కుప్పిలి పద్మ

వర్షాకాలం వచ్చేసింది… యెప్పటిలానే.

వో వంక ఆనందం. మరో వైపు ఆదుర్దా.

వానాకాలపు సౌందర్యపు మనో చిత్రాల చోటునే మనలో వాన కలిగించే భీభత్సపు దృశ్యాలు అసంఖ్యాకంగా వచ్చిపడుతున్నాయి మన కళ్లల్లోకి.

చాల సంవత్సరాలుగా మన దేశంలో ప్రధాన నగరాలు వర్షం కురవగానే రోడ్లన్నీ చెరువులుగా, నదులుగా, మురికి కాల్వలుగా మారిపోతున్న చిత్రాలు మనకి కనిపిస్తాయి. యెక్కడికక్కడ వేళ్లతో సహా పెకలించుకొని కూలిపోతున్న చెట్లు దర్శనమిస్తున్నాయి. మ్యాన్‌హాల్స్‌ నోర్లు తెరుస్తాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లుతాయి. హార్డింగ్స్‌ విరిగిపడతాయి.

యిప్పుడు యీ దృశ్యాలకి మన కళ్లు నిశ్చేష్టం కావటం లేదు. మనకి యే గత్యంతరం లేదని అన్నింటిని సర్వసాధారణం చేసేసింది కాలం. ఆ రోజు రోడ్ల మీద నీళ్లల్లో యిరుక్కున్న ట్రాఫిక్‌ని, జలమయమైపోయిన లోతట్టు ప్రాంతాలని, యిళ్లల్లో చేరిన నీటిని, నీటిపాలైన రేషన్ని, తడసిపోయిన బట్టలని, చీకటిలో మగ్గుతున్న ప్రజలని మనం టీవిల్లో చూస్తాం. పేపరల్లో చదువుతాం. ట్రాఫిక్‌లో యిరుక్కున్న వాళ్లల్లో మనమూ వుంటే విసుక్కుంటాం. యెలా వున్నారని యిళ్లల్లో వున్నవాళ్లు, వూర్లో వున్న బంధువులు, స్నేహితులు ఫోన్‌చేసి అడుగుతుంటే మాటాడుతుంటాం. తిరిగి మనమూ ఫోన్స్‌ చేస్తుంటాం. యిలాంటి జీవితవిధానంలో మన మనసులని గుంజకు కట్టేసింది యెవరిని కూడా మనలని మనం ప్రశ్నించుకోడానికి వీలులేనంత మాయాజాలపు బిజిలో కిక్కిరిసిపోయి వుంటాం.

వాన ఆగుతుంది. మళ్లీ మనం మన పరుగులో, తిరిగి వాన, తిరిగితిరిగి అవే దృశ్యాలు. కురిసిన వాన యింకే మట్టిలేదు. పారేచోటులేదు. భవనాలు, ఫ్లైవోవర్స్‌, నాళాల కబ్జ, చెరువుల కబ్జ కట్టటమే జీవనానందమైన, సంపదే పరమసోపానమైన అభివృద్ధి వికటాట్టహాసంలో మనుషుల ఆక్రందనలు వారి వారికి యెలా వినిపిస్తాయి.

యిదీ నగరాల ఛాయచిత్రం… గత కొన్నేళ్లుగా, వర్తమానం యిలానే వుంది. భవిష్యత్‌ యింతకంటే అధ్వాన్నంగా భయంకరంగా వుంటుంది. యెందు కంటే దీనిని బాగుచెయ్యాలనే సంకల్పం లేని పెద్దమనుష్యులే దండిగా వున్నారు.

ఆ అందమైన సున్నితమైన నదీప్రవాహాపు నిశ్శబ్ధపు కొండకోనల చల్లని నేలంతా యీ రోజు యెందుకంత భీభత్సపు హాహాకారాల నిలయమైంది. ఆ మట్టి యేంటి. ఆ వరదేంటి. అక్కడ మట్టిని, గాలిని, నీటిని పువ్వులతో కొలిచే ఆ ప్రాంతపు ప్రజలు పరమ శివున్ని ఓం నమఃశివాయా అని భక్తిపారవశ్యంతో కొలుస్తు, వేలాదిగా వచ్చే యాత్రికులని ఆత్మీయంగా చూసుకొనే ఆ ప్రాంతవాసులు, అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రీకులకి ప్రాణవాయువుని భయంతో శ్వాశింప చేయ్యాలనే పాపిష్టి కోరిక యెవరిది…

మనసెంత వికలమైపోయింది. యేం తోచని నిశ్శహాయ స్థితి. చెవిలో యిల్లు కట్టుకొని పోరుతునే వున్నారు అన్నెన్ని జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ప్రమాదకరమైనవని. యెవరైనా ముందు చూపుతో ప్రకృతితో మితిమీరి యింట్రాక్ట్‌ అవ్వటం అనర్ధమని శాస్త్రీయంగా చెప్పినా సరే చెవులకి యేదీ అంటదు. అసలు యీ ప్రపంచాన్ని రవ్వంతైనా పట్టించుకొనే వాళ్లకి యేమైనా చెప్పొచ్చు.

ప్రపంచాన్ని ప్రేమించమనటం పెద్ద మాటైన కాలంలో కాస్తేనా పట్టించుకోండని నినదించినా, విన్నవించినా, ప్రార్ధించినా దయాదాక్షిణ్యాలు లేకుండా అభివృద్ధి పేరుతో ధనయావతో కాళరాత్రులని రచిస్తున్నారని వారికి యే భాషలో చెప్పగలం. వినటానికి సిద్ధంగా వుంటే వారికి అర్ధం చేయించగలిగే భాషని అన్వేషించొచ్చు. మేన్‌ మేడ్‌ డిసాస్టర్‌ కాదని తీరుబడిగా సెలవిచ్చే పెద్దమనుషుల మొండితనాన్ని యే కన్నీరు ప్రక్షాళన చేయగలదు.

వాళ్లు తీసుకొంటున్న నిర్ణయాలాకి మూల్యం చెల్లిస్తున్న మనం, వొక చెట్టుని కొట్టినా వొక కొండని పగలకొట్టినా వొక నదీ తీరాన్ని ఆక్రమించినా మనం నిర్విరామంగా అడ్డుకోనాల్సిందే.

లేకపోతే నగరమైనా మైదానమైనా పల్లెలయినా కొండలోయలైనా జీవనం భీభత్సం… భయానకం… చెదిరిపోతున్న జీవితాలని లోలోపల అగాధాలని పెరగనివ్వకుండా యెన్ని అవరోధాలు యెదురైనా భయానక అభివృద్ధి వెలుగుల తహతహని ప్రశ్నించాల్సిందే.

Share
This entry was posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో