మాటలు – వెలివేసే పద్ధతులు

థెమ్సులా అఓ
అనువాదం: ఓల్గా

సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం.

ఈ సూత్రం ప్రకారం హక్కులను, అవకాశాలు కొద్దిమంది చేతిలోనే ఉండి చాలామందికి నిరాకరించబడతాయి.

విశాల పరిధిలో చూసినపుడు సాంఘిక వెలి అనేది ప్రధానంగా జాతి కేంద్రంగా యేర్పడుత వచ్చింది. దాని మూలంగా కొన్ని గ్రూపులను సమాజపు అట్టడుగు వర్గాలుగా వుంచేందుకు అవసరమైన సాంఘిక పద్ధతులను, ఆచారాలను ప్రవేశపెడుతుంది. ఈ వ్యాసం ఈ సమస్యను రెండు రకాలైన వెలివేతల ద్వారా చర్చించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకటి స్పష్టంగా కనిపించే పద్ధతులు రెండు కనిపించని పద్ధతులు.
మొదటి పద్ధతిలో ఏదో ఒక సహేతు కత, కారణం వున్నట్లు కనిపిస్తాయి. చాలాసార్లు వెలి అనేది రక్షణ విధానంగా చూస్తారు. సమాజ ప్రగతికి ఆటంకంగా ఉన్నవారిని దూరంగా పెడతారు. దానివల్ల అధికార యంత్రాంగం అంతర్గత ఆటంకాలేవి లేకుండా నడపగలుగుతుంది. ఇలాంటి సాంఘికవెలి జాతి, రంగు, పుట్టుక, ఆరోగ్యస్థాయి వీటి మీద ఆధారపడి జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాదేశిక ఒంటరితనం వల్ల కూడా జరగవచ్చు. ఈ రకమైన వెలి ‘ఇతరుల’ వల్ల చెడిపోతామనే, జాతి భ్రష్టత వంటి భయాలవల్ల జరుగుతుందని నాకనిపిస్తుంది. దీనితో పాటు వెలివేతకు గురైన కమ్యూనిటీలనుండి దాడి గురించిన భయం కూడా ఉంటుంది. ఆ కమ్యూనిటీలు సామూహిక అస్తిత్వాలకు అభివృద్ధి చేసుకున్నపుడు అవి రాజకీయ అస్తిత్వాలుగా వ్యతిరేకమైన నిర్ణయలకు దారితీయవచ్చనే భయం కూడా ఉంటుంది.

అనేక ‘నాగరిక’ సమాజాలు అనేక యుగాలుగా ఈ వెలివేత పద్ధతుల ద్వారా మనగలుగుతున్నాయి. చాలా స్పష్టంగా కనిపించే ఉదాహరణలుగా జాతి, రంగు అనే బలమైన ఆధారణ మీద నిలబడిన వెలి అమలులో వున్న దేశాలను చెప్పుకోవచ్చు. దీని వల్ల ఆయాదేశాలలో చట్టబద్ధ పౌరులుగా ఉండగల్గిన అనేకమందికి పౌరసత్వం నిరాకరించబడుతుంది. మనం అమెరికా చరిత్రను, చాలా ఆఫ్రికన్ దేశాల చరిత్రను, ఇటీవలి కాలంలో ఫ్రాన్స్లో జరిగిన సంఘటనలను అధ్యయనం చేసినపుడు, ఈ వెలివేత పద్ధతుల ద్వారా మానవుల హుందాతనానికి, హక్కులకు ఎంత భారీగా అన్యాయం జరిగిందో మనకు అర్థమవుతుంది.
అక్కడక్కడ ఆరోగ్య కారణాల వల్ల అంత తీవ్రం కాని వెలివేతలుండవచ్చు. పాత కాలంలో కుష్టువ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష వుండేది. వారిని ప్రధాన సమాజం నుండి దూరంగా పెట్టేవారు. వారిని తాకితే ఆ గాలి తగిలితే ఆ వ్యాధి వస్తుందనే భయంతో అలా చేసేవారు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో కూడా ఎవరి జీవితాన్ని భీమా చేస్తారో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని పక్కనపెట్టవచ్చు. సైన్యంలో కూడా శరీర పటుత్వాన్ని పరిగణనలోకి తీసుకుని పక్కన పెట్టవచ్చు. విదేశీ శక్తుల పోటీని తగ్గించటానికి, స్వదేశి సంస్థలను రక్షించటానికి కొన్ని వెలి పద్ధతులను రూపొందించ వచ్చు.

వీటన్నిటిలో, అలాంటి వెలిని ప్రవేశపెట్టి అమలు చేయటంలో ఏదో ఒకరకమైన సహేతుకతను మనం చడొచ్చు. కానీ అధికార కేంద్రాలనుంచి స్త్రీలను వెలివేయటానికి, అధ్యయన కేంద్రాలనుంచీ, వివిధ వృత్తులనుంచీ, రాజకీయలనుండీ స్త్రీలను వెలివేయడానికి ఎలాంటి సహేతుకతా లేదు. ఈ వెలి జండర్ కారణంగా అస్పష్టంగా ఉంటుంది. ఈ వెలి ఆ స్త్రీలు అంతకుముందే వెలికి గురైన గ్రూపుకు చెందినవారైతే అది మరింత సంక్లిష్టంగా ఉంటుంది. పౌరసత్వం ఉన్నప్పటికీ జండర్ ఆధారంగా స్త్రీలపట్ల చూపే వివక్ష ఈ వైజ్ఞానిక నాగరిక యుగంలో 21వ శతాబ్ధంలో పురోభివృద్ధి చెందిన దేశాల స్థితిని నాశనం చేసే జబ్బుగా మనం చెప్పవచ్చు. వృత్తులలో లోపల చూపే జండర్ వివక్ష కారణంగా అమెరికాలోనే వేలాదిమంది స్త్రీలు లాయర్ వృత్తి నుంచి బైటికొచ్చేస్తున్నారనే వార్తలు మనం చదువుతున్నాం. ఐతే జండర్ వివక్ష ప్రపంచంలో ఎలాంటి సమస్యలు తెస్తుందనే విషయం గురించి నేను మాట్లాడను. అంతశక్తి నాకు లేదు. అంతేకాకుండా మన సమాజంలో స్త్రీల పట్ల ఎట్లాంటి వివక్ష వుందనే విషయం మీతో పంచుకోవాలను కుంటున్నాను.

నేను నాగా జాతికి చెందినదాన్ని అందులో కూడా ఆవో తెగకు చెందినదాన్ని. అది నాగాలుగా ఒక సమూహంగా చడబడే జాతిలోని అనేక తెగలలో ఒక తెగ ఇండియలో ఈశాన్య ప్రాంతంలో నివసిస్తుంటారు. నాగాలది పితృస్వామిక సంస్కృతి. కమ్యూనిటీ లోపల జీవితంలోని ప్రతి కోణము, అంశమూ పురుషధిపత్యం కిందే ఉంటుంది. గ్రామ రాజకీయ వ్యవస్థ నుంచి, యితర సాంఘిక, మత కార్యకలాపాలకు సంబంధించిన అధికార నిర్మాణాలనుంచి స్త్రీలను దూరంగా ఉంచటాన్ని, స్త్రీలు గానీ, పురుషులు గాని పురుషాధిపత్యంగా గుర్తించకపోవటాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. అది కమ్యూనిటీ జీవితంలో మామూలుగా జరిగే విషయంగా ఆమెదిస్తారు. అనేక తరాలుగా, అనేక కాలాల నుంచీ వస్తున్న విషయంగా అంగీకరించి ఊరుకుంటారు. వెలివేయటం అనే పదాన్ని మన సౌకర్యం కోసం వాడుకోవచ్చు గానీ మా కమ్యూనిటీలో పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే అక్కడి గృహసంబంధమైన, సాంఘికమైన వ్యవహారాలలో స్త్రీ పురుషుల పాత్రను చడాలి.
స్త్రీలకంటే పురుషులు శారీరకంగా ఎక్కువ బలం సామర్థ్యం కలిగి వుంటారనే దానితో పాత కాలంలో ఒక సౌలభ్యం కోసం స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన విధులు అప్పగించటమనేది ప్రారంభమైంది. కానీ అది క్రమంగా అది ఆవో సమాజంలో స్త్రీల వెలిని మరింత ఎక్కువగా మంచి అర్థాలొచ్చే మాటలతో చెప్పటానికి దారితీసింది. చాలా కాలం నుంచీ అమలవటం వల్ల వీటిన ఆవో సంప్రదాయిక చట్టాలుగా పేర్కొని అమలు జరుపుతున్నారు. కీర్తి శేషులు టాజెన్ ఆవో తన పుస్తకమైన ”ఆవో” నాగా సంప్రదాయిక చట్టాలు” లో ఐదు క్లాజులను ”సాంఘికంగా అర్హతలేని ఆవో స్త్రీలు” అనే శీర్షిక కింద ఉదాహరించి యిలా అన్నాడు
ఆమె శారీరక బలహీనతను, సెక్స్ను గమనంలోకి తీసుకుని ఆవో సమాజంలో స్త్రీ ఈ కింది విధాలుగా అర్హత లేని దానిగా బాధలనుభవిస్తోంది.

(1) ఆమె సమెన్ మెంచన్లో గానీ, తతార్ పుతు మెండెన్ లోగానీ సభ్యురాలు కాలేదు.
(2) ఆమె పతిర్, పుతిర్ కాలేదు. గ్రామంలో అందరికంటే వయసులో పెద్దదైనా ఆమె పతిర్, పుతిర్ కాలేదు. మత సంబంధ మైన విధులు, క్రతువులను ఆమె చెయ్య కూడదని నిషేధించారు. కుటుంబ పూజల్లో ఆమె భర్తకు సహాయం చెయ్యవచ్చు.
(3) ప్రజాహితానికి సంబంధించిన చర్చల్లో, వాదోపవాదాలలో ఆమె పాల్గొన కూడదు.
(4) ఆమె ఒక గౌరవానికో, బిరుదుకో, కీర్తికో అర్హురాలు కాదు. ఐతే ఆమె, ఆమె భర్త జరిపే విందుల్లో పాడే పాటల్లో ఆమె పేరు చెప్పొచ్చు. అది ఆమెకు చాలా గౌరవమిచ్చినట్లు.
(5) ఆమెకు భూమి ఆస్తిగా సంక్రమించదు. ఆమె తన పూర్వులుగానీ, తన సంతానం గానీ చేసిన అప్పులకు బాధ్యారాలు కాదు. ఆమెకు వారసత్వంగా ఆస్తిని అనుమతిస్తే ఆమె భాగం ఇతర వంశాలలో సభ్యులైన కుమారులకు చెందుతుంది.
శ్రమ విభజనగా మాత్రమే ప్రారంభమైనది ఇంకా ముందుకు వెళ్ళి స్త్రీ పురుషుల మధ్య తేడాను పెంచింది. శారీరకంగా బలహీనురాలైన స్త్రీ మేధాపరంగా తెలివి తక్కువదనే భ్రమకు దారి తీసింది. ఈ విధంగానే ప్రజా జీవితంలోని కొన్ని ప్రాంతాలను స్త్రీల ప్రదేశం నుంచి పూర్తిగా దూరం చేసే క్రమం మొదలయింది. స్త్రీని ‘బలహీనురాలు’ గా గుర్తించటం తర్వాత తర్వాత భాషలో, కొన్ని భ్రమల ద్వారా యింకా పెరిగింది. నా భాషలో ఒక పదం వుంది. ‘అనింగ్ నుజ’ అంటే స్త్రీలు, పిల్లలు అని అర్థం. ఆ పదాన్ని తరచుగా అల్పం, హీనం అనే అర్థంలో వాడతారు. విలువలేకుండా తీసిపారేసే పదమది.
నా గ్రామంలో సాధారణంగా అమలులో ఉన్న పద్ధతుల్లో స్త్రీలను దరంగా నెట్టటం గురించి చర్చించేముందు నేను పురుషులను కూడా తాకేటటువంటి కొన్ని వెలి పద్ధతుల గురించి వట్లాడాలను కున్నాను. ఉదాహరణకు ”పుటు మెన్డెన్” లేదా గ్రామ పరిషత్లో సభ్యత్వానికి అర్హతలు స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. అందులో సభ్యులుగా అన్ని తెగల వారికీ తమ పురుషులను ప్రతినిధులుగా పంపే హక్కు ఉంది. కానీ నేరస్తుల, వివాహేతర సంబంధాలలో పుట్టినవారు, వనసిక స్థిరత్వం లేనివారు అందులో సభ్యులు కాలేరు. పరిషత్లో కూడా పెద్ద పదవులు ఎప్పుడ ప్రాచీన తెగలనుంచి వచ్చిన సభ్యులకే కేటాయించబడతాయి.

ఆయా సమాజంలో స్త్రీలను వెలివేసే క్రమం అస్తిత్వ ప్రశ్నలతోనే మొదలవుతుంది. వారసత్వం ఎప్పుడ పురుషుల ద్వారానే సంక్రమిస్తుంది. మా పురాణాలలో మొదటిదైన ”లంగ్టెరాక్”లో చెప్పబడి అందర విశ్వసించే ప్రకారం ఆరు రాళ్ళనుండి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు పుట్టారు. దానిని బట్టే తెగలను వేరుచేసి చూడటమనేది జరుగుతుంది. ముగ్గురు స్త్రీలు మూడు తెగలకు చెందిన వారిగా చూపించటమనేది, అయె తెగలలో యిప్పటికీ అమలులో ఉన్న ఎక్సోగామస్ వివాహాలకు అనుకూలంగా ఉండటానికి మాత్రమే. పుట్టినచోటు నుంచి వలస వెళ్ళటం, కాలం గడిచే కొద్దీ వివిధ గ్రావలలో స్థిరపడటం, తెగల చరిత్ర అంతా పురుషుల వైపు నుంచే జరుగుతుంది. ఆడవాళ్ళకు పెట్టే పేర్లు కూడా తెగకు చెందినవై వుంటాయి గానీ ఆ స్త్రీకి సంబంధించినవై ఉండవు. ఉదాహరణకు అమ్మాయి పెళ్ళి జరిగినపడు అత్తవారింటికి పంపేటపుడు తండ్రిగానీ, తండ్రి చనిపోతే తెగ పెద్ద గానీ యిలా చెబుతారు. ”ఈ రోజునుంచీ ఈ అవ్మయి మీ కుటుంబానికి చెందుతుంది. కానీ ఆమె చనిపోయినపడు ఆమె పేరును ఆమె తెగకు తీసుకురండి” అంటారు. ఆమెకు పుట్టే పిల్లలు ఆమె భర్త పేరు తీసుకుంటారు. అతని తెగకే చెందుతారు.
ఐతే కొన్నిసార్లు ఈ సంప్రదాయలకు కాస్త సడలింపు వుండే సందర్భాలు, స్త్రీల హక్కులు ముందుకొచ్చే సమయలు ఉంటాయి. ఉదాహరణకు కస్టమర్ లా లో క్లాజు ప్రకారం స్త్రీలకు భమిగానీ భూమికి సంబంధించిన ఆస్తిగానీ వారసత్వంగా వచ్చే వీలు లేకుండా నిషేధించారు. ఐతే ఆ క్లాజుకు కొంచెం మెరుగు పరుస్త మరొక సబ్క్లాజులో ఆమె తన స్వంత ఆస్తిని సృష్టించుకోవచ్చు, తన కిష్టమైన పద్ధతిలో ఆ ఆస్తిని ఎవరికైనా యివ్వొచ్చు. అమ్ముకోవచ్చు” అని ఉంది. ఒక ఉదాహరణ యివ్వాలంటే ఒక శిక్షణ పొందిన నర్సు, చాలాకాలంపాటు ప్రభుత్వోద్యోగం చేసి కొంత భూమిని ఆస్థిగా సంపాదించుకోగలిగింది. పదవీ విరమణ చేశాక ఆమె ఆస్తిని ఇద్దరు కూతుర్లకూ సమానంగా పంచి ఆ విల్లుని వజిస్ట్రేట్ కోర్టులో రిజిష్టర్ చేయలని ఆలోచిస్త ఉంది. ఇంతలో ఆమె తెగవారు యిది పసిగట్టి కస్టమర్ లా ప్రకారం భూమికి సంబంధించిన ఆస్తులు తమకు హక్కుగా చెందుతాయని దావా వేశారు. ఐతే ఆమె కోర్టులో ఆ ఆస్తి తన సంపాదన ద్వారా సృష్టించుకున్నదని, తెగకు హక్కు లేదని నిరపించగలిగింది. ఆమె కేసు గెలిచింది. ఆస్తి ఆమె కూతుళ్ళకు సంక్రమించింది.

స్త్రీ తన భర్తతో పిల్లలతో నివసించే ఇల్లు ఆమెది కాదు. ఆమె భర్తది. భర్త చనిపోతే పెద్ద కొడుకుకి చెందుతుంది. కొడుకు లేకపోతే భర్త బంధువులకు అతని అన్నదమ్ములకు, కజిన్స్కు లేదా వారి కొడుకులకు, దగ్గరి రక్తసంబంధీకులకు, వారిలో వయసులో పెద్దవారికి వారసత్వంగా ఆస్తిని యివ్వటంలో ప్రాధాన్యతగా ఉంటుంది. చాలా కేసులలో వితంతు స్త్రీ చనిపోయేంతవరకూ ఆ ఇంట్లో ఉండటానికి అనుమతి దొరుకుతుంది. తర్వాత విషయంపైన చర్చించిన సంప్రదాయం ప్రకారం సెటిల్ అవుతుంది. విడాకుల కేసులలో విడాకులకు బాధ్యత, కారణం పురుషుడైతే అతను ఇల్లు భార్యకు వదిలి వెళ్ళాలి. ఆమె జీవించినంతకాలం లేదా మరో వివాహం చేసుకునేంత వరకూ ఆ ఇంట్లో ఉండొచ్చు. కొన్ని కేసులలో ‘అపరాధి’ అయిన భర్త భార్యకు ఇల్లు కట్టించి యిస్తాడు. అక్కడామె పైనా చెప్పినట్లు ఉండొచ్చు.
స్త్రీ పురుషుల ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా స్పష్టంగా స్త్రీలను తక్కువగా చూడటమనేది నిండి వుంటుంది. ఉదాహరణకు, ‘సుంగ్కొటెప్సు లేదా సైనికుల శాలువా అనే ప్రత్యేకమైన ఆవో శాలువాను స్త్రీలు ధరించకూడదనే నిషేధం ఉంది. ఎందుకంటే స్త్రీలను అందరిలో గౌరవించటం, వారికి కీర్తి రావటం దీనికి హక్కు లేదుగదా. ఇంకోవైపు మగవాడు స్త్రీల శాలువాను గానీ, పరికిణీని గానీ ధరించటం వట అటుంచి తాకితే కూడా అది చాలా సిగ్గుపడాల్సిన, అవవన పడాల్సిన విషయమవుతుంది. ఎందుకంటే అది అతని పురుషత్వాన్ని తగ్గించే విషయం. నేతపని, కుండలు చేసే పని కూడా ఈ కారణాల వల్లే పురుషులు చేయకూడనివి.

ఐతే స్త్రీలను అన్నిటికంటే ఎక్కువ వెలివేసేది – పరిపాలనారంగం నుంచి గ్రామ పరిషత్లో ఏ స్త్రీ కూచోకూడదు. గ్రామ సభలోనైనా ఏ స్త్రీ కూడా పాల్గొన కూడదు. గ్రామ వ్యవహారాలు చర్చించకూడదు. అన్ని నిర్ణయల మగవాళ్ళే చేస్తారు. అలాంటి సందర్భాల్లో స్త్రీలు ఈ భూమినుంచి అదృశ్యమయ్యరా అనిపిస్తుంది – అన్నిటికంటే ఆశ్చర్యకరం ఈ సంప్రదాయం ఎప్పుడ సవాలు చేయబడకుండా కొనసాగుతనే ఉంది.
బహిరంగంగా మత విధులు నిర్వహించటాన్నించీ బలులు నిర్వహించ టాన్నించీ స్త్రీలకు అధికారం లేకుండా నిషేధించటమనేది ఇప్పుడు కూడా కొన సాగుతోంది. ఇవాళ కూడా, నట ముప్పై సంవత్సరాలకు పైగా క్రైస్తవమతం అమలులో వున్నా, పాస్టర్గా స్త్రీలు లేరు. చర్చిలో మహిళా విభాగ నిర్వాహకులు అసోసియేట్ పాస్టర్స్ అనే పిలవబడతారు. వివాహాల్లో, అంత్యక్రియలలో మత విధుల నిర్వహణకు, హాకీ కమ్యూనియన్ సర్వీసులు జరపటానికీ చర్చి రెవరెండ్గా ఒక ఆవో స్త్రీని నియమించటానికి చర్చికి వంద సంవత్సరాలకు పైగా పట్టింది.
మారిన ప్రజాస్వామిక పాలనలో కూడా ఈ దృష్టే కొనసాగి ఆధిపత్యం చలాయిస్తోంది. ఇండియన్ యూనియన్లో సంపూర్ణ రాష్ట్రంగా నలభై ఏళ్ళకు పైగా వుంటున్నా నాగాలాండ్ శాసన సభకు ఒక్క నాగా స్త్రీ కూడా ఎన్నిక కాలేదు. ఇవాళ్టి వరకూ ఇద్దరు స్త్రీలు మాత్రమే ఎన్నికల బరిలో దిగారు. అనుకున్నట్లే వారి పురుష ప్రత్యర్థుల మీద ఓడిపోయరు. ఇరవై సంవత్సరాల క్రితం ఎన్నుకోబడిన ఒక మహిళా పార్లమెంటు సభ్యురాలు దీనికి ఒకే ఒక్క మినహాయింపు. పార్ట్ నిర్మాణాల్లో పనిచేసే స్త్రీలుంటారుగానీ మహిళా విభాగాలకే పరిమితమవుతారు. అధికార నిర్వాహకుల స్థాయిలో ఎప్పుడు ఉండరు.

వెలివేసే పద్ధతుల గురించి అంచనా వేసేటపుడు న్యాయంగా ఆలోచించాలంటే, స్త్రీల మానసిక స్థితిని అర్థం చేసుకుని, ఆవో సమాజంలోని ఈ అన్యాయనికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనా స్వరం ఎందుకు లేదనేది కూడా ఆలోచించటం అవసరం. తమ అణచివేత అనే వాస్తవానికి ఆసక్తి లేకపోవటానికి చాలా కారణాలున్నాయి. మిగిలిన కమ్యూనిటీలలో వలే కాకుండా ఆవో స్త్రీలు మిగిలినచోట్ల మనం రోజూ చూస్తున్నట్లుగా శారీరకమైన హింసను మగవారినుంచి ఎదుర్కోరు. ఎందుకంటే వారి రక్షణ వారి అన్నదమ్ములనుంచి, బాబాయిల నుంచి తమ తెగ పురుషులనుంచి దొరుకుతుంది. ఒక ఆడపిల్లకు పెళ్ళయినపుడు తండ్రి కూతురి అత్తమామలతో యిలా చెప్తాడు. ”ఈమా కుమార్తె మీ కుటుంబానికి వస్తోంది, ఆరోగ్యం, ఆనందంగా కాళ్ళు చేతులు సరిగ్గా వున్న స్థితిలో వస్తోంది. ఏదైనా సరియైన కారణానికి ఆమె మా దగ్గరకు తిరిగివస్తే ఆమెను ఈ రోజున్న స్థితిలోనే చూడాలని ఆశిస్తాం”. శారీరక హింస జరిగిందని రిపోర్టు చేసిన కేసులలో ఆమె తెగ పురుషులు ఆమెను కాపాడేందుకు వేగంగా వెళ్తారు. అవసరమైతే ఆమె తరఫున న్యాయం కోసం గ్రామపరిషత్ దగ్గరకు వెళ్తారు. ఆవో స్త్రీలు తమ తెగ మగవాళ్ళు తమను రక్షించేందుకు ఉన్నారని అనుకుంటారు.
ఆ తర్వాత స్త్రీలలో పురుషుల గురించిన కొన్ని ఆలోచనలను పెంచుకునే మానసికస్థితి కూడా ఉంటుంది. కొన్ని శతాబ్దాలనుండి పురుషులు అన్ని రకాలుగా తమకంటే అధికులుగా భావించే దృష్టితో స్త్రీలను అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు పెంచుతున్నారు. మగవాళ్ళు అంధులైనా, అవిటివారైనా వాళ్ళను పెళ్ళి చేసుకొమ్మని ఆడపిల్లలకు చెబుతారు. అతను మగవాడు. అది చాలు. పురుషుడు లేకపోతే స్త్రీ తన జీవితంలో ముఖ్యమైనదేదో పోగొట్టుకొన్నట్లే. భర్తలేని స్త్రీకి సవజంలో ఎలాంటి విలువ ప్రాధాన్యత ఉండదు. భాష కూడా ఇలాంటి ఆలోచనావిధానాన్ని కలిగి ఉంటుంది. ఆవో తెగలో వితంతువుని ‘అమిత్సుర్’ అంటారు. ఆ పదాన్ని అవివాహితులకు కూడా వాడతారు. కానీ వ్యవహారంలో ఆ పదాన్ని చిల్లరతనానికి, నీచత్వానికి, అల్పత్వానికి వాడతారు. మగవాడిని ‘అమిత్సుర్’ అని పిలిస్తే ఇక అతనికి అంతకంటే అవవనం మరొకటి ఉండదు.

ఆవో సవజంలో తిరుగులేని వాస్తవం ఏమిటంటే మగవాళ్ళు సమజాంలో అన్ని విధాల అవకాశాల ఉన్న గ్రూపు. ఇంతవరకూ స్త్రీలు తమకున్న తక్కువతనపు అస్తిత్వాలతోనే సంతృప్తి పడుతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ లోపలి వ్యక్తిగా ఇదిలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మా సమాజంలోని ఈ వెలివేసే పద్ధతులను తీసివేయటానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగినా అది పునాదిలోకెళ్ళి అంటే గ్రామ రాజకీయంలోకివెళ్ళిదానిని ఎదుర్కొంటుంది. అంటే అర్థం స్త్రీలు వున్న పద్ధతులకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిఘటన చేయలని నిర్ణయించుకున్నా వాళ్ళు తమ కుమారుల మీదా, తండ్రుల మీదా, మేనవమలు, బాబాయిలు యింకా తెగ పురుషుల మీదా తిరగబడి నట్లుంటుంది. ఈ వివక్షపూరిత మైన సంస్కృతిలో స్త్రీలు పూర్తిగా ఎలాంటి విమర్శా లేకుండా విశ్వసించటమనేది సంపూర్ణంగా జరుగుతున్నపుడు, తిరుగుబాటు అనేది బ్రహ్మప్రళయమే ఔతుంది. ఎంత విద్య అయినా వికాసమైనా, యితర స్త్రీల సవనహక్కుల గురించి పోరాడే స్త్రీల సంఘాల నుంచి ఎంత శక్తిపెట్టినా ఆవో స్త్రీలు అలాంటి సన్నిహిత ఆత్మీయ బంధాలనుండి, కుటుంబ నిబద్ధతలనుండి బయటపడేందుకు సరిపోవు. పురుషులు సాంఘిక పునర్నిర్మాణం చేయటం చాలా కష్టం. వాళ్ళు ఈ వివక్షను వివక్షగా గుర్తించి, ముందుకొచ్చి, యిద్దరికీ ఆమోదయెగ్యమైన పద్ధతుల్లో సమాజాన్ని చర్చల ద్వారా పునర్నిర్మించుకోవాలని గుర్తిస్తే తప్ప అది అసాధ్యమవుతుంది.

మరి చదువుకున్న పురుషుల సంగతేమిటని ఎవరైనా అడగొచ్చు. వాళ్ళేమంటారు అని ప్రశ్నించొచ్చు. దానికి సమాధానం ఏమిటంటే ఒక పురుషుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అతను యింకా గ్రామంలో పౌరుడే, అందువల్ల ప్రతి ఆవో గ్రామంలో ఉన్న పౌరపరిషత్ చేత పరిపాలింపబడతాడు. అక్కడ గ్రామ/నగర చదువుకున్న/చదువులేని గొప్ప/బీద రైతు/అధికారి యిలాంటివాటిని వేటిని లెక్కపెట్టరు. గ్రామ పరిపాలన అనేది తెగల సంబంధాల అల్లికమీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఆవో సమాజంలో తమను తాము పాలించుకోవటమనేది సంప్రదాయనికి గట్టిగా అతుక్కుని ఉంటుంది. దాని ఫలితాలు పట్టణ ప్రాంతాలలో వ్యాపారంలోనో ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలలోనో ఉన్నవారిమీద కూడా అలాగే ఉంటాయి. నిజమైన సాంఘిక రాజకీయ అధికారపీఠం స్థిరంగా బలంగా గ్రామ రాజకీయంలోనే చిక్కుకొని ఉంటుంది. కొన్ని గ్రావలకు చెంది, పట్టణాలలో నివసించేవారికి సంబంధించిన ముఖ్యవిషయలు యొక్క అంతిమతీర్పులు. గ్రామ పౌర పరిషత్లోనే జరుగుతాయి. ఎన్నికలలో గెలవటం ఓడటం అనేది తరచుగా ఈ గ్రామ పరిషత్లు సహకారం ఉండటం లేకపోవటం మీదే ఆధారపడి ఉంటాయి.

తెగల సంబంధాల ద్వారా ఆపాదించబడిన బాంధవ్యాల అల్లికయొక్క బలమే యింకా గ్రామ పరిపాలనను అధికార స్థానాలనుంచి స్త్రీలను దరంగా వుంచే రాజకీయలను పెంచి పోషిస్తోంది. అది ఆవో సమాజంలో స్త్రీల తక్కువ స్థాయిని మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తుంటుంది. పురుషులకు ఈ సంప్రదాయలపై ఎంతోకాలంగా ఉన్న నమ్మకం, సమాజంలో బతకటానికి స్త్రీలు తమ ఆలోచనలను దాచుకోవటమనేది ఎంతగా వ్యాపించాయె చెప్పలేము. అందువల్ల సహజంగా రావాల్సిన విప్లవవె లేదా పురుషులు పూనుకునే చరిత్రాత్మక సాంఘిక తిరుగుబాటో ఆవో సమాజంలో రాకుండా ఆపుతున్నాయి. ఇవి రాకపోతే ఆవో సవజంలో స్త్రీల వెలి మరో వెయ్యి సంవత్సరాలు యిలాగే కొనసాగుతుంది.

ఉపయుక్త గ్రంథాలు
1. ఆవో టజన్ (లేట్) ఆడ్ నాగా కస్టమర్ లాస్ 1980

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.