– ఎమ్‌. సుచిత్ర 

జూన్‌ 14 నుంచి జజీరా తన ముగ్గురి పిల్లలతోపాటు ప్రభుత్వ కార్యాల యాల ఎదుట కూర్చొని ఇసుక తవ్వకాల నుంచి కేరళ సముద్రతీరం రక్షణ కోరుతూ నిశ్శబ్దంగా నిరసన తెలుపుతోంది.

కేరళలో కన్నుర్‌ జిల్లా మదాయి గ్రామపంచాయతికి చెందిన జజీరా (31) మొదటిసారి నిరసన తెలుపుతూ తన గ్రామం వద్ద వున్న పోలీసు కార్యాలయం వద్ద బైటాయించినప్పుడు అందరూ ఆశ్చర్య పోయారు. ముందుగా ఆమె ఒక స్త్రీ అందునా సాంప్రదాయపు ముస్లిం కుటుంబా నికి చెందిన మహిళ. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు స్కూల్‌కి వెళ్ళే అమ్మాయిలు, తప్పటడుగులు వేసే ఒక చంటిబిడ్డ వున్నారు. నిరసన తెలపడం అంటే ప్రస్తుత సమాజంలో విషవలయంలా ఏర్పడివున్న ఇసుక మాఫియా, రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల లాంటి దుష్టశక్తితో తలపడడానికి సిద్ధం అని అక్కడ వాళ్ళు నివ్వెరపోయారు. ఎడతెరిపి లేని వర్షాలు, ఎముకలు వణికించే చలి, చిమ్మచీకట్లతో కూడిన రాత్రులు సహితం ఆమె మనోధైర్యాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేదు. ఆమె దృఢ నిశ్చయంతో చెక్కు చెదరని మనోబలంతో సముద్రతీరంలో ఇసుక మాఫియా కొనసాగిస్తున్న తవ్వకాలని అడ్డుకో వాలని ప్రభుత్వ అధికారుల రక్షణ కోసం నిర్విరామంగా నిరసన కొనసాగిస్తూనే వుంది.

‘ఎనిమిది రాత్రులు తొమ్మిది రోజులు నా పిల్లలతో నిరసన కొనసాగి స్తున్నా’ అని జజీరా తెలిపింది. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలో వున్న రాష్ట్ర సచివాలయం వద్ద బైటాయించింది. పిల్లలు రిజ్వానా, రఫ్జానా, మొహమ్మద్‌ తన వద్దే వున్నారని చెప్పింది. తన నిరసన ద్వారా అధి కారులని కేవలం చట్టబద్ధమైన చర్యలు చేపట్ట మని వేడుకుంటున్నానని నివేదించింది.

కళ్ళ ఎదుట సముద్రతీరం మాయమయ్యింది.

జజీరా పుథ్యంగది అనే సముద్ర తీరప్రాంతంలో వున్న ఒక చిన్న గుడిసెలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి వి.మొహమ్మద్‌ ఆ ఒడ్డున ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ”మా సముద్రతీరం ఎంతో అందంగా వుండేది. దూరప్రాంతాలనుంచి చూడడానికి చాలామంది వచ్చేవారు. సముద్రంతో, ఆ తీరంతో ఒక తెలియని ఆత్మీయబంధం ఏర్పడింది. ఆ సముద్రమే నా ఆప్తమిత్రుడు” అంటుంది జజీరా. జజీరాకు పదవతరగతి పూర్తికాగానే పెళ్ళి అయ్యింది. కాని వెంటనే అది తెగదెం పుల్లయ్యింది. ఆ సమయంలో సముద్రానికి తన కష్టాలు చెప్పుకునేది. సంతోషంలో ఆ ఒడ్డున ఇసుకలో దొర్లేది. అంతటి బంధం ఆ సముద్రంతో వుంది.

ఆమె 2006లో అప్పుచేసి ఒక ఆటోరిక్షా కొనుక్కొని ఆటో నడుపుతూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. 2011లో అబ్దుల్‌ సలాం అనే వ్యక్తి పెళ్ళి చేసుకొని దక్షిణ జిల్లా ఐన కొట్టయంలోని తలయొలప్పరంబకి తరలి వెళ్లిపోయింది.

తన కానుపు కొరకు తల్లితండ్రుల ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, భవనాలు, ఇళ్ళూ చూసి నిర్ఘాంతపోయింది. కొత్త కట్టడాలన్నీ సముద్రతీరానికి దగ్గరలో వున్నాయి. నదుల దగ్గర ఇసుక లేకపోయేసరికి భవన నిర్మాతలు సముద్రతీరం వద్ద వున్న ఇసుకను తవ్వడం ప్రారంభించారని జజీరా చెబుతుంది. రాత్రింబగళ్ళూ ఇసుకను తవ్వి లారీలకు ఎక్కించడం మొదలుపెట్టారు. అధికారులు స్వంత ఉపయోగానికి అనుమతి ఇచ్చారు కాని దానిని అడ్డం పెట్టుకొని ఇసుక మాఫియా అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, బీహార్‌, తమిళ్‌నాడు నుంచి వచ్చిన ఎంతోమంది నిరుద్యోగ యువత ఇసుక తవ్వకాల ద్వారా జీవనభృతి సంపాదించు కుంటున్నారు. ఈ వలస కార్మికులలో ఎక్కువమంది బీద మహిళలే.

”తవ్వకాలు ఎప్పటికీ ఆగలేదు. నిత్యం లోడులకొద్దీ ఇసుక రవాణా సాగుతూనే వుంది” అని జజీరా తెలిపింది. తీరప్రాంతమంతా పెద్ద గుంటలు తయారయ్యేయి. క్రమంగా సముద్రం గోడ ప్రమాదకరంగా మారింది. అలా సముద్ర తీరం కొట్టుకుపోవడం మొదలయ్యింది. దీనితో సముద్రానికి తమ ఇంటికి మధ్య వున్న దూరం తగ్గిపోయింది.

అటువంటి సమయంలో ఇక అక్రమ ఇసుక త్వకాలకు అడ్డు నిలవాలని నిర్ణయించుకుంది. ”సముద్రం ఏ ఒక్కరి ఆస్తి కాదని అది అందరిది” అని జజీరా అంది. పుత్యందిలో ఇలా జరుగుతుంది అంటే తీరం మొత్తం పరిస్థితి ఇలానే వుంటుందని భావించింది. ఆ తరువాత 500 కిలోమీటర్ల పొడపు వున్న కేరళతీరప్రాంతమంతా ఇటువంటి ఇసుక తవ్వకాలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకుంది.

ఆమె తన ఉద్యమాన్ని ఇంటి నుంచి మొదలుపెట్టాలనుకుంది. తన ఇద్దరు అన్నలు ఇసుక తవ్వకాలలో పనిచేసేవారు ఎంతో సంఘర్షణ తరువాత వారిని ఇసుక తవ్వకాలలో పనిచెయ్యకుండా మానిపిం చింది. ఆ తరువాత ఆమె గ్రామ పంచాయతి, పోలీసు స్టేషన్లు, జిల్లా అధికారులను కలిసి వారిని తవ్వకాలు జరగకుండా తీరాన్ని కాపాడమని అభ్యర్ధించింది. ఇసుక తవ్వకాలలో పనిచేసేవారిని కలిసి వారితో కూడా మాట్లాడింది. కాని ఒక్కరు కూడా ఆమె మాట అంగీకరించలేదు. బాసటగా నిలవలేదు. ”పేదవారిని అలా బ్రతకనీ, జజీరా” అని అధికారులు సలహా ఇచ్చారు.

బెదిరింపులు, దాడులు

ఆమె బెదిరింపులకు తలవంచ లేదు. ఆమెకు అండగా నిలిచేందుకు ఒక్కతోడు లేదు. ఎవ్వరి సహాయం లేకుండా లోడ్‌తో నిండిన ఇసుకలారీ ముందు పడుకొని అడ్డుకుంది. ఇసుక లారీలకు ఎక్కిస్తున్న మహిళా కార్మికులను అడ్డుకునేది. ఇసుక రవాణాని మొబైల్లో రికార్డు చేసి అధికారులకి చూపించింది. ఆమె ఇంటిని ధ్వంసం చేసారు. ఆమెను ఎన్నోసార్లు కొట్టించేరు, రెండుసార్లు మొబైలు కూడా దొంగలించడానికి ప్రయత్నించారు. మహిళా కార్మికుల గుంపు ఒకసారి జజీరాను కొట్టడానికి వచ్చినప్పుడు అడ్డుగా నిలిచిన ఆమె పెద్ద కూతురు రిజ్వానా మీద కూడా చెయ్యిచేసుకున్నారు. ఫొటోలులాంటి సాక్ష్యాధారాలను పట్టుకుని ఆ ప్రాంతంలో వున్న ప్రసార మాధ్యమాలను ఆశ్రయిం చింది. వారు జజీరా పబ్లిసిటిని ఆశించి ఈ పనులు చేస్తుందని కొట్టిపారేసారు. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు.

జులై 10న రెండవ విడత ఆందో ళనలో జిల్లా కలక్టరేటు వద్ద నిశ్శబ్ద నిరసన సాగించింది. జిల్లా యంత్రాంగం ఆమెకు పోలీసు భద్రత కల్పించాలనుకుంది కాని ఆమె దానికి నిరాకరించింది. ”నాకు ఎందుకు రక్షణ? రక్షణ కావలసింది సముద్రతీరానికి పోలీసువారు దానికి రక్షణ కల్పించాలనే పోరాడుతున్నా” అని సమాధానమిచ్చింది. ఆమె కూతుర్లు ఎప్పుడూ తనతోనే వుండేవారు. ఉదయం స్కూల్‌కి వెళ్ళేవారు. రంజాన్‌ మాసంలో ఉపవాసం కారణంగా చాలామంది సానుభూతిపరులు ఆమెకు సాయంత్రం ఉపవాసం విరమించిన తరువాత ఆహారం ఇచ్చేవారు. కొంతమంది ఉద్యమకారులు స్వచ్ఛంద సంస్థలు జజీరాకు మద్దతు తెలిపి సహాయం చెయ్యటం ప్రారంభించారు.

ఇంతలో చిన్న పిల్లల హెల్ప్‌లైను సంస్థ ఆమె వలన పిల్లలు ఇబ్బందిపాల వుతున్నారని ఆమెను ఆక్షేపించారు. ”మంచి తల్లిలా ప్రవర్తించటం లేదని నన్ను నిందించటం ప్రారంభించారు. చంటి బాబును సరిగ్గా చూసుకుంటానని ఒక పత్రం మీద సంతకం చెయ్యాలని ఒత్తిడి చేసారు. నేను ఒక తల్లిని పిల్లల పట్ల నా బాధ్యతలు ఏమిటో నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు” అని జజీరా బాధపడింది.

జులై 20న సుమారు 1400 మంది జజీరాకు వ్యతిరేకంగా తమ సాంప్రదాయపు జీవనోపాధిని సంపాదించు కోవడానికి అడ్డుపడుతున్నదని ఒక నిరసన రాలి నిర్వహించారు. జజీరా చెప్పిన కథనం ప్రకారం స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రచార మాధ్యమాల వారు ఇసుక తవ్వకాల లాబివారికి మద్దతు తెలిపారు కాని స్థానికేతరులైన రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా ఆమెకు మద్దతు నిచ్చారు.

ముఖ్యమంత్రి మౌఖిక హామీ సరిపోదు.

జజీరా ఆగష్టు 2న రాష్ట్ర సచివాలయము వద్ద మొదలుపెట్టిన నిరసన బైఠాయింపు ముఖ్యమంత్రి దగ్గరనుంచి లిఖితపూర్వక హామీ లభించేంతవరకూ కొనసాగించే యోచనలో వున్నది. సోమవారంనాడు ముఖ్యమంత్రి తన గదిలోకి పిలిచి జజీరాతో మాట్లాడి సముద్రతీరంలో అక్రమ ఇసుక తవ్వకాల విరుద్ధముగా కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ”మౌఖిక హామీ సరిపోదు. నేను ఒక పత్రం దాఖలు చేసాను దానిమీద లిఖితపూర్వకంగా ఆమోదం కావాలి” అని జజీరా పేర్కొన్నది.

”నేను భగవంతున్ని నమ్ముకున్న దాన్ని.” నేను ఎవరికీ భయపడను. నా భర్త మద్రాసులో ఉపాధ్యాయుడు, ఎంతో మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. తల్లి నిత్యం తనకోసం పూజలు చేస్తుంది. స్థానికులందరూ ఆమెకు నిరసన తెలుపు తున్నప్పుడు కూడా వారు తమ మద్దతు ప్రకటించలేదని ఇప్పుడు తోబుట్టువులు పశ్చాత్తాపపడుతున్నారు. ”ప్రతీ నిమిషం అందరికి భయపడుతూ బ్రతకడంలో జీవితానికి అర్థం ఏముంది? దానికంటే నేను మరణాన్ని ఇష్టపడతాను” అని జజీరా చెబుతుంది.

పర్యావరణ శాస్త్రవేత్త

రోజురోజుకీ పెరుగుతున్న తన మద్దతుదారులలో ఒకరైన తిరువనంత పురంలో వుంటున్న పర్యావరణ శాస్త్రవేత్త యస్‌.ఫైజి. జజీరాకు తన పూర్తి మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో శాంతియుతంగా సచివాలయం ఎదుట సముద్రతీరాలని ఇసుక మాఫియా అక్రమ తవ్వకాల నుంచి రక్షణ కోరుతూ నిరసన చేపడుతున్న జజీరాను పోలీసులు జడిపిస్తు న్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

ఆ లేఖలో ముఖ్యంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ దేశవ్యాప్తంగా పర్యావరణ శాఖ క్లియరెన్సు పొందని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి ఇటువంటి అక్రమ తవ్వకాలు జరగడం అన్యాయం అని నివేదించారు.

చట్టబద్ధంగా సముద్రతీరాన్ని కాపాడవలసిన మూడు సంస్థలు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించిన తరుణంలో జజీరా తన ముగ్గురు పిల్లలతో అనివార్య పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తు న్నది. ముఖ్యముగా కోస్టల్‌ మానేజ్‌మెంట్‌ అథారిటి బాధ్యతలు నిర్వర్తించటంలో పూర్తిగా విఫలమై, తీరని నమ్మకద్రోహం తల పెడుతున్నది.

హోటల్‌ పరిశ్రమలు, రకరకాల అసాంఘిక శక్తులు కలిసి కేరళ సముద్రతీరానికి తీరని నష్టాన్ని కలిగించారని యస్‌.ఫైజల్‌ లేఖలో పేర్కొన్నారు. జజీరాను ఒక మార్గదర్శిగా గౌరవించకపోగా ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారని లేఖలో విమర్శించారు.

పోలీసులు జజీరా పట్ల ప్రవర్తించే తీరు ఎంతో అసంతృప్తిగా, అసభ్యంగా రాజ్యాంగసూత్రాలకు భిన్నంగా ఉన్నదని, ఆర్టికల్‌ 51 ఏ జి భారత పౌరుల ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతీ వ్యక్తికి పర్యావరణ రక్షణ కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టే స్వేచ్ఛ వున్నది. ఆమెపట్ల న్యాయవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల పద్ధతిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని లేఖలో తెలిపారు.

 

 

Share
This entry was posted in గ్రామీణ మహిళావరణం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో