” ()” ()

– విడదల సాంబశివరావు

అర్థరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు. విజయవాడ నగరంలో పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో తుఫాన్‌కి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ పాత పెంకుటిల్లు ముందు జీపు ఆపారు. సి.ఐ., ఎస్‌.ఐ., నలుగురు పోలీసులు ఆ ఇంటి తలుపుకొట్టారు. సరిగ్గా 20 నిమిషాల తరువాత యాభై సంవత్సరాల వయస్సు కలిగిన ఓ స్త్రీ తలుపుతీసింది. పోలీసుల్ని చూసి ఆశ్చర్యపోయింది. పోలీసులు ఆమెను పక్కకు తోసి పరుగలాంటి నడకతో లోపలకు వెళ్ళారు. క్షణాల వ్యవధిలోనే ఓ పాతిక సంవత్సరాల యువకుణ్ణి నిద్రలేపి, రెండు చేతులు బలంగా పట్టుకొని, ఈడ్చుకుంటూ తీసుకువచ్చి జీపులో పడేశారు. ఈ సన్నివేశాన్ని ఆందోళనగా గమనిస్తోన్న ఆమె దుఃఖంతో పోలీసుల్ని అడ్డుకున్నది.

”ఏమిటిది? నా బిడ్డను ఎందుకు తీసుకెళుతున్నారు?” రోదిస్తూ ప్రశ్నించింది.

”రేపు స్టేషన్‌కి రా. విషయం వివరంగా చెబుతాం.” సీరియస్‌గా సమాధానం చెప్పి జీపులో కూర్చున్నాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. జీపు వెళ్ళిపోయింది. ఆ తల్లి ఏడుస్తూ నేలపై కూలబడిపోయింది.

—-

మరునాడు ఉదయం 10 గంటలు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఎదురుగా జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది రామగోపాల్‌ కూర్చొని వున్నాడు. ఆ ప్రక్కనే ఆ మహిల గూడా కూర్చొని వుంది.

”చెప్పండి రామగోపాల్‌ గారు, ఏమిటి విషయం?” సి.ఐ. జానకీ ప్రసాద్‌ అడిగాడు.

”ఈమె సుభద్ర. రాత్రి ఈమె కుమారుడు సుబ్బరాజుని, నిద్రపోతున్న వాణ్ణి బలవంతంగా తీసుకువచ్చారని చెబుతోంది. అతనేం నేరం చేశాడు.” సూటిగా ప్రశ్నించాడు రామగోపాల్‌.

”నిజమే రామగోపాల్‌ గారు. గతంలో సుబ్బరాజు చిల్లర దొంగతనాలు చేసేవాడు. పలుమార్లు విచారించి, హెచ్చరించి వదిలేశాం. కానీ ఇప్పుడతను పెద్ద నేరం చేశాడు. అందుకే అరెస్ట్‌ చేశాం” తాపీగా సమాధానం చెప్పాడు జానకీ ప్రసాద్‌.

”ఏమిటో అది?” రామగోపాల్‌ ప్రశ్న –

”ఈ నెల 10వ తేదీన, అంటే సరిగ్గా గత శుక్రవారం బాపూజి మహిళా సదన్‌లో ఓ అమ్మాయి హత్య చేయబడింది. ఈ విషయం నగరంలో సంచలనం సృష్టించింది.”

”అవును నిజమే!”

”ఆ అమ్మాయిని హత్య చేసింది సుబ్బరాజే!” సి.ఐ. జానకీ ప్రసాద్‌ సమాధానం విని రామగోపాల్‌ ఆశ్చర్యపోయాడు.

”అబద్ధం! ఇదంతా పచ్చి అబద్ధం బాబు. పది రోజుల నుండి నా బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఇంట్లోనే వుండిపోయాడు. ఇందులో ఏదో కుట్ర వుంది. నా బిడ్డను కావాలనే ఇరికించారు.” సుభద్రమ్మ గొంతు చించుకొని అరుస్తోంది.

”చూడమ్మా, ఇక్కడ నువ్వు గొడవ చేయకూడదు. అది మరో కేసు అవుతుంది. ఓ గంటలో సుబ్బరాజును కోర్టులో హాజరు పరుస్తాం. నువ్వేదైనా చెప్పుకోవాలనిపిస్తే కోర్టులో చెప్పుకోవచ్చు.”

ఇదే సమాధానం మీక్కూడా వర్తిస్తుందన్నట్లు రామగోపాల్‌ వైపు చూశాడు సి.ఐ.

”ఓ.కె. ఇన్‌స్పెక్టర్‌. థ్యాంక్యూ వెరీమచ్‌.” బైటకు నడిచాడు రామగోపాల్‌. అతన్ని అనుసరించింది సుభద్రమ్మ.

—-

న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు సుభద్రమ్మ వేదన అరణ్య రోదనే అయిపోయింది. న్యాయవాది రామగోపాల్‌ వాదన వీగిపోయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి సుబ్బరాజుకు 14 రోజుల జుడీషియల్‌ కస్టడి విధించాడు. పోలీసుల అభ్యర్థన మేరకు అయిదు రోజులు పోలీసు కస్టడికి అనుమతించాడు ఇంటరాగేషన్‌ నిమిత్తం. ఈ అయిదు రోజులు పోలీసులు సుబ్బరాజును పలురకాలుగా హింసించడం ప్రారంభించారు నేరం అంగీకరించమని. పోలీసుల హింసను భరించలేక సుబ్బరాజు ఆ అమ్మాయిని మానభంగం చేసి హత్యచేశానని అంగీకరించాడు. చివరకు పోలీసులు యఫ్‌.ఐ.ఆర్‌. తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పరిస్థితులలో ఒక దానివెంట మరొకటిగా కొన్ని సంఘటనలు జరిగాయి.

—–

ఆ రోజు ఒక్కసారిగా విజయవాడ నగరం ఉలిక్కి పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజీవ మహాపాత్ర విజయవాడ నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారుల సమావేశం నిర్వహిస్తున్నాడు.

రాష్ట్ర పౌరహక్కుల సంఘం ఆధ్వర్యములో, రాష్ట్ర మహిళా సంక్షేమ సంఘాల నిర్వహణలో వేలాదిమంది కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించారు. నగరం నలుమూలల నుండి ప్రారంభమైన నిరసనల వెల్లువ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ముందు ఆగిపోయింది.

”మహిళలపై అరాచకాలు ఆగిపోవాలి.”

”బాపుజి మహిళా సదన్‌లో జరిగిన అమ్మాయి హంతకులను కఠినంగా శిక్షించాలి.”

”నకిలీ నేరస్తుడిని విడిచిపెట్టి అసలు హంతకుణ్ణి అరెస్ట్‌ చేయాలి.”

”ఆడపిల్లల జీవితాలకు భద్రత కల్పించాలి.”

పలురకాల నినాదాలు మిన్నంటాయి. నగరం నడిబొడ్డున వున్న కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం ముందు రోడ్డుపై ఉద్యమకారులు బైఠాయించారు. ట్రాఫిక్‌ ఆగిపోయింది. ప్రజలు అసహనానికి గురై ఆందోళన చెందటం ప్రారంభించారు.

ఓ అధికారి వెలుపలకు వచ్చి సమాచారం అందించాడు.

”మీలో ఓ పదిమందిని కలెక్టర్‌ గారు లోపలకు రావలసినదిగా చెప్పారు.”

పౌరహక్కుల సంఘం నాయకుడు రాంగోపాల్‌, మహిళా సమాఖ్యల నాయకురాలు శోభాదేవి, మరికొందరు యువజన విద్యార్థి నేతలు లోపలకు వెళ్ళారు.

కలెక్టర్‌ అందరిని సాదరంగా ఆహ్వానించారు.

”సమస్య ఏమిటో వివరంగా చెప్పండి.” తాపీగా అడిగాడు కలెక్టర్‌.

”ఈ నెల పదవ తేదీన ”బాపూజి మహిళా సదన్‌”లో ”అలేఖ్య” అనే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని మానభంగం చేయబడి హత్య గావించబడింది. హంతకుణ్ణి వెంటనే అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చవలసినదిగా మేము డిమాండ్‌ చేస్తున్నాం సర్‌.”

పౌరహక్కుల సంఘం నాయకుడు రామగోపాల్‌ వివరంగా చెప్పాడు.

”హంతకుణ్ణి నిన్ననే కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు కదా!?” కలెక్టర్‌ సమాధానం.

”లేదు సర్‌. అతను నిజమైన హంతకుడు కాదు. అసలు హంతకుడు వేరే వున్నాడు. రాజకీయం ముసుగులో రక్షింపబడుతున్నాడు.” మహిళా సమాఖ్యల నాయకురాలు శోభాదేవి ఆవేశంతో అరచినంత పనిచేసింది.

”మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. దయచేసి వివరంగా చెప్పండి.”

కలెక్టర్‌ ఈ విధంగా సానుకూల స్పందన తెలియజేయడంతో ఉద్యమ నిర్వాహకులలో ఆశలు మొలకెత్తాయి. రామగోపాల్‌ చెప్పసాగాడు.

”సర్‌, ఈ అమ్మాయి పేరు పూజ. హత్యగావించబడిన అలేఖ్య రూంమేట్‌ మరియు క్లాస్‌మేట్‌. జరిగిన వాస్తవాన్ని మీకు చెబుతుంది. దయచేసి న్యాయం చేయండి.”

18 సంవత్సరాల ఓ అమ్మాయిని కలెక్టర్‌కు చూపిస్తూ చెప్పాడు.

”చెప్పమ్మా, నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెప్పు.” కలెక్టర్‌ అడిగాడు.

”నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించండి. అప్పుడే అన్ని విషయాలు చెబుతాను.” ఆ అమ్మాయి తొలిసారిగా, భయం భయంగా పెదవి విప్పి మాట్లాడింది.

”తప్పకుండా. నీ ఫ్యామిలీకి రక్షణ కల్పించే బాధ్యత నాది. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. జరిగిన వాస్తవాన్ని నిర్భయంగా చెప్పు. అసలు దోషికి శిక్ష పడేట్లు నేను చేస్తాను.” కలెక్టర్‌ అమ్మాయికి ధైర్యాన్ని నూరిపోశాడు.

పూజ ధైర్యాన్ని కూడదీసుకున్నది. ఒక్కసారి కళ్లు మూసుకుని జరిగిన సంఘటనలను మననం చేసుకున్నది. కొన్ని క్షణాల అనంతరం చెప్పడం ప్రారంభించింది. అందరూ శ్రద్ధగా వినడం ప్రారంభించారు.

”సర్‌, నేను, అలేఖ్య బాల్య స్నేహితులం. గుంటూరు జిల్లా అమరావతికి దగ్గరలో వున్న పల్లెటూరు ”పెదపరిమి” మా స్వగ్రామం. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా విజయవాడ నగరంలోని యస్‌.వి.ఆర్‌. ఇంజినీరింగ్‌ కాలేజిలో మా ఇద్దరికీ సీట్లు వచ్చాయి. ఆ కాలేజికి హాస్టల్‌ లేని కారణంగా మేమిద్దరము ”బాపూజి మహిళా సదన్‌” లేడీస్‌ హాస్టల్‌లో చేరాము. అప్పటి నుండే మాకు మనిషి రూపంలో ఉన్న ఓ మృగం నుండి సమస్యలు ఎదురయ్యాయి. నా కళ్ళతో నేను చూసినవి. అలేఖ్య చెప్పగా విన్నవి మీకు వివరంగా చెబుతాను.”

ఆ హాలులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందరూ గుండెలు బిగబట్టుకొని ఆమె చెప్పేది వినడం కోసం చెవులు వెక్కించి మరీ ఎదురు చూస్తూ వున్నారు. ఆమె చెప్పడం ప్రారంభించింది.

——

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామాత్యులు రామకృష్ణారావుకు స్వయాన మరదలు విమలాదేవి. ఆమె నిర్వహణలో ”బాపూజి మహిళా సదన్‌” అనే ఆడపిల్లల హాస్టల్‌ స్థాపించబడింది. హాస్టల్‌ వసతి లేని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ హాస్టల్‌లో చేరి విద్యనభ్యసించడం జరుగుతోంది.

అలేఖ్య, పూజ ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసి చదువుకొన్న ఒకే గ్రామానికి చెందిన ఈ అమ్మాయిలిద్దరూ ఇంజనిరీంగ్‌ చదువుకోసం విజయవాడ యస్‌.వి.ఆర్‌. ఇంజినీరింగ్‌ కళాశాలలో జాయిన్‌ అయ్యారు. బాపూజి మహిళా సదన్‌లో రూమ్‌ నెం.6 pokie machines online లో మరో నలుగురు అమ్మాయిలతో కలిసి వుంటున్నారు. అలేఖ్య గొప్ప అందగత్తె. పచ్చని మేని ఛాయతో, సంపెంగ పువ్వును పోలిన నాసికాద్వయం కలిగి వుండి, దానిమ్మ గింజల్లాంటి పలువరుసతో ఎప్పుడూ చిరునవ్వులు చిందించే పెదాలతో అందర్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఓ రోజు సాయంత్రం కాలేజి నుండి హాస్టల్‌కు వచ్చిన అలేఖ్య, పూజ విమలాదేవి ఛాంబర్‌ ముందు నుంచి తమ గదివైపు వెళుతున్నారు. అదే సమయంలో ఓ 25 సం||ల యువకుడు విమలాదేవి గదిలో నుంచి బయటకు వచ్చి అలేఖ్యను చూసి అకస్మాత్తుగా అన్నాడు.

”ఓహ్‌! వాట్‌ ఏ స్టన్నింగ్‌ బ్యూటి? మే ఐ నో యువర్‌ గుడ్‌ నేమ్‌ ప్లీజ్‌?”

”మీరెవరో నాకు తెలియదు. నా పేరు తెలుసుకోవలసిన అవసరం మీకు లేదు.” చిరునవ్వుతో సమాధానం చెప్పింది అలేఖ్య.

”ఓహ్‌, సారీ! ఐయామ్‌ ఇంద్రకుమార్‌, కజిన్‌ సన్‌ ఆఫ్‌ విమలాదేవి.” తనను తాను పరిచయం చేసుకున్నాడు. అలేఖ్య సమాధానం చెప్పలేదు. ఓ అడుగు ముందుకేసింది వెళ్ళడానికి – అతను చెయ్యి అడ్డుపెట్టి –

”పేరు చెప్పకుండానే వెళుతున్నారు.” అన్నాడు ఒకింత అసహనంతో.

అలేఖ్యకు కోపం వచ్చింది. కానీ తమాయించుకుంది. విమలాదేవి గదిలోనికి వడివడిగా వెళ్ళి సీరియస్‌గా అన్నది.

”మేడం, ఇతనెవరో ఆడ్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు. మీకు బంధువనీ చెబుతున్నాడు. ప్లీజ్‌ ఇతన్ని కంట్రోల్‌ చెయ్యండి.” విమలాదేవి బయటకు వచ్చింది.

”ఇంద్రా, నువ్వు లోపలికి రా!” ఆమె పిలుపుకు అతను వెనుదిరిగి లోపలకు వచ్చాడు. అలేఖ్య, పూజ తమగదికి వెళ్ళిపోయారు.

మరునాడు అదే సమయంలో –

”అలేఖ్యా!” పిలిచాడు అతను సున్నితంగా –

ఆగి వెనక్కి తిరిగి చూసింది. ప్రక్కన పూజ బేలచూపులతో అతన్ని చూస్తోంది.

”నీ పేరు తెలుసుకున్నాను.” ఒకింత గర్వంతో చెప్పాడు –

”అయితే?” ప్రశ్నార్థకంగా అతనివైపు చూస్తూ అన్నది.

”నేనెవరో నీకు చెప్పాను – అంతేగాదు, నన్ను గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి.” ధీమాగా చెబుతున్నాడు. అతని మాటలకు అడ్డుపడింది అలేఖ్య.

”చూడండి మిస్టర్‌ – మిమ్మల్ని గురించి తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు.”

”ఆఫ్‌కోర్స్‌ మిస్‌ అలేఖ్య! కానీ, నాకు నీతో వున్న అవసరం రీత్యా నన్ను గురించి తెలుసుకోవడం ముఖ్యం – నేను ఈ నగరానికి రాజుని! స్వర్గానికి దేవేంద్రుడు రాజైతే, ఈ విజయవాడ నగరానికి ఈ ఇంద్రకుమార్‌ రాజు. నేను చెప్పింది మీరు చెయ్యాలి. నేను ఏం చేసినా మీరు చూస్తూ ఉండాలి.” అతను మాట్లాడే విధానం ఆమెలో కోపాన్ని రెచ్చగొట్టింది. విసవిసా నడుచుకుంటూ విమలాదేవి గదిలోనికి వెళ్ళింది.

”ఏమిటి మేడం ఇదంతా. ఇతని ప్రవర్తన నాకు నచ్చడం లేదు. లేడీస్‌ హాస్టల్‌లో ఇలాంటి వాళ్లు ప్రవేశించి అల్లరి పెడుతుంటే మేం ఎలా సహిస్తాం. ఇతని ప్రవర్తనను మీరు కంట్రోల్‌ చెయ్యకపోతే మా పేరెంట్స్‌కు కంప్లయింట్‌ చేస్తాం.”

సీరియస్‌గా చెప్పి తన గదికి వెళ్ళిపోయింది అలేఖ్య. పూజ ఆమెను అనుసరించింది. ఈ సమయంలో వాళ్ళిద్దరి సంభాషణ పూజ చెవులకు వినిపించింది.

”ఏమిటిది ఇంద్రా? ఏమిటీ న్యూసెన్స్‌?” విమలాదేవి చిరాకుగా ప్రశ్నించింది.

”ఈ అందాన్ని నేను అనుభవించాలి.” స్థిరమైన నిర్ణయంతో అతను చెప్పిన సమాధానం.

——-

రెండు రోజులు హాస్టల్‌లో తమకు ఎదురైన అనుభవం రీత్యా ఇంద్రకుమార్‌ను గురించి వివరాలు సేకరించారు అలేఖ్య, పూజ.

మంత్రి రామకృష్ణారావుకు మరో మరదలు కమలాదేవి. ఆమె కుమారుడే ఈ ఇంద్రకుమార్‌. చిన్న వయస్సులోనే విజయవాడ నగరంలో పేరు మోసిన రౌడీగా ప్రజల దృష్టిలో నిలిచిపోయి, పోలీసు రికార్డులకెక్కాడు. తన పెదనాన్న మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని నగరంలో అతను దౌర్జన్యాలు చేస్తూ వుంటాడు. కన్న బిడ్డలు లేని మంత్రికి ఇతనే వారసుడు కావడం, అతని రౌడీయిజం మంత్రి గారికి ఎన్నికల సమయంలో ఉపయోగ పడటం కారణంగా మంత్రిగారు కూడా అన్ని విషయాలలోను అతనికి రక్షణ కవచంలా ఉపయోగపడుతూ వుంటాడు. విమలాదేవికి కూడా బిడ్డలు లేకపోవడం వలన ఇంద్రకుమార్‌నే కన్నబిడ్డలా భావిస్తోంది. అతను తరచూ హాస్టల్‌కు వస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పరిచయం చేసుకొని కామవాంఛ తీర్చుకుంటూ ఉంటాడు. ఒక వేళ ఆ అమ్మాయి అంగీకరించకపోతే బెదిరించి మరీ తన కోరికను తీర్చుకుంటాడు. విమలాదేవి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుండిపోతోంది.

ఈ విషయాలు తెలుసుకున్న తరువాత అలేఖ్య, పూజలిద్దరూ భయంతో వణికిపోయారు. మరుసటి ఆదివారం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఇంద్రకుమార్‌ గురించి చెప్పి, హాస్టల్‌ మారే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఈ లోపే దారుణమైన ఘోరం జరిగిపోయింది. జులై నెల 10వ తేదీన అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఇంద్రకుమార్‌ తన అనుచరులిద్దర్ని తీసుకొని హాస్టల్‌కి వచ్చాడు. గాఢనిద్రలో ఉన్న సమయంలో అలేఖ్య, పూజాలు వున్న గది తలుపులు గట్టిగా కొట్టారు. ఆ గదిలో వున్న ఆరుగురు అమ్మాయిలలో ఓ అమ్మాయి లేచి తలుపు తీసింది. అంతే-!

మద్యం తాగిన మైకంలో వున్న ఇంద్రకుమార్‌ నేరుగా అలేఖ్య పడుకొని వున్న మంచం దగ్గరకు వెళ్ళి ఆమెను లేపాడు. ఈ హఠాత్‌ సంఘటనకు బిత్తర పోయింది అలేఖ్య. ఆడపిల్లలందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు. అందరికీ ఇంద్రకుమార్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

”ఎవ్వరూ మాట్లాడకండి. మీరెవ్వరూ నాకు అక్కర్లేదు. ఈ అందగత్తె మాత్రమే నాక్కావాలి. ఎవరైనా అల్లరి చేశారో మీ అందర్ని చంపి ఈ గదిలోని పాతిపెడతాను.”

అతని గొంతులోని కాఠిన్యానికి అందరూ భయపడిపోయారు. అతని చేతుల్లో అలేఖ్య నలిగిపోతోంది. ఆమె నడుంపై చేతులేసి బలవంతంగా బయటకు తీసుకెళ్ళాడు. మిగిలిన ఆడపిల్లలు బైటకు రాకుండా అతని అనుచరులు ఆగది ముందు కాపలా ఉండిపోయారు. అలేఖ్యను తీసుకొని టాయ్‌లెట్స్‌ దగ్గరకు వచ్చాడు. అక్కడంతా చీకటిగా వుంది. ఆమెను నేలపై పడుకోమని ఆర్డర్‌ జారీచేశాడు. ఆమె ఎదురు తిరిగింది. అతని ముఖంపై గోళ్ళతో రక్కింది. అతని చేతిని పళ్ళతో కసిగా కొరికింది. ముఖంపై, చేతిపై ఏర్పడిన రక్తం గాట్లను చూసి అతను కోపంతో ఊగిపోయాడు. రాక్షసుడిగా మారిపోయాడు. మానవత్వాన్ని మర్చిపోయి అలేఖ్య తలను బలంగా బాత్రూం గోడకేసి కొట్టాడు. అంతే! ఆమె తల పగిలింది. రక్తం చిమ్మింది. స్పృహ కోల్పోయి నేలపై పడిపోయింది. నిస్సహాయంగా నేలపై పడివున్న ఆమె లేత శరీరంపై వికృత చేష్టలు చేశాడు. కామాంధుడై స్పృహలో లేని ఆమె శరీరంతో ఆడుకున్నాడు. భయంకరమైన శాడిస్టులా ప్రవర్తించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అతని కసి తీరింది. మత్తు వదిలింది. అక్కడి దృశ్యాన్ని తాపీగా గమనించాడు. తెల్లవారితే ఏం జరుగుతుందో ఊహించాడు. మరుక్షణం, అతని మదిలో ఓ ఆలోచన కదలాడింది. అప్పుడే స్పృహలోనికి వస్తున్న అలేఖ్య తలను మళ్ళీ మళ్ళీ బాత్‌రూం గోడకేసి బాదాడు. రక్తం కాలువ కట్టింది. ఆమె మరణించిందని పూర్తిగా నిర్దారించుకున్న పిదప డెడ్‌బాడీని బాత్‌రూంలో ట్యాప్‌ కింద పడేసి నీళ్ళతో ఆమె మర్మావయాలను శుభ్రంగా కడిగాడు. రక్తం ప్రవహించిన ప్రాంతాన్ని కూడా నీళ్ళతో వాష్‌ చేశాడు. ఆ కిరాతకుడు చేస్తున్న రాక్షస కృత్యాన్ని గదిలోంచి తిలకిస్తోన్న ఆమె స్నేహబృందం మూగగా రోదించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

అలేఖ్య నిర్జీవ శరీరాన్ని బాత్‌రూంలో పడేసి ఆమె గది దగ్గరకు వచ్చాడు ఇంద్రకుమార్‌. అతనిప్పుడు మానవ రూపం ధరించి వచ్చిన రాక్షసరాజు రావణాసురుడులా కన్పిస్తున్నాడు.

”రేపు పోలీసులు వస్తారు. నా గురించి ఎవరైనా చెబితే మీ అందరికి ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!” కఠినంగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

——-

మరుసటి రోజు నగర పోలీస్‌ కమీషనర్‌ విక్రమసింగ్‌ ఈ కేసును సరిగ్గా గంట వ్యవధిలో చేధించాడు. తన ప్రియమైన స్నేహితురాలిని కోల్పోయిన పూజ భవిష్యత్‌పై ఆశ చంపుకొని స్నేహితురాలి ఆత్మశాంతి కోసం జరిగిన సంఘటనను వివరంగా చెప్పింది. ధైర్యసాహసాలకు మారుపేరైన విక్రమసింగ్‌ 24 గంటలలో నేరస్తుణ్ణి మీడియా ముందు హాజరు పరుస్తానని చెప్పాడు. విషయం తెలుసుకొన్న ఇంద్రకుమార్‌ తన రాజకీయ పలుకుబడితో 12 గంటల్లో అతడిని బదిలీ చేయించాడు. ఎ.సి.పి. నేతృత్వంలోని పోలీసు బృందం మంత్రిగారి ఆదేశానుసారం వీధి రౌడి, చిల్లర దొంగ అయిన సుబ్బరాజును హంతకుడిగా నిర్ధారించి కోర్టులో హాజరు పెట్టారు.

——-

పూజ చెప్పడం ఆపింది. కలెక్టర్‌ రాజీవ్‌ మహాపాత్ర కళ్ళు చెమర్చాయి. చేతి గుడ్డతో కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు –

”వాట్‌ ఏ పిటియబుల్‌ ఇన్సిడెంట్‌! ఓహ్‌ మై గాడ్‌!! ఈ దురదృష్టకర సంఘటన ఏ ఆడపిల్ల జీవితంలోను జరగకూడదు. హంతకుణ్ణి కఠినంగా శిక్షించేలా నేను ప్రయత్నిస్తాను. రికార్డు చేసిన ఈ రిపోర్టుని ఈ రోజే కోర్టులో సబ్‌మిట్‌ చేస్తాను. అంతేకాదు – హంతకుడు ఎక్కడున్నా అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుస్తాను.” నిబద్ధతతో కూడిన తన నిర్ణయాన్ని అందరికీ తెలియజేశాడు కలెక్టర్‌.

”హంతకుడు ఇంద్రకుమార్‌ హైదరాబాద్‌లో మంత్రి రామకృష్ణారావు ఇంట్లో వున్నాడని తెలిసింది. అతన్ని అరెస్ట్‌ చేయడం సాధ్యమేనా?” పౌర హక్కుల సంఘం నాయకుడు రామగోపాల్‌ ప్రశ్నించాడు.

”సెర్చ్‌వారెంట్‌ తీసుకొని మంత్రి గారింటికి వెళ్ళాలి. నా ప్రయత్నం నేను సిన్సియర్‌గా చేస్తాను. నన్ను నమ్మండి.”

కలెక్టర్‌ పలుకుల్లో నిజాయితీ స్పష్టంగా కన్పిస్తోంది. ఆయనపై అపారమైన నమ్మకం వుంచి ఉద్యమ నేతలు వెనక్కి తిరిగి వచ్చారు.

——-

రోజులు గడుస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ మహాపాత్ర ప్రయత్నాలకు రాజకీయం అడ్డుపడింది. పవర్‌ పాలిటిక్స్‌ గేములో కలెక్టర్‌ వెనుకబడిపోయాడు. హంతకుడు ఇంద్రకుమార్‌ని అరెస్ట్‌ చేయలేకపోయారు పోలీసులు.

పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. ఈసారి ఉద్యమం హైదరాబాద్‌ బాట పట్టింది.

అలేఖ్య తల్లిదండ్రులు రాజారావు, రమాదేవి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు. ”భావిభారత పౌరులను తయారు చేసే తమకే ఇలాంటి కష్టం రావాలా?” అని కుమిలిపోతున్నారు.

ముఖ్యమంత్రిని కలిసి తమగోడు వినిపించాలని, అసలు హంతకుణ్ణి శిక్షించే విధముగా చర్యలు చేపట్టాలని అభ్యర్థించడానికి ఆ దంపతులిద్దరూ ఉద్యమకారులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. అసెంబ్లీ ఆవరణలోని బాపూజి విగ్రహం వద్ద మౌనంగా బైఠాయించారు. అలేఖ్య మరణానికి కారణమైన హంతకుడు ఇంద్రకుమార్‌ని అరెస్ట్‌ చేసి శిక్షించాలని రాసివున్న ప్లకార్డులు అందరి చేతుల్లోను ఉన్నాయి.

కొన్ని గంటల అనంతరం ఓ ప్రభుత్వాధికారి అక్కడకి వచ్చాడు.

”అలేఖ్య తల్లిదండ్రులెవరు?” ఆ అధికారి ప్రశ్నించాడు. రాజారావు, రమాదేవి మౌనంగా లేచి నిల్చున్నారు.

”ముఖ్యమంత్రి గారు మిమ్మల్నిద్దర్ని క్యాంపు కార్యాలయానికి తీసుకురమ్మని చెప్పారు. రండి వెళదాం.” అతను ముందుకు దారితీశాడు.

”వాళ్ళతో పాటు మేము కూడా వస్తాం.” రామగోపాల్‌ లేచి నిల్చున్నాడు.

”ఐయాం సారీ! వాళ్ళిద్దర్ని మాత్రమే తీసుకురమ్మన్నారు.” ఆ అధికారి సమాధానం.

”రామగోపాల్‌ గారు, ముఖ్యమంత్రిగారి ఆదేశానుసారం మేమిద్దరమే వెళతాం. దయచేసి అనుమతించండి.” అలేఖ్య తండ్రి రాజారావు అభ్యర్థన.

రామగోపాల్‌ మౌనంగా తల ఊపాడు. ఆ అధికారితో కలిసి రాజారావు, రమాదేవి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళారు.

—–

మీ బిడ్డ చనిపోయింది. మీకు జరిగిన అన్యాయానికి మేం ఏం చేసినా తక్కువే. కానీ ఇది నా క్యాబినెట్‌లోని ఓ మంత్రి గారి కుటుంబానికి మచ్చ తెచ్చే విషయం. అతన్ని శిక్షిస్తే మీ బిడ్డ తిరిగి వస్తుందా? న్యాయస్థానంలో అతనికి ఉరిశిక్ష విధిస్తే మీ అమ్మాయి బ్రతికి వస్తుందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.” ముఖ్యమంత్రి తాపీగా చెప్పాడు. రమాదేవి గొంతు తెరిచింది –

”నేరస్తుడు శిక్షించబడినంత మాత్రాన చనిపోయిన నా బిడ్డ తిరిగిరాదు సార్‌. కానీ, కోట్లాదిమంది ఆడపిల్లల మనసులు తృప్తి చెందుతాయి. ఘోరమైన నేరం చేసిన కిరాతకుడు శిక్షించబడ్డాడని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు ఎవరు చేసినా న్యాయస్థానంలో కఠినంగా శిక్షింపబడతారని ఈ దేశంలోని ఆడపిల్లలు హాయిగా గుండెపై చెయ్యివేసుకొని నిద్రపోతారు.” ఆమె చెప్పడం ఆపగానే రాజారావు అందుకున్నాడు –

”అందుకే, ఆ హంతకుణ్ణి న్యాయస్థానానికి అప్పగించే విధంగా ఆదేశించండి. మా కడుపుమంట చల్లార్చండి ముఖ్యమంత్రి గారు.” భోరున విలపిస్తూ ముఖ్యమంత్రి కాళ్ళపై పడిపోయాడు. ముఖ్యమంత్రి ఓ అడుగు వెనక్కివేసి అన్నాడు సీరియస్‌గా –

”పెద్దవాళ్ళతో వైరం, ఘర్షణ వద్దు. నామాట విని రాజీ పడండి.”

”సార్‌! మీరు న్యాయం చేస్తారని మూడు వందల యాభై కిలోమీటర్లు నడిచి వచ్చాము. నా బిడ్డ ఆత్మ శాంతించేలా హంతకుణ్ణి కోర్టులో ప్రవేశపెట్టండి.” రమాదేవి కన్నీటి వేడికోలు ముఖ్యమంత్రి మనసును కరిగించలేకపోయింది.

”నా టైం చాలా విలువైనది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఐతే, చివరిసారిగా ఓ ప్రతిపాదన – ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి అవార్డు కోసం మీ ఇద్దరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్‌ చేస్తాను – ఆలోచించుకోండి.”

ముఖ్యమంత్రి చివరి అస్త్రం ప్రయోగించాడు. ఆ తల్లిదండ్రులిద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆవేశాన్ని అణుచుకోలేక గొంతెత్తి అరిచారు.

”అయ్యా, ముఖ్యమంత్రి గారూ! జనరంజకమైన పాలనంటే ఇదేనా? ఘోరమైన నేరాలు, మానభంగాలు, హత్యలు చేసిన హంతకులను మీ బంగళాల్లో దాచిపెట్టి వాళ్ళను శిక్షల నుంచి తప్పించడమేనా ప్రజాహితమైన పాలనంటే? ఇలాంటి పరిపాలనే చేయండి! ప్రజలు తిరబగడి, మీ పునాదులు పెకలించి ఆ పునాదుల్లో మీకు సమాధులు కట్టేవరకూ ఇదే విధమైన పరిపాలన కొనసాగించండి….”

వాళ్ళమాటలు ముఖ్యమంత్రి వినదలుచుకోలేదు. వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భద్రతా సిబ్బంది రాజారావు, రమాదేవి దంపతులను బైటకు నెట్టారు. విషాద వదనాలతో అసెంబ్లీ ప్రాంగణంలో వేచివున్న ఉద్యమకారుల చెంతకు వచ్చారు ఆ దంపతులిద్దరూ.

విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు –

”సామాన్య ప్రజానీకాన్ని, అమాయకులైన అబలలను హింసించి చంపుతోన్న మంత్రులకు, వారి బంధువులకు మినహాయింపు ఇవ్వాలా?

”నేరస్తుడు శిక్షింపబడకూడదా? ప్రజాస్వామ్యమంటే ఇదేనా?”

అసెంబ్లీ ఆవరణలోని బాపూజి విగ్రహం మౌనసాక్షిగా రోదిస్తోంది.

 

 

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో