– ఏల్లబోయిన సాంబరాజు 2

అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌, సికింద్రాబాద్‌, బేగంపేటలోని జీవనజ్యోతి ప్రాంగణంలో 8,9వ తేదీ మే 2013న రెండు రోజులపాటు నావో (జాతీయ మహిళా కూటమి) రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలలనుంచి 140 మంది మహిళలు నవో సభ్యులుగ పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి ప్రముఖ ఉర్దూ రచయిత్రి పద్మశ్రీ జిలానీబాను గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు అలానే ప్రముఖ స్త్రీవాద రచయిత్రులు వసంత్‌ కన్నాభిరాన్‌, కొండవీటి సత్యవతి, గోగు శ్యామల గార్లు ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. వీరితోపాటు జి. సత్యవతి, మేరే అల్ఫన్సా, తిరుపతమ్మ, లలితమ్మ, జమీలా నిషాత్‌ వంటి మహిళ హక్కులకోసం పనిచేస్తున్న సంస్థల బాధ్యులు మాట్లాడారు.

అస్మిత సంస్థ అధ్యక్షులు పద్మశ్రీ జిలానీబాను గారు మాట్లాడుతూ మీడియాలో స్త్రీల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూపిస్తున్నారు. ఎంత ఎక్కువగా స్త్రీ తన శరీరాన్ని ప్రదర్శిస్తే అంత వినోదం అనే ధోరణి ఉంది. దేశంలో ఇంత మంది రచయితలు ఉన్నా స్త్రీలపై జరుగుతున్న హింసల గురించి రాసే వాళ్ళు తక్కువైయారు. ఎన్‌జీవో కార్యకర్తలు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అస్మిత వ్యవస్థాపక సభ్యులు వసంత్‌ కన్నాభిరాన్‌ గారు మాట్లాడుతూ ప్రపంచీకరణ కాలంలో మహిళలపై జరిగే హింసను అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాలి. స్త్రీలపై జరిగే హింసను ఒక చెదురుముదురు సంఘటనగా కాకుండా ఒక యుద్ధంగా అర్థం చేసుకోవాలి. ఒక యుద్ధాన్ని నివారించటానికి పెద్ద ఎత్తున ఎన్ని చర్యలు చేపడ్తామో అదే స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ హింసను ఆపగలం అన్నారు.

అలానే దేశ వ్యాప్తంగా ఉన్న నవో ఫోకల్‌ పాయింట్స్‌లో అస్మిత మొదటిస్థానంలో ఉంది అంటే దానికి కారణం చురుకుగా పనిచేస్తున్న నవో సభ్యులే అని వసంత్‌ కన్నాభిరాన్‌ గారు చెప్పారు. షాహీన్‌ సంస్థ బాధ్యులు జమీలా నిషాత్‌ గారు మాట్లాడుతూ పాతబస్తీలో మహిళలకు రక్షణ లేదు. దీన్ని పోలీసులు సాధారణ విషయంగానే చూస్తున్నారు. మార్పు అనేది ధైర్యం గల మహిళలు, యువతుల వల్లే సాధ్యం అవుతుంది అన్నారు.

ఈ సమావేశములో మొదటిరోజు రెండవ సెషన్‌గా ప్రతినిధులు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి ఐదు గ్రూపులుగ ఏర్పడ్డ వాళ్ళ ప్రాంతంలో స్త్రీలపై ఎలాంటి హింసల జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఈ సమస్యలకు సమాజం, ప్రభుత్వం ఏ మేరకు కారణం అవుతుంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడానికి కారణాలేంటి? నిర్ణయాధికారంలో స్త్రీలు లేకపోవటంవల్ల కలిగే నష్టాలు ఏమిటి? వంటి అంశాలపైన ఈ గ్రూపులు విపులంగా చర్చించాయి.

ఈ సమావేశం రెండవ రోజు మొదటిసెషన్‌లో ప్రముఖ స్త్రీవాద పత్రిక ‘భూమిక’ సంపాదకులు కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ అభివృద్ధి మన జీవితాలను మెరుగుపర్చాలి కాని స్త్రీలపట్ల మరింత హింసకు, అక్రమ రవాణాకు, దాడులకు దారితీస్తుంది. మీడియా జడ్జిమెంట్‌ వైఖరిని మనం వ్యతిరేకించాలి. మీ పని మీరు చేసుకోండి అని మీడియాకు చెప్పాల్సినవసరం ఉంది అన్నారు. ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల గారు మాట్లాడుతూ నేటి వారసత్వ రాజకీయాలు నిర్భయ వంటి సంఘటనలను మర్చి పోవాలే, బంగారు తల్లి పథకాన్ని చూసి ఓట్లు వేయాలే అనే ధోరణిలో స్త్రీలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు. కాని ఈ రోజు ఉద్యమాల ప్రభావంవల్ల పితృస్వామ్య వ్యవస్థపై, పెత్తందారులు తట్టుకోలేనంతగ చైతన్యం స్త్రీలలో ఉంది. స్త్రీల హక్కులు, రాజకీయ భాగస్వామ్యం అంటే అది ఒక రాజకీయపరమైన డిమాండ్‌. దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది అని పేర్కొన్నారు. ఆ తర్వాత సిఏసిఐఆర్‌ – అస్మిత అసిస్టెంట్‌ డైరక్టర్‌ పల్లవి గుప్తా మాట్లాడుతూ చట్టసభల్లో రాజకీయ భాగస్వామ్యం అనేది స్త్రీల కనీస రాజకీయ హక్కు. మనం ఈ దేశ పౌరులం. శాసన సభలలో మన భాగస్వామ్యం ఉండాలి అని డిమాండ్‌ చేశారు.

రెండవ రోజు రెండవ సెషన్‌లో ప్రాంతాల వారీగా ఉన్న గ్రూపులు చట్టసభలో మహిళా రిజర్వేషన్ల అవశ్యకతను చర్చించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించటం కోసం నవో సభ్యులుగ వారి డిమాండ్స్‌ మరియు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ నవో సభ్యుల డిమాండ్స్‌

స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పించినట్లే చట్టసభల్లో కూడా కల్పించాలి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంతోపాటు మహిళలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించేవరకు సార్వత్రిక ఎన్నికలతో సహా అన్నిరకాల ఎన్నికలను బహిష్కరిస్తూ మహిళలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉండాలి.

గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు మహిళా ప్రజాప్రతినిధులు కలిసి ఒక కూటమిగ ఏర్పడి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ వర్గాల స్త్రీలకు, జనాభా ప్రాతిపదికన రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించాలి.

రాజకీయపరమైన, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధికి పూర్తి స్వేచ్ఛతో కూడిన అధికారం ఉండాలి.

మధ్యపాన నిషేదం అమలు చేయాలి.

మహిళలపై లైంగిక దాడులు, హింస, హత్యలకు పాల్పడినవారికి చట్టం ప్రకారం విచారణ జరిపి శిక్ష విధించాలి.

త్వరితగతిన మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా మహిళా కోర్టులు ఏర్పాటు చేయాలి.

రాజకీయాలలో కులం, మతం ప్రభావం తగ్గించడానికి కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఇలాంటి వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించాలి.

మహిళలకై ప్రత్యేకంగా ఉన్న ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌ నవో సభ్యుల కార్యాచరణ ప్రణాళిక

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించడంకోసం నవో సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం గ్రామ స్థాయినుంచి పెద్ద ఎత్తున ఉద్యమనిర్మాణం చేస్తాం.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరపత్రాలు, సదస్సుల ద్వారా గ్రామస్థాయిలో నవో సభ్యులు మహిళలలో రాజకీయ అవగాహనను పెంచటానికి కృషి చేస్తాం.

స్త్రీలు రాజకీయాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న అశాస్త్రీయ భావజాలాన్ని, అపోహలను తొలగించటం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

రాజకీయ పార్టీల ప్రణాళిక తయారీలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చూస్తాం.

మహిళలకు బడ్జెట్‌లో న్యాయమైన వాటాకోసం ప్రత్యేకమైన బడ్జెట్‌ ఏర్పాటు ఉద్యమిద్దాం.

స్వచ్ఛంద సంస్థల ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ప్రజలలో మహిళా రాజకీయ భాగస్వామ్యం, మహిళల రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంకై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ప్రజాప్రతినిధులను కలిసి మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదంకై ఒత్తిడి తీసుకువస్తాం. దీంతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సంతకాల సేకరణ మెమోరాండం సమర్పించాలనుకున్నారు.

ఈ రెండు రోజుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో ప్రధానమైనవి :

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పెద్ద ఎత్తున హింస పెరుగుతుంది. మహిళల మానవ హక్కుల ఉల్లంఘన విస్తృతంగా జరుగుతుంది. కాబట్టి నవో తరపున ఏడాదికాలంపాటు మహిళల మానవ హక్కుల ఉల్లంఘనపై మహిళా నిఘా కమిటీలను చేసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కమిటీకి 3 సభ్యుల చొప్పున 15 మందితో ఐదు నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలి. వీటిని (వుమెన్స్‌ రైట్స్‌ వాచ్‌) మహిళా నిఘా కమిటీలుగా పేర్కొనాలి అన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంకై పోరాటానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని (పోస్టర్లు, కరపత్రాలు మొ||) అందిస్తూ పూర్తి సహకారాన్ని ఎన్‌జీవోలకు నవో అందించాలి అని కోరారు. అలానే గ్రామస్థాయి నుంచి మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంచటం, మహిళల రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి నవో బలమైన ఉద్యమనిర్మాణం చేయాలి అని తీర్మానించారు.

ఇలా రెండు రోజులపాటు మహిళలలో కొత్త చైతన్యాన్ని రగిల్చిన సమావేశానికి చివరలో మహిళా నిఘా కమిటీలకు 15 మంది సభ్యులను నవో సభ్యులు ఎన్నుకోవటంతో రాష్ట్రస్థాయి సమావేశం ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో