ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్?

2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం సాగిస్తున్నాడు. పూజ తన భర్త, అత్తతో కలిసి బతుకుతోంది. పూజ ఎక్కువగా చదువుకోలేదు. పెళ్ళయిన ఆరేడు నెలలకే ఆమెకు భర్తనుంచి కట్నం వేధింపులు మొదలయ్యయి. అదనపు కట్నం తెమ్మని భర్త, అత్త కలిసి తిట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఆడపిల్లను కన్నందుకు కూడా హింసను చవిచడాల్సి వచ్చింది. ఒక రోజు ఆమెను బాగా కొట్టి, బిడ్డతో సహా ఇంట్లోంచి గెంటేయడం జరిగింది. తల్లిదండ్రులిచ్చిన కొద్దిపాటు సొమ్ముతో ఆమె అద్దె ఇంట్లో బతకడం మొదలుపెట్టింది. సరైన తిండి లేక, పోషకాహార లోపంతో తల్లీ బిడ్డలు చిక్కిశల్యాలయ్యారు. భర్త ఆమె అద్దెకుంటున్న ఇంటికి కూడా వచ్చి కట్నం తెమ్మని హింసించేవాడు.

ఈ దశలో పూజ మనోవర్తి కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 కింద కేసు వేసింది. సంవత్సరం గడిచిపోయినా ఆమెకు కనీసం తాత్కాలిక భృతి కూడా మంజూరు కాలేదు. కేసు కోర్టులో మూలుగుతోంది. అంతకు ముందు పూజ తన మీద హింస జరిగినపుడల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కుటుంబ తగాదా పేరు మీద పోలీసులు కేసును రిజిష్టర్ చెయ్యడంగాని, ఆమె మీద హింసను తగ్గించడానికి చర్యలుగానీ ఏమీ తీసుకోలేదు. పది పదిహేను సార్లు ఇలా జరిగింది. పోలీసులు అన్ని సార్లు కూడా ఎలాంటి చర్యల తీసుకోలేదు.

జూన్ 29న ఆమె మీద ఆమె భర్త దారుణ హింసని ప్రయెగించినపుడు ఆమె పోలీస్ కమీషనర్ కార్యాలయనికి వెళ్ళి, తన ఫిర్యాదును రిజిస్టర్ చేసుకుని, తనకు న్యాయం చేయకపోతే తనను తాను నిప్పటించు కుంటానని హెచ్చరించింది. ఆ రోజు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో లేకపోవడంతో తన సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కూడా తనని తాను కాల్చుకుంటానని బెదిరించినపుడు వత్రమే ఆమె కేసును రిజిష్టర్ చేసారు. ఆ తర్వాత ప్రతాప్ ఆమె ఇంటికెళ్ళి పోలీసులు తననేమీ చేయలేరని, ఒక్క రోజులో బెయిల్ మీద బయటకొస్తానని, నీ అంతు చస్తానని బెదిరించాడు. అతను బెదిరించినట్టుగానే అరెస్టయి, వెంటనే బెయిల్ మీద బయటకొచ్చేసాడు. ఇక ప్రతాప్ తనని బతకనివ్వడని పోలీసులు తనను రక్షించరని నిర్ణయించుకున్న తర్వాతే పోలీసులు, న్యాయవ్యవస్థ నిర్లక్ష్య వైఖరులను ఎండగట్టటానికి, దేశం మొత్తం తెలపడానికి లోదుస్తులు వత్రమే ధరించి రాజ్కోట్ రింగు రోడ్డు మీద నడిచి తన తీవ్ర నిరశన తెలిపింది. దినపత్రికలు, టి.వీ ఛానళ్ళు ఆమె ఫోటోను ప్రచురించాయి. ఆమె నిరశనకి ఎక్కువ ప్రాధాన్యమీయకుండా, ఆమెకు న్యాయం జరిగేలా ప్రయత్నించకుండా, పూజ వనసిక స్థితి మీద అనువనాలు కలిగేలా వార్తా కథనాలు, ఇంటర్వ్యలు ప్రసారం చేసాయి. అంటే మీడియ కూడా ఆమె పట్ల అవనుషంగా ప్రవర్తించింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు ప్రవేశించి ఆమె కేసును ఎంత నీరు గార్చాలో అంతా చేస్తున్నారు. పూజ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ర.800 మనోవర్తి వత్రంమంజూరైంది.

పూజా చౌహాన్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశ్లేషిస్తే ఈ దేశంలో స్త్రీల పట్ల పోలీసులు, న్యాయం, మీడియ, రాజకీయ నాయకులు ఎంత బండతనంతో, ఎంత ఇన్సెన్సిటివ్గా ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంత తీవ్రమైన గృహహింస కేసులో (గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా) పోలీసులు పూజను రక్షణాధికారిని కలవమని కనీసం చెప్పలేకపోవడం, ఆమెకు సరైన రక్షణ కల్పించకపోవడం, మనోవర్తి కేసుల్ని కూడా వమూలు కేసుల్లా మూలన పడేయడం చస్తే స్త్రీలకు న్యాయం ఎంత అందని పండో అర్ధమవుతుంది. అత్యుత్సాహంతో ప్రతీదాన్ని సెన్సేషన్ కళ్ళద్దాల్లోంచి మాత్రమే చేసే మీడియ కూడ ఆమెకి న్యాయం అందించలేకపోయింది. రాజకీయ నాయకులు ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయలబ్ది పొందాలనే చేసారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలోంచి పూజాచౌహాన్ చేస్తున్న పోరాటం, ఆమె తన నిరశసనను తెలియచేయడానికి ఎంచుకున్న పద్ధతిని అర్థం చేసుకోవడం, ఆమెలాంటి స్త్రీల ఒంటరి పోరాటాలకు అండగా వుండడం అత్యవసరం. ఆమె పూజ కావచ్చు లేదా మరో రోజా కూడా కావచ్చు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో