ఆనందభారతి

(సెప్టెంబర్‌ 16, జానకి అయ్యర్‌ మొదటి వర్ధంతి)

పి. అనురాధ

”గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…”

ఇలా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపి ఆ తోట యజమాని దగ్గర నేనొక మొక్కనై పెరిగాను. ఆ యజమాని జానికీ అయ్యర్‌గారు. తను ఆనందభారతికి పునాది వేసింది. ఈ రోజు ఆనందభారతి గురించి అందరికీ కొంతవరకు తెలుసు. కాని జానకక్క గురించి చాలా కొంతమందికే తెలుసు. ఈ నెల (సెప్టెంబర్‌) 16న ఆమె చనిపోయిన రోజు. ఆమెతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర ఆమెను గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయ లను ఆమె స్మరణలో నాకు ఆమెతో ఉన్న అనుబంధం, ఆనందభారతితో ఆమెకున్న ఆత్మసంబంధం ఎంతోమందికి తెలియా లని… దీనితోపాటు పిల్లలు వివిధ సందర్భా లలో రాసిన వాళ్ళ ఆలోచనల తెలియాలని….
ఆనందభారతి 1989 జూన్‌ 28న Y.M.C.A. తార్‌నాకలో మొదలైంది. జానకక్క, భాగ్యలక్ష్మక్క కలిసి 6 మంది పిల్లలతో మొదలుపెట్టారు. ఇప్పుడు బడిలో 33 మంది పిల్లలున్నారు. పదిమంది టీచర్లతో బడి నడుస్తుంది. 17 సంవత్స రాలు ఆనందభారతి ఏం సాధించింది. దీని చూస్తే ఎంతమంది డిగ్రీలు తెచ్చుకున్నారు? ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అని నేను చెప్పడంలో అర్థం లేదు. ఎందుకంటె మా స్కూలు కేవలం పిల్లలకి డిగ్రీలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఉద్దేశ్యాలతో నడిచింది కాదు. తనకున్న పరిధిలో ఈ సమాజంలో ఒక పాత్రని నిర్వహించింది. ఆ పాత్రని ఎన్నుకోవడంలో, నిర్వహించడం లో జానకక్క విజయన్ని సాధించిందనే అనుకుంటున్నాను.
ఇక బడిని నిర్వహించడంలో ఎంతోమంది తనకు సహాయం చేసి ఉండవచ్చు. కాని బడిలో మాత్రం ఏ ఒక్కరోజు తన మాటలో కాని ప్రవర్తనలో కాని తను ఈ బడికి అధికారిని అన్న నీడని కూడా మాకు చపించలేదు. తను బడిని నడపలేదు. బడితో ఆమె నడిచింది. ఏ టీచర్‌కీ నీ ప్రవర్తన బడిలో ఇలా ఉండాలి అని చెప్పకుండా తనే ఒక ‘ప్రతీక’ అంటె ఈ బడిలో పనిచేసే టీచర్లు ఇలా ఉంటే తప్ప పనిచేయలేరు అని తెలుసుకునే విధానమే తను రపొందించింది. మళ్లీ అందులో ఏదో బలవంతం కాని, తప్పనిసరి పరిస్థితి కాని ఏమీ లేదు. ఎవ్వరికి వీలైన పద్ధతిలో వాళ్లు ఆ విధానాన్ని ఎన్నుకుని పనిచేస్తారు. ‘ప్రతీక’ అని నేను ఎందుకన్నానంటె తను ఎప్పుడైనా సెలవు తీసుకోవాలంటే బడిలో మిగిలిన అందరి టీచర్ల పరిస్థితిని గమనించి ఏ ఒక్కరికి ఆ రోజు ఏ ఇబ్బంది లేకుండా చసుకుని అప్పుడు తీసుకునేది. అది ఎంత ముఖ్యమైన విషయం ఐనా ఆ రోజు వరకు అది వాయిదా పడాల్సిందే.
ఆనందభారతి ఇంత క్రమశిక్షణగా నడవగలుగుతుంది అంటె అది తను ప్రతిరోజు చేసే పనులు ఏ ఒక్కటీ ఏ ఒక్కరోజూ మారలేదు కాబట్టి. సరిగ్గా 1 గం||కి టీ తాగి బడికి వచ్చేసేది. అది ఎలా అంటే 1.30 లోపల బడి తెరువకపోతే ఎంత ఘోరం జరిగిపోతుందో అన్న ఆత్రంతోని. అంటే ఏ ఒక్క అమ్మాయిగాని, ఏ టీచర్‌గాని బడికి వచ్చి ఒక్క నిముషం బైట నిలబడకూడదు, కష్టపడకూడదు, అలా ఉండేది. ఆ ప్రవర్తన ఒక చిన్న అమ్మాయి మీద ఎలా ఉండిందో నేను చెప్తాను. నరసమ్మ అనే అమ్మాయి (10 సం||లు) ఒకరోజు 2.15కి బడికి వచ్చింది. మా బడి 2 గం||లకి మొదలై ఊపిరి 15 నిముషాలు చేసి తరువాత పాఠాలు మొదలుపెడతాము. ఆ అమ్మాయి బడిలో చేరి అప్పటికి 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు. ఆ రోజు బడికి వస్తుంటె ఆమె పనిచేసే అమ్మగారు ఆ పాపని ఇస్త్రీషాపుకు పంపింది. అతను ఒక చీర ఇస్త్రీ చెయ్యలేదు. ఈ అమ్మాయిని అక్కడే నిలబడమని చెప్పి అది పూర్తిచేసి పంపించినాడు. దాంతో ఆ అమ్మాయికి బడికి 15 ని||లు లేటు అయింది. తను వచ్చేసరికి ఊపిరి (ప్రాణాయామం) అయి అందరు పిల్లలు బల్లలు వేసుకొని కూర్చుంటున్నారు. తను ఏడుస్తూ వచ్చింది. బల్ల తీసుకుని నా ఎదురుగా కూర్చుంది. బల్లమీద తల వంచుకొని ఏడుస్తుంది. ”ఏంటి నర్సమ్మ ఏమయింది ఎవరన్న ఏమన్న అన్నరా? ఏదైనా ఒంట్లో బాగాలేదా” అని నేను ఎన్ని ప్రశ్నలు వేసినా ఎంత ఓదార్చినా జవాబు లేదు. చివరికి నాకే తట్టింది. ”ఏంటి ఊపిరి ఐపోయి బడికి ఆలస్యంగా వచ్చినావని ఏడుస్తున్నవా?” అనేసరికి ”అవునక్కా నేను ఈయళ లేటుగ వచ్చిన” అని ఇంకా పెద్దగా ఏడిచింది. చాలా ముఖ్యమైన కారణం ఉంటేనేతప్ప పిల్లలు బడికి ఆలస్యంగా వచ్చేవాళ్ళు. అందర టైంకి రావడానికి తను టైంని పాటించడమే ఒక కారణం అనేది ఇంక వేరుగా చెప్పుకోనవసరం లేదనుకుంట. ఇంకా బడిలో జరిగే ప్రతిపనిలో తను పాల్గొనేది. అంటే తను పెద్ద క్లాసులు తీసుకున్నా, ఎవ్వరి టైంటేబుల్‌ వాళ్లకి ఉన్నా కూడా బడిలో ఉన్న అందరితో ఏదో ఒక చర్యలో పాల్గొనేది. అంటె డైరెక్టుగా వాళ్లకు చదువు చెప్పకపోయినా వాళ్లని ఆడించేటపుడు, పాటలు చెప్తున్నప్పుడు, కుట్టు నేర్పుతున్నప్పుడు అన్నిట్లో తను చేయవలసినది ఉంది, తను తప్పకుండా చెయ్యలి అని పూర్తిగా బడిలో అడుగుపెట్టినప్పటి నుండి బడి మూసేవరకు ఒక్క నిముషం తను ఖాళీగా ఉండేది కాదు. ప్రతి ఒక అమ్మాయి మనస్తత్వం తెలుసుకోవడానికి వాళ్ల స్థాయికి దిగాలి అన్న ప్రయత్నంలో నిజంగా తను విజయం సాధించింది. తన దృష్టిలో పిల్లలు అంటే వాళ్లు ఎన్నో విషయలు తెలిసినవాళ్లు, వాళ్లు ముఖ్యంగా వయసుకు మించిన ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కడ వీళ్ల మనసుకి దెబ్బ తగులకూడదు, వాళ్లకున్న వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు, వాళ్ల అహాన్ని దెబ్బతీయకూడదు అన్న నియమాలతో ప్రతి ఒక అమ్మాయిని, ప్రతి ఒక టీచర్‌ని గౌరవించేది. టీచర్లుగా వచ్చినవాళ్లకి పని గురించి తెలియని విషయలని ”మీకు ఇది తెలియదు, మీకు ఈ విషయంలో జ్ఞానం తక్కువుంది” అన్నది వాళ్లకు తెలియకుండా తను నేర్పవలసింది వాళ్లకు నేర్పడానికి ప్రయత్నించేది. ఏ ఒక్కరోజు తనకున్న అనుభవం కాని, జ్ఞానం కాని ఇతరుల్లో ఉన్న అజ్ఞానాన్ని కించపరచలేదు. ఎలా అంటే ఆనందభారతిలో చదువు చెప్పే విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. బడిలో చేరిన ప్రతి టీచరు అది నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. దీనికోసం ఒక్కో స్థాయిలో ఏదో ఒక విషయం మీద జానకక్క అందరికి నేర్పవలసిన కొన్ని పద్ధతులు ఉండేవి. దాంట్లో ఏ టీచర్‌కి ఎలా చెప్తే అర్థం అవుతుంది అనేది తనకొక్కదానికే తెలిసేది. అది ఎంత మంచిగ చేసేవారంటే నాకు తెలిసి ఇంకెవ్వర అది అట్లా చెయ్యలేరు. ఆ విధానమే చదువులో ఉన్న ఆనందాన్ని, నేర్చుకోవడంలో ఉన్న సంతోషాన్ని పిల్లలందర అనుభవించి ఈ రోజు డిగ్రీలు తీసుకొని ఉద్యోగాలు చేసే స్థాయికి వాళ్లని తీసుకువచ్చింది. ఆ విధానాన్ని నేర్చుకున్న టీచర్లు ఎక్కడైనా, ఎప్పటికైనా ఏ పిల్లలకైనా ఆ ఆనందాన్ని అందించగలరు. వాళ్లూ వాళ్ల పనిలో తృప్తిని పొందగలరు.
ఆమెకున్న మంచితనమంతా ఇతరుల్లో కూడా ఏదో ఒక మంచిని వెదికేది. దాన్ని పట్టుకుని పిల్లలకి, బడికి, సమాజానికి వాల్లు ఏదో కొంత చేయగల సమర్ధులుగా తయరుచేసింది. నాకు తెలిసి ఆనందభారతి నిలబడడానికి ఇదే ముఖ్యకారణము. తనకి పరిచయం అయిన ప్రతి ఒకరిలో ఒక గొప్పని చసి వాళ్ల నుండి బడి పిల్లలతో పాటు తన ఏదో నేర్చుకుంటున్నట్టుగా ఉండేది. అందుకని పిల్లలకి ప్రతి టీచర్‌ మీద ప్రత్యేకమైన గౌరవం ఏర్పడేది. అదే గౌరవంతో పిల్లల పెరిగారు. ఆనందభారతీ నిలిచింది. ఈ బడిలో పని జరుగుతున్న విధానానికి, పిల్లలకి, టీచర్లకి ఒక అనుబంధం అల్లుకొని ఉంది. ఏ ఒక్కదాన్నీ విడిగా చడలేము. ఆ బంధం ఆమె ఏర్పరిచినదే. అది నిలిచి ఉన్నంతకాలం ఆనందభారతి నిలిచి ఉంటుంది. తను దేనినీ రాసి చపించలేదు. టీచర్‌గా ఎలా ఉండాలి ఆనందభారతి టీచర్‌గా ఇంకా ఎలా ఉండాలి అన్నది ఆచరించి చపింది. తను ప్రతిరోజూ నిత్య విద్యార్థిగా బడిని నడిపింది. నీకు తెలియని విషయలు అడిగి తెలుసుకో అని చెప్పింది. అది ఎవరైనా అంటె ఒక చిన్న అమ్మాయి ఐనా లేక తలపండిన అనుభవజ్ఞుడైనా ఫరవాలేదు. సమానమైన గౌరవంతో అడుగు. ఎదుటివాళ్ళు నీకిది తెలియదా అని నవ్వితే అన్నీ తెలిసిఉండీ వాళ్ల ప్రవర్తనలో ఉన్న అజ్ఞానాన్ని చసి నువ్వూ నవ్వుకో అంతేకాని నువ్వు బాధపడి అడగడం మానకు అని నేర్పింది. నీ పని నువ్వు చెయ్యి. ఇతరుల పని కూడా నువ్వు చెయ్యి కాని అందర పని చేసేటట్టు చడు అని చెప్పింది. తన అలాగే చేసింది. నాకూ అదే నేర్పిందీ. ఆనందభారతి కూడా ఇది ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది….
నా జీవిత సారథికి….
జీవితాన్ని రంగుటద్దంలోంచి చసి ప్రతి ఒక ఇంద్రధనుస్సు మనకోసమే అనుకునేవారు ఎందరో… పూసిన ప్రతి పువ్వూ దైవానికి చెందాలని, సముద్రపు ప్రతికెరటం నింగినందుకోవాలని ఎక్కడా రాసిలేదు. ప్రకృతిలో ప్రతి ఒకటి ఏదో విధంగా గడిచిపోతుంది. కొందరు జన్మతరహా అనాథలుగా మరికొందరు అందర ఉన్న అనాథలుగా జీవితాలను గడుపుతారు. ఒక జంతువైనా, ఒక పక్షిఐనా దేవుడిచ్చిన జన్మను ప్రకృతి పరిసరాలకనుగుణంగా దాని జీవితాన్ని అది స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నది. విధి వక్రించినపుడు తనకు తానుగా ప్రకృతినుంచి స్వేచ్ఛగా తన జీవితాన్ని ముగిస్తుంది. కాని ఆ దేవుడే ప్రసాదించిన ఈ జన్మకు మాత్రం ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవు. ఎందుకంటే జీవితాన్ని ప్రారంభించిన నాటినుండి తన చుట్టూ ఉన్న మానవులననుసరించి తనకి తన చుట్టూ ఉన్న మనుషులకి ఉన్న సంబంధాన్ని బట్టి సమాజపరంగా తాను జీవించాలి. అంతేకాని ప్రకృతిపరంగా తను ఎటువంటి స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి వీలులేదు. తన సవజంలోని కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలపై ఆధారపడి తన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. ఆ జీవితాన్ని ముగించాలన్నా తనకి స్వాతంత్య్రం లేదు. ఈ మనిషి జీవితం ఆ రోజునుంచి ఎదుగుతుంది మొదటిసారిగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని గుర్తుపట్టినప్పుడు, తను తోటి పిల్లలతో ఆడినప్పుడు. అలాగే ప్రారంభం అయిన ‘నా జీవితం’ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏ తీరం చేరుతుందో తెలియని నేను ఒక వర్గంలో మీ చెంత చేరాను. ఇంకా బాల్యం వదలని యవ్వనంలో లేత ఆకులను చిగురిస్తున్న చిన్న ‘మొక్క’గా మీ దరికి చేరాను. అప్పుడు నాలోని ఆ చిన్నతనాన్ని లాలించారు. అదే స్థాయిలో ఎదుగుతున్న నా వయసుకు కావలసిన జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు నా వయసులో సగం మన పరిచయం. ఏ ఒక్కరోజూ మీ వయసు మన స్నేహానికి అడ్డు కాలేదు. బహుశా ఇదేనేమో మీ స్నేహం యొక్క గొప్పదనం. ఆ స్నేహం చేయడం అందరికీ రాదు. ఈ రోజు ఎంతోమంది నన్ను ఓదార్చుత నా భుజం తట్టి నీకు మేమున్నాము అని ధైర్యాన్ని ఇవ్వగలిగే స్థితికి నన్ను చేర్చారు. ఆ ధైర్యమే కాకుండా నేను ఈ రోజు కోల్పోయింది ఏమిటో తెలుసా జానకక్కా… మీ తోడును, మీ సాహచర్యాన్ని. అన్నింటినీ మించిన మీరు నాకు అందించిన ప్రేమని అంతగా నన్ను ప్రేమించే ఆ హృదయన్ని మరియు ఆ స్నేహాన్నీ. ప్రతి సమస్యలో అది వ్యక్తిగతమైనదైనా లేక మనం కలిసి చేసే పనికి సంబంధించినదైనా అన్ని విషయల్లో నా ఆలోచనని మీతో సమానస్థాయిలో నా వ్యక్తిత్వాన్నీ, నా శక్తిని నాకు తెలియకుండానే నేను పోల్చుకునేట్లు చేసిన, ఆ ఆలోచనలు ఇచ్చిన గొప్ప మనసుని నిజంగా అక్కా నిజంగా దాన్నే నేను కోల్పోయను.
మీకున్న జ్ఞానంలో మీకున్న అనుభవంలో మన పని గురించి నాకు తెలిసినది ఆవగింజంత. కాని ఏ ఒక్కరోజు మీరు నన్ను నీకు ఇది తెలియదు అన్న భావన కనీసం ఒక ఊహనన్నా రానివ్వలేదు. నాకు తెలిసిన దాంట్లో మీర ఎంతో నేర్చుకుంటున్నారు అన్నట్లుగా నాకు తెలిసిందే ఇంకా నేర్పుతున్నట్లుగానే మన పని కొనసాగింది. ఎంతమంది ఇది చేయగలరు. ఎంతమంది ఇలా పని చేయగలరు? నాకు తెలిసి ఎవ్వర చెయ్యలేరు. మీలో ఉన్న గొప్పదనం ఇదే. మీరు ‘నిత్యవిద్యార్థి’గా మీ జీవితాన్ని గడిపారు. ప్రతిమనిషి నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోగలం అనే సిద్ధాంతాన్ని మీర పాటించారు. నాకూ నేర్పినారు. అదే ఈ రోజు నన్ను నిలబెట్టింది. నన్నే కాదు ఆనందభారతిని నిలబెట్టింది. ఈ రోజు నేను ఆ విలువిచ్చే మనిషిని కోల్పోయను. ఈ సమాజం ఆ విలువలని పాటించే మనిషిని కోల్పోయింది. అసలా దేవుడికి ఎంత ధైర్యం జానకక్కా… మనమెప్పుడ ఆలోచించని మాట్లాడని విషయన్ని ఈ రోజు మనకిచ్చాడు. ఏంటక్కా…ఎందుకిట్లా జరిగింది. మనం మాట్లాడుకోని విషయం ఏదైనా ఉందా? ఏ సమయనికి తగిన విషయలు ఆ సమయంలో నాతో మాట్లాడినారు కదా. మరెందుకక్కా…దీని గురించి ఎందుకు నాకు చెప్పలేదు? మనకు సంబంధించిన ప్రతీ విషయంలో అనురాదా! ఏంటి ఏమంటావ్‌ తల్లీ…అని ప్రతిసారీ నా అభిప్రాయన్ని అడిగి అడిగి తెలుసుకునేవారు కదా. మరెందుకు ఇది అడుగలేదు. అడిగితే అక్కా నేనూ మీతో వస్తాను. ఇద్దరం కల్సి సంతోషంగా వెళ్దాం అనేదాన్నని అడగలేదు కదా! అక్కా నేను ఒక్కదాన్నే ఉండలేను. మీరు పెంచిన ఈ చెట్టు ఏ గాలివానకో కొట్టుకుపోతుంది. ఏ తుఫానులోనో కూలిపోతుంది అని చెప్పేదాన్ని కదక్కా… ఒహో ఎలాగో అనురాధకు గాలివానలో నిలబడ్డం తెలుసు, తుఫానుల్లో ఒడ్డుకు చేరడం తెలుసు కాబట్టి ఫరవాలేదనుకున్నారా. అవును అలాగే అనుకుని ఉంటారు. కానీ జానకక్కా…మీకు తెలుసా నేను తుఫానులో చిక్కుకున్న ప్రతిసారీ మీరు ఒక ‘ఆధారాన్ని’ విసిరేవారు. దాన్ని ఆధారంగా పట్టుకొని నేను ఈదడం నేర్చుకున్నాను. ఒడ్డున మీరు నుంచొని నా ఈతలో నాకే ఒక ఆనందాన్ని చపేవారు. ఆ ఆటుపోట్ల అలజడిని అర్థం చేసేవారు. ఆ అలసటకి మీ అనురాగాన్ని ఆహారం చేశారు. ఏర్పడిన ఆ ప్రతి గాయనికి మీ ఆప్యాయతనే మందుని పూసారు. ఇప్పుడు ఆ గాయలు ఏర్పడకుండా, ఆ అలసట కలగకుండా మీరు చపిన ఆధారంలోనే ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి. అక్కా… ఆశీర్వదించు. ఏ గాయం తగలకుండా, ఏ గాలివాన రాకుండా ఏ తుఫాన నన్ను ముంచేయకుండా కాపాడు. మీ అంత కాకపోయినా మీ అంత సమానంగా మీరు చేసినటువంటి పనులను ఈ వయసులోనే చేయగలిగేంత శక్తిని ప్రసాదించు. జానకక్కా…మీకిదే నా నివాళి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో