ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్

గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి,
భూమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘మానవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పూర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను.

ప్రత్యామ్న్యాయ ఉద్యమాలు నడపదలచినవారి వ్యక్తీకరణలో అటువంటి భాష దొర్లగడదనే విషయంలో మరొక అభిప్రాయమే ఉండడానికి వీలులేదు.

అయితే మీ సంపాదకీయం చదివాక నాలో కలిగిన ఒకటి రెండు అభిప్రాయలను కూడ చెప్పవలసి ఉంది. ఆ సభ గురించి, అక్కడ ప్రకటించిన కార్యక్రమం గురించి, అది జరిగిన తీరు గురించి, అక్కడ పాటలు పాడిన గాయకుల గురించి అన్ని వివరాల సంపూర్ణంగా రాసిన మీరు ఆ అభ్యంతరకరమైన వ్యక్తీకరణ ఉన్న పాట రచయిత ఎవరో రాయడం మాత్రం వదిలేశారు. మిగిలిన వివరాలు అన్నీ ఉండడం వల్ల ఆ అభ్యంతరకరమైన వ్యక్తీకరణ ఉన్న పాట ఆ సభా నిర్వాహకులదో, ఆ రోజు ఆవిష్కరణ జరిగిన సిడిల లోనిదో అనే అభిప్రాయం కలుగుతుంది. ఆ పాట పాడినవారిదీ, కోరస్ ఇచ్చినవారిదీ, ప్రచారం చేసే వారిదీ కూడ తప్పే గాని, అసలు రాసినవారి పేరే ఎత్తకుండా, పాడినవారిని వత్రం విమర్శించడం నాకు అర్థం కాలేదు.
ఆ పాట రచయిత గద్దర్. ఆయన రాసిన ఇతర పాటలలో గాని, ఆయన ప్రదర్శనల్లో ఉపయెగించే భాషలో గాని అటువంటి వ్యక్తీకరణలు ఉంటున్నాయని, వాటిని వర్చుకోవలసి ఉందని గత పది, పదిహేను సంవత్సరాలుగా జరిగిన చర్చ మీ దృష్టిలో ఉండే ఉంటుంది. ఇప్పుడు మీరు అభ్యంతరపెట్టిన పాట వెలువడి, అచ్చు కూడ అయి, సిడి రూపంలో కూడ వచ్చిన క్రమంలో ఈ భాష అభ్యంతరకరమని విమర్శించిన వారు ఉన్నారు.

అసలు ఇటువంటి భాష వాడడమే ఒక అస్తిత్వ చిహ్నంగా వాదిస్తున్న వారు కూడ ఉన్నారని మీకు తెలుసు. మన సవజంలో చాలా అవసరమైన ఆకాంక్షలపై, అనివార్యంగా, స్వచ్ఛంగా పెల్లుబికిన ఎన్నో అస్తిత్వ ఉద్యవలు ఆ తర్వాతి కాలంలో వెర్రితలలు వేసిన క్రమంలో ”మనవాళ్ళు చేసిందేదయినా ఒప్పే, అవతలివాళ్ళు చేసిందేదయినా తప్పే” అనే స్థితికి చేరిన విషయం కూడ మీకు తెలుసు. ఆ నేపథ్యంలో అవనవీయ భాషను, ఇతర పీడిత అస్తిత్వాలను కించపరిచే భాషను వాడడం అలవాటుగా వరిపోయి, దాన్ని ఖండించడానికి భయపడే స్థితి వచ్చింది. తప్పు ఎవరుచేసినా తప్పే. దాన్ని ఖండించవలసిందే అనే సాధారణ అవగాహననుంచి, సవజం తప్పుడు పనులుగా చసేవాటిని ఇంతకాలం ఇతరులు చేశారు గనుక, ఇక నుంచి మేమూ చేస్తాం, మేం చేస్తే తప్పు కాదు అనే ఒక వాదన బలపడుతున్న స్థితికి మనం చేరుకుంటున్నాం. మీరు లేవనెత్తిన చర్చను ఆహ్వానిస్తే, ఆ చర్చలో ఈ విషయలు కూడ భాగమయితే బాగుంటుందని కోరుతున్నాను.

డా. విద్యాసాగర్ అంగళకుర్తి, హైదరాబాదు

సంపాదకుల వారికి నమస్సులు,
సెప్టెంబరు 2007 ”భూమిక” లో మన భాషమీద మీ సంపాదకీయం వో లోతైన విషయన్ని ఎత్తి చూపుతోంది. దీన్ని మనం తీవ్రంగా పరిగణించాలి.

మన తెలుగు భాషలో ఎన్నో పదాలు స్త్రీని కించపరిచేవిగా ఉన్నాయి. అయితే ఈ పదాలన్నీ వాడుకలో ఎంతగా కలిసిపోయయంటే వాటిని వాడకుండా ఉండలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. వాస్తవానికి చాలా మందికి అటువంటి పదాలను వాడుతున్నామన్న స్పృహ ఉండదు.

ఉన్నా ఆ పదాలకు ప్రత్యామ్నాయమేవిటో తెలీక వాటిని వాడేస్తుంటారు. లంజ, ముండవెపి, ఆడదానిలా ఏడుస్తున్నావే, గాజులు తొడుక్కున్నావ – లాంటి పదాల, పద బంధాల భావ వ్యక్తీకరణకు తిరుగులేనివిగా తెలుగు ప్రజల వాడుకలో కలిసి పోయయి. పూర్తిగా నిషేదించవలసిన వాటిలో యివి కొన్ని.
అదే రకంగా జంతువులకూ, ఆడవాళ్ళకూ సర్వనామంగా ‘ఇది’ అని వాడ్డం చాలా మంది చేస్తుంటారు. ఆ పదం తమ ప్రేమకు సూచకంగా, లేదా వాళ్ళతో తమకున్న చనువుకు సూచకంగా సమర్థించుకోవచ్చు గానీ అది సరికాదు. ఇంగ్లీషులో జంతువులకు కూడా లింగం ఉంది.

అంచేత, అలా వాడుతున్నవాళ్లను చసి కోపగించు కోవడం, బాధ పడడం, జాలి పడడం, గర్హించడం – ఆ సమయనికి మన నిరసనను మాత్రమే తెలియజేస్తుంది. కానీ దానికి పరిష్కారం కనుక్కోవలసిన అవసరం ఉంది.
”నడుస్తున్న చరిత్ర” అనే మాస పత్రికలో మన నిత్య జీవితంలో వాడుతున్న యింగ్లీషు పదాలకు చక్కటి తెలుగుపదాలను పరిచయం చేస్తున్నారు. అదే విధంగా ”భూమిక” ద్వారా మీరటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ ప్రయత్నం కేవలం భాషను మానవీయం చెయ్యడమే కాదు, స్త్రీని గౌరవించడమెలానో నేర్పుతుంది. ఇదో గొప్ప బాధ్యత.
ఈ ప్రయత్నంలో భాగంగా అస్సలు వాడకూడని పదాల జాబితాను రూపొందించడం తొలి దశ అనుకుంటాను. ఆ తరువాతది యిప్పుడు వాడుతున్న పదాలకు ప్రత్యావ్నయ పదాల జాబితా. ఇలా దశల వారీగా మనం వనవీయ భాషను తయరు చెయ్యగలమమో ప్రయత్నిద్దాం.

అనిశెట్టి రజిత, వరంగల్

సంపాదకులకు, నమస్సులు !
గత సంచిక సంపాదకీయంలో ‘నేటి అవసరమైన వనవీయ భాష’ గురించి మీరు ప్రస్తావించారు.

ఈ రోజు సృష్టిలో మనిషికి ఇతర ప్రాణులకన్నా ఎక్కువ గౌరవం ఒక సావజిక హోదా ఉన్నాయంటే ముఖ్యమైన వ్యక్తీకరణ లక్షణాల్లో ఒకటి భాష. గౌరవనీయమైన మానవ భాషనే నాగరికులెవ్వరైనా కోరుకుంటారు. పీడనల సమాజంలో ఒకరినొకరు కించపర్చుకోవడానికి, అగౌరవపరుస్త హింసించుకోవడానికి భాష కూడా ఒక ఆయుధంగా ఉపయెగించబడుతున్నది.

శ్రీశ్రీ ‘అనంతం’ ప్రచురణ జరిగిన తరువాత అందులో స్త్రీల ప్రస్తావనల్లో వచ్చిన చులకన భావాలతో కూడిన అవవనకరమైన భాష, భావ ప్రకటనల గురించి అప్పట్లో దుమారం చెలరేగింది. గద్దర్ ఇతర ప్రజాకవుల పాటల్లో, దిగంబర కవుల రచనల్లో బతుల గురించీ, ఆ బతు అశ్లీల, తిట్టు పదాలు మహిళలను పోలుస్త ఉండటం గురించి కొన్ని పత్రికల్లో వాద ప్రతివాదాలు జరిగాయి.
దిద్దుకునేవాళ్ళు దిద్దుకున్నారు. పొరపాట్లను ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకున్నారు… రాజ్యం మీద, వ్యవస్థమీద, సమాజం మీద ఉన్న కసినీ, నిరసనన ప్రకటించడానికే ఆ భాషా పదాలు వాడాము తప్ప స్త్రీలను కించపర్చడానికి కాదని సమర్థించుకున్న వాళ్ళూ ఉన్నారు.

పితృస్వామ్య భావజాల ప్రభావం వల్ల స్త్రీలను పోలుస్త స్త్రీలను కించపరుస్త భాషా ప్రయెగం జరుగుతున్నదని తేల్చి చెప్పిన సాహిత్య మేధావుల ఉన్నారు. పీడిత, తాడిత, బాధిత వర్గాలపట్ల పీడనన, హింసన, దోపిడీని వ్యక్తపర్చడానికి స్త్రీలను వివిధ మూసల్లోకి, నమూనాల్లోకి, హోదాల్లోకి వర్గీకరించిన అసవజిక, అనౌచిత్యపు, అగౌరవపు భాషా ప్రయెగం సర్వత్రా సర్వసావన్యమైన సర్వావెదితమైన సౌలభ్యకరమైనదిగా విప్లవకారులనుండీ లంపెన్ వర్గాల మగవాళ్ళ వరకూ భావిస్త భ్రమిస్త వస్తున్నదే.
ఇప్పుడిప్పుడే కదా కొంతమంది మహిళలు అన్ని సందర్భాల్లోన అన్ని సమూహాల్లోన భాషా హింసను భాషాపరమైన అవనవీయతను ప్రశ్నిస్తున్నది. అయితే మళ్ళీ ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. స్త్రీలు ప్రశ్నించడం, స్త్రీలు వ్యతిరేకించడం, స్త్రీలు నిరసించడం కూడా ఎంతటి మహాపురుషులు, పురుషోత్తములు, ప్రజానాయకులకైనా మింగుడు పడని విషయం. జనంతో మమేకమయ్యేవాళ్ళు కూడా ‘ఇగో’లను బదులుకోలేని బలహీనతల్లో కూరుకుపోయి ప్రవర్తిస్తుండటం మనకేమీ కొత్తకాదు.. పిటీయే…
ఆడవాళ్ళ ఆకాంక్షలు, ప్రతిభ, చైతన్యం, సామర్థ్యం, జ్ఞానం వరకు వచ్చేసరికి పాలకులుగా, నిర్వాహకులుగా, కళాకారులుగా, మేధావులుగా, విధానకర్తలుగా అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఆధిక్యులుగా ఉన్న పెద్దలకు మన గాంధీగారికి ప్రియమైన మూడు చైనా కోతుల్లో ఏమీ కనిపించదు, ఏమీ వినిపించదు, ఏమీ మంచి వటలాడరాదు.

ప్రజాసంఘాల్లో, ఉద్యవల్లో ఉన్న మహిళా కార్యకర్తలు ఎంతగా విసిగిపోయరంటే చెవిటితనం నటిస్తున్న వాళ్ళకు ఎప్పటికీ ఆ చెవుడు శాశ్వతం కావాలనీ, కళ్ళుమూసుకుని అన్నీ గ్రహిస్తున్న వాళ్ళకు ఎప్పటికీ దృష్టిలోపం ఉండిపోవాలనీ నోళ్ళు మూసుకొని మాకేమీ తెలియదు ఏమీ ఎన్ని సిద్దాంతాలు చెప్పి రాద్ధాంతం చేసినా ఎన్ని గ్రంథాలు చదివి పాండిత్యం సంపాదించినా, ఎన్నో పీడనలకు చలించి ద్రవించి ప్రతిఘటనవాదులుగా, పోరాట శీలురుగా మారినా తమ సహానుభతీ, సమతావాదం, మానవీయ దృక్పధంలో నిజాయితీ ఆత్మపరిశీలన, పరివర్తన లోపిస్తే అంతా తుప్పే. ప్రత్యావ్నయ సంస్కృతికోసం పీడనలు లేని వ్యవస్థ కోసం పరితపించేవాళ్ళూ త్యాగాల కష్టాల చేస్త పడుత ఉన్నవాళ్ళూ ముందుగా భాషను వర్చుకోవడం రాకపోతే క్షవర్హం ఎట్లా అవుతారు?

అట్లాగని ఆడవాళ్ళు వట్లాడే భాషలో ఎవరికైనా తిట్టడం, విమర్శించడం, ఆక్షేపించడంలో స్త్రీజాతిగానే అవవనించుకునే, భాషా ప్రయెగాలు అస్సలు ఉండవనీ లేవనీ కాదు..
భాష ద్వారానే మన వైఖరి స్పష్టం అవుతుందనీ మన భావజాలం ఆవిష్కృతమవుతుందనీ గ్రహించుకొని మనల్ని మనం మార్చుకోవాల్సిన సమయం ఇంకా రాలేదా..?
ఆడవాళ్ళు ఏ అభ్యుదయ సమూహాల నడుమ నాగరిక సంస్కారవంతుల నడుమనైనా కూర్చొని లేదా వారితో కలిసి నిర్భయంగా పాల్గొని భాగస్వామ్యం వహించే వాతావరణం ఆశిస్త ఆశిస్త ఇంకా ఎన్ని దశాబ్ధాలు ఎదురుచడాల్నో….

విజయశ్రీ, హైద్రాబాద్

సత్యవతిగారికి అభినందనలు చెపుత నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సెప్టెంబర్ వసం భూమికలో వఘసర్యకాంతి, పుష్ప రాసిన విమెన్స్ కాలేజీ అనుభవం, డి. చంద్రకళ కవితా, వసంతకువరిగారి ‘పరంపర’ కథానిక దేనికదే చాలా బావున్నాయి.

స్త్రీలని అన్ని కోణాల్లో చూపించే కధానికలు, ఇతర ప్రక్రియలు ప్రచురించడంతో చాలా ఆసక్తికరంగా ఉంది భూమిక. ‘స్త్రీవాదం’ అంటే స్త్రీలుసంప్రదాయలకి విరుద్ధంగా ఉండాలనే నియమంలేదు కదా. సంప్రదాయలని కించపరుస్త రాసిన కొండేపూడి నిర్మలగారి వ్యాసం కొంత వెలుగును చూడాలేమో.

రేణుక అయోల, హైద్రాబాద్

మృదంగం శీర్షికలో కొండేపూడి నిర్మలగారి వ్యాసం చదివాక నాలుగు ముక్కలు రాయలనిపించింది.

రచయిత్రి వివాహ వేడుకలని సరిగ్గా అర్ధం చేసుకున్నట్లు లేదు. సంప్రదాయలు వర్చాలని సచిస్తున్నారా. లేక వివాహ వేడుకలని వెక్కిరిస్తున్నారా అర్ధం కాలేదు.

strong>వందన, శివాజీపాలెం
సెప్టెంబరు సంచికలో డా. ఎండ్లరి సుధాకర్ గారు, రాష్ట్రపతి పదాన్ని ‘రాష్ట్రసతి’ గా వర్చాలంట, అలా వరుస్తే జెండర్ పరంగా గౌరవంగా వుంటుంది అని అంటున్నారు.

మంత్రి కార్యదర్శి వంటి అధికారిక పదవే ‘రాష్ట్రపతి’ కూడా. మంత్రి స్త్రీ అయితే మంత్రిణి, కార్యదర్శి అయితే కార్యదర్శిణి అని అనం. అలా అనకపోయినా ఆ పదవులకూ, ఆ పదవులనలంకరించిన స్త్రీలకూ నష్టమేం లేదు. ‘పతి’ అంటే, మగాడు-మొగుడు’ అని అనుకోవలసిన అవసరమే లేదు, ఆ పదానికి, ‘పెద్ద అయినటువంటిది’ అన్న అర్థం వుంది. ఒకవేళ వర్చాలి అనుకుంటే రాష్ట్రవత అని అనవచ్చు. ‘సతి’ అంటే స్త్రీ లింగపదమే అనుకోవడం కూడా పొరపాటు. ‘సతి’ అంటే ధ్యానము అన్న అర్థం వుంది.

strong>నటరాజ్, విశాఖ

సెప్టెంబరు భూమికలో, ‘నను మించి వ్యాపించనంత వరకు నీ విస్తృతీ నా కిష్టం’ అని డా. జరీనా బేగం గారు మగ పెద్ద మనసును కవితలో చాలా బాగా వ్యక్తీకరించారు.

భమిక లోని కవితల సెలక్షన్ బాగుంటుంది.

బొవ్మ-బొరుసు, డి. చంద్రకళ గారి కవిత, నిష్టూరమైన నిజాల్ని మొకం మీద గుద్దింది. మగాళ్ళు సిగ్గొదిలేసి కొన్ని యుగాలయ్యింది. యిప్పుడు కావలసింది యిట్లాంటి చెప్పుదెబ్బలే. పరంపర కథలో వసంతకువరిగారు, అంత మంచి అత్తగారికి సంకుచితంగా ఆలోచించే కోడల్ని చపించి కోడలిపాత్రకు అన్యాయమే చేశారు. అత్తా-కోడల యిద్దర ఆడవాళ్ళే. ఆ సంగతి మరిచిపోతే ఎలా? పాట బాగులేదని అలిగి వెళ్ళిపోయి వ సత్యవతమ్మతల్లి వకు తెలంగాణా పాలపిట్టపాటకు తన చక్కని కామెంటరీని మిస్ చేసింది. సత్యవతి గారికి కోపమెక్కువని వైజాగ్ దాకా తెలిసింది. ముండవెపి అన్న పదమొక్కటే కాదు, యింకేదో కారణం కూడా వుండి వుంటుందని అనుకునే అవకాశం కూడా వుంది. నాయకురాలు మీరు, సంయమనం లేకపోతే ఎలా? మీ చక్కని విశ్లేషణని మిస్సయ్యం అని మీరు గుర్తిస్తే ఎంత బాగుండును? నిజంగానే ఓ చిన్న రిపోర్టులో రావలసిన దాన్ని సంపాదకీయంలోకి ఎక్కించారు. మీరు ప్రతిపాదించే చర్చ, కోపం వల్ల కాకుండా విజ్ఞత వల్ల పుట్టివుంటే అదిలోకానికి మేలౌతుంది.

Share
This entry was posted in ఎడిటర్‌కి లేఖలు. Bookmark the permalink.

One Response to

  1. మీ త్తెలుగు బగుగ వున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో