– జూపాక సుభద్ర

ఇదివరకు ఏవో కొద్దిమంది తీరుకున్నోల్లు, పుర్సతున్నోల్లు ప్రశాంతత కోసం నల్లగ సంతోషంగా కష్టాలప్పుడు కట్టుకున్న ముడుపులు యిచ్చుకోనీకి బాధ్యతలు తీరినంక యాత్రలకు బొయేటట్లు వచ్చేటోల్లు. కాని వేలం వెర్రిగ వేలమంది, లక్షలమంది తీర్థయాత్రలకు, కుంభ మేళాలకు పోవడం యీ మధ్య భాగా పెరిగింది. టూరిజం మత సందర్శన, ఆలయ సందర్శనగా మారింది ఇండియాలో. కేవలం మత సందర్శన కాదు యిది పక్తు వ్యాపారంగా మారింది. దాని పర్యవసానమే చార్‌ధామ్‌, మారణ ధామంగా మారింది. మత టూరిజానికి వ్యాపారంతో డై గ్లోబల్‌ వామింగ్‌తో దేవాలయాల్ని చూడబోయినోల్ల జాడల్ని అనకొండలె మింగింది.

జనాల్లో టూరిజాన్ని భక్తి ఛానల్స్‌తోని ప్రలోభ పెట్టింది. వూరించింది. వురికించింది చంపేసింది. చార్‌దామంలో చనిపోయిన వేలమంది ప్రాణాలు తీసింది వరదలు కాదు. మనిషి చేసిన విధ్వంస ప్రవాహాలు. యీ చార్‌దామ మారణకాండకు ప్రధాన నిందితులు మీడియా, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, పూజారి వ్యవస్థనవచ్చు. మీడియా భక్తిని మూఢవిశ్వాసాల్ని పెంచడం, హేతుబద్ధతల్ని దూరం చేయడం ఒక నేరమైతే, నీరు, మట్టి పచ్చికలు కలగల్సిన పర్యావరణాన్ని అభివృద్ధి పేరిట చెట్టుకొమ్మ లేకుండా చేసి రోడ్లేయడం, కొండల్ని ప్రాజెక్టుల పేరుతో పిండి చేసిన ధ్వంస రచన యింకో పెద్ద నేరం. అన్ని కల్సి వేలమంది ప్రాణాల్ని బొక్కి దొరకుండా గంగల కలిపినయి. నిజానికి అక్కడి స్థానికులు ఎవరికి ప్రాణ నష్టం జరగలే. యాత్రికులుగా పోయిన వారికే జరిగింది.

ఎందుకన్నిన్ని వేలమంది సామాన్యులు బొయిండ్రు? తమ దుక్కాలు, కష్టాలు పోవాలని, తమ దైనందన సమస్యల్ని, ఈతిబాదల్ని గట్టెక్కించుకునే ప్రయత్నంలో యాత్రలకు బొయిండ్రు, యీ బలహీనతల్ని మీడియా పెంచి పోషిస్తుంది. సమస్యల్లో వున్న బీద, మధ్యతర గతి సామాన్యుల్ని ‘ఫలానా బిల్ల వేసుకుంటే అన్ని జబ్బులు పోతాయని అన్ని సమస్యలు తీర్తాయని, తీర్థయాత్రలు జేస్తే అన్ని సమస్యలకు విముక్తి అని మీడియా వూకదంపుడుగా ప్రలోభ పెడ్తుంది.

వాస్తవానికి పీడితులంతా బహుజన కులాలవారేది వీరే భారత సమాజాల్లో మెజారిటీ, చార్‌దామంలో అధిక సంఖ్యాకులు వీరే. వీరి సమస్యల మంచి గట్టెక్కనీకే ఆలయ సందర్శన కోసం మీడియా మాయమాటలు నమ్మిపోయింది. వారి బాధలకు, కష్టాలకు కారణం కులధర్మరాజకీయ వ్యవస్థ, కుల ధర్మసాంఘిక వ్యవస్థ. యీ వ్యవస్థలకు కారణ బూతం హిందూమత ధర్మ సిద్ధాంతాలు. యీ వుచ్చులోబడి వేలమంది సామాన్యులు పైస పైస కూడబెట్టుకొని తినీతినకౌ పెట్టుకొని ఫలానా దేవుని కాడకి బోతే కష్టాలన్నీ తీర్తయని చివరికి మృత్యువాతబడిండ్రు.

దేవుడే దిక్కు దేవునిమీద భరోసా సాగబోతే చివరికి దేవుడు తనను తాను కూడా రక్షించుకోలేక కోట్క పోయిండు వరదల్ల. అందికేనేమో చార్‌ధామ్‌ బాదితులు దేవున్ని కాకుండా ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. వీల్లను వీరు నమ్ముకున్న దేవుడు కాపాడలేదు గానీ 73 Pokiesవేలమందిని సైన్యం కాపాడింది. వరదల్లో చిక్కుకున్న చార్‌దామ్‌ బాధితుల్ని సైన్యం ఒడ్డున చేర్చి ప్రాణాలు కాపాడిన, కాపాడుతున్న వాస్తవాలు యింత కళ్లముందున్నా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరిద్వార్‌లో మహాయాగం చేస్తానని ప్రకటనలివ్వడం చూస్తే జనాన్ని దేవుని గుంతలోనుంచి మూడభక్తి విశ్వాసాల్లోంచి లేవనియ్యని అహేతుకమే. మనిషి చేసిన విధ్వంసాల్ని మాయజేసి కప్పిపుచ్చి, లేని దేవుని మీదేస్తూ తప్పుకుంటున్నారు.

వేలమంది బొక్కదొర్కని చావుల పాపమంతా మనిషి చేసిన విధ్వంసమే. నీటి బుగ్గలాంటి కొండల్ని కుళ్లబొడచి, భూమిని ప్రాజెక్టులతో వూపిరాడనివ్వని పొల్యూషన్‌తో నింపిండ్రు. భూమి, కొండలు, నీళ్లు, చెట్లు భరించి భరించే ఏకమై కసి తీరా మానవ అడ్డంకుల్ని, అడ్డంకుల మనుషుల్ని ధ్వంసం చేసినాయి.

ప్రజల్ని శాస్త్రీయ దృక్పథాలవైపు, హేతువాద దృష్టి జ్ఞానాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వాలు టూరిజాన్ని దానిపేరుతో వ్యాపారాన్ని పెంచుకోడానికి తద్వారా తమ దోపిడి సజావుగా సాగడానికుపయోగించుకుంటుంది. ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించుకోడానికి ప్రభుత్వాలను అడక్కుండా వుండడానికి వారిని స్పిరిచ్యువల్‌గా డైవర్ట్‌ చేస్తున్నది. ఆ నేపథ్యంగా ప్రజలు వారి ఆర్థిక సమస్యలు, సామాజిక అణచివేతలు, నిరుద్యోగం, అన్యాయాలు, కనీసావరసరాలు తీరని స్థితుల్నించి దేవుడిమీద భారమేసి నాకర్మరాతని తీర్థాలు బొయి తలనీలాలిచ్చి, గుండాల్లో, హుండీల్లో చందా తీస్తే పోతాయనే నిర్హేతుకల్లోనే వున్నారు. దీన్ని ప్రభుత్వాలు, మీడియా హిందూమతం, పూజార్లు పెంచి పోషిస్తున్నాయి. వారి సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం. రాజకీయ నాయకులు తమమీద తిరుగుబాట్లు చేయకుండా నిరోదించడానికుపయోగించు కుంటుంది. మాయావతి లాగ చందాలు గుళ్లు గోపురాలక్కా దు మాకివ్వండి. మిమ్మల్ని మారుస్తామనే ప్రభుత్వాలు రావాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో