సంపాదకులు సత్యవతిగారు…

నమస్కారములు… జులై నెల భూమిక కవరుపేజీమీద నవ్వులు చిందిస్తూవున్న మహిళవి రెండు ఫోటోలు, ఫోటోల క్రింద ‘ఐనా నేను ఓడిపోలేదు’ చూడగానే ఇదేదో ప్రత్యేకత కల్గినదిగా తోచింది. సంపాదకీయానికి పెట్టిన శీర్షిక ‘మైలారంపిల్ల… పిల్లకాదు మహా పిడుగు’ చదవగానే కవరు మీద శీర్షిక, సంపాదకీయం శీర్షికలే ఇంత అధ్బుతంగా వున్నవి లోపల విషయం ఇకెంత ఆకర్షణీయంగా వుందో అనిపించింది. సంపాదకీయం, జ్యోతిరెడ్డిగారి ఆత్మకథ పుస్తకం నుంచి ప్రచురించిన కొంత భాగం చదవటం మొదలు పెట్టగానే త్వరగా చదవాలనే ఉత్కంఠ కలిగింది. అంతేకాదు చదువుతూ వున్నంతసేపు ఆశ్చర్యంవేసింది. ఆనందం కలిగింది. జ్యోతిరెడ్డిగారి ఆత్మకథ చదువుతుంటే నాకు ఒక హిందీ కవిగారి కవిత గుర్తొచ్చింది. ”శిశునె రో రోకర్‌ హసనా సీఖా, గిర్‌ గిర్‌ కర్‌ చలనా సీఖా’ (శిశువు ఏడ్చిన తర్వాతనే నవ్వటం నేర్చుకుం. క్రిందపడి పడి చివరకు నడవటం నేర్చుకుంటుంది) ఈ కవిత జ్యోతిరెడ్డిగారి జీవితానికి సంపూర్తిగా వర్తిస్తుందనుకుంటున్నాను తన చదువుకోరిక తీర్చటానికి ఆమెను తల్లిలేని అనాధని చెప్పి వరంగల్‌లోని బాలసదన్‌లో చేర్పిస్తాడు తండ్రి. అంతవరకు ఆసంగతి ఆ బాలికకు తెలియదు. తల్లిని తలచుకొని రాత్రిపూట ఏడ్చిన కన్నీళ్లతో పక్క బట్టలు తడసిపోతాయి. ఇప్పుడు నవ్వుతూ జీవిస్తున్నది. తండ్రి నిరాదరణను, ఎదురయిన అవమానాలను దిగమ్రింగి, ఎదురైన ప్రతి అవరోధానికి ప్రత్యామాన్నాయ మార్గాన్ని వెతుక్కుని ముందడుగువేసి ఉన్నత స్థానానికి చేరుకుంది.

జ్యోతిరెడ్డిగారి ఆత్మకథ పుస్తకం చదివితే తల్లితండ్రులు మందలించారని ఇంటి నుంచి వెల్లిపోయే పిల్లలకు, పరీక్షల్లో తప్పామని ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థిని, విద్యార్థులకు కనువిప్పు కల్గుతుంది. అందరూ ఆ పుస్తకాన్ని కొని చదివే అవకాశాలు లేకపోవచ్చు. మీరు ప్రతినెల భూమికలో ఆ పుస్తకాన్ని సీరియల్‌గా ప్రచురించితే కనీసం భూమిక పాఠకులకన్నా ఆమె ఆత్మకథ అగాధాలు, ఉన్నతాలు తెలుసుకో వీలు కల్గుతుంది. అబ్బూరి ఛాయాదేవిగారు జ్యోతిరెడ్డిగారిపై రాసిన సద్విమర్శ చాలా బాగుంది. మీకు భూమికలో ఆమెను గురించి రాయమని చెప్పిన ఛాయాదేవిగారికి, పుస్తకం కొని చదివి ఆమెను గురించి ప్రచురించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా.

– వేములపల్లి సత్యవతి, హైదరాబాద్‌.

 

ముందుగా మాతృ సమానులైన ఛాయాదేవి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు..

మీ అభిప్రాయం చదివిన తరువాత ఒక్క పది నిమిషాలు కన్నీళ్ళు ఆగడం లేదు… ఒక్కసారి 28 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. ఆవేదన, ఆవేశం, సంతోషం అన్ని కలకలిసిన భావాలు ఒక్కసారి… ఆ తరువాత నా ముఖ చిత్రంలో పెట్టాను, ఏ బాధ ఐనా అక్కడ పంచుకోవడం నాకు అలవాటు… మీకు తిరిగి రాయకుండా ఉండలేకపోయాను.. ఒక స్త్రీ భర్త సహకారం లేకుండా బతికితే, మన సమాజంలో మగవాళ్ళు మాత్రమే కాకుండా ఆడవాళ్ళు కూడా చాలా హింస పెడతారు… ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసంఎంత దూరమైనా కూడా మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి వెళతారు కదా నేను అదే చేను. నా పిల్లలిద్దరు ఎలాంటి లోటు లేకుండా.. నేను పేదరికం వల్ల అనుభవించిన కష్టాలు వేరొకరు అనుభవించకూడదు అనేది మాత్రమే కాకుండా… నేను ఎక్కడైతే అవమానాలు పాలు అయ్యానో అక్కడ నేను నా పిల్లలు వాళ్లకు అందనంద ఎత్తుకు ఎదిగి చూపించాలనే కసి, కోపం, బాధ నన్ను ఎక్కడ ఎలాంటి కష్టాలు నన్ను ఆపలేదు… ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నానో ఆ తరువాత ప్రతి అవమానం నాలో మరింత శక్తినిచ్చాయి… అదే కసి ఇప్పటికీ ఉంది. నా పిల్లలిద్దరు ఆమెరికా లాంటి ఆగ్ర దేశంలో అతి ఉన్నత స్థానంలో ఉన్న తరువాత… నాలాగ అనాధల ఆశ్రమంలో పెరిగే పిల్లల జివితాలాకు అర్థాన్నివ్వాలనే దిశకు పరిగులెత్తడం ప్రారంభించాను. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. అందులో నేను భాగస్తురాలిని, ఇండియా అర్బన్‌ రైట్స్‌ కి కార్యాధికారిణిగా బాధ్యతలు చేపట్టాను. నేను సఫలీకృతం కావాలని నన్ను ఆశీర్వదించండి ప్లీజ్‌…

ఆమెరికా నుండి ఇండియాకు ప్రతి యేటా 3 సార్లు వచ్చి… మహిళలను ఉత్తేజపరిచే కార్యక్రమాలు ఎన్నో చేసాను… అందులో భాగంగానే, ఆంధ్ర యూనివర్సిటీ, స్టీల్‌ ప్లాంట్‌ విశాఖపట్నం, లయన్స్‌ క్లబ్‌ సహకారంతో రాజమండ్రిలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ఒక్క దగ్గర తీసుకువచ్చి ఒక కార్యక్రమం, ఎన్నో కళాశాలల్లో ఎన్నో ప్రోగ్రాములు చేసాను.

వందేమాతరం లాంటి సంస్థలతో కలిసి పని చేస్తున్నాను… ప్రభత్వు సంస్థలు ఐకెపి గ్రూప్స్‌, డ్వాక్రా గ్రూప్స్‌తో మహిళా కార్యక్రమాలు చెయ్యడం జరిగింది… అంతేకాదు ఈ మధ్యనే డాక్టర్‌ కలాం గారితో కలిసి లీడ్‌ ఇండియా 2020 అనే ఆర్గనైజేషన్‌ లో చేరాను… మన రాష్ట్ర బాధ్యతలు చేపట్టాను.. ప్రతి ఉన్నత పాఠశాలలో మానవతా విలువలు, నాయకత్వ లక్షణాలతో పాటు, పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటికి రావాలనే ప్రయత్నమే ఆ సంస్థ లక్ష్యం… నేను ఇప్పుడు కూడా గొంతెత్తి అరవాలనుకుంటున్నాను… ఏ స్త్రీ కూడా …ఐనా వోడిపోకూడదు. … పట్టుదలే పెట్టుబడిగా ఎదగాలని ఆశిస్తూ…. అందరు నా ఆవేదనను ఆర్థం చేసుకుంటారని ఆశిస్తూ… మీ శ్రేయోభిలాషి… మీ జ్యోతిరెడ్డి.

– జ్యోతిరెడ్డి, అమెరికా.

 

 

Share
This entry was posted in ఎడిటర్ కి ఉత్తరాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో