– సామాన్య

ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన పిల్లల కథల పుస్తకం ”ది హ్యేపీ ప్రిన్స్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌”లో మొదటి కథ ”ది హ్యేపీ ప్రిన్స్‌”. నాకు బాగా ఇష్టం ఈ కథ. యెన్నెన్నో చదువుతూ బాగా పెద్దైపోయాక కూడా మనల్ని వెంటాడే కథ ఇది. చిన్నపుడెపుడో పాఠ్యాంశంగా ఉండింది మాకు. ఆ కథలోని ఆర్ద్రత అప్పటి నా చిన్న మనసుని బాగా కష్టపెట్టి ఉంటుందేమో, అందుకే ఇప్పటికీ ఆ కథకి అప్పుడు టెక్స్‌ బుక్‌లో వుండిన హేపీ ప్రిన్స్‌ బొమ్మ మనసులో అచ్చుగుద్దినట్టు జ్ఞాపకం వుంది నాకు (ఆ పాఠం ఏ క్లాసులో చదువుకున్నానో మాత్రం జ్ఞాపకం లేదు) ఆ ఇష్టమైన జ్ఞాపకంతో హేపీ ప్రిన్స్‌ సినిమా ఏమైనా వుందాని వెతుకుతుంటే 1974లో ఈ కథని సినిమాకి మలచుకుని తానే దర్శకుడుగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ”మైఖేల్‌ మిల్స్‌” తీసిన ”ది హేపీ ప్రిన్స్‌” యానిమేషన్‌ కనిపించింది. హేపీ ప్రిన్స్‌కి ”క్రిస్టోఫర్‌ ప్లమ్మర్‌” గొంతునిచ్చారు. చాలా పాత ప్రింట్‌. ఆ తరువాత ఎవరూ నిర్మించిన దాఖలాలు లేకపోవడం నన్ను నిరాశ పరచింది. అయినా పిల్లలూ పెద్దలూ తప్పక చూడదగ్గ యానిమేషన్‌ ఇది.

ఒకానొక నగరంలో పొడవాటి పిల్లర్‌పైన బంగారపు తొడుగు, మరకతపు కళ్ళు, పిడికి కెంపు రాయి వున్న కత్తితో హేపీ ప్రిన్స్‌ విగ్రహం వుంటుంది. ఆ నగరం వాళ్లకి ప్రతి దానికీ హేపీ ప్రిన్స్‌తో పోల్చుకోవడం అలవాటు. అదే నగరంలో ఒక బుజ్జి స్వాలో (వాన కోవెల) వుంటుంది. అది పడక పడక నది పక్కన వున్న రెల్లు పూవుతో ప్రేమలో పడుతుంది. దానితో బోలెడు కబుర్లు చెబుతుంది. వాన కోవెల రెల్లు పూవుతో ప్రేమలో పడటం ఏమిటీ అనుకుంటాయి మిగిలిన వాన కోవెలలు. ఇంతలో ఆ నగరపు వాతావరణం మారడం మొదలు పెడుతుంది. గాలి మార్పు కోసం అన్ని స్వాలోలు ఈజిప్ట్‌కి ప్రయాణం కడతాయి. మన బుజ్జి స్వాలో మాత్రం రెల్లుని వదల్లేకపోతుంది. ఒక రోజు ఇక అడుగుతుంది. ”ఇదిగో నాకు ప్రయాణా లంటే చాలా ఇష్టం. నా భార్యకి కూడా ప్రయాణాలంటే ఇష్టమై ఉండాలి. నీకు ఇష్టమే కదా” అంటుంది. రెల్లు పులకదూ, పలకనే పలకదు. అప్పుడిక విసిగి ఈవిడికి మాటలే వుండవు అనుకుని రెల్లుకి గుడ్‌బై చెప్పి వెళిపోతుంది.

అట్లా వచ్చి వచ్చిన ఆ రాత్రికి, అబ్బ నాకో గోల్డెన్‌ బెడ్‌ రూమ్‌ దొరికింది అని చెప్పి హేపీ ప్రిన్స్‌ పాదాల వద్ద పడుకుం టుంది. పడుకున్న కాసేపటికి దాని నెత్తిన టప్‌ మని నీటి చుక్క ఒకటి పడుతుంది. చూడబోతే అది హేపీ ప్రిన్స్‌ కళ్ళ నీళ్ళు. కారణమేమిటని అడుగుతే హేపీ ప్రిన్స్‌ చెబుతాడు… తను ప్రిన్స్‌గా వున్నపుడు సంతోషం తప్ప మరో అనుభవం అతనికి లేదట. ఇప్పుడు నగరంలో అన్నింటి కన్నా ఎత్తైన ఈ స్తంభంపై నిల్చుని చూస్తుంటే నాలుగు దిక్కులా దుఃఖమే కనపబడుతందట. ఆ విషయం చెప్పి బుజ్జి స్వాలో ఆదిగో ఆ మూల ఒక అమ్మ యువరాణి గౌనుపైన పూలు కుడుతుంది. ఆ గౌను ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఇచ్చేయాలి. ఒక వైపేమో ఆమె కొడుకు జ్వరంతో బాధపడుతూ కమలా పళ్ళు కావాలని అడుగుతున్నాడు. కానీ ఆమె దగ్గర ఆ పిల్లవాడికి ఇవ్వడానికి నది నీళ్ళు తప్ప ఏమీ లేవు, స్వాలో… స్వాలో బుజ్జి స్వాలో నువ్వు నా కత్తి పిడికి వున్న కెంపు రాయిని ఆ అమ్మకి ఇవ్వగలవా అంటాడు. స్వాలో మొదట గునుస్తుంది. ఊహూ… నేను ఈజిప్ట్‌కి పోవాలి, నా వల్ల కాదు అంటుంది. కానీ హేపీ ప్రిన్స్‌ కళ్ళ నీళ్ళు చూసి జాలి పడి, ఆ పని చేస్తుంది. మరుసటి రోజు హేపీ ప్రిన్స్‌ మళ్ళీ స్వాలో స్వాలో బుజ్జి స్వాలో అదిగో నగరంలో ఆ మూల రచయత ఒకరు చలికి వణికి పోతున్నాడు అతనికి తినడానికి కూడా ఏం లేవు. అతను రాస్తున్న నాటకమ్‌ ఇవాళ పూర్తి చేసి కంపెనీ వాళ్లకి ఇచ్చేయాలి. అతనికి నా కన్నుకి వుందే ఇండియా నుండి తెచ్చిన అపురూపమైన పచ్చ రాయి దాన్ని ఇవ్వగలవా అంటాడు. యదా ప్రకారం స్వాలో ఈజిప్ట్‌ అని గొణగదు, నీ కన్నుని తీయలేను అని దిగులు పడుతుంది. కానీ చివరకి అతను చెప్పినట్లు చేస్తుంది. మరుసటి రోజు మరో కన్నుని అగ్గిపెట్టెలమ్ముకునే పిల్లలకి ఇస్తుంది.

రెండు కళ్ళనీ అలా ఇచ్చేసాక స్వాలో అంటుంది ”యు ఆర్‌ బ్లైండ్‌ నౌ, సో ఐ విల్‌ స్టే విత్‌ యు ఆల్వేస్‌” అని. అంత మంచి మనసు దానిది. హేపీ ప్రిన్స్‌ వద్దు నువ్వు ఈజిప్ట్‌కి వెళ్ళిపో అంటాడు. అయినా వినకుండా అతనితో వుండిపోయి నగరపు పిచ్చాపాటి విశేషాలను చెప్తూ వుంటుంది. వినివిని హేపీ ప్రిన్స్‌ అంటాడు స్వాలో ఆ విశేషాలు కాదు దుక్కాల గురించి చెప్పు ”దేరీస్‌ నో మిస్టరీ సో గ్రేట్‌ యాస్‌ మిజరీ” అంటాడు. స్వాలో నగరపు నాలుగు మూలలా ప్రవహించే కన్నీళ్ళని గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ”రిచ్‌ మేకింగ్‌ మెర్రీ ఇన్‌ దేర్‌ బ్యూటిఫుల్‌ హౌసెస్‌, వైల్‌ ది బెగ్గర్స్‌ సిట్టింగ్‌ ఆఫ్‌ ది గేట్స్‌” అని వివరిస్తుంది.

అంతా విన్న హేపీ ప్రిన్స్‌ తన వంటి మీద వున్న బంగారు తొడుగుని అందరికీ పంచమని చెబుతాడు. స్వాలో అలాగే చేస్తుంది.

ఇంతలో నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మంచు దట్టంగా కురవడం మొదలు పెడుతుంది. ఎటు చూసిన తెల్లగా మంచుమేటలతో నగరం నిండిపోతుంది. వలన పక్షి స్వాలోకి సరిపడని వాతావరణం అది. అప్పుడొక రోజు స్వాలో హేపీ ప్రిన్స్‌కి గుడ్‌ బై చెపుతూ నేను చివరిగా నీ చేతి మీద ముద్దు పెట్టుకోవచ్చా అంటుంది. కళ్ళు లేని అతను ఈజిప్టుకి వెళుతున్నావా స్వాలో గుడ్‌బై, కానీ నువ్వు నా చేతి మీద కాదు పెదాల మీద ముద్దు పెట్టుకో అంటాడు. స్వాలో ఈజిప్ట్‌కి కాదు శాశ్వత నిద్రపోబోతున్నాను ”డెత్‌ ఈస్‌ ది బ్రదర్‌ ఆఫ్‌ స్లీప్‌ ఈస్‌ హీ నాట్‌” అంటుంది. అని పెదాలపై ముద్దు పెట్టుకుని మరణిస్తుంది. అప్పుడు హేపీ ప్రిన్స్‌ హృదయం విరిగిపోతుంది.

నగర మేయర్‌ వెలిసిపోయిన హేపీ ప్రిన్స్‌ విగ్రహాన్ని కరిగించేసి తన విగ్రహాన్ని చేయించుకోవాలని భావిస్తాడు. విగ్రహం కరిగిస్తున్న వ్యక్తి ఎంత కరిగించినా హేపీ ప్రిన్స్‌ సీసపు హృదయం కరగకపోవడంతో ఆశ్చర్యపడి బయట పడవేస్తాడు. అక్కడే బుజ్జి స్వాలో శవం పడి వుంటుంది.

ఆ రోజు భగవంతుడు దేవదూతని పిలిచి ”బ్రింగ్‌ మీ టూ ప్రేషియస్‌ థింగ్స్‌ ఇన్‌ ది సిటీ” అంటాడు. దేవదూత స్వాలో శరీరాన్ని, హేపీ ప్రిన్స్‌ సీసపు హృదయాన్ని తీసుకెళతాడు. దేవుడు నీ ఎంపిక చాలా బాగుంది అని దేవదూతని మెచ్చుకుని, హేపీ ప్రిన్స్‌కి, స్వాలోకి బంగారు నగరంలో స్వర్గపు ఉద్యానవనంలో చోటు కల్పిస్తాడు.

ఈ కథ నేను స్థలాభావం వల్ల పైన చెప్పినట్లు అతుకుల బొంతలా వుండదు. అయస్కాంతమ్‌ లా వుంటుంది. ఎంత బాగుంటుందంటే ఒక్కసారి చదివినా, చూసినా మరి మరిచిపోలేం. ఈ కథని పిల్లలకి తప్పనిసరిగా చెప్పాలి. మంచిని విన్పించినా, చూపించినా చాలు మంచి పెరుగుతుంది. పువ్వుల్లాంటి పిల్లల హృదయాలకి మనం మంచితనమనే సంస్కారాన్ని నేర్పడం ఎంతైనా అవసరం. సమ సమాజానికి, నాగరిక సమాజానికి అది తొలి అడుగు. మంచి మనుషులుండే చోటు పేరు స్వర్గమైతే ప్రాణి కోటి అందరమూ హేపీ ప్రిన్స్‌ లా, వాన కోవెల లా స్వర్గానికే పోవాలి. అవును కదా!

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

One Response to

  1. We need True Justice says:

    ఈ కథ నాక్కూడా ఎంతో ఇష్టం అండి. బహుశా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా ఈ కథ వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.