– శివపురపు శారద,

తెలుగు అనువాదం : పి. సౌజన్య కుమారిపన్నెండు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒకామె పనిమనిషిగా ఉండేది. నాకు బదిలీ కావడం వల్ల ఆమెను వదులుకోవలసి వచ్చింది. ఆమె పనితో అసంతృప్తితో వుండటం వాళ్ల కాదు గాని అలాంటి పనిమనిషి బెంగుళూరులో దొరుకుతుందో లేదోననే నా దిగులంతా. నిజానికి ఆమెకు శుభ్రత అనేదే తెలీదు. ప్రతిరోజు ఆమె పని మొదలు పెట్టినప్పటి నుండి ఇంకా బాగా చెయ్యమని నేను దేప్పి పొడుస్తూనే వుంటాను. ఒక్కోసారి ఆమె కడిగిన పాత్రలను చూపుతూ వాటికంటే అడుక్కునే వారి అల్యూ మినియమ్‌ బొచ్చెలే నయమని వాపోయే దానిని. ఆమె ఏ పని చేసినా నాకు తృప్తి నిచ్చేది కాదు. నేను అంత బాగా శుభ్రం చేస్తానని కాదు గాని ఆమె శుభ్రత నాణ్యతలో లేకపోవటం వల్లనే.

ఆమెది కీచు గొంతు, ఆమె మాట్లాడే ప్రతి వాక్యంలోని చివరి పదాన్ని సాగదీస్తూ ఒక్కోసారి నవ్వునీ మరోసారి విసుగును తెప్పించేది. ఇరుగుపొరుగువారు కొన్నిసార్లు ఆమె అరుపులకు విసుగెత్తిపోయే వారు. ఆమె శరీర కదలికలను చూసి కొందరు ఆమెకు పిచ్చేమోనని అనుమానం పడేవారు. ఆమెకు క్యాడ్బరి చాకొలెట్లు అంటే చాలా ఇష్టం. ఆమె వాటిని ఎంత ఇష్టపడే దంటే ఒకసారి నా కొడుకు కోసం ఒక పెద్ద చాకొలేట్‌ తెచ్చి బల్లపై పెడింతే దాన్ని ఆమె తీసుకుంది. అన్నిచోట్ల వెదుకుతూ తన మీద అనుమానం వచ్చేలోగా దాన్ని నేను వెదకబోతున్న ఫ్రిడ్జి మీద ఆమె పెట్టింది.

ఇలా జరిగినా నేను ఆమెను మాన్పించ లేదు. ఎందుకంటే ఆమె సమయానికి రావడమే కాక అనుమతి లేకుండా ఎప్పుడూ సెలవు తీసుకునేది కాదు. బ్రతిమాలితే కొన్నిసార్లు సెలవు కూడా వాయిదా వేసేది.

అందుకే ఆమె పని చేసే ప్రతి చోట మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి ఆమె ఏ పని చెప్పినా చేసేది పైగా జీతం పెంచమని గాని వెంటనే ఇవ్వమని గాని కొరేది కాదు. దీని గురించి ఆమెను అడిగితే జీతం ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు నేనెందుకు గుర్తు చేయడం అనేది. ఆమెకు చదవడం రాయడం తెలీదు. మిగతా పనిమనుషుల్లా కనీసం ఆమెకు రావలసిన జీతం ఖచ్చితంగా ఇచ్చారో లేదో నన్న లెక్కలు వేసుకోవడం కూడా తెలీదు. ఆమె తల్లికి తనపై అనుమానం వుండటం వల్ల ఎప్పుడు రోడ్డు పైనే గొడవపడేది. ఎప్పుడూ తన తల్లితో గొడవైనా పడుతూ వుంటుంది లేదా మాట్లాడ కుండా నైనా ఉండేది. కాని ఎప్పుడైనా ఆమె రాలేకపోతే ఆమె తల్లే వచ్చి పని చేసేది కాని ఆమె గురించి ఒక్క మాట చెప్పేది కాదు.

ఆమె మా ఇంట్లో పదిహేను పదహారు ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి పని చేసేది. మా ఇంట్లో పనికి కుదిరిన వెంటనే ఆమెకు ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి కొడుకు కొంత భూమి, పశువులు గల ధనికుడు. కాని ఏ కారణం చెప్పకుండా ఆమె పెళ్లిని నిరాకరించింది. అంత మంచి సంబంధం వదులుకోలేక వాళ్ల అమ్మ ఆమె కంటె రెండు మూడేళ్ళు చిన్న దైన చెల్లితో వివాహం జరిపించింది. అయితే ఆ పెళ్ళి కొడుకు తన పొలంలోనే కూలీగా పని చేస్తాడని, ఇంతకుమునుపే ఒక పెళైందని, కానీ ఆ భార్య తన ఆస్తికి వారసుడిగా మగబిడ్డని కనివ్వలేకపోయిందని నాకు ఆ తర్వాత తెలిసినది.

నా పని మనిషి చెల్లెలు రెండు సంవత్స రాల్లో ముగ్గురు ఆడపిల్లలకు జన్మ నిచ్చినది. ఆమె భర్త అత్త తనని ఆడపిల్లలతో ఇంటికి రావద్దని ప్రతిసారి బెదిరించేవాడు. వాళ్ళు ఆ ఆడపిల్లలను స్వీకరించడానికి ఆమె తన అక్క ద్వారా ఏదో రకంగా వారి ఆశలు తీరడానికి ప్రయత్నం చేసేది. ఆమె కూడా తన చాలీచాలని జీతంతో తన చెల్లికి కాదనక సహాయపడేది. ఇది చాలదన్నట్లు ప్రతి కాన్పు తర్వాత ఆరు నెలలకు, చిన్న పాపను వాళ్ళ అక్క దగ్గరే వదిలి వెళ్ళేది. తన పనిలో ఆమెకు ఎంత తీరిక లేకపోయినా ఆ పిల్లలను సంతో షంగా చూసుకునేది. పిల్లలకు తినిపించా ల్సిన సమయంలో పైకి కిందకు పరుగులు తీసేది. వాళ్ళ నడిచే వయసుకు వచ్చేసరికి తనతో పాటు తీసుకొని వచ్చేది. చిన్న పిల్లలంటే ఆమెకు అంతులేని ప్రేమ. ఆ ముగ్గురి పిల్లలను ఆమె ఎంత గారాబం చేసిందంటే వారికి రోజు చాక్‌లెట్లు, కొత్త బొమ్మలు ఐస్‌క్రీములు అంటూ ఏవేవో కొనిచ్చేది. ఇక్కడ నేనో విషయం తన గురించి చెప్పాలి. మా ఇంట్లో అన్ని తెరిచే ఉంచినా ఎప్పుడు ఒక్క పైసా కూడా తీసుకో లేదు. సొంత తల్లి కాకున్నా ఆమె ఆ పిల్లలను ఎలా అంత బాగాచూసుకొనేదా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పిల్లలు కూడా ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా వుండేవారు కాదు పైగా వాళ్ళ అమ్మను కూడా కాదనే వారు. అంత గొప్ప మనసు ఆమెకెలా అంత సహజంగా వుందని నాకు ఆశ్చర్యం కలిగేది. రెండేళ్ళ వయసు నుండి ఆమె ఖర్చుతోనే బడికి వెళ్తున్న ప్రతి ఆడపిల్లకి ఐదు ఏళ్ళు వచ్చేసరికి తనకు చేదోడు వాదోడుగా ఉంటారని తన చెల్లి బలవంతంగా తీసుకొని వెళ్ళేది. అయినా పెద్దదానిలా చిన్న దానికి బంగారు చెవి కమ్మలు తీసుకొని రావడానికి డబ్బు ఎలా పొదుపు చేయాలని ఆలోచించేది. నీవంత కష్టపడి సంపాదించిన డబ్బుని అలా వృధా చేయకు అంతేకాక వాళ్ల నాన్నను కూడా కొంచెం సంపాదించనీ అని నేను ఎప్పుడైనా కసిరితే, పిల్లలందరినీ సమానం గా చూడాలని చెప్పేది.

ఆమె తల్లికి తన గురించి నిదానంగా అర్థమై మునపటిలా ఆమె గురించి మాట్లాడకుండా వుండేది కాదు. నా దాతృత్వాన్ని చూపటానికి ప్రయత్నిస్తూ, ప్రతి దీపావళికి ఆమెకు కొత్త బట్టలు కొనిస్తూ, ఆమె తల్లికి చెల్లికి పాత చీరలు ఇచ్చి బీరువాలో ఖాళీ లేకపోయినా మరో సందర్భంలో ఇద్దామని కొన్నిటిని దాచేదాన్ని. కాని తన అవసరానికి మించినదాన్ని ఆమె తన పొరుగువారికి పంచేదని తెలిసి నాకు ఆశ్చర్యం కలిగింది. తనకు ఎంతో ఇష్టమైన తినుబండారాలు చాక్‌లేట్లను కూడా దాచుకోకుండా పంచేది.

నా దాతృత్వాన్ని ఆమె దాతృత్వంతో పోల్చుకోలేను. ఇంతకు ముందు లంచ్‌ బాక్సులు, రంగురంగుల జడ బ్యాండ్లు, పెన్సిళ్ళు, రబ్బర్లు వంటివి మా ఇంటిలో కనపడనప్పుడు నేను ఆమె పని చేసే ఇళ్ళల్లో ఫిర్యాదు చేసేదాన్ని కాని ఇక ఇప్పుడు నేను వాటి గురించి పట్టించుకోడంలేదు.

ఈ మధ్య నేను ఒక పెళ్ళికని హైదరాబా దు వెళ్ళినప్పుడు, ఆమె తన చెల్లిని, చిన్న కూతురిని తీసుకొని నన్ను చూడడానికి వచ్చింది. ఆ పాపకు చాకొలెట్లు కొనివ్వమని కొన్ని వందల రూపాయల కాగితాలను ఆమె చేతిలో బలవంతంగా వుంచాను.నవ్వుకుంది.

ఆమె రేపటితో పనిలేని మనిషిలా ఎప్పు డూ చిద్విలాసంగా వుంటుంది. ఆ రోజు గురించి చింత గానీ, రేపేమౌతుందనే బెంగ కానీ ఆమెలో ఏ కోశానా కనబడవు. తన తల్లి, చెల్లి కోసం తానేదో త్యాగం చేసాననే ఓ ఆలోచన గానీ, తనను వాళ్ళు ఉపయోగిం చుకున్నారనే భావం కానీ ఆమెలో కనబడవు. నిజానికి త్యాగమంటే ఏమిటో ఆమెకు తెలియదు.

ఆమె ఒక సంతోష తరంగం అని మాత్రం నాకు బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా ఆ సంతోషం ఆమెలో ఎగిసిపడుతూనే వుంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో