– సామాన్య

33

బెంగాలీ మేటి దర్శకుడు ఋతుపర్ణోఘోష్‌ ఈ ఏడాది మే నెలలో పరమపదించారు. ఒక్క బెంగాల్‌కే కాదు మొత్తం భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా అతను అంత చిన్న వయసులో మరణించడం పూడ్చలేని లోటు. స్పష్టమైన సామాజిక దృక్పథం కలిగివున్న దర్శకుల కొరత మనకు చాలా ఉంది. సమాజం మరింత మెరుగుగా మారడం కోసం మనుషుల ఆచార వ్యవహారాలలో ఏమేం మార్పులు రావాలో, ఏయే ‘మెంటల్‌ రిజర్వేషన్స్‌’ని వారు వదిలించుకోవాలో గుర్తించి అటువైపుగా మానవ సమూహాలను నడిపించి మార్గదర్శకత్వం వహించగల దృక్పథం ఉన్న దర్శకుడు రితుపర్ణో.

49 ఏళ్ళ జీవితంలో ఋతుపర్ణో ఇరవైకి పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. ‘ఆరేక్టి ప్రేమేర్‌ గల్పో’ వంటి సినిమాలలో నటించారు. దాదాపు ఒక దశాబ్దంనుంచీ స్వలింగ సంపర్కుల, నపుంసకుల హక్కుల గురించి, వారి హృదయ వేదనల గురించి వీలైన ప్రతి మాధ్యమంలోనూ చాటుతూ వచ్చారు రితుపర్ణో. నిజానికి రితుపర్ణో సినిమాల గురించి పరిచయం చేయాల్సి వస్తే ‘చోఖేర్‌ బాలి’ ముందు వరుసలో ఏం నిలబడదు. కానీ రితుపర్ణోకి ఠాగూర్‌ రచనలంటే వల్లమాలిన ప్రీతి. ఆ ప్రీతితోనే ఆయన చోఖేర్‌ బాలి కాక, నౌకాడూబె, చిత్రాంగద వంటి టాగూర్‌ రచనలకి దృశ్యరూపాన్ని ఇచ్చాడు ఋతుపర్ణో. ఈ చోఖేర్‌ బాలి పరిచయం ఆయనకి నివాళి తెలుపడానికే.

‘చోఖేర్‌ బాలి’ ప్రచురించబడిన కొంతకాలానికి ‘ఇప్పుడైతే అలాటి ముగింపు ఇచ్చి ఉండేవాడిని కాదు’ అన్నాడుట రవీంద్రుడు. ఇద్దరు యువతులు, ఇద్దరు యువకుల మధ్యన యౌవన ప్రేరేపిత కామనల కథ ఇది. వివాహం మీద ఇచ్ఛలేక మహేంద్రుడు (నవలలో కుంజు) తిరస్కరించిన వధువు బినోదిని (మాయ) ఏడాదిలోపే విధవ అవుతుంది. మహేంద్రుడికి ఆశాలతతో (కరుణామయి) వివాహం అవుతుంది. వారి కాపురం వర్ణరంజితంగా సాగుతున్న సమయంలో బినోదిని మహేంద్రుడి తల్లితో కలిసి ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. ఆశాలత అమాయకురాలైన మంచిపిల్ల, త్వరలోనే గడుసరి బినోదినికి, ఆశాలతకి మంచి స్నేహం కుదిరి ఒకరినొకరు ముద్దుగా చోఖేర్‌ బాలి అని పేరు పెట్టుకుని పిలుచుకునే వరకూ వెళుతుంది. (బాలి అంటే ఇసుక). ఈ స్నేహపు తీగ మరింత పాకి మహేంద్రుడికి, బినోదినికి ప్రేమ సంబంధం ఏర్పడుతుంది. ఇది తెలిసి ఆశ కాశీకి వెళ్ళిపోతుంది. బినోదిని బిహారిని తనను పెళ్ళాడమని యాచించి తిరస్కృత మవుతుంది. మహేంద్రుడు ఆమెతో వచ్చేసినా విధవా వివాహమాడటానికి అతని సాహసం అనుమతించదు. బినోదిని చివరికి ఎటో వెళ్ళిపోతుంది. ఇదీ క్లుప్తంగా కథ.

”మత్తు వదిలిన పిమ్మట మనిషిలో కొంచెం శిథిలత వచ్చేస్తుంది. మరల ఆ శిథిలతను పోగొట్టుకోడానికి ఆయత్తమ వుతాడు” అంటాడు ఒకచోట ఈ మువ్వురి సంబంధం గురించి రవీంద్రుడు. అటువంటి అలజడే బహుశా ఈ ఒకచోట రిచర్డ్‌ రైట్‌ ”మార్క్సిజం సమాజ అస్థిపంజరాన్ని నగ్నంగా బయటపెట్టింది. రచయిత చెయ్యాల్సింది దానికి కండని చేర్చడం. అంతేకాని ఆ అస్థిపంజరాన్ని యధాతథంగా పాఠకుడికి చూపకూడదు” అంటాడు. ఏ సిద్ధాంతమైనా చేయాల్సింది అదేనేమో. రవీంద్రడు ఆ ముగింపుని ఇచ్చినా, ఆ ముగింపుని పాఠకులు భరించలేక, సరళహృదయులై బినోదినికి కొత్త జీవితం సంప్రాప్తిస్తే బావుండనుకుంటారు. నవల నుండి పాఠకుడు ఎగ్జాస్ట్‌ చేసుకునే ఆ ముగింపే నవల విజయానికి కారణమని చెప్పచ్చు. ఆ రకంగా ఆ ముగింపుతో కూడా రవీంద్రుడు రచయితగా విజయులయ్యారు.

‘చోఖేర్‌ బాలి’ సినిమాగా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. నటీనటులకు మంచి గుర్తింపుని కూడా తెచ్చింది. నామటుకు నాకు నవల ఇచ్చినంత సంతృప్తిని సినిమా ఇవ్వకపోయినా ఆ మాధ్యమం దృష్ట్యా ఇది సంతృప్తికర దృశ్యరూపాన్నే పొందిందని చెప్పగలను.

 

 

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో