,

– ఎమ్‌. సుచిత్ర

కౌలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించవలసిన ఆంధ్రప్రదేశ్‌ చట్టం తీవ్రంగా విఫలమయ్యింది.

తూర్పు గోదావరి జిల్లా తాడిపత్రి గ్రామంలో సమినీధి వసంతరాయుడు తన భార్యతో కలిసి శాస్త్రోక్తంగా తమ కొడుకు ఐదవరోజు కర్మలు నిర్వర్తిస్తున్నాడు. హరిబాబు విషం తాగి మార్చి 25à°¨ ప్రాణాలు తీసుకున్నాడు. ”వాడికి 25 సంవత్సరాలు” అని తల్లి భోరున ఏడ్చింది.

హరిబాబు తీవ్రమైన ఇబ్బందులలో కూరుకుపోయేడు తండ్రి క్షయ వ్యాధి సోకడంవల్ల ఒక్కసారిగా ఇంటిని పోషించే భారం తన భుజాలమీద పడింది. తరతరాలుగా వీరి కుటుంబం వ్యవసాయం చేస్తున్నా వారికి స్వంత భూమి లేదు. హరిబాబు 1.2 హె. భూమి ఒక పెద్ద రైతు దగ్గర సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేలా కౌలుకు తీసుకొని వరి, ప్రత్తి సాగు చెయ్యటం మొదలుపెట్టేడు. వడ్డీ 36 శాతం చొప్పున అతడి అప్పు వడ్డీ వ్యాపారి దగ్గర 1,50,000 రూపాయలు దాటింది. క్రితం సంవత్సరం అక్టోబరులో వచ్చిన నీలం తుఫానువల్ల పంట మొత్తం నష్టపోయాడు. కోతల సమయానికి మొత్తం పంట నాశనమయ్యింది. ”భూమి యజమాని కూడా జాలి చూపించలేదు. వెంటనే డబ్బులు మొత్తం కట్టాలని వత్తిడి చేసాడు” అన్నాడు తండ్రి. కాని ప్రభుత్వం తుఫాను వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లిస్తుందన్న విషయం వీరికి తెలియదా? ”భూమి నష్టపరిహారం యజమానికి ఇస్తారు” అన్నాడు వసంతరాయుడు. ప్రభుత్వం ఒక సంవత్సరం క్రితం ప్రవేశపెట్టిన కొత్త చట్టం ప్రకారం కౌలు చేసుకొనే వ్యవసాయదారునికి నష్టపరిహారం లభిస్తుందన్న సంగతి ఈ కుటుంబం వారికి తెలియదు. హరిబాబు తల్లితండ్రులు అతని ఆత్మహత్య గురించి పోలీసులకు గాని ఇతర ప్రభుత్వ అధికారులకు గాని తెలియపరచలేదు. ”మాకు పోలీసులు అన్నా, శవ పంచనామా అన్నా భయం” అన్నాడు వసంతరాయుడు.

నీలం తుఫాను తరువాత గొల్లప్రోలు బ్లాకులో ఆత్మహత్య చేసుకున్న వారిలో హరిబాబు పదమూడవ వాడు. ”హరిబాబు కుటుంబం వారిలానే మిగతావారు కూడా ఆత్మహత్యకేసు నమోదు చెయ్యించలేదు” అన్నారు జి. అప్పారెడ్డి తూర్పు గోదావరి జిల్లా ఆల్‌ ఇండియా కిసాన్‌ సభా (జు|చఐ) కార్యదర్శి. సుమారు 50 మంది వ్యవసాయదారులు ఐదు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వీరందరూ వెనుకబడిన కులాలకు, షెడ్యూల్డు కులాలకు మరియు షెడ్యూల్డు తెగలకు చెందినవారు. వీరందరికి ఏ సంస్థల నుంచి రుణ సదుపాయం కలుగలేదు (అంటే బ్యాంకుల నుంచి రుణం లాంటివి). వీరెవ్వరి దగ్గర కూడా కౌలుకు సంబంధించిన వ్రాత పత్రాలు లేవు కాబట్టి వీరి ఆత్మహత్యలకు కారణం వ్యవసాయం వల్ల కలిగిన తీవ్ర వత్తుడులేనని బాధితుల కుటుంబాలు నిరూపించటం చాలా కష్టం.

అధికసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు పాలుపడిన మొదట ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటే. నేషనల్‌ కెమె రీకార్డ్స్‌ బ్యూరో ప్రకారం (శ్ర్పీుష్ట్రఔ) 1995 నుండి 2011 వరకు సుమారు 33,236 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో దాదాపు అందరూ చిన్న రైతులు లేక కౌలు చేసుకునే రైతులే. కౌలు చేసుకునేవారిలో చాలామందికి స్వంతభూములు లేవు. ఉన్నా ఒక ఎకరం కన్నా చిన్నవి. చాలామంది మరణాలు నమోదు చెయ్యించరు. ఎందుకంటే వారివద్ద సంబంధిత కౌలు వ్రాతపత్రాలు వుండవు. కొన్ని లెక్కల ప్రకారం సుమారు 25 లక్షల ఆత్మహత్యలు జరిగివుంటాయని అని అంచనా, కాదు 40 లక్షలని జు|చఐ వారు భావిస్తున్నారు. ”ఆశ్చర్యం లేదు శ్ర్పీుష్ట్రఔ వారు 2011 సంవత్సరంలో 2,206 ఆత్మహత్యలు జరిగాయని చెబితే రాష్ట్రప్రభుత్వం మాత్రం అవి 141 అని తీర్మానించేరు” అని జు|చఐ అధ్యక్షుడు ఎస్‌. మల్లారెడ్డి అన్నారు.

పొలాలు కౌలుకు తీసుకునే ప్రక్రియ కోస్తా ఆంధ్రా జిల్లాలైన తూర్పు మరియు పశ్చిమ గోదావరులలో చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ సాగునీటి జలాలకు ఇబ్బంది వుండదు. ఆ రెండు జిల్లాల్లో 5 లక్షల మంది వ్యవసాయదారులు అక్కడవున్న సుమారు సగం భూములు కౌలు చేసుకుంటారు. ”దురదృష్టవశాత్తు భూమిని కష్టపడి సాగుచేసుకునే వ్యవసాయదారులకు లభించవలసిన పంట రుణాలు, నష్టపరిహారాలు, విత్తనాలు మరియు ఎరువులు మీద రాయితీలు మొదలైన ఆర్థికసహాయం అంతా భూస్వాములు పొందుతున్నారు” అని రాష్ట్ర కౌలు రైతుల సంఘం (జు|చఐ) ఆధ్వర్యంలోని, అధ్యక్షుడు బి. బలరాం చెప్పారు.

భూములు కౌలుకు ఇచ్చేవారిలో అధికశాతం వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, మిల్లు యజమానులు వున్నారు. వీరిలో చాలామంది పెద్ద పట్టణాలలో లేక ఇతర దేశాలలో ఉంటారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 11 శాతం పెద్ద రైతుల వద్ద 42 శాతం సాగుభూమి వుంది. మిగిలిన భూమిని 89 శాతం మంది రైతులు అంటే చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులు సాగుచేసుకుంటున్నారు. చిన్న రైతులు పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడుల ధరలు భరించలేక స్వంతంగా సాగు చెయ్యక భూమిని కౌలుకు ఇస్తున్నారు.

రుణాలకు అనుమతి

భూపంపిణీ విధానాలని సంస్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం 2004 సంవత్సరంలో అప్పటి గ్రామీణ పరిపాలనా మరియు పట్టణ అభివృద్ధి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. రెండు సంవత్సరాల తరువాత కమిటి ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం రాష్ట్రంలో కౌలు చేసుకునే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది కాని వారి ఆదాయ వివరాలు మాత్రం లభించడం లేదు అని నిర్ధారించేరు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు చట్టం 1980 నుంచి అమలులోకి వచ్చింది. దాని ప్రకారం కౌలు తీసుకునే వ్యక్తులు తమ పేరులు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. కాని ఆ చట్టాన్ని ఎప్పుడూ అమలుపరచలేదు. కోనేరు కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిలో ముఖ్యమైనవి, భూస్వాములకు భూమిపైన అధికారినికి భంగం కలగకుండా కౌలురైతుల హక్కులను రక్షించటం. ఎప్పటివరకు కౌలు రైతులకు ప్రభుత్వ రుణాలు అందవో అప్పటివరకూ వారు యజమానుల గుప్పెట్లోంచి బైటపడలేరు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డును పంపిణీ చెయ్యాలని కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు చేసింది.

ఈ కమిటీ సిఫార్సుల మేరకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయదారుల చట్టం 2011 అమలులోకి వచ్చింది. ఆ చట్టం ముఖ్య ఉద్దేశ్యం కౌలు రైతులకు న్యాయపరమైన సహాయాన్ని అందించి తద్వారా వారికి కొన్ని సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కలిగించటం. చట్టం ద్వారా కౌలు రైతులు రుణాలు తదితర రాయితీలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం అర్హత కార్డు మాత్రం క్రొత్తగా చేయించుకోవాలి. కార్డు పొందినవారు పంట రుణాలు, రాయితీలు, నష్టపరిహారాలు, పంట బీమా పొందవచ్చు. కౌలు రైతులు తాము కౌలు తీసుకున్నట్లు రెవెన్యూ అధికారి వద్ద ప్రకటించి ఒక పత్రం సమర్పించాలి. రెవెన్యూ అధికారి ఆ పత్రం పరిశీలించి పంట రుణాలు పొందడానికి అర్హత గల రైతుల పేర్లు బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకులు కార్డు కలిగిన వ్యక్తులకు ఎటువంటి పత్రాలు అడగకుండా రుణాలు జారీచేస్తారు. బ్యాంకులు పంట రుణాలు రైతులందరికి వడ్డీ లేకుండా ఒక లక్ష రూపాయలు వరకూ మంజూరు చేస్తాయి. ఎవరైతే సకాలంలో సొమ్ము తిరిగి చెల్లిస్తారో వారికి మూడు లక్షల రూపాయల రుణం మూడు శాతం వడ్డీకి లభిస్తుంది. తాటిపర్తి గ్రామానికి చెందిన హరిబాబుకి అర్హత కార్డు వున్నా ఆర్థికసహాయం దొరకటం కష్టమైంది. ఆ కార్డులు రుణాలు పంపిణీ చేసే సంస్థ ప్రస్తుతం చిక్కుల వలయంలో వున్నాయి. 2011-12 సంవత్సరంలో రెవెన్యూ శాఖ 576,147 కార్డులు పంపిణీ చేసింది, బ్యాంకులు 393 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసాయి అంటే ఒక్క శాతం కన్నా తక్కువ వ్యవసాయ రుణాలు (రూ.58,000 కోట్లు) ఇచ్చారు. 2012-13 పంపిణీ చేసిన కార్డులు, రుణాలకు చాలా తక్కువ. రెవెన్యూ శాఖ 1,250,000 కార్డులు ఇవ్వాల్సి వుండగా కేవలం 423,328 ఇచ్చారు, బ్యాంకులు రూ.270 కోట్ల రుణాలు మంజూరు చేసేరు . వ్యవసాయ శాఖ వారికి ఇచ్చిన లక్ష్యం రూ.2,000 కోట్లు.

2012లో ఎంతో పోరాటం తరువాత కేవలం 15 శాతం మంది రైతులకు రుణాలు లభించాయి. ”రెవెన్యూ శాఖ ముందు బ్యాంకులు ముందు ఎన్నో ఆందోళనలు చేసాం” అని పశ్చిమగోదావరి జిల్లా కొత్తూరు గ్రామం కార్డు గ్రహీత పెల్లపోతు రెడ్డి చెప్పారు. అతను అతనిలాంటి కార్డులు కలిగిన రైతులందరిని ఆ ప్రాంతంలో వున్న అన్ని బ్యాంకుల దగ్గర నుంచి బకాయిలు లేనట్లు పత్రాలు తీసుకుని రమ్మన్నారు. ”రెవెన్యూ శాఖ వారు అర్హత కల రైతులందరి జాబితా బ్యాంకులకు పంపినా, భూమి యజమాని దగ్గర నుంచి మరియు మిగిలిన సాక్షుల దగ్గరనుంచి వ్రాతపత్రాలు తీసుకుని రమ్మని వత్తిడి చేస్తున్నారు” అని అన్నారు. అతను ఇంకొక ఐదుగురు రైతులు ఒక సమూహంగా ఏర్పడి 12 లక్షల రుణం పొందేరు.

రుణ అర్హత కార్డు ఒక న్యాయపరమైన పత్రం కనుక కౌలు రైతులు కొంతకాలం తరువాత భూమి మీద తమ అధికారం స్వంతం చేసుకుంటారేమో అని భూస్వాములు భయపడుతున్నారు. చాలా గ్రామాలలో భూస్వామి ఒత్తిడి భరించలేక కౌలు రైతులు కార్డులకు దరఖాస్తులు కూడా పెట్టుకోవటం లేదు. ”కార్డు పెట్టుకుంటే మా పొలం యజమాని ఇంక ఎరికైనా కౌలుకు ఇస్తాను” పొత్నూరు గ్రామం పశ్చిమగోదావరి జిల్లా గంగుల జయరాజు అన్నారు.

హైదరాబాదులోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్సిటిట్యూట్‌ పరిశీలనలో 5 జిల్లాలలోని 22 గ్రామాలలో రెవెన్యూ అధికారులు యజమానులు కుమ్మక్కై వాళ్ళ సంఘం వారికి రుణ అర్హత కార్డులు రాకుండా నిలిపివేసేరు. కొన్ని గ్రామాలలో ఉచితంగా లభించే కార్డు దరఖాస్తు పత్రం రూ.10-100కి అమ్ముతున్నారు. పలకవీడు గ్రామం, నల్గొండ జిల్లాలో కౌలు రైతులు దగ్గర నుంచి కార్డుకి, పంట రుణ మంజూరీకి రు.5000 అడుగుతున్నారని ఆ సంస్థ పరిశీలనలో తెలిసింది. ఇప్పటికీ 80 శాతం రైతులు వడ్డీవ్యాపారి మీదే డబ్బుకోసం ఆధారపడుతున్నారు.

”ఇన్ని అవాంతరాలు వుండటంవల్లే కౌలు రైతులు కార్డులకోసం దరఖాస్తులు కూడా పెట్టడం లేదు. జు|చఐ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. 2012-13లో క్రితం సంవత్సరం కన్నా 200,000 దరఖాస్తులు తక్కువ వచ్చాయని రెవెన్యూశాఖవారు వెల్లడించారు.

రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మాత్రం పరిస్థితులు మెరుగుపడతాయని ప్రకటించారు. ”ఇది ఒక క్రొత్త చట్టం మార్పులు రావటానికి సమయం పడుతుంద”ని అన్నారు.

యధార్ధమా కాదా?

నీలం తుఫాను కలిగించిన బీభత్సం వల్ల పంట నష్టపోయిన 10 మంది కౌలు రైతులు, సన్నకారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యలు, పరిస్థితుల ప్రభావం వల్లనే జరిగినాయని నిర్ధారించడానికి బ్యాంకు రుణపత్రాలు, పొలం పట్టా పుస్తకంతోపాటు 13 ఆధారపత్రాలు ఉండాలి. కొత్తూరు గ్రామానికి చెందిన బాగమ్మ తన భర్త పెలగాలా గంగరాజు, కొడుకు వెంకటరమణని మూడు సంవత్సరాల క్రితం కోల్పోయింది. గంగరాజు 30 సంవత్సరాలుగా 4 హెక్టార్ల కౌలు భూమి సాగు చేస్తూ 4 లక్షల అప్పు మిగుల్చుకున్నాడు. దీనితోపాటు అతడు వారి 16 ఏళ్ళ మూగ చెమిటి అబ్బాయి జీవితం గురించి కూడా బెంగపెట్టుకున్నాడు. మానసిక వత్తిడి తట్టుకోలేక అతను వారి కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయారు. వీరివద్ద కౌలుకు సంబంధించిన పత్రాలు ఏమీ లేవు. కనుక ప్రభుత్వం వారి మరణాలు ఆత్మహత్యలుగా పరిగణించడానికి నిరాకరించింది. వీరు వడ్డీవ్యాపారి దగ్గర చేసిన అప్పు వ్యవసాయం కోసమేనని నిరూపించడానికి కూడా ఏ దస్థావేజులు లేవు. బాగమ్మ పోలీసులకు ఇచ్చిన ఎఫ్‌.ఐ.ఆర్‌. మరియు శవపంచనామా పత్రం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మేము మా గొర్రెలు అమ్మి అప్పు తీర్చాము అని చెప్పింది. మిగిలిన ముగ్గురు కొడుకులు కూడా కౌలుకు తీసుకున్న అదే పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికి వారి దగ్గర కౌలుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేవు. వారికి ఇంకా రుణ అర్హత కార్డుల గురించి కూడా తెలియదు.

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు

క ఆంధ్రప్రదేశ్‌ అనుమతి పొందిన వ్యవసాయదారుల చట్టం 2011లో అమలుపరిచింది. దాని ప్రకారం కౌలు రైతులందరికి కార్డులు సరఫరా చేసి పంట రుణాలు పొందే అవకాశం కల్పించాలి.

క బ్యాంకులకు కూడా రుణాలు మంజూరు చెయ్యాలని ఆదేశాలు జారీచేసింది.

క గ్రామాలవారీగా కౌలు రైతుల పేర్లతో ఒక చిట్టా పుస్తకం తయారుచెయ్యాలి.

చట్టం అమలుపరచడానికి కలుగుతున్న అవాంతరాలు

క కౌలు రైతులకు పంట రుణాలు జారీచేయడానికి విముఖంగా వున్నారు.

క రుణాలు పొందటానికి కౌలు రైతుల కన్నా ముందు భూస్వాములు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

క కౌలు రైతులు రుణ అర్హత కార్డులకు దరఖాస్తు చెయ్యనివ్వకుండా భూస్వాములు అడ్డుపడుతున్నారు.

క చాలామంది కౌలు రైతులకు ఈ చట్టం గురించి ఇంకా తెలియదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.