మాలతీ చందూర్‌

మాలతీ చందూర్‌ మరణం …. అదీ క్యాన్సర్‌ బారినపడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. మాలతి గారిని తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ఆవిడ పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం. పాత కెరటాల్లో ఆవిడ పరిచయం చేసిన పుస్తకాలను ఎలాగైనా సంపాదించి చదవాలనిపించేంత ప్రేరకంగా వుండేవి.ఆవిడ పుస్తక సమీక్షలు నాకు బాగా గుర్తు. తను పరిచయం చేసిన ”ద పిక్చర్‌ ఆఫ్‌ డొరియన్‌ గ్రే” అస్కార్‌ వైల్డ్‌ ప్రముఖ నవల. ఆ పరిచయం చదివి చాలా కష్టపడి ఆ పుస్తకం సంపాదించి చదివి వారం పదిరోజులు నేను నిద్రపోలేకపోయాను. ‘డొరియన్‌ గ్రే’ పాత్ర అంత తేలికగా మనసులోంచి పోదు. ఈ పుస్తకం చదివిన వెంటనే మాలతీ గారికి ఉతతం రాసినట్టు గుర్తు. సమాధానం వచ్చిందో లేదో గుర్తు రావడం లేదు. ఆస్కార్‌ వైల్డ్‌ మీద అభిమానం పెంచింది మాలతి గారే.

అలాగే డి.హెచ్‌. లారెన్స్‌ నవల ”లేడి చాటర్లీస్‌ లవర్‌” ఈ నవలని బ్రిటన్‌లో అశ్లీల నవల అంటూ నిషేదించారు. ఈ నవలని మాలతీ చందూర్‌ పరిచయం చేసినపుడు దాన్ని చదవాలని మనసు ఉవ్విళ్ళూరింది. సంపాదించి చదివాను. దానిలో అశ్లీలం ఏముందో అర్థం కాలేదు. వివాహం బయట పురుషులు సంబంధాలు పెట్టుకుంటే శృంగారపురుషులంటూ కీర్తిస్తూ, అదే భార్య అలాంటి సంబంధాల్లోకి వెళ్ళినపుడు ‘అశ్లీలం’ అనే సమాజనీతి ప్రపంచమంతా ఒకటే అని అర్థమైన సందర్భం. అది బ్రిటిన్‌ అయినా భారత్‌ అయినా ఒక్కటే.

మాలతీ చందూర్‌ గారి పాత కెరటాలు చదివి నేను ఎన్నో ప్రపంచ సాహిత్య పుస్తకాలు చదివాను. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన నాలాంటి తెలుగు మీడియం వాళ్ళం కూడా గొప్ప గొప్ప పుస్తకాలు చదవగలిగామంటే ఖచ్చితంగా అది మాలతి గారి చలవే. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన అద్భుతమైన అనువాద పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకున్నట్టే మాలతి గారి పాత కెరటాలలో పరిచయం చేసిన పుస్తకాలు చదివి జీవితాన్ని వెలుగించుకున్నాను.

మాలతీ చందూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. అస్మిత ప్రచురించిన ‘నవలా మాలతీయం’ పుస్తకంలో ఆవిడ నవలల గురించి సమగ్రంగా వచ్చిన వ్యాసాలున్నాయి. ఆంధ్రప్రభ లో ఆవిడ నడిపిన ప్రమాదావనం కాలం కొన్ని దశాబ్దాలు పాటు నడిచింది. ఎన్నో చిక్కు సమస్యలకు సమయస్ఫూర్తితో సమాధానాలు రాసేవారు. ఈ కాలమ్‌ ద్వారా ఎందరో మహిళలకు ఆవిడ ఆత్మీయురాలయ్యారు. చాలా మంది అభిమానులు తిరుపతికి వచ్చినపుడు, చెన్నై వెళ్ళి మాలతిని కలిసేవారు. అక్కయ్యా! అంటూ అప్యాయంగా పిలిచేవారు. తెలుగు మహిళా పాఠకుల్నించి అంతటి అభిమానం పొందారు మాలతి చందూర్‌.

2008లో లాడ్లి అవార్డు తీసుకోవటానికి చెన్నై వెళ్ళినపుడు, నేను ప్రతిమ కలిసి మాలతీ చందూర్‌ని చూడడానికి వాళ్ళింటికెళ్ళాం. ముందుగా ఫోన్‌చేసి, అడ్రస్‌ కనుక్కుని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి కొంచం ఆలస్యమైంది. ఆవిడ మా కోసం ఎదురు చూస్తూవున్నారు. ”ఏమోయ్‌ సత్యవతి! భలేసాహితీ యాత్రలు వేస్తున్నవే” అన్నారు వెళ్ళగానే. అంతకు ముందే రచయిత్రులందరం తలకోన యాత్రకి వెళ్ళివచ్చాం. దానికి సంబంధించిన రచయిత్రుల స్పందన భూమికలో వేసాం. అది చదివే ఆవిడ ఆ యాత్ర గురించి ప్రస్తావించారు. ‘నాకు కూడా రావాలన్పిస్తుందోయ్‌! కానీ రాలేను కదా’ అన్నారు. ఆ రోజు చాలా సేపు మా మధ్య కబుర్లు నడిచాయి. చందూర్‌ గారు కూడా మాతో చేరి ‘భూమిక’ గురించి చాలా వివరాలడిగారు. ఆ రోజు శారదగారు కూడా మాతో చాలా విషయాలు మాట్లాడారు. మేము తిరిగి వచ్చేస్తుంటే కింది వరకూ వచ్చి మమ్మల్ని సాగనంపారు మాలతిగారు. ఆ తర్వాత చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడాను. ‘ఏమోయ్‌! భూమికా! అంటూ నీకు భూమిక పేరే బావుంది. మెడ్రాస్‌కి ఎప్పుడొస్తావ్‌ అని అడిగేవారు. ఈ మధ్య కాలంలో ఆవిడతో మాట్లాడలేదు. మాట్లాడాలి, మాట్లాడాలి అనుకుంటూ అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. మాలతి గారు శాశ్వతంగా ఈ లోకం నించి నిష్క్రమించారు. అందుకే ఎప్పుడనుకున్న పని అప్పుడే చెయ్యాలి.

మాలతీ చందూర్‌ కాలానికి అతీతమైన వ్యక్తి. అపార జ్ఞాన సంపన్నురాలు. స్నేహశీలి. గలగల మాట్లాడే భోళామనిషి . నాలాంటి ఎందరికో ప్రపంచ సాహిత్యాన్ని రుచి చూపించింది, తను పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచిన మేధావి.

మాలతీ చందూర్‌కి భూమిక ఆత్మీయ నివాళి. భూమిక పాఠకుల కోసం ‘నవలా మాలతీయం’ పుస్తకంలో మాలతి గారి సమగ్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన ఓల్గా వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.