలో ఎక్కడా లేదు. నేనీ భావనను నా కవితల్లో తీసుకురావడానికి ప్రయత్నించాను. నా కవితల ఒక సీరీజ్ ఉంది. దాని పేరు ‘మన్కోహా’. ఉర్ధులో ‘మన్కోహా’ అంటే ‘ఎవరితో నికాహ్ (పెళ్ళి) అయిందో, ఆమె’ అని అర్థం. ఈ సీరీజ్లోని ఒక కవిత్వం నమూనాగా మీకు వినిపిస్తాను –
ఇక ఆమె నిదల్రేస్తుంది
నిదప్రోయేవాళ్ళనలా ఒకసారి చస్తుంది
చెదరిన వెంటుక్రలను కొప్పులో ముడుచుకుంటుంది
తన బట్టల మడతలను విదిలిస్తుంది
తేలికైన వ్యాయమంతో ఒళ్ళును మేల్కొల్పి
నిలువెత్తు అద్దంలో
ఆపాదమస్తకం తన్ను చూసుకుంటుంది
చిరునవ్వు నవ్వుతుంది
బాల్కనీనుండి బయట పరుచుకుంటున్న ఉదయన్ని పరికిస్తుంది
చెరుగు తలపై కప్పుకొని
అజాన్ (నవజుకు పిలుపు) వింటుంది
స్నానం చేస్తుంది, శుచి అయి
నమాజు విధి-విధానాల్లో లీనమైపోతుంది
చాలాసేపు భక్తిభావంతో
తన దేవుని స్మరిస్తుంది, పార్థ్రిస్తుంది
వంటగదిలోకి వెళ్తుంది
బల్లమీద ఫలహారం వడ్డిస్తుంది
అందరికీ కొద్ది-కొద్దిగా వారి-వారి వంతు
పేమ్ర పంచిపెడుతుంది
అనుబంధ-బాంధవ్యాల పుష్పాలు చేతికిచ్చి
అందరినీ సాగనంపుతుంది
చివరన ఇంట్లోకి పోత నావంతుగా
మండే ఇంటి అవసరాల
ఒగరు, చేదు సంబంధాల
అగ్గిమంటలను
నా అరచేతిలో ఉంచుతుంది!

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో