– వలిశెట్టి గాంధీ, వేముల సౌజన్య

 1980 తరవాత కొత్త చైతన్యంతో వచ్చింది స్త్రీవాద సాహిత్యం. పాత విలువలను ప్రశ్నిస్తూ, పితృస్వామ్య విలువలను ధిక్కరిస్తూ సమానత్వ కోసం సంఘర్షిస్తూ వినిపించింది స్త్రీవాద కవిత్వం.

పురుషుడు చేసే ప్రతి పనికీ విలువ పెరుగుతూ, స్త్రీ చేసే ప్రతి పనికీ విలువ తరుగుతూ వచ్చింది. మాతృత్వం పేరుతో పిల్లలను కనిపెంచాల్సిన బాధ్యతను స్త్రీ స్వీకరించింది. కాని ప్రయోజకులైన పిల్లలు మాత్రం పురుషుడి వారసులే అయ్యారు. వీటన్నింటికీ మించి లైంగిక వివక్షు గురి అయింది. కుటుంబ హింస ఎక్కువైంది. ఆత్మాభిమానం కోల్పోయింది. సమాజంలో రెండవ శ్రేణికి దిగజారింది స్త్రీ పరిస్థితి. తిరుగుబాటు చేయక తప్పనిసరి అయిన తరుణంలో స్త్రీలు మేల్కొన్నారు.

పితృస్వామ్యాన్ని గూర్చి సావిత్రి 1984లోనే ”బందిపోట్లు” అనే కవిత రాసింది.

పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని

పంతులు గారన్నప్పుడే భయమేసింది

ఆఫీసులో నా మొగుడున్నాడు

అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది.

పెళ్ళంటే పెద్ద శిక్ష అనే

మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చిపెంచిన జనంలో సగమే

మనల్ని విభజంచి పాలిస్తొందని” అని విశ్లేషణ చేసింది.

పితృస్వామ్య దురహంకారం మీద నేటి స్త్రీవాద కవిత్వం తిరుగుబాటు చేస్తున్నది.

సాధ్యమైనంతవరకు చెప్పదలుచు కొన్న సమస్యకు సంబంధిం చిన సమగ్రాను భవస్ఫూర్తిని వెలువరించ టానికి ప్రయత్నిం చారు.

”తన ప్రేమను….. ఈనాటి స్త్రీ!”

భాస్కర స్వర్ణాంబ రచించిన కవిత ఇది. శిల్ప రీత్యా ఇది ఒక మంచి కవిత. మొదటి ఐదు చరణాలు స్త్రీ మూర్తి పంచప్రాణాలు. పుట్టింటి ఆడపడుచుగా, అత్తింటి ఇల్లాలుగా, సొంతింటి యజమాను రాలుగా ఆమె పంచిన ధనం ప్రేమ. ఈ కవితలో కాన్ట్రాస్ట్‌తో కరుణను సృష్టించే శక్తివంతమైన చరణం ”జాలి చూపులతో చూస్తున్నది” అన్నది. ఇది రచయిత్రి దర్శించింది, లోకానికి దర్శింప చేయాలను కున్నది. ప్రేమకు ఫలంగా ఆమె పొందింది నిరాశ. దానికి కారుకులెవరు? ఆ జాలి చూపులు ఏ పరిస్థితుల వలన ఏర్పడ్డాయి? ఇది జీవితంలో తెలుసుకొనే ధ్వని. ఎవరా వ్యక్తి? అనే ప్రశ్న ఆలోచనను రేకెత్తించేది.

‘ఈనాటిస్త్రీ! అనేది మొత్తం కవితలో కవయిత్రి ప్రతిపాదింపదలచుకొన్న తాత్పర్యంతో పఠిత తాదాత్మ్యం పొందటానికి వీలైన వాహిక. అది వాచ్యమౌతున్న వాస్తవంగా కాకుండా వ్యక్తమౌతున్న అనుభూతిలా గోచరిస్తుంది. ఒక స్త్రీ సమగ్ర జీవిత చిత్రాన్ని ముంజేతికంకణంలో చూపుతున్న మినీ కవిత యిది. స్త్రీ రచనా సామర్థ్యాన్ని చాటుతున్న స్త్రీ సమస్యా చిత్రణ కవిత.

నిజానికి ఏ సమాజంలో పితృ స్వామ్యం కొనసాగుతుందో అది నాగరిక ముసుగులో కొనసాగుతున్న బానిస సమాజమే. అయితే ఆ బానిస తిరగబడడం చారిత్రక అనివార్యత. బానిసత్వాన్ని త్యజించి స్త్రీలు ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అణచివేత సమాజాల నుండి ఆత్మఘోషను వినిపించారు.

సమస్యలను కవితలలో వ్యక్తీకరించేటప్పుడు కవయిత్రులు స్త్రీ రేఖా చిత్రాన్నిగాని, భావ చిత్రాన్నిగాని ముందు నిలిపి, దాని గురించి తామేమి వ్యాఖ్యానించకుండా సమస్యల సాంద్రతను భావించి అనుభవించేటట్లు చేసే స్వభావోక్తి శిల్పవైభవాన్ని ఒక్కొక్కసారి ప్రదర్శిస్తే, మరొకసారి తమ వ్యాఖ్యానాలతో మన వివేచనాశక్తిని రెచ్చగొట్టే తులనాత్మక వైఖరిని ప్రకటిస్తూ ఉంటారు. ఇందులోనూ నిర్వచన పద్దతిలో ఒకసారి, నినాదపద్దతిలో మరొకసారి చెప్పే అవకాశాలున్నాయి. ఈ రెండింటికి రెండు ఉదాహరణలు

‘ఆడది……….పెళ్ళి కొడుకు !”

యలమర్తి అనూరాధ రచించిన ఈ అధిక్షేపాత్మక వ్యంగ్య రచనకు శీర్షిక ”ఆడది-మగాడు” సమాంతర అవస్థలను అభాసగా సృష్టించి తులనాత్మకంగా లోకస్వభావాన్ని ఎత్తిపొడుస్తున్న ఈ కవితలోని అభివ్యక్తి నిర్వచన ధోరణిని ప్రకటిస్తున్నది.

ఇలాంటిదే మరొక కవిత జానకి రచించిన ‘నాడూ-నేడూ’ కాని ఇందులో ప్రశ్నార్థక ప్రవృత్తి లేదా నినాదాత్మమైన వైఖరి గోచరిస్తుంది.

”నాడు అపవాదు వేసి……

కారణాలు వేరు తప్ప?”

ఈ కవితలో బలం తర్కం. సమాజంలో పురుషాధిపత్యం నాడూ – నేడూ ఉంది. అది భార్య పట్ల ఒకే విధంగా అన్యాయం చేస్తూనే ఉంది. అయితే ఆనాడు ధార్మిక కారణం చూపింది. ఈనాడు ఆర్థిక కారణం చూపుతోంది. ఈ కారణాల వెనుక ఉన్న సామాజిక వ్యవస్థలను, అవి స్త్రీల పట్ల చేసే అన్యాయాలను సమాజ దృష్టికి తేవడం ఈ కవితా లక్ష్యం. దీనికి ప్రశ్నార్థక లేదా నినాద వైఖరి బాగా తోడ్పడుతుంది. నిర్వచన వైఖరి చమత్కారాన్ని కలిగిస్తే, నినాదవైఖరి చైతన్యాన్ని రేకెత్తిస్తుంది. అయితే స్త్రీలలో నినాదవైఖరికంటే నిర్వచన వైఖరికే ఎక్కువ ప్రాచుర్యం కనపడుతుంది.

పారిశ్రామికీకరణ కూడా స్త్రీ వంటింటికి బందీ కావడానికి ఒక కారణమైంది. మగవారు పబ్లిక్‌ జీవితంతో పాటు దర్జాగా ఇంట్లో ప్రైవేట్‌ జీవితాన్ని గడుపుతుంటే స్త్రీలకు పబ్లికక జీవితం మృగ్యమై వంటింటికే పరిమితమైనారు. కారణాలేమైనా, సామాజిక ఉత్పత్తికి దూరమైన స్త్రీ, ఆర్థిక స్వాతంత్య్రానికి దూరమైంది. ఆమె చేసే ఇంటి పనికి, వంట పనికీ, పిల్లల చాకిరీకి విలువ లేకుండా పోయింది. తన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమెలోని ప్రతిభ, సృజనాత్మక శక్తి అణగారిపోయాయి. ఆమె జీవితమంతా వంటింటిలోనే మగ్గిపోయింది. క్రమంగా వంటింటి తనానికీ స్త్రీత్వానికి మధ్య అభేదమేర్పడింది.

విమల స్త్రీల సృజన శక్తులను అణచివేసే భూతం ‘వంటిల్లు’ అన్నది మన రక్తం పీల్చేసి, మన ఆశల్ని, కలల్నీ కాజేసి కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు అంటూ వంటిల్లు వికృత స్వరూపాన్ని విమల ఆవిష్కరించారు. స్త్రీ జాతిని వంటింటికే పరిమితం చేస్తూ వారి ఆలోచనలను, ఆసక్తులను, అభిరుచులను బందీ చేస్తూ తొక్కి పట్టే సంస్కృతికి వంటిల్లును ప్రతీకగా చేశారు. ఈ రకమైన అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీ తన సంకెళ్ళను తెంచుకొని స్వేచ్ఛా పూరితమైన ప్రపంచంలోకి ప్రవేశించాలనే స్త్రీల తపన్ను విమల ఒక స్త్రీగా స్వానుభవ కోణం నుండి వివరించారు.

మనం ఏమైనా అంతిమ కర్తవ్యం

గరిట దిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను

ధ్వంసం చేద్దాం రండి!

ఇక గిన్నెలపై ఎవరి పేర్లూ వద్దు

వేరు వేరు స్వంత పొయిలను

పునాదులతో సహా తవ్విపోద్దాం రండి!

మళ్ళీ మన పాపలు ఈ వంటరి వంటిళ్ళలోకి

అడుగిడబోతున్నారు

మన పిల్లల కోసం

వంటరి వంట గదులు కూల్చేందుకు రండి

అంటూ ”వంటిల్లు” కవిత ముగుస్తుంది.

‘యశోధరా ఈ వగపెందుకే” అన్న జయప్రభ కవితా సంకలనంలో స్త్రీ వాదాన్ని మరింత బలంగా ప్రతిపాదించే కవితలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పురుష ప్రపంచాన్ని దోషిలా నిలబెట్టి ప్రశ్నించే పాత్ర ”వరలక్ష్మి” పిన్ని.

‘నలుగురితో కలిసేదో నవ్వేదో లేదో

……… కనుక్కున్న వాళ్ళు లేరు”

స్త్రీ జీవిత విషాద చిత్రాన్ని ఈ వాక్యాలు అలవోకగా ఆవిష్కరించాయి.

చాతుర్వర్ణ వ్యవస్థలోని పై కులాల స్త్రీల జీవన చిత్రణను కొందరు కవయిత్రులు ప్రతిభావంతంగా కవిత్వీకరిస్తుంటే దళిత స్త్రీ జన జీవనాన్ని మరికొందరు కవయిత్రులు ఆవిష్కరణ చేస్తున్నారు. అలాగే మైనారిటీ స్త్రీలు తమవైన సమస్యలను కవితలలో చిత్రణ చేస్తున్నారు. స్థాయీ బేధాలేవైనా సమస్త స్త్రీ సమాజం పితృస్వామ్య వ్యవస్థలో వివక్షతనే ఎదుర్కొంటున్నది వాస్తవ. ఆ వాస్తవ పరిస్థితులను ప్రశ్నిస్తూ, సమాన హక్కుల సాధన దిశగా నేడు స్త్రీవాదం పయనిస్తున్నది. ఆ పయనాన్ని స్త్రీవాద కవిత్వం ప్రతిఫలిస్తున్నది.

 

– వలిశెట్టి గాంధీ, వేముల సౌజన్య

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.